జమియత్ ఉలేమా-ఎ-హింద్ అర్షద్ మదానీ క్షేత్ర స్థాయి బలోపేతం చెయ్యండి
◆:- జామియా ఇస్లామియా ఖైరుల్-ఉలూమ్ రంజోల్‌లో శిక్షణా సెషన్,
◆:- మౌలానా అస్జాద్ మదానీ ప్రసంగం
జహీరాబాద్ నేటి ధాత్రి:
జమియత్ ఉలేమా-ఎ-హింద్ యొక్క లక్ష్యాలు మరియు లక్ష్యాలు మరియు దాని ప్రాముఖ్యత” అనే శీర్షికతో జామియా ఇస్లామియా ఖైరుల్-ఉలూమ్ రంఝోల్‌లో జమియత్ ప్రిన్సిపాల్ మరియు జమియత్ ఉలేమా సంగారెడ్డి అధ్యక్షుడు మౌలానా ముహమ్మద్ ఫరూఖ్ ఖాస్మీ మరియు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి పర్యవేక్షణ మంత్రి ముఫ్తీ మహమూద్ జుబైర్ ఖాస్మీ అధ్యక్షతన శిక్షణా సెషన్ జరిగింది, దీనికి జమియత్ ఉలేమా-ఎ-హింద్ ఉపాధ్యక్షుడు మౌలానా సయ్యద్ అస్జాద్ మదానీ, జమియత్ ఉలేమా-ఎ-జార్ఖండ్ ప్రధాన కార్యదర్శి ముఫ్తీ షాబుద్దీన్ ఖాస్మీ మరియు జమియత్ ఉలేమా-ఎ-కర్నాయక్ ప్రధాన కార్యదర్శి మౌలానా ముహిబుల్లా ఖాస్మీ ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. ప్రసంగం సందర్భంగా, ముఫ్తీ మహమూద్ జుబైర్ జమియత్ ఉలేమా-ఎ-హింద్ చరిత్రను క్లుప్తంగా వివరించి, దాని ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ, జమియత్ ఉలేమా-ఎ-హింద్ అనేది ఇతర సంస్థల మాదిరిగా ఒక సంస్థ పేరు కాదని, క్లిష్ట పరిస్థితుల్లో ఎల్లప్పుడూ ప్రజలతో నిలబడే ఆలోచన మరియు భావజాలం అని అన్నారు. మౌలానా సయ్యద్ అస్జాద్ మదానీతన ముఖ్యమైన ప్రసంగంలో, జమియత్ ఉలేమా-ఎ-హింద్ యొక్క లక్ష్యాలు మరియు లక్ష్యాలను వివరించారు మరియు మన గొప్ప నాయకులు జమియత్ ఉలేమా-ఎ-హింద్‌ను అందించారని, ఇది ప్రజల సేవ కోసం మాత్రమే సృష్టించబడిందని, కాబట్టి జమియత్ యొక్క పని ఎక్కడ మరియు ఎప్పుడు అవసరమైతే అక్కడ సేవ చేయడమేనని, అందుకే జమియత్ 150 సంవత్సరాలుగా ఈ పనిని గర్వంగా చేస్తోంది, అది హిందువు అయినా లేదా ముస్లిం అయినా, అతను క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే, అతనికి సేవ చేయడానికి నిలబడాలి. జమియత్ యొక్క గ్రౌండ్ బాడీని బలోపేతం చేయడంపై కూడా ఆయన నొక్కి చెప్పారు. ఈ సందర్భంగా జామియా ఇస్లామియా ఖైరుల్ ఉలూమ్ నిర్వాహకుడు హఫీజ్ ముఖ్తార్ అహ్మద్, మౌలానా ముహమ్మద్ ఖాసిం అతర్ ఖాస్మీ, జమీత్ ఉలేమా జహీరాబాద్ అధ్యక్షుడు మౌలానా మహమ్మద్ ఇస్మాయిల్, హఫీజ్ ఫరూక్ బిలాల్‌పూర్, అజీమ్ పటేల్, యూనస్ భాయ్ అతనూరు, జహీర్ మిత్రబృందం తదితరులు పాల్గొన్నారు.
ఒక్క ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే వేలాది కోట్ల కుంభకోణం!
12 నెలలుగా వరంగల్ నగరంలో ‘‘చిట్స్ రిజిస్ట్రార్’’ లేడు.
`దివాళా కంపెనీల ఆగడాలు అన్నీ ఇన్నీ కావు!
`దివాళా తీసిందని చట్టాన్ని నమ్మిస్తారు!
`కోర్టులను కూడా నమ్మించి జనాన్ని మోసం చేస్తారు!
`కంపనీ బకాయి పడ్డ వారికి రూపాయి ఇవ్వరు!
`కంపనీకి రావాల్సి వుంటే వేధించుకు తింటారు!
`ప్రజలకు ఎవరూ మద్దతుగా రారు!
`పోలీసులు కూడా ప్రజల పిర్యాదులు పట్టించుకోరు!
`నాయకులు, పోలీసులు కంపనీలకు అండగా నిలుస్తారు!
`బోర్డులు తిప్పేసిన కంపెనీలకే వంతలు పాడుతుంటారు!
జనాలకు ‘‘చిట్ చట్టాల’’ మీద అవగాహన వుండదు! బోర్డు తిప్పేసిన కంపెనీకి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని తెలియదు! ఆ సొమ్మును ‘‘చిట్ రిజిస్ట్రార్’’కు మాత్రమే చెల్లించాలన్న అవగాహన ఎవరికి ఉండదు!
`పదే పదే కంపెనీల మోసాలకు బలౌతుంటారు.
హైదరాబాద్,నేటిధాత్రి:
చట్ట బద్దమైన సంస్థలు అంటారు. చట్టాలను చచ్చుబండలు చేస్తారు. ప్రజలు ఎవరో ఒకరిని నమ్మి, చిట్టీలు వేసి మోసపోవద్దు? అని నీతులు చెబుతారు. అన్ని రకాల అనుమతులతో కూడిన చిట్ కంపనీ ఊదరగొడతారు. ప్రచారం చేసుకుంటారు. సెలబ్రిటీలతో ప్రకటనలు చేయిస్తారు. హంగూ ఆర్భాటాలతో కూడిన కార్యాలయాలు ఏర్పాటు చేస్తారు. జనం సొమ్ముతో కార్యాలయాలను నిర్వహిస్తుంటారు. మా చిట్స్ కంపనీలో చిట్టీల కట్టమంటారు? ప్రజలను మోసం చేస్తుంటారు. జనాన్ని నిండా ముంచేస్తుంటారు. వారి బతుకులతో ఆడుకుంటుంటారు. నమ్మినందుకు జనానికి నరకం చూపిస్తారు. వేసిన చిట్టీల గడుపు పూర్తయినా చిట్టీ మొత్తం డబ్బులు ఇవ్వరు. నట్టేట ముంచుతుంటారు. అయినా పాలకులు పట్టించుకోరు. వ్యవస్ధలు పట్టించుకోవు. జనం గోడు వినిపించుకోరు. బాధితులకు అండగా ఎవరూ ముందుకు రారు. ప్రభుత్వాధికారులు పట్టించుకోరు. అందరూ పట్టీపట్టనట్లే వ్యవహరిస్తుంటారు. చిట్స్ పేరుతో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న కంపనీలు బోర్డులు తిప్పేసినా దిక్కు దివానం వుండదు. జనం సొమ్ముతో ఉడాయిస్తుంటారు. కంపనీ దివాళా తీసిందని కాకమ్మ కధలు చెబుతారు. జనం నోట్లో మట్టికొడతారు. నాలుగు రోజులు జైలు జీవితం అనుభవిస్తారు. బైటకు వచ్చి మళ్లీ కొత్త బాగోతం మొదలు పెడతారు. పాత బోర్డు స్ధానంలో కొత్త బోర్టు పెట్టేస్తారు. కంపెనీకి కొత్త పేరు పెట్టేస్తారు. మళ్లీ అద్దాల కార్యాలయం ఓపెన్ చేస్తారు. అమాయక జనాన్ని మళ్లీ ఆకర్షిస్తారు. బోనం బొట్లు పెట్టేస్తుంటారు. కంపనీలకు దేవుళ్ల పేరు పెడుతుంటారు. నమ్మకానికి ప్రతి రూపం అంటారు. నమ్మకమే మా పెట్టుబడి అని నమ్మిస్తారు. జనం సొమ్ముకు భరోసా అంటారు. మమ్మల్ని నమ్మడం అంటేనే గొప్ప వరం అన్నంతగా ప్రచారం సాగిస్తారు. సెలబ్రిటీలను తెచ్చి ప్రచారానికి వినియోగిస్తుంటారు. మీ భవిష్యత్తు మాది అంటారు. జనం సొమ్ము ఊడ్చుకొని ఉత్తచిప్ప కూడా చేతికి రాకుండా చేస్తారు. జనం రూపాయికి రక్షణ అంటారు. జనం బలహీనతను హాయిగా సొమ్ము చేసుకుంటారు. ఆస్ధులు పెంచుకుంటారు. చిట్ వేసేదాక బెల్లం మీద ఈగలు వాలినట్టు, జనం చుట్టూ తిరుగుతారు. వడ్డీ వల విసురుతారు. వెంట పడీ పడీ చిట్టీ కట్టేదాకా వదిలిపెట్టరు. అప్పులోల్లు ఇంటికి తిరిగినట్లే తిరుగుతారు. ఒక్క సారి చిట్టీ కట్టిన తర్వాత ఆ తిరగడం మనకు నేర్పిస్తారు. కాళ్లు అరిగేలా తిరిగినా కనికరం చూపరు. జనం సొమ్ముతో జనాన్నే బెదిరిస్తుంటారు. చుక్కలు చూపిస్తుంటారు. నెల కిస్తీ కట్టడం ఒక్క రోజు ఆలస్యమైనా సరే, పెనాల్టీలు వేస్తారు. చిట్టీ గడువు పూర్తయి, నెలలు గడిచినా సరే సొమ్ము తిరిగి ఇవ్వరు. ఆఖరుకు కంపనీ దివాళా పేరుతో బోర్డు తిప్పేస్తారు. ఇలా ఒక్క వరంగల్ జిల్లాలోనే వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్లు తెలుస్తోంది. వెలిసిన కంపనీలకు, మూత పడిన కంపనీలకు లెక్కేలేదు. కొత్తవి పుట్టుకొస్తూనే వుంటాయి. పాతవి మూత పడుతూనే వుంటాయి. కాని వ్యక్తులు వాళ్లే వుంటారు. జనం సొమ్మును దశాబ్ధాల తరబడి దోచుకుంటూనే వున్నారు. త్వరలో వరంగల్ జిల్లాలో ఇప్పటి వరకు జనానికి కుచ్చుటోపీ పెట్టిన చిట్ కంపనీల దుర్మార్గాలన్నీ ఒక్కొక్కటిగా వరుసగా మీ నేటిదాత్రిలో…త్వరలో..
వరంగల్‌లో చిట్స్ రిజిస్ట్రార్ ఎక్కడ?
ఏడాది గడుస్తున్నా ఎందుకు ఖాళీగా వుంది?
`సబ్ రిజిస్ట్రార్లు ఎందుకు ముందుకు రావడం లేదు?
`వరంగల్ అంటే ఎందుకు సుముఖంగా లేరు?
`వరంగల్ చిట్స్ రిజిస్ట్రార్‌గా పని చేయాలంటే ఎందుకు భయపడుతున్నారు?
`వచ్చేందుకు సిద్దంగా వున్న వారిని ఎందుకు ఉపేక్షిస్తున్నారు?
`రెవిన్యూ వ్యవస్ధలో ఏం జరుగుతోంది?
వరంగల్‌లో చిట్స్ రిజిస్ట్రార్ లేక ఏడాది గడుస్తోంది. అయినా ఆ కుర్చీ ఖాళీగానే వుంది. కనీసం ఇన్ చార్జి కూడా ఎవరూ లేరు. చిట్స్ రిజిస్ట్రార్‌గా పనిచేయడానికి సబ్ రిజిస్ట్రార్లు ఎందుకు ముందుకు రావడం లేదు? వరంగల్ చిట్స్ రిజిస్ట్రార్‌గా పని చేయడానికి సబ్ రిజిస్ట్రార్లు ఎందుకు భయపడుతున్నారు. అనుకున్నంత సంపాదన రాదని వద్దనుకుంటున్నారా? చిట్స్ రిజిస్ట్రార్‌గా పనిచేస్తే ఎలాంటి ఫలితం వుండదనుకుంటున్నారా? లేక ప్రజా ప్రతినిధులకు భయపడి రానంటున్నారా? వరంగల్ చిట్స్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏం జరుగుతోంది. ఆ మధ్య ఓ వరంగల్ చిట్స్ రిజిస్ట్రార్‌గా ఓ అధికారిని వచ్చారు. నేను ఇక్కడ పని చేయాలని వెళ్లిపోయారు. కారణాలు ఏమైనా కావొచ్చు? అధికారులు తమకు నచ్చిన చోటనే పనిచేస్తారా? వారికి అనుకూలమైన పోస్టింగ్ వుంటే తప్ప పనిచేయరా? కేవలం రిజిస్ట్రేషన్ శాఖలో మాత్రమే పనిచేస్తారా? లంచాలకు అలవాటు పడిన వారు చిట్స్ రిజిస్ట్రార్లుగా పనిచేయడానికి ఇష్టపడడం లేదా? వచ్చిన వారిని ప్రజా ప్రతినిధులు పని చేయనీయడం లేదా? వరంగల్ అంటేనే అధికారులు ఎందుకు భయపడుతున్నారు? జీతం తప్ప అదనంగా దమ్మిడి రాకున్నా, సమస్యలు ఎదురౌతానకుంటున్నారా? ప్రజా ప్రతినిధుల ఒత్తిళ్లతో పనిచేసి, ఉద్యోగానికే ఎసరు తెచ్చుకోవాల్సి వస్తుందని భయపడుతున్నారా? అయితే ఇలాంటి చోట కూడా పనిచేసేందుకు కొందరు అదికారులు సిద్దంగా వున్నారు. కాని వారికి మాత్రం పోస్టింగ్ ఇవ్వడం లేదు. ఎందుకంటే వచ్చే అధికారులు తమ చెప్పు చేతుల్లో వుండాలని ప్రజా ప్రతినిధులు కోరుకుంటున్నారు. అవినీతికి అలవాటు పడిని అధికారులు చిట్స్ రిజిస్ట్రార్‌గా పనిచేయడానికి ఇష్టపడడం లేదు. ఒక వేళ పనిచేద్దామని వచ్చే వారిని ప్రజా ప్రతినిధులు రానివ్వడం లేదు? కారణమేమిటంటే తమ మాట వినని అదికారులు వస్తే ఆ ప్రజా ప్రతినిధుల మాట చెల్లుబాటు కాదు. వారి ఆదేశాలు ఆచరణలోకి రావు. దాంతో ఏడాది కాలంగా చిట్స్ రిజిస్ట్రార్ లేకుండానే కార్యాలయం పనిచేస్తోంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. వరంగల్ అంటేనే చిట్ ఫండ్ కార్యాలయాల గోల్ మాల్‌కు అడ్డా? ఏ చిట్ ఫండ్ చూసినా అదే తీరు. అదే వ్యవహారం. అలా ప్రజలను నిండా ముంచిన కంపనీలే ఎక్కువ. ప్రజలను వీదిన పడేసిన కార్యాలయాలే వున్నాయి. వేల కోట్లు రూపాయల కుంభాకోణాలకు నిలయంగా మారాయి. అలాంటి వరంగల్‌లో బాధితుల గోడు వినేందుకు, చిట్స్ కంపనీ ఆగడాల నుంచి రక్షించేందుకు చిట్స్ రిజిస్ట్రార్ వుండాలి. ప్రజల గోడు ఎవరు వినాలి? ప్రజల సమస్యలు ఎవరు పట్టించుకోవాలి? బాధితులకు న్యాయం ఎవరు చేయాలి? నిజాయితీగా పనిచేసే అధికారులు వున్నారు. కాని వారికి అవకాశం ఇవ్వడం లేదు. ప్రజా ప్రతినిధులంటే జిల్లా రిజిస్ట్రార్లే భయపడుతున్నారు. ప్రజా ప్రతినిధులు ఎలాగూ ప్రజలకు సహకరించరు. పైకి ఎన్ని మాటలు చెప్పినా సరే, వాళ్లంతా చిట్స్ కంపనీలకే వత్తాసు పలుకుతారన్నది భహిరంగ రహస్యమే. అందుకే వరంగల్‌కు ఎవరినీ రానివ్వడం లేదు. బాధితుల సమస్యలు తీరడం లేదు. రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెంటనే స్పందించి, వరంగల్ చిట్స్ రిజిస్ట్రార్ పోస్టు భర్తీ చేయాలని కోరుతున్నారు. చిట్ రిజిస్ట్రార్‌గా పని చేయమని చెప్పేవారిని వదిలేయండి. కాని వస్తామని అంటున్నవారిని ఎందుకు రానివ్వడం లేదో చెప్పండి? ఏది ఏమైనా వెంటనే ఆ పోస్టును భర్తీ చేయండి.
జగిత్యాల ఇందిరా భవన్ లో మాజీ మంత్రివర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి సోమవారం విలేకరుల సమావేశం
రాయికల్, అక్టోబర్ 13, నేటి ధాత్రి:
అధిక లాభాపేక్షతో పెట్టుబడులు పెట్టి అమాయక ప్రజలు మోసపోతున్నారు.
ఫేక్ యాప్ ల ద్వారా అధిక లాభాపేక్షను ఎర చూపి, గ్రామీణ ప్రజలతో పాటు వివిధ హోదాల్లో ఉన్నవారు సైతం మెట్ ఫండ్, యు బిట్ లలో చైన్ విధానంలో పెట్టుబడులు పెట్టి మోసపోతున్నారు.
పెట్టుబడి దారులకు విదేశీ టూర్లు, లక్సరీ వసతుల పేరిట అమాయక ప్రజలు ఆకర్షితులు అవుతున్నారు.
గతంలో ఫైనాన్స్ కంపెనీలు రెగ్యులేటరీ లేదు..ప్రస్తుతం క్రిప్టో కరెన్సీ పేరిట నకిలీ యాప్లు, వెబ్సైట్లు విస్తరించాయి.
ఆర్ బి ఐ అనుమతులు లేకుండా చేపట్టే ఏ ఆర్థిక కార్యక్రమాలు అయినా చట్ట విరుద్ధమే.
కేవలం జగిత్యాల జిల్లా లోనే సుమారు 1000 కోట్లు మోసపోయినట్లు లెక్కలు చెబుతున్నాయి.
పెట్టుబడులు పెట్టిన వారికి ఏవిధమైన రశీదులు లేకుండానే పెట్టుబడులు పెడుతున్నారు.
క్షణాల వ్యవధిలో యాప్ లు తొలగిస్తూ ఆధారాలు లేకుండా చేస్తున్నారు.
జగిత్యాల పోలీసు యంత్రాంగం కేసులు నమోదు చేయడం అభినందించదగ్గ విషయం.
నకిలీ యాప్ లలో పెట్టుబడులు పెట్టీ మోసపోయిన వారు పోలీసుల దృష్టికి వచ్చేది ఒక్క శాతం కూడా లేదు.. ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు..
రాష్ట్ర ప్రభుత్వం గంజాయి, జూదం అరికట్టేందుకు చర్యలు చేపడుతోంది.
చట్ట పరమైన చర్యలు తీసుకోవడం తో పాటు, రికవరీ అవుతుందో లేదో అని భయపడి కేసు పెట్టేందుకు ముందుకు రావడం లేదు.
నకిలీ యాప్ లలో అమాయక ప్రజలను పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించిన వారి ఆస్తులు జప్తు చేయాలి.
పోలీసులు కేసులు నమోదు చేయడంతోపాటు రికవరీ చేస్తామనే విశ్వాసం బాధితుల్లో కల్పిస్తేనే ఫిర్యాదు చేసేందుకు ముందుకు వస్తారు.
రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు తగ్గిపోయి, ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది.
ఆర్ బి ఐ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఆర్థిక కార్యకలాపాలు దేశ ఆర్థిక వ్యవస్థ పై ప్రభావం చూపుతుంది.
దేశ రక్షణ తో పాటు ఆర్థిక వ్యవస్థ రక్షణ కూడా ప్రధానం.
రాష్ట్ర పరిధిలో ఏ మేరకు నిలుపుదల చేస్తాం.. అని పరిశీలించి ఆర్థిక మోసాలు అరికట్టేలా చర్యలు చేపట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
కేంద్ర హోమ్ శాఖ, ఆర్థిక శాఖ సైతం నకిలీ యాప్ లు, వెబ్సైట్ లలో పెట్టుబడులను అరికట్టేలా చొరవ తీసుకోవాలి..
నకిలీ యాప్ లలో పెట్టుబడులు పెట్టీ మోసపోవడం జగిత్యాల జిల్లాకే పరిమితం కాలేదు. బాధితులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు.
పోలీసులు ప్రత్యేక చొరవ తీసుకొని, ఆర్థిక నేరాలు చేసిన వారి ఆస్తులు జప్తు చేయాలి.
పోలీసులు సుమోటోగా విచారణ చేపట్టాలి..
రాష్ట్ర స్థాయిలో పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి, ఆర్థిక నేరాల వ్యవహారాలను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి కి విజ్ఞప్తి చేస్తున్న..
వరంగల్ కు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి రానున్నారు.ఈ నెల 15న సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ రాక ఖరారు అయ్యింది.ఐతే వరంగల్ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తల్లి కాంతమ్మ ఈ నెల 4 అనారోగంతో మరణించిన విషయం తెలిసిందే.కాగా సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని ఫోన్ ద్వారా అదే రోజు పరామర్శించారు.ఈ నేపథ్యంలో 15 న కాంతమ్మ పెద్దకర్మ కార్యక్రమం హన్మకొండలో ఏర్పాటు చేయనున్నారు.ఐతే ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని స్వయంగా పరామర్శించేందుకు గాను ఈ నెల 15 న ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి వరంగల్ కు వస్తున్నట్లు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం అధికార ప్రతినిధులు ఒక ప్రకటన విడుదల చేశారు.
కరీంనగర్ డీసీసీ అధ్యక్ష పదవి కోసం వెలిచాల రాజేందర్ రావు తరపున దరఖాస్తు
కరీంనగర్, నేటిధాత్రి:
డిసిసి అధ్యక్ష పదవి ఎన్నిక కోసం ఏఐసీసీ పరిశీలకులు రానున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావుకు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరుతూ సోమవారం మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు డిసిసి కార్యాలయంలో దరఖాస్తు అందజేశారు. డిసిసి పిఆర్ఓలు దొంతి గోపి, న్యాత శ్రీనివాస్ కు దరఖాస్తు అందజేశారు. ఈసందర్భంగా కాంగ్రెస్ నాయకులు మీడియాతో మాట్లాడుతూ 1981 నుంచి కాంగ్రెస్ పార్టీలో వెలిచాల రాజేందర్ రావు ప్రస్థానం మొదలైందని పేర్కొన్నారు. 1987లో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి యూత్ కాంగ్రెస్ లో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా, సంయుక్త కార్యదర్శిగా పనిచేశారని తెలిపారు. అదేవిధంగా రాజేందర్ రావ్ గుండి గోపాలరావుపేట సింగిల్ విండో చైర్మన్ గా, కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా పనిచేశారని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్టేట్ చాంబర్ ఆఫ్ మార్కెట్ కమిటీ అసోసియేషన్ చైర్మన్ గా, నెడ్ క్యాప్ గా డైరెక్టర్ పనిచేశారని చెప్పారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రత్యేక కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. 2024లో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థిగా రాజేందర్రావు పోటీ చేశారనీ, ఎన్నికల్లో మూడు లక్షల అరవై వేల ఓట్లు సాధించారని తెలిపారు. అతికొద్ది సమయంలోనే భారీ ఓట్లను సాధించి రికార్డు సృష్టించారని చెప్పారు. కరీంనగర్ ప్రజలకు రాజేందర్ రావు అందుబాటులో ఉంటూ ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నారనీ, నీతి నిజాయితీగా వ్యవహరిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ సీనియర్ కాంగ్రెస్ నేత జగపతిరావు కరీంనగర్ అభివృద్ధి ప్రదాత అనీ, వారి తనయుడు జగపతిరావు అడుగుజాడల్లో నడుస్తూ తండ్రి ఆశయ సాధనకు కృషి చేస్తూనే, కరీంనగర్ ప్రజలకు అండగా ఉంటున్నారని తెలిపారు. అదేవిధంగా రాజేంద్ర రావు తల్లిదండ్రులు జగపతిరావు సరళాదేవి పేరిట సరల్ జగ్ అనే ట్రస్టును ఏర్పాటుచేసి పేద ప్రజలకు సాయం చేస్తున్నారని పేర్కొన్నారు. నీతిగా నిజాయితీగా సౌమ్యుడిగా వ్యవహరిస్తున్న వెలిచాల రాజేందర్ రావుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దలు డిసిసి అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరారు. రాజేందర్రావు డిసిసి అధ్యక్ష పదవికి అన్ని విధాల అర్హుడు అనీ, సమర్థుడని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఈవిషయాలను అన్నింటినీ పరిగణనలోకి తీసుకొని డిసిసి అధ్యక్షుడిగా రాజేందర్ రావును నియమించాలని అధిష్టానాన్ని కోరారు. ఈకార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు ఆకుల ప్రకాష్, ఆకుల నరసన్న, డిసిసి ప్రధాన కార్యదర్శి మూల వెంకట రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు వేల్పుల వెంకటేష్, గండి రాజేశ్వర్, ఉప్పరి రవి, శ్రావణ్ నాయక్, జువ్వాడి మారుతి రావు, బాషవేణి మల్లేశం పలువురు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
సోమవారం నాడు తెలంగాణ రైతు రక్షణ సమితి ఆధ్వర్యంలో సీసీఐ కొనుగోలు సెంటర్ ఏర్పాటు చేయాలని పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ సూపర్డెంట్ కి సోమవారంనాడు వినతి పత్రం అందజేయడం జరిగింది.తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వరికెల కిషన్ రావు ఈ కార్యక్రమంలో వీరి వెంట (ఏఐటియుసీ)కార్మిక సంఘం నాయకులు లంక దాసరి అశోక్,రైతునాయకులు సురావు బాబురావు,సురావు కిషన్ రావు,కోడం రవీందర్, రఘుపతి పలువురు పాల్గొన్నారు.
దేవీ నవరాత్రి ప్రత్యేక పూజల పట్టు వస్త్రాలు కలుశాన్ని సమ్మి గౌడ్ కి అందజేత
కేసముద్రం/ నేటి ధాత్రి
కేసముద్రం మండలం తాళ్ల పూసపల్లి గ్రామం లో అన్నదాత యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ దుర్గా భవాని మాతా దేవి ప్రత్యేక పూజల్లో తొమ్మిది రోజులపాటు ఉన్నటువంటి కలుశాన్ని,ప్రతిరోజు అమ్మవారి అలంకరణలో భాగంగా ఉన్న పట్టు వస్త్రాలను తాళ్లపూస పల్లి అన్నదాత యూత్ అసోసియేషన్ కమిటీ యువత సమ్మి గౌడ్ ఫౌండేషన్ అధినేత కాంగ్రెస్ మండల నాయకులు చిలువేరు సమ్మయ్య గౌడ్ కి అందజేశారు.ఈ సందర్భంగా సమ్మయ్య గౌడ్ మాట్లాడుతూ, ఆ దుర్గామాత తల్లి పూజలతో వర్ధిల్లిన పట్టు వస్త్రాలు,కలుశం అన్నదాత యూత్ అసోసియేషన్ కమిటీకి, నాకు అందేలా చేసిన దుర్గామాతకు, అసోసియేషన్ కమిటీ సభ్యులందరికీ నా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు.
ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కమలాకర్,రాజు, మధుకర్,నరేందర్, విక్రమ్,శివరామకృష్ణ, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
వైద్య ఖర్చులకు పాడి ఉదయ నందన్ రెడ్డి ఆర్థిక సహకారం
ఫోటో రైట్ అప్ ఆర్థిక సహకారం అందజేస్తున్న సభ్యులు
వీణవంక( కరీంనగర్ జిల్లా):నేటి ధాత్రి:
ఇటీవల ప్రమాదానికి గురైన శంకరపట్నం మండలం కల్వల గ్రామానికి చెందిన సంగి సందీప్ కుమార్తె శ్రద్ధ వైద్య ఖర్చుల నిమిత్తం యప్ టీవీ అధినేత పాడి ఉదయ నందన్ రెడ్డి ఆర్థిక సహకారం అందించారు.ఇటీవల కాలంలో ప్రమాదానికి గురైన శ్రద్ధకు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు తలలో చిన్న ఎముక విరిగడం తో డాక్టర్లు శ్రద్ధకి ఆపరేషన్ చేపట్టారు.మరల పర్యవేక్షణ చేసిన డాక్టర్లు శ్రద్ధ తలలో ఎముక ఇన్ఫెక్షన్ అయ్యిందని ,మరలా డాక్టర్లు వైద్యం చేయాలని, ఎక్కువ మొత్తంలో ఖర్చవుతుందని వైద్యులు కుటుంబీకులకు సూచించడం జరిగింది. దీంతో నిరుపేద కుటుంబానికి చెందిన శ్రద్ధ తల్లిదండ్రులు ,పాడి ఉదయ నందన్ రెడ్డిని కలిసి తన ఆర్థిక పరిస్థితిని విన్నవించుకోగా ,సానుకూలంగా స్పందించిన పాడి ఉదయ్ నందన్ రెడ్డి తన అనుచరులచే రూ 20 ,000/- లను ఆర్థిక సహాయంగా అందించడం జరిగింది. ఈ సందర్భంగా వారికి శ్రద్ధ కుటుంబ సభ్యులు మరియు గ్రామస్తుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి దాసారపు ప్రభాకర్, వెన్నంపల్లి నారాయణ, అమృత ప్రభాకర్, సమిండ్ల చిట్టి, దాసారపు రాజు, మంతెన శ్రీధర్, తాళ్లపెళ్లి కుమారస్వామి, సిరిగిరి రాజశేఖర్, దాసారపు అశోక్, వంశీకృష్ణ, లోకేష్, పస్తం కుమార్ స్వామి, నీల ప్రభాకర్, సంగి మహేందర్, గట్టయ్య, చల్లూరి హరీష్, దాసారపు మహేందర్, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని ప్రగతి పాఠశాలలో సోమవారం నిర్వహించిన 3D ప్లానిటోరియం విజ్ఞాన కార్యక్రమం అన్ని వయసుల విద్యార్థులను ఆకట్టుకుంది. ఒకటో తరగతి నుండి పదవ తరగతి వరకు విద్యార్థులు నక్షత్రాలు, గ్రహాలు, గెలాక్సీల అద్భుత ప్రపంచాన్ని ప్రత్యక్షంగా వీక్షించి మంత్రముగ్ధులయ్యారు.చిన్న తరగతుల విద్యార్థులకు సౌరమండల పరిచయం, భూమి–చంద్రుని కదలికలు, పగలు–రాత్రి మార్పు, ఋతువుల మార్పు వంటి అంశాలను సరళంగా చూపించగా,పెద్ద తరగతుల విద్యార్థులకు నక్షత్ర సమూహాలు,గెలాక్సీలు,బ్లాక్ హోల్‌లు,అంతరిక్ష పరిశోధనలు, ఉపగ్రహాల ప్రయాణం వంటి అధునాతన విషయాలను 3D రూపంలో ప్రదర్శించారు.విద్యార్థులు తాము తరగతుల్లో చదివిన విషయాలను ప్రత్యక్షంగా వీక్షించడంతో ఆసక్తి మరింత పెరిగింది.శాస్త్ర విజ్ఞానం, ఖగోళ శాస్త్రంపై ఆసక్తి కలిగించే ఈ కార్యక్రమం పాఠశాల ప్రాంగణంలో ఆనందోత్సాహాల నడుమ సాగింది.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలె శేఖర్ మాట్లాడుతూ — “విజ్ఞానం వినోదంతో మిళితమైతేనే విద్యార్థుల్లో ఆసక్తి పుడుతుంది. ఇలాంటి ప్రదర్శనలు పిల్లల్లో ఊహాశక్తి, ప్రశ్నించే స్వభావం, పరిశోధనా దృక్పథం పెంపొందిస్తాయి” అన్నారు.కార్యక్రమం నిర్వహణలో ఉపాధ్యాయులు సక్రియంగా పాల్గొనగా, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై 3D ప్రదర్శనను ఆస్వాదించారు.ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ జయశ్రీ, అకాడమీ డైరెక్టర్ నిఖిల్ కుమార్, ఉపాధ్యాయ బృందం,విద్యార్థులు పాల్గొన్నారు
◆:- ఏఐబీఎస్సెస్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ నాయక్
జహీరాబాద్ నేటి ధాత్రి:
https://youtu.be/noKiE2XIQfg?si=L7oOaMMyR-BikAwq
జహీరాబాద్. పోలియో చుక్కలతో పిల్లల శరీర వికాసానికి తోడ్పాటు ఉంటుందని, రహిత రాష్ట్రం నిర్మాణంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పుట్టిన నాటి నుంచి 5 ఐదేళ్లు పూర్తయ్యే చిన్నపిల్లలకు పోలియో చుక్కల కార్యక్రమాన్ని చేపట్టిందని అల్ ఇండియా బంజారా సేవ సంఘ్ అధ్యక్షుడు, యువజన కాంగ్రెస్ నాయకులు పవార్ శ్రీనివాస్ నాయక్ అన్నారు. ఆదివారం నాడు పట్టణంలోని చిన్న హైదరాబాద్ వార్డులో జరిగిన పోలియో చుక్కల కార్యక్రమనికి శ్రీనివాస్ నాయక్ హాజరై చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లల తల్లిదండ్రులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని పోలియో రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని, పుట్టిన చిన్న పిల్లల నుంచి ఐదేళ్లు పూర్తయ్యే వారికి వీర్యాలని, గతంలో పోలియో ఇంజెక్షన్, చుక్కలు వెయ్యకపోవడం వల్ల శారీరకంగా బలహీనులు అయ్యేవరని, 2004 సం రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పోలియోను దేశవ్యాప్తం చేసి ఇంటింటికి తిరిగి ప్రజలకు పోలియో కార్యక్రమన్ని ప్రారంభించి అమలు చేశారని అన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా డాక్టర్ ఆరాధన్ రెడ్డి, సరిన్ జాన్ జన్మదిన వేడుకలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్. పట్టణంలోని సిటీ సెంటర్ ఆసుపత్రి ప్రధాన డాక్టర్ ఆరాధన్ రెడ్డి, డైరెక్టర్ సారిన్ జాన్ జన్మదిన వేడుకలు ఆదివారం నాడు సిటీ సెంటర్ ఆసుపత్రిలో పార్లమెంట్ ఇంచార్జ్, ఆసుపత్రి డైరెక్టర్ గంకటి శుక్లవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జన్మదిన వేడుకల్లో భాగంగా ఇరు డాక్టర్లకు డైరెక్టర్లు శుక్లవర్ధన్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి లు శాలువకప్పి బొకేతో ఘనంగా సన్మానించి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పార్లమెంట్ ఇంచార్జ్ మాట్లాడుతూ తమ జీవితంలో చేసే మంచి కార్యాలు తమను ఉన్నతంగా నిలుపుతాయని, ప్రజల కష్ట నష్టలలో అండగా నిలిచినప్పుడే తమకు పేరు ప్రఖ్యాతలు వస్తాయని అన్నారు. కార్యక్రమంలో డా ఆరాధన్ రెడ్డి, డా సారిన్ జాన్, డైరెక్టర్ లు గంకటి శుక్లవర్ధన్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి, పల్లవి స్కూల్ డైరెక్టర్ గంకటి శ్రీధర్ రెడ్డి, మొయిజ్ లష్కరి, మొహమ్మద్ అష్రాఫ్, డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
హోటళ్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజావాణిలో వినతిపత్రం
జిల్లాకు రెగ్యులర్ ఆహార భద్రత అధికారిని నియమించాలి
డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి భూక్య నవీన్
జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రజావాణిలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి భూక్య నవీన్ జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అనుమతులు లేకుండా అనుమతులు నుండి నిబంధనలు పాటించకుండా నడుస్తున్న హోటల్ పైన చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యాప్తంగా ప్రజా రవాణా వలన ప్రజలు భోజన వస్తు కోసమని హోటల్లోకి వెళ్తుంటారు కానీ కొన్ని హోటల్స్ ధనార్జిని ధ్యేయంగా ప్రజల అవసరాన్ని ఆసరాగా చేసుకుని నిబంధనలను ఉల్లంఘించి విచ్చలవిడిగా వ్యవహరిస్తా ఉన్నాయి దీనివలన ప్రజల ప్రాణాలకే ప్రమాదం ఉంది ముఖ్యంగా ఆ శాఖ అధికారుల పర్యవేక్షణ లోపం వలన ఇదంతా జరుగుతుందని జిల్లాకి ఆహార భద్రత అధికారి రెగ్యులర్ పోస్ట్ లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రజలకు నాణ్యమైనటువంటి భోజనం అందించకుండా కనీస మౌలిక వసతులు కల్పించకుండా కనీస ప్రమాణాలు పాటించకుండా నడుస్తున్నటువంటి హోటళ్లపైన తమరు ప్రత్యేక దృష్టి సారించి సమగ్ర విచారణ జరిపి ఆ హోటల్లో పై చర్యలు తీసుకోవాలని వెంటనే ఆహార భద్రత రెగ్యులర్ రధికారిని నియమించి హోటల్లు ప్రమాణాలు పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజల ప్రాణాలకు ముప్పు లేకుండా చేయాలి అన్నారు ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ యంగ్ ఉమెన్స్ జిల్లా కన్వీనర్ బందు సుజాత కో కన్వీనర్ బుర్ర స్వాతి లతోపాటు తదితరులు పాల్గొన్నారు
పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా విద్యార్థులకు ఆన్‌లైన్ వ్యాసరచన పోటీలు
పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్
మంచిర్యాల,నేటి ధాత్రి:
పోలీస్ అమరవీరుల ప్రాణ త్యాగాల స్మరణలో భాగంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం,పోలీస్ ఫ్లాగ్ డే సందర్బంగా దేశం కోసం ప్రాణాలు అర్పించిన ధైర్యవంతులైన పోలీసు సిబ్బందిని స్మరించుకుంటూ తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆన్‌లైన్ వ్యాసరచన పోటీ నిర్వహించడం జరుగుతుందని రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు.ఈ పోటీలు మూడు భాషల్లో తెలుగు,ఇంగ్లీష్,ఉర్దూ భాషల్లో 6వ తరగతి నుండి పీజీ వరకు ఉన్న విద్యార్థులు పాల్గొనవచ్చునని అన్నారు. డ్రగ్స్ నివారణలో పోలీసుల పాత్ర,విద్యార్థులు డ్రగ్స్ నుండి ఎలా దూరంగా ఉండగలరు అనే అంశం మీద వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.విద్యార్థులు తమ వ్యాసాలను అక్టోబర్ 28 వ తేదీ లోగా సమర్పించాలని,ఉత్తమ ప్రతిభ కనబరిచిన ముగ్గురు విద్యార్థులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేయడం జరుగుతుందని,అంతే కాకుండా రామగుండం పోలీస్ కమీషనరేట్ స్థాయిలో 1వ, 2వ,3వ స్థానాల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేయబడుతాయి అన్నారు.విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జిల్లా,రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచి బహుమతులు పొందాలని సీపీ సూచించారు.పోటీలో పాల్గొనే విధానం కింద ఇవ్వబడిన లింక్‌పై క్లిక్ చేసి పాల్గొనండి https://forms.gle/jaWLdt2yhNrMpe3eA మీ పేరు,విద్యార్హత ఇతర వివరాలు నమోదు చేయండి.వ్యాసాన్ని పేపర్ పై రాసి,దానిని చిత్రం (ఇమేజ్) లేదా పిడిఎఫ్ ఫార్మాట్ లో 500 పదాలు మించకుండా అప్ లోడ్ చేసి సబ్మిట్ చేయాలని తెలిపారు.
ఆధార్ క్యాంపు ను సద్వినియోగం చేసుకోండి : మండల విద్యాధికారి వినయ కుమార్
చందుర్తి’ నేటిధాత్రి:
చందుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటుచేసిన ప్రత్యేక ఆధార్ క్యాంపును మండలంలోని అన్ని గ్రామాల విద్యార్థిని విద్యార్థులు మరియు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తేది 14.10.2025 మంగళ వారం నుండి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ క్యాంపులో ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ చేయడం, నూతన ఆధార్ కార్డు నమోదు, ఆధార్ కార్డులో పేరు మార్చుట, వేలిముద్రలు మార్చటం, మొబైల్ నెంబర్ మార్చుట, అడ్రస్ మార్చుట, పుట్టిన తేదీ మార్చుట, ఆధార్ నెంబర్ కు ఫోన్ నెంబర్ లింక్ చేయడం, ఆధార్ కార్డుకు పాన్ కార్డు మరియు ఓటర్ గుర్తింపు కార్డు అనుసంధానం చేయుట వంటి అన్ని అవకాశాలు ఉన్నాయి. ఈ ఆధార్ క్యాంపు సనుగుల ప్రాథమిక పాఠశాలలో ఇప్పటికే ఒకటి కొనసాగుతుందని, మంగళ వారం నుండి చందుర్తి ప్రాథమిక పాఠశాలలో మరో క్యాంపు మొదలవుతుందని తెలిపారు. మండలం లోని అన్ని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థిని విద్యార్థుల బయోమెట్రిక్ అప్డేట్ చేసుకునేందుకు, ఆధార్ కార్డు లేని విద్యార్థులకు కొత్త ఆధార్ కార్డు తీసుకునేందుకు ఇదొక మంచి అవకాశం అని, ఈ అవకాశాన్ని విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మరియు మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు ఈ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే నాగరాజు, జిల్లా యూత్ అధ్యక్షుడు దిలీప్ రాజ్ గారు… పర్వతగిరి (నేటిధాత్రి)
https://youtu.be/noKiE2XIQfg?si=L7oOaMMyR-BikAwq
వరంగల్ జిల్లా పర్వతగిరి మండల పరిధిలోని అన్నారం గ్రామానికి చెందిన పర్వతగిరి మండల యూత్ అధ్యక్షుడు గొడుగు వినయ్ గారి నానమ్మ గొడుగు లచ్చమ్మ నిన్న అనారోగ్యంతో మరణించగా నేడు వారి నివాసానికి వెళ్లి భౌతిక దేహానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు మరియు వరంగల్ అర్బన్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కేఆర్ దిలీప్ రాజ్ అనంతరం కల్లెడ గ్రామానికి చెందిన మద్దెల శ్రీనివాస్, బాల్లె వెంకటయ్య ఇటివల అనారోగ్యంతో మరణించగా నేడు వారి నివాసాలకు చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.అదే విధంగా నిన్న కల్లెడ గ్రామంలో కురిసిన అకాల వర్షంతో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో వర్షపు నీరు రోడ్డుపైకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు సంబంధిత అధికారులతో మాట్లాడి గ్రామంలో శాశ్వత డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే స్పష్టంగా తెలిపారు కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
తెలంగాణ మంచిర్యాల జిల్లా కు చెందిన అకీరా జాను చిన్న వయసులోనే దేశవ్యాప్తంగా ప్రముఖమైన కూచిపూడి నర్తకి గా గుర్తింపు పొందింది.అకీరా తన నాట్య ప్రయాణాన్ని చిన్నతనంలోనే ఏడవ సంవత్సరంలో ప్రారంభించి,ఇప్పటివరకు సుమారు 100 కీ పైగా నృత్య ప్రదర్శన కార్యక్రమాలలో పాల్గొంది.కళా సంస్కృతి, సాంప్రదాయాల విలువల అభివృద్ధికి కృషిచేస్తూ,వివిధ సంస్కృతిక కార్యక్రమాలలో తన ప్రతిభను ప్రదర్శిస్తుంది.ప్రఖ్యాత గురువుల నుంచి శిక్షణ పొంది,శాస్త్రీయ నాట్యంలో విశిష్టమైన తనదైన శైలితో కళకు జీవం పోస్తుంది.బాల్యంలో నుండే అకీరా పలు ప్రభుత్వ,ప్రైవేట్ సంస్థల పురస్కారాలు,ప్రశంస పత్రాలు అందుకుంది.తెలంగాణ రాష్ట్రస్థాయిలో ఉత్తమ కూచిపూడి నృత్య ప్రదర్శన కళాకారిణిగా గుర్తింపు పొందింది.రాష్ట్రీయ బాల పురస్కార్ కోసం ఆమెను నామినేట్ చేయడం ఈ ప్రాంత యువతకు స్ఫూర్తిదాయకం.అనేక పత్రికలు అకిరా నృత్య ప్రదర్శన పై ప్రత్యేక కథనాలు,శీర్షికలు ప్రచురించాయి.ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటే భవిష్యత్‌లో మరిన్ని దేశ,విదేశీ వేదికలపై కూచిపూడి కళను ప్రదర్శించి భారతీయ కళా సంప్రదాయాన్ని ప్రపంచ దేశాలకు విస్తరింప చేయాలని,ఈ సంప్రదాయ నృత్యాన్ని మరింతగా గ్రామ స్థాయి యువతలోకి తీసుకెళ్లాలని అకీరా ఆకాంక్షిస్తుంది.
2025 – 26 ఆర్థిక సంవత్సరానికి గాను సింగరేణి సంస్థ భూపాలపల్లి ఏరియా సేవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించనున్న వృత్తి విద్యా కోర్సులైన
కంప్యూటర్ (డిటిపి), మగ్గం వర్క్, స్పోకెన్ ఇంగ్లిష్, బ్యూటీషియన్,ఫ్యాషన్ డిజైనింగ్ , మల్టీ మీడియా , జ్యూట్ బ్యాగ్,(ఓసి ప్రభావిత గ్రామాల మహిళలకు టైలరింగ్) వంటి కోర్సులను నేర్పించుటకు ఫాకల్టీ గా పని చేయుటకు ఆసక్తి,అర్హతఅనుభవం గలవారి నుండి దరఖాస్తులు ఆహ్వానించడం జరుగుతుందని ఏరియా పర్సనల్ మేనేజర్ కే. మారుతి తెలియ జేసారు.అర్హత ఆసక్తి కలిగిన ఫ్యాకల్టీ సభ్యులు 25-10-2025- రోజున ధరఖాస్తులు చివరి తేదిగా నిర్ణయించారు. తమ యొక్క దరఖాస్తులను తగిన అర్హత,అనుభవాల,దృవపత్రలను,జతపరిచి పర్సనల్ విభాగం నందు అందజేయగలరని వారు తెలిపారు .
ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి నేటిధాత్రి
ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలనిజిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. సోమవారం ఐడిఓసి కార్యాలయ సమావేశపు హాలులో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులతో కలిసి ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులు, దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుండి మొత్తం 41 దరఖాస్తులు స్వీకరించామని, వాటిని సంబంధిత శాఖాధికారులకు తక్షణ పరిష్కారానికి ఎండార్స్మెంట్ చేసినట్లు తెలిపారు. ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కారం కావాలనే ఉద్దేశంతో ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. అధికారులు ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును ప్రాధాన్యతగా తీసుకోవాలని, సమయానికి చర్యలు తీసుకుని నివేదికలు సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా, పారదర్శకంగా సేవలు అందించాలని అన్ని శాఖల అధికారులను ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఆర్డీఓ రవి, ట్రైని ఉప కలెక్టర్ నవీన్ రెడ్డి అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ అనుమతులు లేకుండా ఎలాంటి నిర్మాణాలు చేపట్టిన చర్యలు తప్పవు. కందవాడ వార్డు 269 అసైన్డ్ భూమిలో కొనసాగుతున్న అక్రమ ఫామ్ హౌస్ నిర్మాణం పనులు ఆపివేశాము. జిల్లా ఉన్నత అధికారులకు రిపోర్ట్ పంపించి కూల్చివేస్తాము.
* మున్సిపాలిటి పరిధిలో అక్రమ నిర్మాణాలకు చెక్ •కందవాడ 269అసైన్డ్ లో అక్రమ ఫామ్ హౌస్ నిర్మాణాలు * పనులు ఆపివేసిన టౌన్ ప్లానింగ్ అధికారి * అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవు * చేవెళ్ల మున్సిపల్ కమిషనర్ వెంకటేశం
చేవెళ్ల,నేటిధాత్రి:
రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల వంటి ప్రాంతాల్లో, నిరుపేదలకు జీవనోపాధి కోసం ప్రభుత్వం కేటాయించిన అసైన్డ్ భూములలో బహుళ అంతస్తుల భవనాలు, ఫామ్‌హౌస్‌లు నిర్మిస్తున్నారు. చేవెళ్ల పట్టణ మున్సిపల్ పరిధిలోని కందవాడ వార్డులోని సర్వే నెంబర్ 269 లో సుమారు 100 ఎకరాలకు పైగా ప్రభుత్వ అసైన్ పట్టాలను నిరుపేదలకు జీవనోపాధి కోసం ప్రభుత్వం కేటాయించింది. కాని ఇప్పుడు ఆ భూముల్లో ప్రైవేట్ వ్యక్తులు పాగావేశారు. ప్రభుత్వ అసైన్డ్ పట్టాలను కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు నయాన బయానకు కొనుగోలు చేసి ఆ భూముల్లో ఫామ్ హౌస్ నిర్మాణాలు చేపడుతున్నారు. ఒకవైపు అధికారులు హెచ్చరిస్తున్నప్పటికీ పి.ఓ.టి చట్టానికి విరుద్దంగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. కందవాడ సర్వేనెంబర్ 269 లో ప్రభుత్వం పేదలకు ఇచ్చిన సుమారు 100ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. ఇందులో సుమారు 80శాతం భూమి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లింది. ప్రభుత్వ భూములు అమ్మకూడదన్న నిబంధన ఉన్న, యతేచ్చగా విక్రయిస్తున్నారు. పట్టా భూముల ధరలు కోట్లలో ఉండటంతో, ఐదుకో పదికో చౌక ధరకు ఈ ప్రభుత్వ అసైన్డ్ పట్టా భూములను కొనుగోలు చేసి, కమర్షియల్ నిర్మాణాలు చేపడుతున్నారు.
అసైన్డ్ లో నిర్మాణాలకు అనుమతులు ఎలా..
పట్టా భూముల్లో నిర్మాణాలు చేయాలంటేనే మున్సిపల్ శాఖ నుండి తప్పనిసరిగా అనుమతులు తీసుకునే నిర్మాణం చేపట్టాలి. కాని కందవాడలో దర్జాగా అసైన్ భూముల్లో కొనసాగుతున్న అక్రమ ఫామ్ హౌస్ నిర్మాణదారులు రెవెన్యూ చట్ట నిబంధనలను, అధికారుల ఆదేశాలను లెక్క చేయకుండా, దర్జాగా అక్రమంగా ఫామ్ హౌస్ నిర్మాణం చేపడుతున్నారు. పి ఓ టి చట్టానికి విరుద్దంగా అమ్మకాలు, కొనుగోలు చేసిన ప్రభుత్వ అసైన్డ్ భూములను పి ఓ టి యాక్ట్ కింద నోటీసులు ఇచ్చి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. కాని రెవెన్యూ శాఖ అధికారులు మండలపరిధిలో ఎక్కడ కఠినంగా చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. అధికారులు కఠినంగా వ్యవహరించకపోవటంతోనే ఇలా అక్రమనిర్మాణాలు కొనసాగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ ఫామ్ హౌస్ కల్చర్ పల్లెలకు విస్తరించటంతో ప్రభుత్వ అసైన్డ్ భూములు కూడా వదలటంలేదు. అసైన్డ్ భూములను మూడవ పార్టీలకు విక్రయించడం లేదా బదిలీ చేయడం చట్టవిరుద్ధం. అయినప్పటికీ, కొన్ని ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు రాజకీయ అండతో అసైన్డ్ భూములలో దందాలకు పాల్పడుతున్నారు. కందవాడ రెవెన్యూ మున్సిపల్ పరిది 269 అసైన్మెంట్ భూమిలో కొనసాగుతున్న అక్రమ ఫామ్ హౌస్ నిర్మాణంపై సోమవారం చేవెళ్ల మున్సిపల్ కమిషనర్ వెంకటేశం చర్యలు చేపట్టారు. కమిషనర్ వెంకటేశం ఆదేశాలతో చేవెళ్ల మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఇంచార్జ్ అధికారి అమరేందర్ రెడ్డి చర్యలలో భాగంగా ఫామ్ హౌస్ నిర్మాణం పనులను నిలిపివేశారు. అనుమతులు తీసుకున్న తర్వాతే పనులు కొనసాగించాలని నిర్మాణదారులను హెచ్చరించారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.