జహీరాబాద్ లో తరగతి గదిలోనే ఉపాధ్యాయురాలి మృతి
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ పట్టణంలో బుధవారం ఉదయం ఎంపీ యుపీఏస్ పాఠశాల తరగతి గదిలో బి. సుజాత అనే ఉపాధ్యాయురాలు గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందారు. విద్యాశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, మృతురాలు సుజాత టీచర్ కోహీర్ మండలం పైడిగుమ్మల్ గ్రామానికి చెందినవారు. ఈ సంఘటనతో పాఠశాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి.