గోవాలో అలనాటి తారల సందడి…

గోవాలో అలనాటి తారల సందడి

దక్షిణాదికి చెందిన తొంభైల నాటి తారలు గోవాలో ఇటీవల రీ-యూనియన్ పార్టీ జరుపుకున్నారు. బీచ్ సైడ్ రీసార్ట్ లో ఫుల్ గా ఎంజాయ్ చేశారు.

ఒకే స్కూల్ లో చదువుకున్న పూర్వ విద్యార్థులు, ఒకే కాలేజీలో చదువుకు స్టూడెంట్స్ పదేళ్ళకో, పాతికేళ్ళకో ఒకసారి కలుసుకుని అప్పటి విశేషాలను తలుచుకోవడం, ఆనాటి సంఘటనలను నెమరవేసుకోవడం సహజం. విశేషం ఏమంటే సినిమా తారలూ అందుకు మినహాయింపు కాదు. చిరంజీవి (Chirajeevi), బాలకృష్ణ (Balakrishna), నాగార్జున (Nagarjuna), వెంకటేశ్ (Venkatesh) వంటి స్టార్స్ సౌతిండియాలోని తమ సమకాలీనులతో కలిసి ఎయిటీస్ రీ-యూనియన్ పేరుతో గెట్ టు గెదర్ నిర్వహిస్తుంటారు. ఒక్కోసారి ఒక్కో థీమ్ ను పెట్టుకుని దానికి తగ్గట్టుగా డ్రసులు వేసుకుంటారు. హాయిగా మంచి పార్టీ జరుపుకుంటారు.

విశేషం ఏమంటే బహుశా ఇదే స్ఫూర్తితో కావచ్చు… తొంభైల నాటి తారలు సైతం ఇలాంటి ఓ రీ-యూనియన్ ను ఇటీవల గోవాలో జరుపుకున్నారు. ఇందులో అప్పటి హీరోలు, హీరోయిన్లు మాత్రమే కాదు… దర్శకులు సైతం హాజరయ్యారు. ఈ తొంభై దశకం వెండితెర హీరోలు, హీరోయిన్ల రీ-యూనియన్ లో జగపతిబాబు (Jagapathi Babu), శ్రీకాంత్ (Srikanth), ప్రభుదేవా (Prabhudeva), కె.ఎస్. రవికుమార్, శంకర్, లింగుస్వామి, మోహన్ రాజా తదితరులు పాల్గొన్నారు. అలానే అలనాటి అందాల భామలు మీనా (Meena), సిమ్రాన్ (Simran), ఊహ, సంఘవి, మాళవిక, సంగీత, రీమాసేన్, మహేశ్వరి, శివరంజనీ ఈ పార్టీకి హాజరయ్యారు. వీరంతా గోవాలో బీచ్ పార్టీలో ఫుల్ ఎంజాయ్ చేశారు. ఉషోదాయాలను, సాయం సంధ్యలను ఎంచక్కా తమ తోటి నటీనటులతో కలిసి ఫోటోలు దిగి, ప్రతి ఒక్కరూ రీ-బూట్ అయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో మంగళవారం నుండి చక్కర్లు కొడుతున్నాయి.

సీక్వెల్‌ రాబోతోంది.

సీక్వెల్‌ రాబోతోంది

 

 

 

యూత్‌ను విపరీతంగా ఆకట్టుకున్న సినిమాల్లో ఈ నగరానికి ఏమైంది ఒకటి. విశ్వక్‌ సేన్‌ కథానాయకుడిగా తరుణ్‌ భాస్కర్‌ దాస్యం దర్శకత్వంలో 2018లో విడుదలైన ఈ…

యూత్‌ను విపరీతంగా ఆకట్టుకున్న సినిమాల్లో ‘ఈ నగరానికి ఏమైంది’ ఒకటి. విశ్వక్‌ సేన్‌ కథానాయకుడిగా తరుణ్‌ భాస్కర్‌ దాస్యం దర్శకత్వంలో 2018లో విడుదలైన ఈ చిత్రానికి కొనసాగింపు భాగం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఆదివారం ఈ సినిమాకు సీక్వెల్‌ రాబోతుందని ప్రకటించారు మేకర్స్‌. ‘ఈఎన్‌ఈ రిపీట్‌’ అనేది టైటిల్‌. ‘ఏలినాటి శనిపోయింది. కన్యారాశి టైమ్‌ వచ్చింది’ అనేది ట్యాగ్‌లైన్‌. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ దశలో ఉందీ చిత్రం. మొదటి పార్ట్‌కు పనిచేసిన చిత్రబృందమే ఈ సీక్వెల్‌లోనూ భాగమవుతున్నారు. తరుణ్‌భాస్కర్‌ దాస్యం దర్శకత్వంలో డి.సురేశ్‌బాబు, సృజన్‌ యరబోలు, సందీప్‌ నాగిరెడ్డి నిర్మించనున్నారు. విశ్వక్‌ సేన్‌, సాయి సుశాంత్‌ రెడ్డి, అభినవ్‌ గోమతం, వెంకటేశ్‌ కాకుమాను ప్రధాన పాత్రలు పోషించనున్నారు.

భవిష్యత్తు తారల కోసం డ్రగ్స్ రహిత సమాజం నిర్మించడమే అందరి లక్ష్యం.

భవిష్యత్తు తారల కోసం డ్రగ్స్ రహిత సమాజం నిర్మించడమే అందరి లక్ష్యం..

మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలి..
– ఎస్సై దికొండ రమేష్

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

మాదక ద్రవ్యాల నిర్మూలనకు సమాజం కలిసి రావాలని “ఇది ఒక వ్యక్తిని చంపడమే కాదు, సమాజంలోని అన్ని రకాల సమస్యలకు దారితీస్తుంది. డ్రగ్కు నో చెప్పడంలో యువత అప్రమత్తంగా ఉండాలి మరియు బాధ్యతగా ఉండాలి” అని పొత్కపల్లి ఎస్సై దికొండ రమేష్ అన్నారు.ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన వారోత్సవాల్లో భాగంగా ( సే నో టూ డ్రగ్స్ ) అనే నినాదం తో పొత్కపల్లి ఓదెల మోడల్ స్కూల్, హై స్కూల్, కస్తూర్బా విద్యార్థులతో విద్యార్థులతో కలిసి ఎస్సై రమేష్ ఆధ్వర్యంలో ఓదెల సెంటర్లో ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులతో డ్రగ్స్ వ్యతిరేక నినాదాలు మరియు ప్రతిజ్ఞ చేయించారు.ఈ సందర్భంగా పొత్కపల్లి ఎస్సై దికొండ రమేష్ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అని విద్యార్థి దశలోనే పిల్లలను మంచి మార్గంలో నడిపించడం సమాజం యొక్క ప్రధాన బాధ్యత అని చుట్టూ జరుగుతున్న అనైతిక కార్యకలాపాల గురించి వారిలో అవగాహన పెంచాలి.డ్రగ్స్, గంజాయి వంటి మాదకద్రవ్యాల ప్రభావం ఇప్పుడు పల్లెప్రాంతాలకూ విస్తరించిందనీ,వీటి నుంచి యువతను కాపాడుకోవాలి” అని తెలిపారు.
గంజాయి వంటి మాదకద్రవ్యాలు రవాణాకు సులభ మార్గాలనీ, విద్యార్థులు,యువత వీటికి బలవుతున్నారనీ,మత్తులో ఉన్న వ్యక్తి తన చర్యల్ని గుర్తించలేని స్థితికి చేరతాడనీ,ఈ అలవాటు అనేక ఆరోగ్య సమస్యలతో పాటు నేరపూరిత జీవితానికి దారితీస్తుందని అన్నారు.
అంతేకాకుండా సరదా కోసం అయినా డ్రగ్స్ వైపు అడుగు వేయకండనీ,ఇవి కేవలం వ్యక్తిని కాదు, కుటుంబాన్నీ నాశనం చేస్తాయనితెలిపారు. డ్రగ్స్‌కి బలైపోకుండా మీ భవిష్యత్తును కాపాడుకోనీ విజేతలుగా ఎదగండి” అంటూ విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఓదెల మండల విద్యాధికారి రమేష్, అధ్యాపక బృందం, పోలీస్ సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

యోగా డే.. త‌ర‌లివ‌చ్చిన సినీతార‌లు.

యోగా డే.. త‌ర‌లివ‌చ్చిన సినీతార‌లు

 

 

 

హైద‌రాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వ‌హించిన యోగా డే కౌంట్‌డౌన్ శుక్ర‌వారం క‌ల‌ర్‌ఫుల్‌గా మారింది.

జూన్ 21న అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వం సంద‌ర్భంగా హైద‌రాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వ‌హించిన యోగా డే (Yoga Day) కౌంట్‌డౌన్ శుక్ర‌వారం క‌ల‌ర్‌ఫుల్‌గా మారింది. కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి (Union Minister Kishan Reddy) ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన ఈ కార్య‌క్ర‌మానికి తెలంగాణ గవర్నర్ జిష్ణుడేవ్ వర్మ (Telangana Governor Jishnu Dev Varma), మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Venkaiah Naidu)ల‌తో పాటు ప‌లువురు కేంద్రమంత్రులు, బీజేపీ నేతలు,పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజలు యోగాసనాలు వేశారు.

ఆపై సినీ తార‌లు తేజ స‌జ్జా (Teja Sajja), సాయుధ‌ర‌మ్ తేజ్ (Sai Dharam Tej), మీనాక్షి చౌద‌రి (Meenakshi Chaudhary), ఖుష్బూ (Kushboo) వంటి తార‌లు సైతం త‌ర‌లివ‌చ్చి ప్రొగ్రాంకు కొత్త క‌ళ తీసుకు వ‌చ్చారు. త‌మ ప్ర‌సంగంతో అక్క‌డికి చ్చిన వారిలో ఉత్తేజం నింపారు. అంద‌రితో పాటుగా యోగా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

ఈ సంద‌ర్భంగా మంత్రి కిష‌న్ రెడ్డి మాట్లాడుతూ.. మోదీ ప్రధాని అయిన తర్వాత భారత దేశం ప్రపంచానికి ఇచ్చిన అద్భుతమైన బహుమతి యోగా అని అన్నారు. ఈ యోగాను ప్రపంచవ్యాప్తంగా గుర్తించారని.. మోదీ నాయత్వంలో యావత్ ప్రపంచంలో ఉన్న 2 వందల దేశాల నాయకులు, ప్రజలు యోగాను ఆచరిస్తున్నారంటే.. ప్రతి భారతీయుడు గర్వించాల్సిన విషయమని కిషన్ రెడ్డి అన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version