ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

రైతులను ఇబ్బంది చేస్తే కఠిన చర్యలు తీసుకుం టాం

జిల్లా కలెక్టర్ సత్యశారద

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండలం పత్తి పాక గ్రామంలో ధాన్యం కొను గోలు కేంద్రాన్ని కలెక్టర్ సత్య శారద గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు కొనుగోలు కేంద్రాల నుండి మిల్లులకు ధాన్యం తరలింపులో తీరును స్వయంగా పరిశీలించారు ఇప్పటివరకు రైతుల నుంచి సేకరించిన ధాన్యం ఎంత ఇంకా ఎంత ధాన్యం సేకరిం చాల్సి ఉందని ఆరా తీశారు.

కొనుగోలు కేంద్రంలో రైతులతో మాట్లాడి సమస్య అడిగి తెలు సుకున్నారు. రైతులకు నీడగా టెంట్ సౌకర్యం కల్పించాలని ఆదేశించింది వడ్ల తేమ శాతా న్ని పరిశీలించి నిబంధనల మేరకు తాలు మట్టిలేని వడ్లను వెంటనే కొనుగోలు చేయాల న్నారు వడ్ల కొనుగోలు వివ రాలు క్యాబ్ ఎంట్రీ లపై ఆరా తీశారు. ఈ విషయంపై కలెక్టర్ మండిపడ్డారు.

ధాన్యం కొను గోలు ఆలస్యం కాకూడదు రవాణా పరంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండ వని పంట కొనుగోలు చేసిన తర్వాత పూర్తి బాధ్యత కేంద్రం నిర్వాహకులదేనని తెలిపారు. కొనుగోలు చేసిన వడ్లను వెం టనే మిల్లులకు తరలించాలని ఆదేశించారు రైతులను ఇబ్బం దులను గురి చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ ప్రవీణ్ కుమార్, తాత్కాలిక మండల వ్యవ సాయ అధికారి శ్రీనివాస్, స్థానిక అధికారులు, రైతులు పాల్గొన్నారు

నూతన కమిషనర్ గా సోమిడి అంజయ్య..

నూతన కమిషనర్ గా సోమిడి అంజయ్య

పరకాల,నేటిధాత్రి

 

పరకాల మున్సిపల్ కమిషనర్ గా సోమిడి అంజయ్య సోమవారం నాడు బాధ్యతలు స్వీకరించారు.అనంతరం కార్యాలయ ఉద్యోగులు నూతన కమిషనర్ ను శాలువాతో సత్కరించి స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో గంజి వెంకట్ రెడ్డి,జూనియర్ అకౌంట్ ఆఫీసర్ హర్షద్,సీనియర్ అకౌంటెంట్ శ్రీనివాసరావు,అంజి,ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ రోహిత్ పాల్గొన్నారు.

గురుకుల పాఠశాలలో జరిగిన ఘటనపై విచారణ…

గురుకుల పాఠశాలలో జరిగిన ఘటనపై విచారణ…

విచారణ పారదర్శకంగా చేపట్టాం….

గురుకుల పాఠశాలల జోనల్ ఇంచార్జ్ గిరిజ

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

రామకృష్ణాపూర్ గురుకుల సాంఘిక సంక్షేమ పాఠశాలలో రెండు రోజుల క్రితం గోల్డ్ చైన్ పోయిందని భావించి ఇద్దరు విద్యార్థినిలను పాఠశాల పి.ఈ.టి చితకబాదడం తో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ఎదుట తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడంతో జిల్లా కలెక్టర్ విచారణ జరిపించాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశాల మేరకు సోమవారం విచారణ చేపట్టారు. ఈ విచారణలో గురుకుల పాఠశాలల జోనల్ ఇన్చార్జ్ గిరిజ, జిల్లా ఇంచార్జ్ అధికారి కే. మహేశ్వరరావు, జిల్లా కోఆర్డినేటర్ రమా కల్యాణి, పట్టణ ఇంచార్జ్ ఎస్ఐ నూనె శ్రీనివాస్, సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్ లు పాల్గొన్నారు. బాధిత విద్యార్థినులు, వారి తల్లిదండ్రులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ఉపాధ్యాయురాళ్ళను, పాఠశాల ప్రిన్సిపాల్ ప్రేమా రాణి నీ కూడా అధికారులు విచారించారు. ఈ సందర్భంగా జోనల్ ఇంచార్జ్ గిరిజ మాట్లాడారు. పాఠశాలలో జరిగిన సంఘటన పై విచారణ జరపాలని కలెక్టర్ ఆదేశించడంతో మొదటగా విద్యార్థినులను, విద్యార్థినిల తల్లిదండ్రులను విచారించడం జరిగిందని, అనంతరం ఉపాధ్యాయులను, పిఈటి ని సైతం విచారించి వారందరి నివేదికను తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఉపాధ్యాయులలో కమ్యూనికేషన్ లోపం కనబడుతుందని అన్నారు. నివేదికను జిల్లా కలెక్టర్ కు పంపించడం జరుగుతుందని చెప్పారు.గురుకుల పాఠశాలల సెక్రటరీ కి సైతం నివేదిక పంపిస్తామని తెలియచేశారు.

పాఠశాలలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలి..

సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్,పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్

పాఠశాలలో విద్యార్థులకు సరైన సౌకర్యాలు లేవని, సుమారు 600 మంది విద్యార్థులు చదువుకుంటున్న పాఠశాలలో సీసీ కెమెరాలు సైతం సరిగా పనిచేయడం లేదని, పాఠశాల గదులలో ఫ్యాన్ లు కూడా లేవని అన్నారు. సంబంధంలేని విషయంలో విద్యార్థులను చితక బాధడం నేరమని వెంటనే సంబంధిత అధికారులు అట్టి ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని సిపిఐ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.

ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని…

ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

 

ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలనిజిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.
సోమవారం ఐడిఓసి కార్యాలయ సమావేశపు హాలులో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులతో కలిసి ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులు, దరఖాస్తులను స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుండి మొత్తం 41 దరఖాస్తులు స్వీకరించామని, వాటిని సంబంధిత శాఖాధికారులకు తక్షణ పరిష్కారానికి ఎండార్స్మెంట్ చేసినట్లు తెలిపారు. ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కారం కావాలనే ఉద్దేశంతో ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. అధికారులు ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును ప్రాధాన్యతగా తీసుకోవాలని, సమయానికి చర్యలు తీసుకుని నివేదికలు సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా, పారదర్శకంగా సేవలు అందించాలని అన్ని శాఖల అధికారులను ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఆర్డీఓ రవి, ట్రైని ఉప కలెక్టర్ నవీన్ రెడ్డి అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version