దుర్వాసన వెదజల్లుతున్న దామెరా చెరువు(మినీ ట్యాంక్ బండ్)
ఎమ్మెల్యే,మున్సిపల్ అధికారులు స్పందించాలి
బిఆర్ఎస్ యువజన నాయకులు ఇంగిలి వీరేష్ రావు
ఆహ్లాదకరంగా ఉండాల్సిన దామెర చెరువు(మినీ ట్యాంక్ బండ్)ప్రాంతం దుర్గంధంతో, చెత్త చెదరంతో కంపు కొడుతూ పరిసర ప్రాంతా ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని అధికారులు దామెర చెరువు పై నిర్లక్ష్యం వీడాలని బిఆర్ఎస్ యువజన నాయకుడు ఇంగిలి వీరేష్ రావు అన్నారు.పరకాల ప్రజలు వాకింగ్ చేయడానికి,మరియు ఆహ్లాదకరంగా పిల్లలతో గడపడానికి గత ప్రభుత్వం సుమారు 4 కోట్ల రూపాయలతో దామెర చెరువు కట్టను మినీ ట్యాంక్ బండ్ గా తీర్చిదిద్దిందని,కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి పాలన పై శ్రద్ధ లేకుండా కేవలం పైసల పైనే శ్రద్ధ వహిస్తుందని ఆయన ఎద్దేవా చేశారు.
మునిసిపాలిటీ కి సంబంధించిన ఆటోలే ఇక్కడ చెత్త వేస్తున్నట్టు స్థానికులు వివరించారని,పక్కనే ఉన్న శ్రీనివాసకాలని ప్రజలు ఈ కంపును భరించలేక పోతున్నారని,ఈ దుర్గంధం వల్ల వారి ఆరోగ్యాలకు నష్టం జరుగుతుందని ఆయన అన్నారు.ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే, మున్సిపల్ కమీషనర్ లు ఈ సమస్యపై దృష్టి సారించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయన కోరారు.
