రజినీకి గుడి కట్టి నవరాత్రి పూజలు చేస్తున్న అభిమాని..

 రజినీకి గుడి కట్టి నవరాత్రి పూజలు చేస్తున్న అభిమాని..

 

 

ఆ గుడిలో ఏకంగా 230 తలైవా ప్రతిమలు ఉన్నాయి. వాటిని 15 వరసల్లో ఏర్పాటు చేశాడు. పది వరుసల్లో రజినీకి సంబంధించిన టాప్ ఫొటోలు ఉన్నాయి.

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తలైవాకు ప్రపంచం నలుమూలలా ఫ్యాన్స్ ఉన్నారు. ఫ్యాన్స్‌కు రజినీ అంటే పిచ్చి అభిమానం. ఆయన కోసం ఏదైనా చేసేస్తారు. ఇందుకు తాజా సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. ఓ ఫ్యాన్ తన అభిమాన హీరో రజినీకాంత్ కోసం కొన్నేళ్ల క్రితం గుడి కట్టాడు. రజినీ విగ్రహానికి ప్రతీరోజూ పూజలు చేస్తున్నాడు. ఇప్పుడు నవరాత్రి సందర్భంగా ఏకంగా బొమ్మల కొలువు ఏర్పాటు చేశాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
తమిళనాడులోని మధురైకి చెందిన కార్తీక్ అనే వ్యక్తికి రజినీకాంత్ అంటే చిన్నప్పటినుంచి పిచ్చి అభిమానం. అతడు పెరిగేకొద్దీ అభిమానం పెరుగుతూ పోయిందే తప్ప తగ్గలేదు. ఈ నేపథ్యంలోనే అతడు ఓ వినూత్న పనికి తెరతీశాడు. కొన్ని నెలల క్రితం తలైవా కోసం ఓ చిన్న గుడిని నిర్మించాడు. అందులో రజినీ విగ్రహాన్ని పెట్టి పూజలు చేస్తూ ఉన్నాడు. అయితే, ఈసారి మరో వినూత్న కార్యక్రమానికి తెరతీశాడు. నవరాత్రి సందర్భంగా రజినీ గుడిలో బొమ్మల కొలువు ఏర్పాటు చేశాడు.

శ్రీ దుర్గామాత & ఉరడమ్మ మాతల…!

శ్రీ దుర్గామాత & ఉరడమ్మ మాతల విగ్రహాల ప్రతిష్ఠాపన,ధ్వజస్తంభం మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్,

◆ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

కోహీర్ మండలం లోని చింతల్ ఘట్ గ్రామంలో మంగళవారం శ్రీ దుర్గామాత & ఉరడమ్మ మాతల విగ్రహాల ప్రతిష్ఠాపన,ధ్వజస్తంభం మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి.అనంతరం కార్యక్రమ నిర్వాహకులు వారిని శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈకార్యక్రమంలో సిడిసి చైర్మన్ ముబీన్,కోహీర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాంలింగా రెడ్డి,జహీరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి,మాజీ యం.పి.టి.సి మల్లన్న పాటిల్,అశ్విన్ పాటిల్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు గ్రామస్తులు,తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version