బాధిత కుటుంబాన్ని పరామర్శించిన – మాజీ జెడ్పిటిసి…

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన – మాజీ జెడ్పిటిసి

మహాదేవపూర్ అక్టోబర్ 9 (నేటి ధాత్రి)

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా బెగులూర్ గ్రామపంచాయతీ పరిధిలోని బాధిత కుటుంబాన్ని గురువారం రోజున మాజీ జెడ్పిటిసి గుడాల అరుణ శ్రీనివాస్ పరామర్శించారు. మండలంలోని బెగులూర్ గ్రామానికి చెందిన కొయ్యల మహేష్ అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకొని బాధిత కుటుంబాన్నీ పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ అన్నివిధాల కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని బాధిత కుటుంబానికి బరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.

దుర్వాసన వెదజల్లుతున్న దామెరా చెరువు(మినీ ట్యాంక్ బండ్)

దుర్వాసన వెదజల్లుతున్న దామెరా చెరువు(మినీ ట్యాంక్ బండ్)

 

ఎమ్మెల్యే,మున్సిపల్ అధికారులు స్పందించాలి

బిఆర్ఎస్ యువజన నాయకులు ఇంగిలి వీరేష్ రావు

ఆహ్లాదకరంగా ఉండాల్సిన దామెర చెరువు(మినీ ట్యాంక్ బండ్)ప్రాంతం దుర్గంధంతో, చెత్త చెదరంతో కంపు కొడుతూ పరిసర ప్రాంతా ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని అధికారులు దామెర చెరువు పై నిర్లక్ష్యం వీడాలని బిఆర్ఎస్ యువజన నాయకుడు ఇంగిలి వీరేష్ రావు అన్నారు.పరకాల ప్రజలు వాకింగ్ చేయడానికి,మరియు ఆహ్లాదకరంగా పిల్లలతో గడపడానికి గత ప్రభుత్వం సుమారు 4 కోట్ల రూపాయలతో దామెర చెరువు కట్టను మినీ ట్యాంక్ బండ్ గా తీర్చిదిద్దిందని,కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి పాలన పై శ్రద్ధ లేకుండా కేవలం పైసల పైనే శ్రద్ధ వహిస్తుందని ఆయన ఎద్దేవా చేశారు.

మునిసిపాలిటీ కి సంబంధించిన ఆటోలే ఇక్కడ చెత్త వేస్తున్నట్టు స్థానికులు వివరించారని,పక్కనే ఉన్న శ్రీనివాసకాలని ప్రజలు ఈ కంపును భరించలేక పోతున్నారని,ఈ దుర్గంధం వల్ల వారి ఆరోగ్యాలకు నష్టం జరుగుతుందని ఆయన అన్నారు.ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే, మున్సిపల్ కమీషనర్ లు ఈ సమస్యపై దృష్టి సారించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయన కోరారు.

రాయలాపూర్ గ్రామ రైతుల వినతి పత్రం సమర్పణ..

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download.wav?_=1

 

రైతుల ధాన్యం ఎండబెట్టేందుకు స్థలం కేటాయించాలంటూ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన
రాయలాపూర్ గ్రామ రైతుల వినతి పత్రం సమర్పణ..

రామాయంపేట అక్టోబర్ 9 నేటి ధాత్రి (మెదక్)

రామాయంపేట మండలంలోని రాయలాపూర్ గ్రామ రైతులు గురువారం తహసీల్దార్ కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ సమస్యలను వెల్లడించారు. ధాన్యం కొనుగోలు సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో రైతులు తాము కోత కోసిన వడ్లను ఎండబెట్టేందుకు సరైన స్థలం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతి సీజన్‌లో రాయలాపూర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి, రామాయంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా ధాన్యం సేకరణ జరుగుతుందని రైతులు తెలిపారు. అయితే, ప్రస్తుతం ఉన్న సంఘ స్థలం చాలక రోడ్డుపై, పొలాల్లో ధాన్యం ఆరబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.
రోడ్డుపై ధాన్యం పోస్తే రవాణాకు ఆటంకం కలుగుతోందని, పోలీసు అధికారులు కూడా అడ్డుకుంటున్నారని రైతులు వివరించారు. ఈ నేపథ్యంలో రాయలాపూర్ గ్రామంలోని ఎల్లమ్మ గుడి, హనుమాన్ గుడి ముందు ఉన్న సర్వే నెం. 881లోని ప్రభుత్వ భూమిలో కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని తహసీల్దార్ రజనీకుమారిని కోరుతూ వినతి పత్రం సమర్పించారు.
రోడ్డుపై వడ్లు ఆరబెట్టడం వాహనదారులకు ఇబ్బందికరమని, ప్రమాదం కూడా ఉందని రైతులు పేర్కొన్నారు. కనుక ప్రభుత్వమే తక్షణం ప్రత్యామ్నాయ స్థలం కేటాయించి తమ సమస్యను పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఈ వినతి పత్రం సమర్పణ కార్యక్రమంలో సుమారు 100 మంది రైతులు పాల్గొన్నారు.

బాక్స్ డ్రైన్ వెడల్పు నిర్మాణ పనులను పరిశీలించిన…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-09T140659.375.wav?_=2

     బాక్స్ డ్రైన్ వెడల్పు నిర్మాణ పనులను పరిశీలించిన:

కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్.

కాప్రా నేటిధాత్రి

 

మీర్ పేట హౌసింగ్ బోర్డు కాలనీ డివిజన్ నోమా కళ్యాణ మండపం నుండి రైల్వే ట్రాక్ వరకు ఇటీవల చేపట్టిన బాక్స్ డ్రైన్ వెడల్పు నిర్మాణ పనులను పరిశీలించిన స్థానిక కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్. ఈ సందర్భంగా కార్పొరేటర్ ప్రభుదాస్ మాట్లాడుతూ ఈ యొక్క బాక్స్ డ్రైన్ వెడల్పు నిర్మాణంతో వర్షం నీరు నిలవకుండా, స్థానికంగా నివాసం ఉన్న ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉంటారని, ఈ నిర్మాణం పూర్తయితే డ్రైనేజీ నీరు రోడ్లపైకి రాకుండా ప్రధాన సమస్య తీరుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో డీఈ రూప, ఏఈ లింగారావు, వర్క్ ఇనస్పెక్టర్ చారి, శ్రీనివాస్ స్థానిక నాయకులు సాయి కుమార్, శేఖర్ గౌడ్, దండెం నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే దొంతిని పరామర్శించిన పీసీసీ సభ్యులు…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-09T134857.124.wav?_=3

 

ఎమ్మెల్యే దొంతిని పరామర్శించిన పీసీసీ సభ్యులు

నర్సంపేట నేటిధాత్రి:

 

గత కొన్ని రోజుల క్రితం నర్సంపేట ఎమ్మెల్యే తల్లీ దొంతి కాంతమ్మ అనారోగ్యంతో మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డిని హనుమకొండలోని తన నివాసంలో టీపీసీసీ సభ్యులు సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి,పెండెం రామానంద్ మర్యాదపూర్వంగా కలిసి పరమర్శించారు. కాంతమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు బత్తిని రాజేందర్, నెక్కొండ మండల కాంగ్రెస్ అధ్యక్షులు బక్కి అశోక్, వరంగల్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కొరివి పరమేష్, నర్సంపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రవి, నర్సంపేట మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొల్లూరి మధుకర్, మాజీ కౌన్సిలర్ ఎలకంటి విజయ్ కుమార్, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ కార్యదర్శులు మోటం రవికుమార్, చిప్ప నాగ, నాడేం నాగేశ్వర్లు, నాడేం ప్రదీప్ కన్నా, తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం అందించిన తోటి స్నేహితులు…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-09T133358.203.wav?_=4

 

ఆర్థిక సహాయం అందించిన తోటి స్నేహితులు.

చిట్యాల, నేటిధాత్రి ;

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగ గ్రామానికి చెందిన జాలిగపు సునీల్ గారి తల్లిగారు మరణించడంతో వారి కుటుంబానికి అండగా సునీల్ గారి స్నేహితులైన సన్రైజర్స్ చారిటబుల్ ట్రస్ట్ 99 బ్యాచ్ కి చెందిన విద్యార్థులు 10000వేల రూపాయల చెక్ అందించారు.

అతి త్వరలోనే శ్రీ శివ భక్తమార్కండేయ స్వామి దేవాలయ పునర్నిర్మాణం…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-09T132848.714.wav?_=5

 

అతి త్వరలోనే శ్రీ శివ భక్తమార్కండేయ స్వామి దేవాలయ పునర్నిర్మాణం

శ్రీ మార్కండేయ స్వామి జయంతి మహోత్సవ సమితి కన్వీనర్ మోర శ్రీనివాస్

సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి)

 

సిరిసిల్ల పద్మశాలి కులబంధు వులకు హిందూ బంధువులకు సిరిసిల్ల మార్కండేయ వీధిలో అత్యంత పురాతనమైన విశిష్టమైన శ్రీ శివభక్త మార్కండేయ స్వామి దేవాలయము పునర్నిర్మాణం కై శ్రీ మార్కండేయ స్వామి జయంతి మహోత్సవ సమితి ఒక కార్యచరణను ప్రారంభించింది. దీనిలో భాగంగా ఈ రోజు ప్రెస్ క్లబ్లో శ్రీనివాస్ మాట్లాడుతూ గత రెండు నెలల నుండే పద్మశాలి కుల బంధువులతో, హిందు బంధువులతో సమాజంలోని అందరిని కలుపుకుని పోయే విధంగా దేవాలయాల ఆధారంగా 22 సమావేశాలను శాంతి నగర్ ‘నుండి భూపతినగర్’ వరకు, చంద్రంపేట నుండి సాయినగర్ వరకు నిర్వహించి అభిప్రాయాలను సేకరించింది. దేవాలయ పునర్నిర్మాణం హిందూ సంఘటనా శక్తికి, ఆత్మ గౌరవానికి, సమరసతకు చిహ్నంగా శ్రీ లలితా పరమేశ్వరీ లక్ష్మీనారాయణ సహిత శ్రీ శివభక్త మార్కండేయ స్వామి దేవాలయాన్ని పునర్నిర్మా ణములో సామాన్యుడి నుండి సంపన్నుడి వరకు అందరినీ భాగస్వామ్యం చేయాలని భావించి అందుకు నిధి సమర్పణ కార్యాచరణను ప్రారంభించి తెలియజేపింది వారి అభిప్రాయాలను సేకరించింది.ఈ సమావేశం ద్వారా ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా అతి త్వరలోనే దేవాలయ నిధి సమర్పణ కార్యాచరణను ప్రారంభం. చేస్తున్నామని అది కూడా వారం పది రోజులలో ప్రారంభిస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము.
ఇటీవల అయోధ్య లో భవ్యమైన దిన్యమైన అయోధ్య రామమందిర నిర్మాణముకై జరిపిన నిధి సమర్పణ కార్య విధానమే స్ఫూర్తిగా తీసుకుని సామాన్యుడి నుండి సంపన్నుడి వరకు అందరం దేవుడి ముందర సమానమే అనే భావనతో ప్రయత్నం చేసి సిరిసిల్ల లో దివ్యమైన భవ్యమైన
శ్రీ మార్కండేయ ఆలయాన్ని పునర్నిర్మాణం చేద్దామని ఇది మనందరి సంఘటితశక్తికి, స్వాభిమానా ఆత్మ గౌరవానికి ప్రతీకగా ఉంటుందని తెలిపారు.ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా తను మన ధనాన్ని భగవంతునికి దేవాలయానికి సమర్పించి భగవంతుని కృపకు పాత్రులు కాగలరని
శ్రీ మార్కండేయ స్వామి జయంతి మహోత్సవ సమితి తెలిపింద త్వరలోనే నిధి సమర్పణ ప్రారంభం తేదీని మీకు మీడియా ద్వారా తెలియపరుస్తాం.దేవాలయానికి “ఇచ్చే ఒక ఇటుక కానీ, ఒక రూపాయి కానీ సమర్పణ చేస్తే తర తరాలకు పుణ్యం లభిస్తుంది . కావున ప్రతి ఒక్కరూ సమర్పణకి తను మన ధన ని సమర్పించి భాగస్వాములై భగవంతుని కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. ఇట్టి కార్యక్రమంలో మెరుగు సత్యనారాయణ మాదాస శ్రీనివాస్. నాగుల శ్రీనివాస్,కోడం రవి,గుంటుక పురుషోత్తం, చిమ్మని ప్రకాష్, గాజుల సదానందం, గుడ్ల విష్ణు, జిందం రవి, ఎనగంటి నరేష్,తదితరులు పాల్గొన్నారు.

ఉప్పరి సాయి కృష్ణను అభినందించిన మాజీ టీపీసీసీ అధ్యక్షులు దొమ్మటి…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-09T132223.758.wav?_=6

 

ఉప్పరి సాయి కృష్ణను అభినందించిన మాజీ టీపీసీసీ అధ్యక్షులు దొమ్మటి

పరకాల నేటిధాత్రి

 

హనుమకొండ జిల్లా పరకాల మండల పరిధిలోని మలకపేట గ్రామానికి చెందిన ఉప్పరి రవీందర్ మమత దంపతుల కుమారుడు ఉప్పరి సాయికృష్ణ ఎంబిబిఎస్ ప్రతిమ వైద్య కళాశాలలో సీటు వచ్చిన సందర్భంగా గురువారం రోజున ఉప్పరి సాయికృష్ణను మాజీ టీపీసీసీ ఉపాధ్యక్షులు దొమ్మటి సాంబయ్య శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.ఈ సందర్భంగా దొమ్మటి సాంబయ్య మాట్లాడుతూ ఒక పేద కుటుంబంలో పుట్టి ఉన్నంత చదువు చదివి సీటు సంపాదించదం అభినందనియామని గ్రామ యవత చదువులో ముందుండి మిగతా గ్రామాల యువతకు ఆదర్శవంతంగా ఉండాలని తల్లిదండ్రుల పేరును మరియు గ్రామ పేరును నిలబెట్టే విధంగా యువత తయారు అవ్వాలని,ఎంబిబిఎస్ సీటు సాధించిన సాయి కృష్ణ మరింత మంది యువతకు స్ఫూర్తిదాయకంగా ఉండాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మల్లక్కపేట గ్రామస్తులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

ఓటు చోరీ పేరిట కాంగ్రెస్ సంతకాల సేకరణ…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-09T131336.257.wav?_=7

 

ఓటు చోరీ పేరిట కాంగ్రెస్ సంతకాల సేకరణ…

ఓటు హక్కు కోల్పోవడం అంటే సర్వం కోల్పోయినట్లే….

కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, టిపిసిసి సభ్యులు రఘునాథ్ రెడ్డి,జిల్లా అధికార ప్రతినిధి వొడ్నాల శ్రీనివాస్

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

ఓటు హక్కు కోల్పోవడం అంటే సర్వం కోల్పోయినట్లే అని రామకృష్ణాపూర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, టిపిసిసి సభ్యులు రఘునాథ్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి వొడ్నాల శ్రీనివాస్, సీనియర్ నాయకులు అబ్దుల్ అజీజ్ లు అన్నారు. గురువారం క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అమ్మ గార్డెన్ ఏరియాలో ఓటు చోరీ పేరిట కాంగ్రెస్ పార్టీ సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడారు.

ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ల పిలుపుమేరకు ఓటు చోరీ పై సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. ఓటు చోరీ ఆపాలని కేంద్రానికి సంతకం చేసి తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని ప్రజలను కోరారు. ఓటు చోరీపై బూత్ స్థాయి నుంచి డివిజన్ స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు ఇంటింటికి వెళ్లి సంతకాలు సేకరించాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఓట్ల చోరీకి పాల్పడిందని దీనిపై రాహుల్ గాంధీ అలుపెరగని పోరాటం చేస్తున్నారని అన్నారు. బిజెపి తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థను అణచివేయాలని చూస్తుందని విమర్శించారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చేలా ఓటు చోరీ జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాండ్ల సమ్మయ్య, మాజీ చైర్ పర్సన్ జంగం కళ, వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ పనాస రాజు, నాయకులు గోపు రాజం, గోపతి భానేష్, భీమ మల్లేశ్, బొద్దుల ప్రేమ సాగర్,రామ్ సాయి, మహిళా నాయకురాలు పుష్ప తదితరులు పాల్గొన్నారు.

రామాంజనేయ కాలనీ నుండి ఎంపీటీసీ బరిలో పోకల శ్రీలత…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-09T115909.986.wav?_=8

 

చుంచుపల్లి మండలం రామాంజనేయ కాలనీ నుండి ఎంపీటీసీ బరిలో పోకల శ్రీలత

 

బి.ఆర్.యస్ పార్టీకి కట్టుబడి నియమ నిబద్ధతతో ఉంటూ కార్యక్రమంలో ముందంజ పోకల శ్రీలత

గతంలో వార్డు నంబరు గా ఇండిపెండెట్ అభ్యర్ధి అత్యధిక మెజార్టీ తో గెలుపొందారు

గతంలో ఎంపీటీసీ,జెడ్పీటీసీ అభ్యర్ధులు గెలవడంలో కీలకపాత్ర పోషించిన శ్రీలత

కొత్తగూడెం నియోజకవర్గం చుంచుపల్లి మండలం రామాంజనేయ కాలనీ నుండి

 

ఎంపీటీసీ అభ్యర్ధిగా పోటీచేస్తున్న పోకల శ్రీలత బి.ఆర్.యస్ పార్టీకి కట్టుబడి నియమ నిబద్ధతో పార్టీకి కష్టపడి ఒక సామాన్య కార్యకర్తగా ఉంటూ పార్టీ యొక్క ప్రతి కార్యక్రమములో పాల్గొంటూ ముందజంలో ఉన్నారు పార్టీ ఇచ్చిన ప్రతి ఒక్క కార్యక్రమంలో చురుకుగా తనదైన శైలిలో కార్యకర్తలను పోగుచేయడంలో శ్రీలత కి సాటి లేరు పార్టీ ఇచ్చిన

ఆదేశానుసారం ప్రతి ఒక్క కార్యక్రమములో పాల్గొంటూ తమకంటూ ఒక ప్రత్యేక స్థానంసంపాదించుకున్నారు నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజలందరికీ సుపరితురాలు అయ్యరూ,పోయిన ఎన్నికల్లో వార్డు నంబరు గా ఇండిపెండెట్ గా పోటీ చేసి అత్యధిక

మెజార్టీ తో గెలుపొందింది వార్డులో నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలుపరిష్కరించి అందరికీ ఇంటికి ఆడ బిడ్డ అయ్యారు,పోయిన ఎంపీటీసీ జెడ్పీటీసీ అభ్యర్ధులు గెలవడంలో కీలక పాత్ర పోషించారు వార్డులో అత్యధిక మెజారిటీ

కొనుగోలు కేంద్రం ప్రారంభించిన తహసిల్దార్ …

కొనుగోలు కేంద్రం ప్రారంభించిన తహసిల్దార్

నిజాంపేట, నేటి ధాత్రి

 

Vaibhavalaxmi Shopping Mall


మండలంలోని తిప్పనగుళ్ల గ్రామంలో బుధవారం ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని తహసిల్దార్ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రం వద్దకు ధాన్యం తీసుకువచ్చే రైతులు నాణ్యత ప్రమాణాలను పాటించాలన్నారు. ఏ గ్రేడ్ ధాన్యానికి 2389, బి గ్రేడ్ ధాన్యానికి 2369 గా ప్రభుత్వం ధర నిర్ణయించడం జరిగిందన్నారు. కార్యదర్శి శ్యామల, ఏపిఎం అశోక్, సీసీ రవీందర్, గుర్రాల మమత, బెల్లం లావణ్య తదితరులు ఉన్నారు.

హన్మంత్ రెడ్డి — రజిత వస్త్రధారణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

హన్మంత్ రెడ్డి — రజిత వస్త్రధారణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

Vaibhavalaxmi Shopping Mall

ఝరాసంగం మండల కేంద్రంలో కక్కెరవాడ గ్రామానికి చెందిన హన్మంత్ రెడ్డి — రజిత కుమార్తెల నూతన వస్త్రధారణ కార్యక్రమంలో చిన్నారులను ఆశీర్వదించిన శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, పాక్స్ చైర్మన్ మచ్చెందర్,మాజి ఎంపీపీ బొగ్గుల సంగమేశ్వర్,మాజి సర్పంచ్ లు బస్వరాజ్, శ్రీనివాస్ రెడ్డి,సంగారెడ్డి, నాయకులు డాక్టర్ నాగన్న,సోహైల్, దత్త రెడ్డి నాయకులు ,కార్యకర్తలు తదితరులు.

నిజాంపేటలో పర్యటించిన కేంద్ర బృందాలు…

నిజాంపేటలో పర్యటించిన కేంద్ర బృందాలు
• కృంగిన బ్రిడ్జి, తెగిన రోడ్లను పరిశీలన

నిజాంపేట: నేటి ధాత్రి

Vaibhavalaxmi Shopping Mall

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నిజాంపేటలో జరిగిన నష్టాన్ని కేంద్ర బృందం బుధవారం పరిశీలించారు. నందిగామ గ్రామ శివారులో 765 డీజీ రోడ్డు పై కృంగిన బ్రిడ్జి, నస్కల్ రోడ్డులో తెగిన బ్రిడ్జిలను పరిశీలించారు. భారీ వర్షాల కారణంగా కలిగిన నష్టాల అంచనా వేయడం జరుగుతుందన్నారు. వారితోపాటు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఆర్డీవో రమాదేవి, మండల తాహాసిల్దార్ శ్రీనివాస్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఇమాద్ తదితరులు ఉన్నారు.

కెటిపిపి విద్యుత్ ఉద్యోగ సంఘాల నిరసన

కెటిపిపి విద్యుత్ ఉద్యోగ సంఘాల నిరసన

గణపురం నేటి ధాత్రి

Vaibhavalaxmi Shopping Mall

గణపురం మండలం చెల్పూర్ గ్రామంలో భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ పై దాడికి యత్నించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం కెటిపిపి ప్రధాన ముఖద్వారం అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ ఎస్సీ & ఎస్టీ విద్యుత్ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన ఈ దాడి దేశ న్యాయ వ్యవస్థ చరిత్రలో చీకటి రోజని, భారత రాజ్యాంగం, ప్రజాస్వా మ్యంపై జరిగిన దాడిగానే భావిస్తున్నామని దాడికి పాల్పడిన వారికీ తగిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు సనతన దర్మం పిచ్చి ఎంత ముదిరింది అంటె దళితుడు ఐన సుప్రీంకోర్టులో సిజేఐ గవాయ్‌పై బూటు విసిరె స్థాయికి చేరింది.ఈ చర్యను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ లు అందరు తీవ్రంగా ఖండించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎస్పీ & ఎస్టీ జెఎసి నాయకులు తదితరులు పాల్గొన్నారు

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు

మహాదేవపూర్ అక్టోబర్ 8 (నేటి ధాత్రి)

Vaibhavalaxmi Shopping Mall

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం బెగులూర్ గ్రామానికి చెందిన మంద లక్ష్మి కుటుంబాన్ని బుధవారం రోజున కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు పరామర్శించారు. బెగులూర్ గ్రామానికి చెందిన మంద లక్ష్మి ఇటీవల భారీ వర్షాలకు గోడకూలి మృతి చెందగా వారి కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు పరామర్శించి వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి గుడాల అరుణ శ్రీనివాస్, పార్టీ సీనియర్ నాయకులు కటకం అశోక్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బుర్రి శివరాజ్, ములకల పోచమల్లు, ఆకుల రాజయ్య, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

జహీరాబాద్ లో తరగతి గదిలోనే ఉపాధ్యాయురాలి మృతి

జహీరాబాద్ లో తరగతి గదిలోనే ఉపాధ్యాయురాలి మృతి

జహీరాబాద్ నేటి ధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ పట్టణంలో బుధవారం ఉదయం ఎంపీ యుపీఏస్ పాఠశాల తరగతి గదిలో బి. సుజాత అనే ఉపాధ్యాయురాలు గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందారు. విద్యాశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, మృతురాలు సుజాత టీచర్ కోహీర్ మండలం పైడిగుమ్మల్ గ్రామానికి చెందినవారు. ఈ సంఘటనతో పాఠశాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సీఎం సహాయ నిధి చెక్కును అందించిన ఎంపీ షెట్కర్

సీఎం సహాయ నిధి చెక్కును అందించిన ఎంపీ షెట్కర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

శంకరం పేట్ (A) మండలం మూసాపేట్ గ్రామానికి చెందిన గోసాయిపల్లి సాయమ్మ, భర్త సంగయ్యకు అత్యవసర చికిత్స నిమిత్తం సీఎం సహాయ నిధి నుండి మంజూరు అయిన 2.5 లక్షల రూపాయల ఎల్ ఓ సి చెక్కును జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్ రెండవసారి బాధితుడికి అందించారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పేద, మధ్య తరగతి ప్రజలకు సీఎం సహాయ నిధి ద్వారా ప్రభుత్వం వైద్య ఖర్చులు చెల్లిస్తూ ఆర్థికంగా ఆదుకుంటుందని బుధవారం ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ ఆత్మ చైర్మన్ జైహింద్ రెడ్డి, అశోక్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

రామాయంపేట ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక..

రామాయంపేట ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక..

రామాయంపేట అక్టోబర్ 8 నేటిధాత్రి (మెదక్)

Vaibhavalaxmi Shopping Mall

అధ్యక్షునిగా మద్దెల సత్యనారాయణ.
రామాయంపేట ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని బుధవారం ఏ క గ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. రామయంపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా మద్దెల సత్యనారాయణ, ఉపాధ్యక్షులుగా చిర్ర సత్యనారాయణ, కోశాధికారిగా కట్ట ప్రభాకర్, ప్రధాన కార్యదర్శిగా రాగి లింగం, సహాయ కార్యదర్శులుగా రామారపు యాదగిరి, కుస్టీ నారాయణ, ముఖ్య సలహాదారులుగా పాతూరి రమేష్ గౌడ్, ఉడెం దేవరాజు, మర్కు నగేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన రామాయంపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మద్దెల సత్యనారాయణ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఏకగ్రీవంగా తనను అధ్యక్షునిగా ఎన్నుకున్న సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సభ్యులకు అన్ని విధాలుగా తన వంతు ఎల్లప్పుడు సహకారం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రెస్ క్లబ్ అభివృద్ధితో పాటు సమాజానికి ఉపయోగపడే విధంగా తన ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ పనిచేస్తుందని అన్నారు.

భూభారతి దరఖాస్తుల త్వరితగతిన పరిష్కరించాలి…

భూభారతి దరఖాస్తుల త్వరితగతిన పరిష్కరించాలి

నర్సంపేట ఆర్డీఓ కార్యాలయం సందర్శన

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

నర్సంపేట,నేటిధాత్రి:

 

Vaibhavalaxmi Shopping Mall


రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి కార్యక్రమం ద్వారా రైతులు సకాలంలో తమ భూ సంబంధిత సమస్యలను పరిష్కరించుకునేలా చొరవ చూపాలని, దరఖాస్తుల పరిశీలనలో జాప్యానికి తావులేకుండా వెంటనే ఆర్జీలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు.బుధవారం కలెక్టర్ డాక్టర్ సత్య శారద అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలసి నర్సంపేట ఆర్డీఓ కార్యాలయాన్ని సందర్శించారు.

 


ఈ సందర్భంగా రెవిన్యూ డివిజన్లోని 6 మండలాల తహసిల్దార్, ఇతర సిబ్బందితో భూభారతి అమలుపై సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులలో ఆయా మాడ్యుల్స్ లో ఎన్ని అర్జీలు పరిష్కరించారు?.ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి?. ఎంత మందికి నోటీసులు ఇచ్చారు?. క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ పూర్తయ్యిందా..? లేదా అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు.
క్షేత్రస్థాయి పరిశీలన నిర్ణీత గడువు లోపు అన్ని దరఖాస్తులు పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు.దరఖాస్తులు తిరస్కరణకు గురైనట్టయితే అందుకు గల కారణాలు స్పష్టంగా పేర్కొనాలని సూచించారు. సాదా బైనామా, పీఓటీ లకు సంబంధించిన అప్లికేషన్ లను క్షుణ్ణంగా పరిశీలించాలని వెంటనే నోటీసులు జారీ చేస్తూ క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ నిర్వహించాలన్నారు. భూభారతి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఆర్జీల పరిష్కారంలో జాప్యం జరుగకుండా రోజువారీగా దరఖాస్తుల పరిశీలనను పర్యవేక్షిస్తూ.. వేగవంతంగా వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ సమీక్షలో ఆర్డీఓ ఉమారాణి, తహశీల్దార్లు
రవిచంద్ర రెడ్డి, రాజేశ్వరరావు, రాజ్ కుమార్, అబిడ్ అలీ, రమేష్, కృష్ణా, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ఎమ్మెల్యే డోలా రోహన కార్యక్రమంలో ఆశీర్వదించారు

డోలా రోహన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

మొగుడంపల్లి మండల కేంద్రంలో జరిగిన గారి వార్డ్ మెంబర్ ప్రభు గారి కుమారుడి డోలా రోహన కార్యక్రమంలో పాల్గొని ఆశీర్వదించిన శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, పాక్స్ చైర్మన్ మచ్చెందర్,మాజి సర్పంచ్ లు ఈశ్వర్ రెడ్డి,సీతారాం రెడ్డి,నాయకులు ఓంకార్ రెడ్డి,గోపాల్, సంజీవ్ పవార్, దేవిదాస్ జాదవ్, రాంశెట్టి, లింబాజీ, జ్ఞానేండ్, నరేశ్ చౌహన్, సుభాష్ చందర్, కిరు, బిక్కు,
గ్రామ నాయకులు అంజన్న ,రాములు,జెట్టప్ప,వెంకట్ ,నర్సింలు,నాగన్న తదితరులు ..

error: Content is protected !!
Exit mobile version