ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి నేటిధాత్రి
ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలనిజిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.
సోమవారం ఐడిఓసి కార్యాలయ సమావేశపు హాలులో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులతో కలిసి ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులు, దరఖాస్తులను స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుండి మొత్తం 41 దరఖాస్తులు స్వీకరించామని, వాటిని సంబంధిత శాఖాధికారులకు తక్షణ పరిష్కారానికి ఎండార్స్మెంట్ చేసినట్లు తెలిపారు. ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కారం కావాలనే ఉద్దేశంతో ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. అధికారులు ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును ప్రాధాన్యతగా తీసుకోవాలని, సమయానికి చర్యలు తీసుకుని నివేదికలు సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా, పారదర్శకంగా సేవలు అందించాలని అన్ని శాఖల అధికారులను ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఆర్డీఓ రవి, ట్రైని ఉప కలెక్టర్ నవీన్ రెడ్డి అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.