వైభవంగా గోదాదేవి కల్యాణంతో ధనుర్మాస పూజలు ముగింపు

వైభవంగా గోదాదేవి అమ్మవారి కల్యాణం

ముగిసిన ధనుర్మాస పూజలు

మంగపేట, నేటి ధాత్రి

 

ధనుర్మాస ప్రత్యేక పూజా కార్యక్రమా ల్లో భాగంగా నిర్వహించే గోదాదేవి అమ్మవారి కల్యాణ మహోత్సవం బుధవారం కమలాపురం శ్రీ సితారామ చంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో అర్చకుల వేదమంత్రోచ్ఛాణల మధ్య వైభవంగా జరిగింది. స్వామివారిని కల్యాణం చేసుకునేందుకు గోదాదేవి అమ్మవారు ధనుర్మాసంలో నెల రోజుల పాటు భక్తి శ్రద్ధలతో స్వామివారిని తిరుప్పావై పారాయణంతో మేల్కొలిపి పూజించి ప్రసన్నం చేసుకుంటుందని ఆలయ పండితులు ప్రతాపురం శ్రీనివాసాచార్యులు, అర్చకులు ప్రతాపురం వంశీకుమారాచార్యులు తెలిపారు. సంవత్సరంలో ఈ ఒక్కరోజే వేంకటేశ్వరుడితో గోదాదేవి పరిణయాన్ని చూసే భాగ్యం కలుగుతుందని.. గోదాదేవి కల్యాణోత్సవం సాక్షాత్తు తిరుమలలో జరుగుతున్నట్లుగా అనుభూతి కలుగుతుందని భక్తులు పేర్కొన్నారు. భక్తులు అమ్మవారికి, స్వామివారికి పట్టువస్ర్తాలను సమర్పించారు. కల్యాణోత్సవంతో ఆలయ ప్రాంగణం గోవిందనామ స్మరణలతో మార్మోగింది.అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. గోదాదేవి కల్యాణంతో ధనుర్మాస పూజా కార్యక్రమాలు ముగిశాయి.

నూతన వధూవరులను ఆశీర్వదించిన.!

నూతన వధూవరులను ఆశీర్వదించిన రామడుగు సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు

రామడుగు, నేటిధాత్రి:

 

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామానికి చెందిన కంకణాల లక్ష్మీపతి రమాదేవి దంపతుల కుమారుడు చంద్రశేఖర రావు మధుప్రియల వివాహా మహోత్సవ వేడుక(అన్విత గార్డెన్స్ కరీంనగర్) లో జరగగా ఆవేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, రామడుగు సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు. ఈవివాహ మహోత్సవ వేడుకలో బిఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు గంట్ల జితేందర్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు ఎల్లా జగన్మోహన్ రెడ్డి, సత్యనారాయణ, శనిగారపు అనిల్ కుమార్, తదితరనాయకులు పాల్గొన్నారు.

శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి వార కళ్యాణం.

అంగరంగ వైభవంగా శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి వార కళ్యాణం
చిల్పూర్(జనగాం)నేటి ధాత్రి

 

భక్తుల కోరిన కోర్కెలు తీర్చుతూ దినదినాభివృద్ధి చెందుతూ భక్తుల కొంగు బంగారంగా నిలుస్తున్న చిల్పూర్ గుట్ట చిల్పూర్ మండల కేంద్రంలోని కొలువైన శ్రీ ముగ్గులు వెంకటేశ్వర స్వామి వార కళ్యాణ మహోత్సవం శనివారం ఆలయ కార్య నిర్వహణ అధికారిని లక్ష్మీ ప్రసన్న ,ఆలయ ప్రధాన అర్చకులు రంగాచార్యులు,కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛరణల నడుమ అంగరంగ వైభవంగా జరిగింది.ఈ సందర్భంగా ఆలయ అర్చకుల శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలలో భాగంగా హారతులు, అభిషేకాలు,అర్చనలు నిర్వహించారు.ఇందులో భాగంగా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై కళ్యాణ మహోత్సవంలో పాల్గొని భగవంతునికి ప్రత్యేక పూజలు నిర్వహించి భగవంతుని కృపకు పాత్రులు అయ్యారు.దీంతో ఆలయ పరిసరాలు ఓం నమో వెంకటేశాయ నామస్మరణలతో మారుమోగాయి. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version