వైద్య ఖర్చులకు పాడి ఉదయ నందన్ రెడ్డి ఆర్థిక సహకారం…

వైద్య ఖర్చులకు పాడి ఉదయ నందన్ రెడ్డి ఆర్థిక సహకారం

ఫోటో రైట్ అప్ ఆర్థిక సహకారం అందజేస్తున్న సభ్యులు

వీణవంక( కరీంనగర్ జిల్లా):నేటి ధాత్రి:

 

ఇటీవల ప్రమాదానికి గురైన శంకరపట్నం మండలం కల్వల గ్రామానికి చెందిన సంగి సందీప్ కుమార్తె శ్రద్ధ వైద్య ఖర్చుల నిమిత్తం యప్ టీవీ అధినేత పాడి ఉదయ నందన్ రెడ్డి ఆర్థిక సహకారం అందించారు.ఇటీవల కాలంలో ప్రమాదానికి గురైన శ్రద్ధకు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు తలలో చిన్న ఎముక విరిగడం తో డాక్టర్లు శ్రద్ధకి ఆపరేషన్ చేపట్టారు.మరల పర్యవేక్షణ చేసిన డాక్టర్లు శ్రద్ధ తలలో ఎముక ఇన్ఫెక్షన్ అయ్యిందని ,మరలా డాక్టర్లు వైద్యం చేయాలని, ఎక్కువ మొత్తంలో ఖర్చవుతుందని వైద్యులు కుటుంబీకులకు సూచించడం జరిగింది. దీంతో నిరుపేద కుటుంబానికి చెందిన శ్రద్ధ తల్లిదండ్రులు ,పాడి ఉదయ నందన్ రెడ్డిని కలిసి తన ఆర్థిక పరిస్థితిని విన్నవించుకోగా ,సానుకూలంగా స్పందించిన పాడి ఉదయ్ నందన్ రెడ్డి తన అనుచరులచే రూ 20 ,000/- లను ఆర్థిక సహాయంగా అందించడం జరిగింది. ఈ సందర్భంగా వారికి శ్రద్ధ కుటుంబ సభ్యులు మరియు గ్రామస్తుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి దాసారపు ప్రభాకర్, వెన్నంపల్లి నారాయణ, అమృత ప్రభాకర్, సమిండ్ల చిట్టి, దాసారపు రాజు, మంతెన శ్రీధర్, తాళ్లపెళ్లి కుమారస్వామి, సిరిగిరి రాజశేఖర్, దాసారపు అశోక్, వంశీకృష్ణ, లోకేష్, పస్తం కుమార్ స్వామి, నీల ప్రభాకర్, సంగి మహేందర్, గట్టయ్య, చల్లూరి హరీష్, దాసారపు మహేందర్, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

చిన్నారుల కలల లోకం లోకి అడుగులు..

చిన్నారుల కలల లోకం లోకి అడుగులు

– ప్రగతిలో 3D ప్లానిటోరియం అనుభవం!

రాయికల్, అక్టోబర్ 13: నేటి ధాత్రి:

 

 

జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని ప్రగతి పాఠశాలలో సోమవారం నిర్వహించిన 3D ప్లానిటోరియం విజ్ఞాన కార్యక్రమం అన్ని వయసుల విద్యార్థులను ఆకట్టుకుంది. ఒకటో తరగతి నుండి పదవ తరగతి వరకు విద్యార్థులు నక్షత్రాలు, గ్రహాలు, గెలాక్సీల అద్భుత ప్రపంచాన్ని ప్రత్యక్షంగా వీక్షించి మంత్రముగ్ధులయ్యారు.చిన్న తరగతుల విద్యార్థులకు సౌరమండల పరిచయం, భూమి–చంద్రుని కదలికలు, పగలు–రాత్రి మార్పు, ఋతువుల మార్పు వంటి అంశాలను సరళంగా చూపించగా,పెద్ద తరగతుల విద్యార్థులకు నక్షత్ర సమూహాలు,గెలాక్సీలు,బ్లాక్ హోల్‌లు,అంతరిక్ష పరిశోధనలు, ఉపగ్రహాల ప్రయాణం వంటి అధునాతన విషయాలను 3D రూపంలో ప్రదర్శించారు.విద్యార్థులు తాము తరగతుల్లో చదివిన విషయాలను ప్రత్యక్షంగా వీక్షించడంతో ఆసక్తి మరింత పెరిగింది.శాస్త్ర విజ్ఞానం, ఖగోళ శాస్త్రంపై ఆసక్తి కలిగించే ఈ కార్యక్రమం పాఠశాల ప్రాంగణంలో ఆనందోత్సాహాల నడుమ సాగింది.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలె శేఖర్ మాట్లాడుతూ —
“విజ్ఞానం వినోదంతో మిళితమైతేనే విద్యార్థుల్లో ఆసక్తి పుడుతుంది. ఇలాంటి ప్రదర్శనలు పిల్లల్లో ఊహాశక్తి, ప్రశ్నించే స్వభావం, పరిశోధనా దృక్పథం పెంపొందిస్తాయి” అన్నారు.కార్యక్రమం నిర్వహణలో ఉపాధ్యాయులు సక్రియంగా పాల్గొనగా, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై 3D ప్రదర్శనను ఆస్వాదించారు.ఈ కార్యక్రమంలో
కరస్పాండెంట్ జయశ్రీ, అకాడమీ డైరెక్టర్ నిఖిల్ కుమార్, ఉపాధ్యాయ బృందం,విద్యార్థులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version