బోడగుట్ట తండాలో పోషణ మాసోత్సవం…

బోడగుట్ట తండాలో పోషణ మాసోత్సవం

కేసముద్రం/ నేటిదాత్రి

 

కేసముద్రం మండలంలోని అంగన్వాడి కల్వల క్లస్టర్ లోని పిక్లా తండా శివారు బోడగుట్ట తండా అంగన్వాడి సెంటర్లో గురువారం పోషణ మాసోత్సవం కార్యక్రమం నిర్వహించారు ఇందులో పోషకాలను అందించే 20 రకాల పిండి వంటలు, కొత్త రకమైన వంటకాలు, అలంకరణ బాగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా అంగన్వాడి సూపర్వైజర్ ఎస్ ప్రేమ జ్యోతి మాట్లాడుతూ… చిన్నపిల్లలకు ఎలాంటి జంక్ ఫుడ్ ఇవ్వవద్దని, నూనె పదార్థాలు, చక్కెర, చిప్స్ వంటి వాటికి దూరంగా ఉంచాలన్నారు. గర్భిణీ స్త్రీలు ప్రతినెల పరీక్ష చేయించుకుని తగిన పోషకాహారం తీసుకోవాలన్నారు. గర్భిణిగా ఉన్నప్పుడు మంచి ఆహారం తీసుకుంటే ఆరోగ్యవంతమైన బేబీ జన్మిస్తుందని చెప్పారు. పిల్లల పెరుగుదల విషయంలో ఎప్పటికప్పుడు పోషకాహారం అందిస్తూ ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలన్నారు. ఈ సందర్భంగా వివిధ రకాల ఆహార పదార్థాలను చిరుధాన్యాలతో తయారుచేసి పిల్లలకు అందించారు. హాజరైన వారందరితో పోషకాహారం పై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం గనె యాదగిరి, కార్యదర్శి ఇ.నివాస్ రెడ్డి, టీచర్ గానె పావన, క్లస్టర్ లోని అంగన్వాడి టీచర్లు జీ. నీల, టి. వాణి, ఈ. జ్యోతి, బి. సునీత, బి. స్వప్న, జి. పద్మ, ఆశ వర్కర్లు ఎం. నాగలక్ష్మి, ఎస్. ఉపేంద్ర, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, గ్రామస్తులు, పిల్లలు పాల్గొన్నారు.

*సదరం’ పరీక్షల్లో ప్రభుత్వ నిబంధనలు పాటించండి..

*’సదరం’ పరీక్షల్లో ప్రభుత్వ నిబంధనలు పాటించండి..

*కమిషనర్ ఎన్. మౌర్య..

తిరుపతి(నేటి ధాత్రి)అక్టోబర్
09:

 

సదరం ధ్రువ పత్రాల కొరకు నిర్వహించే పరీక్షలను పారదర్శకంగా ప్రభుత్వ నిబంధలను పాటిస్తూ నిర్వహించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్. మౌర్య వైద్యులకు సూచించారు. వికలత్వం యొక్క శాతాన్ని నిర్దారిస్తూ రుయాసుపత్రి లో నిర్వహిస్తున్న పరీక్షా కేంద్రాలను గురువారం ఉదయం కమిషనర్ తనిఖీ చేశారు. ఏ విధంగా పరీక్షలు చేస్తారు, రోజూ ఎంతమందికి పరీక్షలు నిర్వహిస్తున్నారనే విషయాలను రుయా వైద్యులు కమీషనరకు వివరించారు. చెవి, ముక్కు, ఎముకలు, మానసిక రోగులకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ వైద్యులు అందించే సదరం ధ్రువ పత్రాల మేరకు వికలాంగులకు పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఇందులో ఎటువంటి అవకతవకలు లేకుండా ప్రభుత్వ నిబంధనల మేరకు పారదర్శకంగా పరీక్షలు చేయాలాని వైద్యులకు సూచించారు. పరీక్షల కొరకు వచ్ఛే వారికి తాగునీరు, నీడ తదితర మౌళిక వసతులు కల్పించాలని తెలిపారు. రోజుకి వందమందికి పరీక్షలు చేసేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. డిప్యూటీ కమిషనర్ డిప్యూటీ కమిషనర్ అమరయ్య, రుయా సూపరింటెండెంట్ డాక్టర్ రాధ, ఆర్ ఎం ఓ డాక్టర్ హరికృష్ణ, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, పలువురు వైద్యులు ఉన్నారు

నామినేషన్ కేంద్రం వద్ద పోలీసుల బందోబస్తు

నామినేషన్ కేంద్రం వద్ద పోలీసుల బందోబస్తు

తాండూర్,(మంచిర్యాల) నేటి ధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

మంచిర్యాల జిల్లా తాండూరు మండల కేంద్రంలో ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికల నామినేషన్ కేంద్రం వద్ద సిఐ దేవయ్య ఆదేశాల మేరకు తాండూర్ ఎస్సై కిరణ్ కుమార్, మాదారం ఎస్సై సౌజన్య పటిష్ట బంధవస్తు నిర్వహించారు. పై అధికారుల ఆదేశాల మేరకు అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని విధాల ఏర్పాట్లు చేశామని తెలిపారు. నామినేషన్ కేంద్రానికి 100 మీటర్ల దూరం వరకు ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించరాదని ఎస్సై లు హెచ్చరించారు.అలాగే తాండూర్ మండల కేంద్రంలో గురువారం ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని ఎన్నికల అధికారులు తెలిపారు.

వరల్డ్ కరాటే రికార్డు పోటీలో యాసీన్ ప్రతిభ…

వరల్డ్ కరాటే రికార్డు పోటీలో యాసీన్ ప్రతిభ

నేటిధాత్రి, వరంగల్.

 

తమిళనాడు లోని తాంబరం సివెట్ కళాశాల మైదానంలో ఆదివారం వరల్డ్ కరాటే మాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, బాలమురుగన్ నిర్వహించిన ప్రపంచ రికార్డు ప్రయత్న కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో వరంగల్ జిల్లా ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్న ఫునాకోషి షోటోకాన్ కరాటే-డో ఇండియా అసోసియేషన్‌కు చెందిన బ్లాక్ బెల్ట్ 4వ డాన్ షేక్ యాసీన్ పాల్గొని తన నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ప్రపంచ రికార్డు సృష్టి కార్యక్రమంలో విశేష ప్రతిభ కనబరిచిన యాసీన్‌కు వరల్డ్ కరాటే మాస్టర్స్ అసోసియేషన్ తరఫున పతకం, సర్టిఫికేట్‌ లను లండన్‌కు చెందిన గిన్నిస్ వరల్డ్ రికార్డు ఇన్‌చార్జ్ రిషినాథ్ అందజేశారు.

ఈ విజయంపై ఇండియా చీఫ్ ఇన్స్పెక్టర్ అండ్ ఎగ్జామినర్ రాచా శ్రీనుబాబు (బ్లాక్ బెల్ట్ 7వ డాన్) యాసీన్‌ను అభినందిస్తూ, ఆయన కృషి మరియు ప్రతిభ ప్రపంచ స్థాయి గుర్తింపు పొందడం వరంగల్ కరాటే అభిమానులకు గర్వకారణమని పేర్కొన్నారు.

చేనేత జౌళి శాఖ కార్యాలయాo కార్మికులకు చేరువలో ఉండాలి…

చేనేత జౌళి శాఖ కార్యాలయాo కార్మికులకు చేరువలో ఉండాలి

సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కి , చేనేత జౌళి శాఖ ఏడి కి వినతి పత్రం అందజేత

సిరిసిల్ల టౌన్: ( నేటి ధాత్రి )

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలో సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ మాట్లాడుతూ సిరిసిల్ల పవర్లూమ్ వస్త్ర పరిశ్రమలో వివిధ రంగాలపై ఆధారపడి పనిచేస్తున్న వేదలాదిమంది కార్మికులకు చాలా సంవత్సరాలుగా సిరిసిల్ల బి.వై. నగర్ లో అందుబాటులో ఉండి సేవలందించిన జిల్లా చేనేత జౌళి శాఖ కార్యాలయాన్ని కలెక్టరేట్ సముదాయంలోకి మార్చడం వలన కార్మికులు వివిధ సంక్షేమ పథకాలు , సమాచారం కోసం లేదా ఏదైనా పని నిమిత్తం కలెక్టరేట్ లోని చేనేత జౌళి శాఖ కార్యాలయానికి వెళ్లాలంటే కార్మికులకు దూర భారంతో పాటు ఆర్థిక భారం మరియు కొంత సమయం పని కూడా కోల్పోయి అనేక ఇబ్బందులకు గురవుతున్నారని రాను పోను ప్రయాణంలో

 

 

ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉందన్నారు.సిరిసిల్ల పట్టణం బి.వై. నగర్ లో చేనేత జౌళి శాఖ కార్యాలయానికి సొంత భవనం ఉన్నప్పటికీ అప్పటి కలెక్టర్ ఏకపక్ష నిర్ణయంతో ఆఫీసును కలెక్టరేట్ సముదాయంలోకి మార్చడం జరిగిందని ఆఫీసును మార్చడం ద్వారా కార్మికుల ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృశ్య యధావిధిగా సిరిసిల్లలోకి ఆఫీసును మార్చాలని పలు దాఫాలుగా కలెక్టర్ గారికి విన్నవించినప్పటికీ కూడా కలెక్టర్ పట్టించుకోలేదని ప్రస్తుతం కొత్తగా వచ్చిన ఈ కలెక్టర్ అయినా వేలాదిమంది కార్మికులకు ఎదురవుతున్న ఇబ్బందులను గుర్తించి ఆఫీసును యధావిధిగా సిరిసిల్లలోకి మార్చే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో వార్పిన్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు సిరిమల్ల సత్యం , ఉడుత రవి , గుండు రమేష్ , ఎక్కల్ దేవి జగదీష్ , బాస శ్రీధర్ , స్వర్గం శేఖర్ , పత్తిపాక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

పెట్రోల్ బంకులలో తనిఖీలు చేపట్టిన తహసిల్దార్ వనజా రెడ్డి

పెట్రోల్ బంకులలో తనిఖీలు చేపట్టిన తహసిల్దార్ వనజా రెడ్డి

జైపూర్,నేటి ధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

 

జైపూర్ మండలంలోని ఇందారం, నర్వ, జైపూర్ గ్రామాలలోని పెట్రోల్ బంకులను ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు తహసీల్దార్ వనజా రెడ్డి గురువారం తనిఖీలు చేపట్టారు. పెట్రోల్ బంకులలో యజమాన్యం కల్పిస్తున్న వివిధ సౌకర్యాలు ఉచిత గాలి, త్రాగునీరు టాయిలెట్స్, ఫైర్ ఫైటింగ్ ఎంక్విమెంట్లను తనిఖీలు చేసిన అనంతరం పెట్రోల్ బంకుకు వచ్చే వినియోగదారులతో మర్యాదపూర్వకంగా ఉంటూ నిబంధనల ప్రకారం పెట్రోల్ బంకులను నిర్వహించాలని అన్నారు.వినియోగదారులతో అసభ్యకరంగా ప్రవర్తించడం లేదా వారిని కించపరచడం లాంటిది చేస్తే తగు చర్యలు తీసుకుంటామని యజమానులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ తిరుపతి, జిపిఓ నవీన్, రాజు పాల్గొన్నారు.

పంచాయతీ ఎన్నికల నిర్వహణలో తనిఖీలు చేపట్టిన అధికారులు

2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నిర్వహణ భాగంగా స్వేచ్ఛాయితంగా, పారదర్శకంగా నిష్పక్షపాతంగా జరిగే విధంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం తహసిల్దార్ వనజా రెడ్డి,ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్,ఎంపీఓ శ్రీపతి బాబురావు,సిఐ వేణు చందర్,శ్రీధర్ ఇందారం గ్రామంలో గురువారం తనిఖీ కేంద్రం ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీలు చేపట్టారు

దాతల సహాయంతో ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు టై బెల్టులు పంపిణీ…

దాతల సహాయంతో ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు టై బెల్టులు పంపిణీ.

చిట్యాల, నేటి ధాత్రి :

 

చిట్యాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో టై బ్యాడ్జి బెల్టుల పంపిణీ@
స్థానిక జడ్పీహెచ్ఎస్ చిట్యాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థినీ విద్యార్థుల కోసం దాతల సహాయంతో టై, బ్యాడ్జి బెల్టులను ఎంఈఓ రఘుపతి పంపిణీ చేశారు.
ఇందుకోసం పొగళ్ల మహేందర్ రెడ్డి, దేవ శ్రీధర్,మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు సహకారంతో విద్యార్థులకు ఎం ఈ వో రఘుపతి వీటినిపంపిణీ చేశారు.
ఇట్టి కార్యక్రమంలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు బొమ్మ రాజమౌళి, బుర్ర సదయ్య, కూచనపల్లి.శ్రీనివాస్, పిడి సూధం సాంబమూర్తి, రామనారాయణ, ఉస్మాన్ అలీ, నీలిమ రెడ్డి సరళ దేవి,కల్పన, విజయలక్ష్మి, సుజాత, బుజ్జమ్మ తదితరులు పాల్గొన్నారు.

చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు

చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు

నీతి అయోగ్ ప్రభరి అధికారి పౌసమి బసు

భూపాలపల్లి నేటిధాత్రి

Vaibhavalaxmi Shopping Mall

పోషణలోపంతో బాధపడుతున్న చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నీతి అయోగ్ ప్రభరి అధికారి పౌసమి బసు తెలిపారు..
గురువారం గణపురం మండలం బుర్రకాయలగూడెం అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా చిన్నారులు పూల బొకే అందించి ఆమెకు స్వాగతం పలికారు. చిన్నారులతో ఆప్యాయంగా మాట్లాడుతూ, “మీ పేరేంటి… నాకోసం ఎదురు చూస్తున్నారా?” అంటూ వారిని పలకరించారు. తరువాత ఆమె పోషణ లోపంతో బాధపడుతున్న చిన్నారుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ప్రస్తుతం 140 మంది చిన్నారులు పోషణలోపంతో బాధపడుతున్నారని, వారికి తగిన వైద్య శిబిరాలు నిర్వహించి, అవసరమైన పోషకాహారాన్ని అందించాలని ఆమె సూచించారు. అలాగే గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అందిస్తున్న బాలామృతం గురించి, అలాగే కిశోర బాలికలకు పంపిణీ చేస్తున్న పల్లి, మిల్లెట్ చిక్కీలువివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో మొత్తం 8,550 మంది కిశోర బాలికలకు పల్లి, మిల్లెట్ చిక్కీలు అందిస్తున్నామని అధికారుల నుండి సమాచారం అందుకున్న ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కేంద్రం నిర్వహణ బావుందని సిబ్బందిని అభినందించారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు పోషణ మాసంలో భాగంగా సీమంతాలు చేసి ఆరోగ్య పరిరక్షణ చర్యలు పాటించాలని, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేపించుకుంటూ వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తూ సుఖ ప్రసవాలతో పాటు ఆరోగ్య వంతమైన బిడ్డలకు జన్మనివ్వాలని సూచించారు.
అంతకు ముందు రేగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఓపి రిజిస్టర్ పరిశీలించారు. ఎలాంటి వ్యాధులకు సేవలకు వస్తున్నారని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆశాలకు ఆశా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాకు విచ్చేసిన ప్రభరి అధికారి పౌసమి బసుకు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పూల మొక్కను అందించి స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్,
జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్, సిపిఓ బాబురావు, జిల్లా సంక్షేమ అధికారి మల్లీశ్వరి ఉప వైద్యాధికారి డా శ్రీదేవి, డా ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు

విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి…

విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి

ఎంపిడిఓ పెద్ది ఆంజనేయులు

పరకాల నేటిధాత్రి

 

ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మండల విద్యాశాఖ అధికారి రమాదేవి అధ్యక్షతన ఏర్పాటు చేసిన స్కూల్ గేమ్స్ పెడరేషన్ ఆఫ్ ఇండియా 14 నుండి 17 సంవత్సరాల వయస్సు గల బాల బాలికలకు మండల స్థాయి కబడ్డీ కోఖో క్రీడల ప్రారంభోత్సవం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యంపీడీఓ పెద్ది ఆంజనేయులు హాజరయ్యారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నేటి కాలమాన పరిస్థితులలో విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు ఇతర రంగాలలో కూడా రాణించాలని రాష్ట్ర దేశ స్థాయిలో ఉత్తమ క్రీడాకారులకు ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్లు ఉంటాయని తెలిపారు.అనంతరం ఆంజనేయులు వారి తల్లిదండ్రులు జ్ఞాపకార్థం జిల్లా స్థాయిలో పాల్గొనే క్రీడాకారులకు టీషర్టులు ఉచితంగా అందిస్తానన్నారు.ఈ కార్యక్రమంలో స్కూల్ గేమ్స్ పెడరేషన్ పరకాల మండల ఆర్గనైజింగ్ కార్యదర్శి బి సాంబయ్య,నోడల్ అధికారి నామాని సాంబయ్య,గెజిటెడ్ ప్రదానోపాద్యాయులు సురేందర్,మదు బాస్కర్,పీడీలు శ్యాం,రజిత ,వినయ్ ,సుదీర్, రాజు,శ్రీకాంత్,సురేష్ మండల పరిధిలోని ప్రబుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు,పీఈటీలు పాల్గొన్నారు.

“ముత్యంపేట్‌లో వరల్డ్ పోస్టల్ డే అవగాహన కార్యక్రమం”..

మల్లాపూర్ అక్టోబర్ 9 నేటి ధాత్రి

 

మల్లాపూర్ మండల్ ముత్యంపేట గ్రామంలో వరల్డ్ పోస్టల్ డే సందర్భంగా తపాల శాఖ వారు పోస్టాఫీస్ ముత్యంపేట్ సిబ్బంది సబ్ పోస్టుమాస్టర్ ఎన్ ఎం శ్రీనివాస్.డక్ సేవకులు ప్రశాంత్ భూమయ్య చంద్రమౌళి ప్రజలకు పోస్టాఫీస్ స్కీముల పైన గురువారం అవగాహన కల్పించడం జరిగింది ఇందుకోసం స్కూల్స్ గ్రామపంచాయతీ ముత్యంపేట్ లో కొన్ని వీధులను సందర్శించి ప్రజలకు అవగాహన కల్పించారు పోస్ట్ ఆఫీస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సబ్ పోస్ట్ మాస్టర్ చెప్పారు.

ఎర్రోళ్ల శ్రీనివాస్ ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది…

ఎర్రోళ్ల శ్రీనివాస్ ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది

నర్సంపేట,నేటిధాత్రి:

 

రాష్ట్ర మాజీ ఎస్సి ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తండ్రి ఎర్రోళ్ల విజ్జయ అనారోగ్యంతో గురువారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్ గ్రామంలో మృతి చెందాడు. ఈ నేపథ్యంలో రాష్ట్ర సివిల్ సప్లై మాజీ చైర్మన్, బిఆర్ఎస్ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విజ్జయ మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.రాష్ట్ర మాజీ ఎస్సి ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తో పాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఖమ్మం జిల్లాలో తాటిచెట్లు నరికిన వారిపై చర్యలు తీసుకోవాలి…

ఖమ్మం జిల్లాలో తాటిచెట్లు నరికిన వారిపై చర్యలు తీసుకోవాలి

మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ డిమాండ్

నర్సంపేట,నేటిధాత్రి:

 

ఖమ్మం జిల్లా సింగరేణి మండలం మాదారం గ్రామంలో తాటిచెట్లు నరికినవారిపై కేసులు నమోదుచేసి చర్యలు తీసుకోవాలని గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ డిమాండ్ చేశారు. నర్సంపేట పట్టణంలో సంఘం సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్బంగా రమేష్ గౌడ్ మాట్లాడుతూ
మాదారం గ్రామంలో గత 40 సంవత్సరాల నుండి కల్లు వృత్తిపై జీవనాధారం కొనసాగించే వందల కుటుంబాలు ఆ గ్రామంలో గీత కార్మికులు ఉన్నారన్నారు.మాదారం గ్రామంలో ఒక పెద్ద మనిషి పంట పొలాన్ని కొనుగోలుచేసి గత సంవత్సరం కొన్ని తాటిచెట్లను తీసివేయగా గీత కార్మికులు వెళ్లి నిరసన వ్యక్తంచేయగా ఆరోజు ఆపేశారన్నారు. ఈ నెల 8న మరలా వందల తాటిచెట్లను జె.సి.బిలతో కూల్చివేయడం
మొదలుపెట్టారన్నారు.గీత కార్మికులకు విషయం తెలిసి అడ్డుకోగా చెట్లను
కూల్చడానికి సిద్ధపడుతున్నారని ఆయన పేర్కొన్నారు.చెట్లను నరికి గీత కార్మికులు పొట్టకొట్టొద్దని వేడుకున్నా ఆపలేదని అవేదన వ్యక్తం చేశారు.
జీవనాధారం మొత్తం కల్లువృత్తిపై ఆధారపడి ఉంటున్న గీత కార్మికులు రోడ్డునపడే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తంచేశారు.ఇప్పటికైనా ఆబకారిశాఖ అధికారులు స్పందించి గీత కార్మికులకు తగిన న్యాయం చేయాలని, లేనిఎడల పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని రమేష్ గౌడ్ డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మోకుదెబ్బ రాష్ట్ర ప్రచార కార్యదర్శి గోడిశాల సదానందం గౌడ్,జిల్లా అధ్యక్షులు గోపగాని వెంకటేశ్వర్లు గౌడ్, రాష్ట్ర కార్యదర్శి మద్దెల సాంబయ్య గౌడ్,జిల్లా ప్రధాన కార్యదర్శి శీలం వీరన్న గౌడ్,సలహాదారులు రామగోని సుధాకర్ గౌడ్, గౌడ సంఘం పట్టణ అధ్యక్షులు కోల వెంకటేశ్వర్లు గౌడ్,కార్యదర్శి మద్దెల శ్రీనివాస్ గౌడ్, తాళపెల్లి శ్రీనివాస్ గౌడ్,మొగలగానిసురేష్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు జూలూరి హరిప్రసాద్ గౌడ్, జునూరి నరేష్ గౌడ్,డివిజన్ అధ్యక్షులు కందుల శ్రీనివాస్ గౌడ్,గిరగాని కిరణ్ గౌడ్,రమేష్ గౌడ్, కృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే మాధవరెడ్డిని కలిసిన సిపిఐ నాయకులు…

ఎమ్మెల్యే మాధవరెడ్డిని కలిసిన సిపిఐ నాయకులు

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట శాసన సభ్యులు మాతృమూర్తి దొంతి కాంతమ్మ గత కొన్ని రోజుల క్రితం మరణించగా గురువారం సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు పంజాల రమేష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని కలసి విమర్శించారు. కాంతమ్మ చిత్రపటానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట మండల కార్యదర్శి అయిత యాకుబ్, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు పాలక కవిత, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు దిడ్డి పార్థసారధి, మాదన్నపేట రోడ్ సిపిఐ శాఖ కార్యదర్శి పిట్టల సతీష్, సహాయ కార్యదర్శి బాధరబోయిన యాదగిరి, గడ్డం నాగరాజు, మాతంగి సురేష్,కమ్మాల అరుణ, గౌరబోయిన పద్మ,కోలుగురి రాధిక తదితరులు పాల్గొన్నారు.

షేక్ జావిద్ ఆధ్వర్యంలో పరామర్శ..

తెలంగాణ జన సమితి పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు షేక్ జావిద్ ఆధ్వర్యంలో నర్సంపేట ఎమ్మెల్యే పంది మాధవరెడ్డి హనుమకొండలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పరామర్శించారు. షేక్ జావిద్ తో విద్యావంతుల వేదిక వరంగల్ జిల్లా అధ్యక్షులు ఎండి మహబూబాబాద్ వరంగల్ జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు మీర్జా మసూద్ అలీ మహమ్మద్ నుమాన్ మహమ్మద్ యూసుఫ్ ఆఫీస్ ఇర్ఫాన్ సాబ్ మహమ్మద్ హర్షద్ శ్రవణ్ లు ఎమ్మెల్యే తల్లి కాంతమ్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

స్వచ్చంధ సంస్థల ప్రతినిధుల పరామర్శ..

నర్సంపేట ఎంఎల్ఏ దొంతి మాధవరెడ్డిని తన నివాసంలో నర్సంపేట పట్టణ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పరామర్శించారు. ఎమ్మెల్యే తల్లి దొంతి కాంతమ్మ చిత్ర పటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో స్వచ్చంధ సంస్థల సమాఖ్య అధ్యక్షులు, కన్స్యూమర్ ఫోరమ్ జిల్లా అధ్యక్షులు గిరగాని సుదర్శన్ గౌడ్,ఏ.ఎస్.ఆర్. సంస్థ నిర్వాహకులు ఎర్రబోయిన రాజశేఖర్, స్వయంకృషి సంస్థ నిర్వాహకులు బెజ్జంకి ప్రభాకర్, ప్రతిభ సంస్థ ప్రతినిధి బోయిని వెంకటస్వామి, స్వేచ్ఛశ్రీ సంస్థ నిర్వాహకురాలు మైస వసంత, కన్స్యూమర్ ఫోరమ్ విజిలెన్స్ కమిటీ మెంబెర్ నాగేల్లి సారంగం గౌడ్,మెడికల్ స్టోర్స్ అసోసియేషన్ ప్రతినిధి రవికాంత్, సోషల్ వాలంటీర్ కాసుల వెంకటాచారి, రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర స్థాయి కిట్ బాక్సింగ్ పోటీకి ఎంపికైన విద్యార్థులు…

రాష్ట్ర స్థాయి కిట్ బాక్సింగ్ పోటీకి ఎంపికైన విద్యార్థులు

భూపాలపల్లి నేటిధాత్రి

 

ఎస్ జి ఎఫ్ రాష్ట్రస్థాయిబాక్సింగ్ పోటీలకు ఎంపికైన జిల్లా విద్యార్థులు
సెప్టెంబర్ 08.10.2025 నాడు జె ఎన్ ఎస్ , స్టేడియం బాక్సింగ్ హాల్ హన్మకొండ నందు జరిగిన అండర్ 17 ఉమ్మడి జిల్లా స్థాయి బాక్సింగ్ పోటీలలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన శశి కమల్ నాథ్ లు రాష్ట్రస్థాయి ఎస్ జి ఎఫ్ పోటీలకు అర్హత సాధించారు.
వీరికి జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి సి హెచ్ రఘు అభినందనలు తెలియచేశారు. వీరు మరెన్నో ఉన్నత స్థాయి క్రీడలలో పాల్గొని జిల్లా కి మంచి పేరు తేవాలని కోరారు.

సిజిహెచ్ఎస్ వెల్‌నెస్ సెంటర్‌ కోసం కుడా కార్యాలయ పై అంతస్తు పరిశీలన…

సిజిహెచ్ఎస్ వెల్‌నెస్ సెంటర్‌ కోసం కుడా కార్యాలయ పై అంతస్తు పరిశీలన

పరకాల నేటిధాత్రి

 

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లు కోసం ప్రత్యేకంగా నడిపించే కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం సిజిహెచ్ఎస్ వెల్‌నెస్ సెంటర్‌ను వరంగల్‌లో ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది.ఈ సందర్భంగా వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటుకై భవనాల ఎంపిక కోసం కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(కుడా)కార్యాలయం పై అంతస్తును వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య
సిజిహెచ్ఎస్ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్.రోహిణితో సందర్శనకు వచ్చిన సందర్భంగా,ఛైర్మన్ వారికి మర్యాదపూర్వకంగా పూల కుండీని అందించారు.అనంతరం కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, పీవో అజిత్ రెడ్డి తో కలిసి కార్యాలయాన్ని పరిశీలించారు.వరంగల్ లో కొత్తగా వెల్‌నెస్ సెంటర్‌ ఏర్పాటు చేయటం వలన వరంగల్‌తో పాటు పరిసర ప్రాంతాల్లోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి.సీజీహెచ్‌ఎస్ ఒక కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్‌ అయినప్పటికీ,వెల్‌నెస్ సెంటర్‌లలో ప్రాథమిక ఓపీడీ చికిత్స సాధారణ ప్రజలకు కూడా అందుబాటులో ఉంటుంది.ఈ నిర్ణయం ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే కాకుండా స్థానిక ప్రజలకు కూడా లబ్ధి చేకూరనుంది.

అతి త్వరలోనే నిధి సమర్పణ ప్రారంభం…

అతి త్వరలోనే నిధి సమర్పణ ప్రారంభం

– శ్రీ శివ భక్తమార్కండేయ స్వామి దేవాలయ పునర్నిర్మాణం కోసం

– శ్రీ మార్కండేయ స్వామి జయంతి మహోత్సవ సమితి కన్వీనర్ మోర శ్రీనివాస్

సిరిసిల్ల (నేటి ధాత్రి):

 

సిరిసిల్ల పద్మశాలి కులబంధువులకు, హిందూ బంధువులకు సిరిసిల్ల మార్కండేయ వీధిలో అత్యంత పురాతనమైన విశిష్టమైన శ్రీ శివభక్త మార్కండేయ స్వామి దేవాలయము పునర్నిర్మాణం కై
శ్రీ మార్కండేయ స్వామి జయంతి మహోత్సవ సమితి ఒక కార్యచరణను ప్రారంభించింది.
దీనిలో భాగంగా ఈ రోజు ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ గత రెండు నెలల నుండే పద్మశాలి కుల బంధువులతో, హిందు బంధువులతో సమాజంలోని అందరిని కలుపుకుని పోయే విధంగా దేవాలయాల ఆధారంగా 22 సమావేశాలను శాంతి నగర్ నుండి భూపతినగర్ వరకు, చంద్రంపేట నుండి సాయినగర్ వరకు నిర్వహించి అభిప్రాయాలను సేకరించిందని అన్నారు.
దేవాలయ పునర్నిర్మాణం హిందూ సంఘటనా శక్తికి, ఆత్మ గౌరవానికి, సమరసతకు చిహ్నంగా శ్రీ లలితా పరమేశ్వరీ లక్ష్మీనారాయణ సహిత శ్రీ శివభక్త మార్కండేయ స్వామి దేవాలయాన్ని పునర్నిర్మా ణములో సామాన్యుడి నుండి సంపన్నుడి వరకు అందరినీ భాగస్వామ్యం చేయాలని భావించి అందుకు నిధి సమర్పణ కార్యాచరణను ప్రారంభించి తెలియజేపింది వారి అభిప్రాయాలను సేకరించిందనీ అన్నారు.
ఈ సమావేశం ద్వారా ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా అతి త్వరలోనే దేవాలయ నిధి సమర్పణ కార్యాచరణను ప్రారంభం చేస్తున్నామని అది కూడా వారం పది రోజులలో ప్రారంభిస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము అన్నారు.

ఇటీవల అయోధ్య లో భవ్యమైన దిన్యమైన అయోధ్య రామమందిర నిర్మాణముకై జరిపిన నిధి సమర్పణ కార్య విధానమే స్ఫూర్తిగా తీసుకుని సామాన్యుడి నుండి సంపన్నుడి వరకు అందరం దేవుడి ముందర సమానమే అనే భావనతో ప్రయత్నం చేసి సిరిసిల్ల లో దివ్యమైన భవ్యమైన
శ్రీ మార్కండేయ ఆలయాన్ని పునర్నిర్మాణం చేద్దామని ఇది మనందరి సంఘటితశక్తికి, స్వాభిమానా ఆత్మ గౌరవానికి ప్రతీకగా ఉంటుందని తెలిపారు.

ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా తను మన ధనాన్ని భగవంతునికి దేవాలయానికి సమర్పించి భగవంతుని కృపకు పాత్రులు కాగలరని
శ్రీ మార్కండేయ స్వామి జయంతి మహోత్సవ సమితి తెలిపింద
త్వరలోనే నిధి సమర్పణ ప్రారంభం తేదీని మీకు మీడియా ద్వారా తెలియపరుస్తామని అన్నారు.

దేవాలయానికి “ఇచ్చే ఒక ఇటుక కానీ, ఒక రూపాయి కానీ సమర్పణ చేస్తే తర తరాలకు పుణ్యం లభిస్తుంది . కావున ప్రతి ఒక్కరూ సమర్పణకి తను మన ధన ని సమర్పించి భాగస్వాములై భగవంతుని కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నామనీ అన్నారు.
ఇట్టి కార్యక్రమంలో మెరుగు సత్యనారాయణ,మాదాస శ్రీనివాస్, నాగుల శ్రీనివాస్, కోడం రవి, గుంటుక పురుషోత్తం, చిమ్మని ప్రకాష్, గాజుల సదానందం, గుడ్ల విష్ణు, జిందం రవి, ఎనగంటి నరేష్, తదితరులు పాల్గొన్నారు.

చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్న పెద్దింటి ప్రభాకర్…

చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్న పెద్దింటి ప్రభాకర్

తాండూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

 

మంచిర్యాల జిల్లా తాండూరు మండలం కొత్తపల్లి గ్రామంలో పెద్దింటి ప్రభాకర్(64)అనే వ్యక్తి చెరువులో పడి మృతి చెందినట్లు తాండూర్ ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. వారు సేకరించిన వివరణ ప్రకారం మృతుడు అతిగా మద్యం తాగడానికి అలవాటు పడడంతో కుటుంబ సభ్యులు అతన్ని మందలించారని తెలిపారు. దీంతో మనస్థాపానికి గురైన ప్రభాకర్ గురువారం ఊరి చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతిచెందిన వ్యక్తి భార్య రాజేశ్వర్ తో పాటు ఇద్దరు కొడుకులు ఒక కుమార్తె ఉన్నారని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు.

నారాయణకు రాయితీ హెల్త్ కార్డు అందించిన మెట్‌పల్లి ప్రెస్ క్లబ్…

సీనియర్ జర్నలిస్టు నారాయణకు మెట్ పల్లి లోని కార్పొరేట్ స్థాయి ఆసుపత్రి బిల్లులో రాయితీ కలిగిన హెల్త్ కార్డు అందించిన
మెట్ పల్లి ప్రెస్ క్లబ్( ఐజేయు) సభ్యులు

 

మెట్ పల్లి అక్టోబర్ 9 నేటి దాత్రి
కోరుట్లలోని 6 వార్డు ఎకిన్ పూర్ చెందిన సీనియర్ జర్నలిస్టు గోరు మంతుల నారాయణకు. మెట్ పల్లి లోని కార్పొరేటర్ స్థాయి ఆసుపత్రిలో. బిల్లులో రాయితీ కలిగిన హెల్త్ కార్డును. గురువారంటీయూడబ్ల్యూజే( ఐజేయు) మెట్ పల్లి ప్రెస్ క్లబ్ ప్రింట్ మీడియా.అధ్యక్ష కార్యదర్శులు బూరం సంజీవ్, మహమ్మద్ అజీమ్ ల ఆధ్వర్యంలో అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. నారాయణకు గత నెలలో ఆర్థిక సాయం అందించినట్లు. ఇప్పుడు ఆయనకు పట్టణంలోని ఓ కార్పొరేట్ స్థాయి ఆసుపత్రికి చెందిన బిల్లులో రాయితీగల హెల్త్ కార్డును అందించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు మహమ్మద్ అప్రోజ్, సహాయ కార్యదర్శి పింజారి శివ, ఈసీ మెంబర్ కుర్ర రాజేందర్ లు తదితరులున్నారు.

రేవూరి బుచ్చిరెడ్డిని పరామర్శించిన దొమ్మటి సాంబయ్య…

రేవూరి బుచ్చిరెడ్డిని పరామర్శించిన దొమ్మటి సాంబయ్య

పరకాల నేటిధాత్రి

 

మండలంలోని వెల్లంపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రేవూరి బుచ్చిరెడ్డి ద్విచక్ర వాహనంపై వస్తుండగా ఆకస్మాత్తుగా ప్రమాదం జరిగింది.విషయం తెలుసుకున్న టీపీసీసీ మాజీ ఉపాధ్యక్షులు దొమ్మటి సాంబయ్య రేవూరి బుచ్చిరెడ్డిని పరామర్శించి, త్వరగా కోలుకోవాలని
ఆకాంక్షించారు.ఈ పరామర్శించిన కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు తక్కళ్లపల్లి స్వర్ణలత,నలుబోలు కిష్టయ్య, నేతాని ఆదిరెడ్డి,కొత్తపల్లి రవి, పెండేల కుమార స్వామి,రావుల విజేందర్ రెడ్డి, నేతాని ప్రభాకర్ రెడ్డి, రిమ్మయ్య,డాక్టర్.బాబురావు, పెండేల విక్రమ్,పెండేల సారయ్య,మచ్చ రాజయ్య, మచ్చ విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల పరిశీలన

వెల్లంపల్లి గ్రామంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను మాజీ టిపిసీసీ ఉపాధ్యక్షులు దొమ్మటి సాంబయ్య పరిశీలించారు.

టొబాకో ఫ్రీ యూత్ క్యాంపెయిన్…

టొబాకో ఫ్రీ యూత్ క్యాంపెయిన్

#హనుమకొండ  డిఎంహెచ్వో డాక్టర్ అప్పయ్య

హన్మకొండ, నేటిధాత్రి (మెడికల్):

 

టొబాకో ఫ్రీ యూత్ క్యాంపెయిన్ 3.0 లో భాగంగా నేటి నుండి డిసెంబర్ 8 వరకు 60 రోజులు యువతను లక్ష్యంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని
హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య తెలియచేసారు.ఈ రోజు ప్రభుత్వ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వడ్డేపల్లి లో టొబాకో ఫ్రీ యూత్ క్యాంపెయిన్ ప్రారంభించడం జరిగింది. అలాగే పొగాకు వినియోగంపై అవగాహన కార్యక్రమము, అలాగే పొగాకు సంబంధించిన ఉత్పత్తులు అయినటువంటి గుట్కా, కైని, జర్ధ ,సిగరెట్, చుట్ట,బీడీ, పాన్ మసాలాలు వినియోగించడం వలన వచ్చే అనారోగ్య సమస్యలు నోరు, గొంతు, ప్రేగు, ఊపిరితిత్తులు, గుండె మొదలగు వాటికి మరియు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ ఉందని అంతేకాకుండా ఆడ మగ వ్యత్యాసం లేకుండా మరీ ముఖ్యంగా యువకులు ఎక్కువగా వీటికి అలవాటు పడుతున్నారు అలాగే ప్రజలు పొగాకు మరియు పొగాకు సంబంధించిన ఉత్పత్తులకు దూరంగా ఉండి మీ విలువైన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కోరడం జరిగింది. అలాగే 60 రోజులు జరిగే ఈ ప్రోగ్రాము ప్రాథమిక ఆరోగ్య కేంద్రలలో, పాఠశాలలో ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు, నిర్వహించాలని, పాఠశాల ఆవరణలో వంద గజాల దూరంలో పొగాకు సంబంధించిన షాప్స్ ఉండకుండా చూడాలని, బహిరంగ ప్రదేశంలో ఎవరు ఈ ఉత్పత్తులను వినియోగించకూడదని సూచించారు.రాలీ అనంతరం ఎన్జీవోస్ కాలనీ కూడలిలో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎన్ సి డి ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఇక్తేదార్ అహ్మద్, వైద్యాధికారి డాక్టర్ మాలిక జిల్లా మాస్ మీడియా అధికారి వి అశోక్ రెడ్డి, సోషల్ వర్కర్ నరేష్, హెల్త్ సూపర్వైజర్ గోవర్ధన్ రెడ్డి, కమ్యూనిటీ ఆర్గనైజర్ మానస హెల్త్ అసిస్టెంట్లు ఏఎన్ఎంలు ఆశాలు స్థానిక యువకులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Exit mobile version