చత్రపతి శివాజీ ని ఆదర్శంగా తీసుకోవాలి…

చత్రపతి శివాజీ ని ఆదర్శంగా తీసుకోవాలి

* విగ్రహ ఆవిష్కరణలో మాజీ మంత్రి, మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

 

యువత చత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకోవాలని మాజీ మంత్రి, మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి అన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్బంగా తుంకుంట మున్సిపాలిటీ మందయిపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గోని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు ఉమా ఆంజనేయులు, రాజ్ కుమార్ యాదవ్, బిఆర్ఎస్ అధ్యక్షుడు పాముల శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ నాలుక యాదగిరి, కృష్ణారెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, మందాయపల్లి వాసులు, యువకులు పాల్గొన్నారు.

రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి మరోసారి ఈడీ సమన్లు…

రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి మరోసారి ఈడీ సమన్లు

అనిల్ అంబానీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నుంచి మరోసారి సమన్లు అందాయి. గత కొంతకాలంగా విదేశీ మారక ద్రవ్య ఉల్లంఘనల కేసులో విచారణను ఎదుర్కొంటున్న ఆయనను.. ఈనెల 26వ తేదీన తమ ఎదుట విచారణకు హాజరుకావాలని ఈడీ ఆదేశాలు జారీ చేసింది.

 రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) నుంచి మరోసారి సమన్లు అందాయి. గత కొంతకాలంగా విదేశీ మారక ద్రవ్య ఉల్లంఘనల కేసులో విచారణను ఎదుర్కొంటున్న ఆయనకు, ఈనెల 26వ తేదీన తమ ఎదుట విచారణకు హాజరుకావాలని ఈడీ ఆదేశాలు జారీ చేసింది.

ఇటీవల ఈడీ జారీ చేసిన సమన్లకు అనిల్ అంబానీ గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలో అధికారులు ఆయనకు రెండోసారి నోటీసులు పంపారు. ఆయన సతీమణి టీనా అంబానీని కూడా ఈడీ విచారించాల్సి ఉంది. అయితే ఆమె కూడా గతంలో రెండుసార్లు విచారణకు హాజరు కాలేదు. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (FEMA) నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి అంబానీ కుటుంబంపై ఈ విచారణ కొనసాగుతోంది. విదేశాల్లోని వారి ఆస్తులు, లావాదేవీల గురించి ఈడీ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది.

కాగా, ఈనెల 26న అనిల్ అంబానీ విచారణకు హాజరవుతారా, లేదా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వరుసగా విచారణకు గైర్హాజరు కావడం వల్ల భవిష్యత్తులో ఈడీ ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నది ఆసక్తికరంగా మారింది.

ఉపాధ్యాయురాలిగా ప్రతిభ, గానంతో మన్ననలు పొందుతున్న స్వరూపరాణి…

ఉపాధ్యాయురాలిగా ప్రతిభ, గానంతో మన్ననలు పొందుతున్న స్వరూపరాణి

జహీరాబాద్ నేటి ధాత్రి:.

ఝరాసంగం మండలం బిడేకన్న గ్రామ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న కే. స్వరూపరాణి, బోధనలో తన ప్రతిభతో పాటు గాన మాధుర్యంతో అందరి మన్ననలు అందుకుంటున్నారు. ఇటీవల శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి దేవస్థానంలో విడుదలైన ఆడియో, వీడియో ఆల్బంలో ఆమె పాడిన పాటలు విశేష ప్రశంసలు పొందాయి. ఈదులపల్లి గోరఖ్ నాథ్ బృందం స్వరపరిచిన పాటల ఆల్బంలో ఆమె గానానికి ఆలయ కార్యనిర్వాణాధికారి, రాజకీయ నాయకులు ఘనంగా సన్మానించారు. తన అభిమాన ఆశీర్వాదాలతో రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించి ప్రాంతానికి పేరు ప్రఖ్యాతులు తెస్తానని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు..

రేవంత్ సహా కాంగ్రెస్ మంత్రులకు ఢిల్లీ పిలుపు

· నేడు ఏఐసీసీ ఆధ్వర్యంలో సమావేశం
· రేవంత్ పట్ల అధిష్టానం పూర్తి సానుకూలత
· సీనియర్ మంత్రుల్లో కొందరి పోర్ట్‌పోలియోలు మారే ఛాన్స్
· కొందరికి ఉద్వాసన తప్పదు
· కొత్త మంత్రివర్గంలో లంబాడా, ముస్లిం వర్గాలకు ప్రాధాన్యత
· మంత్రిపదవి రేసులో వెటరన్ నటి విజయశాంతి
· బీసీ మహిళగా ఆమెకు ప్రాధాన్యం దక్కే అవకాశం
· పార్టీ విధేయుల ఫిర్యాదుల పరిశీలన
· ఢిల్లీలో ఆశావహుల లాబీయింగ్
· మంత్రుల పనితీరుపై ఓ కన్నేసిన అధిష్టానం
· కోల్ బ్లాక్, మేడాడం జాతర టెంటర్ల వివాదంపై ప్రశ్నించే అవకాశం
· రిపోర్టుల తయారీలో మంత్రులు బిజీ
హైదరాబాద్, నేటిధాత్రి:
పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అప్రతిహత విజయం సాధించిన నేపథ్యంలో, అధిష్టానంముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పట్ల అత్యంత సానుకూలతతో వున్నది. బీఆరఎస్, బీజేపీలను సమర్థ వంతంగా ఎదుర్కొని, అద్భుత వ్యూహాలతో పార్టీని విజయపథంలో నడిపించిన నేతగా రేవంత్ హైకమాండ్ దష్టిలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఆయన సమర్థ నాయకత్వాన్ని ఇతరరాష్ట్రాల నాయకులకు రోల్‌మోడల్‌గా అధిష్టానం పరిగణిస్తోంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలు ముఖ్యమంత్రి రేవంత్‌ను ప్రశంసించారు. 90కి పైగా మున్సిపాలిటీలు కాంగ్రెస్ కైవసం కావడమంటే రేవంత్ అమలు చేస్తున్న ప్రజా ప్రాధాన్య కార్యక్రమాలు, ఆరు గ్యారంటీల అమలే ప్రధాన కారణమని కేంద్ర నాయకత్వం భావిస్తోంది. ఈ వరుస విజయాలతో రేవంత్ తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్నారు. ఇప్పుడిక పార్టీలో అసమ్మతి వాదుల ఫిర్యాదులను పరిశీలించినా, అధిష్టానం పెద్దగా వాటిని పట్టించుకోదనేది సుస్పష్టం. రాబోయే జీహెచఎంసీ ఎన్నికల్లో కూడా ఇదేమాదిరి విజయం సాధించాలని రేవంత్‌ను అధిష్టానం కోరినట్టు తెలు స్తోంది. ఇక 2034 వరకు తన ముఖ్యమంత్రి పదవికి ఢోకాలేదన్న ధీమాతో రేవంత్ వున్నారు.
ఇదిలావుండగా మున్సిపల్ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి సహా ఇతర మంత్రులకు ఢిల్లీనుంచి పిలుపు వచ్చింది. వీరితో కాంగ్రెస్ అధిష్టానం గురువారం సమావేశం కానుంది. ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న వివాదాలు ముఖ్యంగా నైనీ కోల్ బ్లాక్ కుంభకోణం, మంత్రుల మధ్య విభేదాలున్నట్టు వస్తున్న వార్తల నేపథ్యంలో మొత్తం రేవంత్ మంత్రివర్గ సభ్యులను ఢిల్లీకి పిలిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా కోల్ బ్లాక్ కుంభకోణం పార్టీ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీసిందన్న అభిప్రాయం ఏఐసీసీ పెద్దల్లో నాటుకున్నట్టు తెలుస్తోంది. మేడారం జాతర టెండర్ల వివాదం కూడా పార్టీ ప్రతిష్ఠను మసకబార్చింది. ఈ రెండు అంశాలు ఈ సమావేశంలో కీలకం కానున్నాయి. అంతేకాదు ఎంతోకాలంగా పార్టీకి విధేయులుగా వుంటున్న తమను పక్కన పెట్టేశారని, కేవలం ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే అన్నిరకాల ప్రాధా న్యతలిస్తున్నారని కొందరు ఎమ్మెల్యేలు ఎప్పటినుంచో పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నారు. ఇప్పటివరకు వీరి ఫిర్యాదులను కేంద్ర నాయకత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు వీటిపై దష్టి సారించే అవకాశముంది. దీనికితోడు మున్సిపల్ ఎన్నికల తర్వాత మంత్రివర్గ విస్తరణ వుంటుందన్న ఊహాగానాలు ఊపందుకున్న నేపథ్యం కూడా ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకోవడానికి ప్రధాన కారణం. తెలంగాణ మంత్రివర్గంలో ప్రాంతీయ సమతుల్యత లేదన్న ఆరోపణలు నిజం. ఎందుకంటే కొన్ని జిల్లాలకు అత్యధిక ప్రాతినిధ్యం వుండగా మరికొన్ని జిల్లాలకు అసలు మంత్రివర్గంలో స్థానమే దక్కలేదు. ఉదాహరణకు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు 3, కరీంనగర్‌కు 3, నý£్గండజిల్లాకు 2, వ రంగల్ జిల్లాకు చెందిన ఇద్దరికి మంత్రివర్గంలో స్థానాలు లభించాయి. ఇక హైదరాబాద్, రంగా రెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. ఆదిలాబాద్ జిల్లా కు జి.వివేక్ వెంకటస్వామి (చెన్నూరు)కు మంత్రివర్గంలో ఇటీవల స్థానం కల్పించినా, ఈ జిల్లా లోని ఇతర ప్రాంతాలను పట్టించుకోలేదు. ఈ వ్యత్యాసాలను భర్తీ చేసేరీతిలో అధిష్టానం ఈ సమావేశంలో తగిన నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ఇదిలావుండగా ఏఐసీసీ వివిధ రాష్ట్రాల కాంగ్రెస్ నాయకులతో ఢిల్లీలో సమావేశాలు నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగానే తెలంగాణకాంగ్రెస్ నేతలకు కూడా పిలుపు వచ్చిందన్నది పార్టీ వర్గాలు చెబుతున్న మాట. నిజానికి మం త్రుల పనితీరును అధిష్టానం ఎప్పటినుంచో నిశితంగా పరిశీలిస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో 90కి పైగా మున్సిపాలిటీల్లో పార్టీ గెలిచిన నేపథ్యంలో ఆయా మంత్రులు తమ శాఖలకు సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్టును, మున్సిపల్ ఎన్నికల్లో పనితీరుకు సంబంధించిన వివరాలను సమర్పించాలని అధిష్టానం నుంచి ఆదేశాలందాయి. ఈ నివేదికల ఆధారంగా ఎవరిని మంత్రివర్గంలో కొనసాగించాలి లేదా పోర్టుఫోలియో మార్చాలి లేదా పూర్తిగా తొలగించాలన్న నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఈ పరిణామాల నేపథ్యంలో రేవంత్ బందానికి అధిష్టానం పిలుపుతో ఒక్కసారి గా తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ఢిల్లీ పిలుపుతో మంత్రులు ఈ రెండేళ్ల కాలంలో తమ ఆధీనంలోని మంత్రి త్వశాఖల పురోగతిపై నివేదికలు సిద్ధం చేసుకుంటున్నారు. ముఖ్యంగా తమ పై వచ్చిన ఆరోపణలు, వివాదాలకు సమాధానాలు రూపొందించుకొని అధిష్టానానికి సమర్పించే అవకాశముంది. ఇదిలావుండగా సీనియర్ మంత్రులు ఒక్కొక్కరి వద్ద చాలా మంత్రిత్వశాఖలున్న నేపథ్యంలో మంత్రి పదవులకు ఆశావహులు ఎప్పటినుంచో పట్టువదలని విక్రమార్కుల మాదిరిగా ఢిల్లీ స్థాయి లో లాబీయింగ్ చేస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తికావడం, లాబీయింగ్ వత్తిడి నేపథ్యంలో అధిష్టానం కేబినెట్ విస్తరణపై తక్షణం దష్టి పెట్టనున్నది.
ఇప్పటివరకు మంత్రుల పనితీరుపై దష్టిపెట్టిన అధిష్టానం తనకు అందిన నివేదికల ఆధారంగా చర్యలు తీసుకునే అవకాశముండటంతో, మంత్రుల్లో టెన్షన్ నెలకొంది. ఈ నేపథ్యంలో మంత్రి వర్గంనుంచి తొలగించే అవకాశాలున్న వారిలో రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంక ట్‌రెడ్డి, రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, అటవీ పర్యావణ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎక్సైజ్Ê పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కష్ణారావుల పేర్లు వినిపిస్తున్నాయి. రాజ్‌గోపాల్‌రెడ్డి బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరినప్పుడు మంత్రిపదవవి ఇస్తామని చెప్పిన హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆయనకు మంత్రిపదవి ఇచ్చేందుకు వీలుగా సోదరుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని తప్పించవచ్చుని చెబుతున్నారు. ముఖ్యంగా ఇద్దరు సోదరులు మంత్రిపదవుల్లో వుండరాదన్న పార్టీ విధానం మేరకు ఈ చర్య వుంటుందంటున్నారు. ఇక పొన్నం ప్రభాకర్‌ను పార్టీసేవలకు వినియోగించుకోవాలన్న ఆలోచన వున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా సామాజిక వర్గాల సమతుల్యతను పాటించేందుకు ఈ మార్పు చేసే అవకాశముంది. ఇక కొండాసురేఖ మొదట్నుంచీ పలు వివాదాýకు కారణమయ్యారు. ఆమె చేసిన వ్యాఖ్యలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీసిందన్న అభిప్రాయం వ్య క్తమవడం, పనితీరు సంతప్తికరంగా వుండకపోవడంతో ఆమె తొలగింపు తప్పదంటున్నారు. ఇక కొత్త వారికి అవకాశమిచ్చే ఉద్దేశంతో జూపల్లిని మంత్రిపదవినుంచి తొలగమని కోరవచ్చు. ముఖ్యంగా తక్కువ ప్రాతినిధ్యమున్న జిల్లాలకు అవకాశం కల్పించాలన్న ఉద్దేశమే ఇందుకు కారణం.ఏఐసీసీ ఈవిధంగా సర్జికల్ స్ట్రెíక్ చేయడానికి ప్రధాన కారణం, మంత్రుల పనితీరును ఎప్పటికప్పుడు మూల్యాంకనం చేయడంతోపాటు, మున్సిపల్ ఎన్నికల్లో వారి సామర్థ్యాన్ని తెలుసుకోవ డం. ముఖ్యంగా నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన మంత్రులు ఇప్పుడు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. హైకమాండ్ ఇప్పుడు లంబాడా (ఎస్టీ), ముస్లిం వర్గాల వారిని మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న ఆలోచనలో వుంది. వీరితో పాటు మంత్రివర్గంలో ప్రాతిని ధ్యం లభించని జిల్లాలకు ప్రాధాన్యతనివాలన్న ఉద్దేశం మరో కారణం. ఈ నేపథ్యంలో మంత్రుల మధ్య నెలకొన్న విభేదాలు, పార్టీ విధేయులు ఇచ్చిన ఫిర్యా దులకు సంబంధించిన నివేదికలను సమర్పించాలని పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఆదేశించినట్టు తెలుస్తోంది.
శాఖలు మారే మంత్రుల్లో ముందుగా వినిపిస్తున్న పేరు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క.ఆయన్ను ీVAంశాఖకు బదిలీచేసే అవకాశముంది. ఇక మంత్రుల్లో అద్భుతమైన పనితీరు ప్రద ర్శిస్తున్నారని పేరు సంపాదించుకున్న దుద్దిళ్ల శ్రీధర్‌బాబును ఇప్పుడు నిర్వహిస్తున్న ఐటీ శాఖ నుంచి ప్రమోషన్‌పై ఆర్థిక శాఖ అప్పగించే అవకాశాలున్నాయి. ప్రభుత్వంలో వివాదరహితుడు, సమర్థుడుగా శ్రీధర్‌బాబుకు పేరుంది. పస్తుతం నీటిపారుదల శాఖను చూస్తున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని రెవెన్యూశాఖకు బదిలీచేయవచ్చు. ఇక రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వానికే మూలస్తంభంగా వున్న నేపథ్యంలో ఆయన్ను ప్రస్తుత రెవెన్యూ శాఖ నుంచి నీటిపారుదల లేదా పౌరసరఫరాల శాఖకు బదిలీచేయవచ్చు. ఇక కోయ సామాజిక వర్గానికి చెందిన ధనసరిఅనసూయ (సీతక్క) మంచి పాపులారిటీ సంపాదించుకున్న నేపథ్యంలో ఆమె పదవికి ఎటువంటిఢోకా లేదు. ఎస్సీ వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మంత్రివర్గంలో కొనసాగే అవకాశాలే మెండు. మంత్రివర్గంలో అత్యంత సీనియర్ అయిన తుమ్మల నాగేశ్వరరావు పోర్ట్‌పోలియో మారవచ్చు. ఇక ఇటీవల మంత్రివర్గంలో చేర్చుకున్న జి.వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణకుమార్, వాకిటి శ్రీహరిల పదవులకు భయం లేదు.
ఇక మంత్రిపదవుల ఆశావహుల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (మునుగోడు), బి. మహేష్‌కుమార్ గౌడ్ (టీపీసీసీ ప్రెసిడెంట్), కె. మదన్‌మోహన్‌రావు (ఎల్లారెడ్డి), బాలూ నాయక్ (దేవరకొం డ), బీర్ల ఐలయ్య (ఆలేర్), ఆది శ్రీనివాస్ (వేములవాడ), అమర్ అలీఖాన్ (ఎమ్మెల్సీ), విజయ శాంతి (ఎమ్మెల్సీ) వున్నారు. ఇంకా పి. సుదర్శన్‌రెడ్డి (బోధన్), మల్‌రెడ్డి రంగారెడ్డి (ఇబ్రహీంప ట్నం), కె. ప్రేమ్‌సాగర్‌రావు (మంచిర్యాల్) కూడా వున్నారు. నిజానికి వెటరన్ సినీనటి విజయ శాంతిని 2025 జూన్‌లోనే మంత్రివర్గంలోకి తీసుకుంటారని బలమైన అంచనాలున్నప్పటికీ, కేవలం ఎమ్మెలేలు, సామాజిక వర్గానికి ప్రాధాన్యతనిచ్చిన నేపథ్యంలో ఆమె చివరి నిముషంలో అవ కాశం కోల్పోయారు. ఇది ఇప్పుడు ఆమెకు గొప్ప సావకాశంగా మారనున్నదనేది అంచనా. ముఖ్యంగా మహిళా నాయకురాలిగా ఆమెకు అవకాశం దక్కవచ్చు. పార్టీలో చేరినప్పుడు అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఆమెకు మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చినట్టు వార్తలు వచ్చా యి. కానీ ఈ హామీ ఇప్పటివరకు అమలు కాలేదు. ఆవిధంగా రెండు సార్లు ఛాన్స్ మిస్ అయి న నాయకురాలిగా, మంత్రిపదవి రేసులో ముందు వరుసలో నిలిచారు. ప్రస్తుతం ఆమెకు హైకమాండ్ ఆశీస్సులు పుష్కలంగా వున్నాయి. అదీకాకుండా బీసీ వర్గానికి చెందిన మహిళ కావడం ఆమెకు తిరుగులేని అర్హతగా మారింది. కాగా ఆశావహులు, మంత్రుల భవితవ్యాన్ని 19వ తేదీన జరిగే సమావేశంలో పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలు తేల్చనున్నారు. మంత్రిపదవుల్లో కొనసాగేవారికి ఈసారి పాలనాపరంగా మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు వీలుగా లక్ష్యాలు నిర్దేశించడం, ముఖ్యంగా విజన్`2047 సాధనకు వీలుగా తెలంగాణ రైజింగ్‌పై ప్రధానంగా దష్టి కేంద్రీకరించాలని ఆదేశించే అవకాశాలున్నాయి. 2027 నాటికి మూడు ట్రిలియన్ల ఎకానమీ లక్ష్యానికి అనుగుణంగా పాలన, అభివద్ధి కార్యక్రమాలను మంత్రులు అ మలు చేయాల్సి వుంటుంది. ఏఐ ఇన్నోవేషన్ హబ్, నెక్స్‌ట్ జెన్ లైఫ్ సైన్స్ పాలసీ ప్రాజెక్టులనువిజయవంతం చేయడానికి మంత్రులు కషిచేయాలని అధిష్టానం నిర్దేశించవచ్చు.

ఎమ్మెల్యేలకు చిట్ బాధితులు గోడు పట్టదా!

-“నేటిధాత్రి” వార్తకు సిపిఐ ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు స్పందించారు.

-కూనమనేనికి ఉన్న బాధ్యత మిగతా ఎమ్మెల్యేలకు లేదా!

-కళ్ళముందు కష్టాలు పడుతున్న బాధితులు కనిపించడం లేదా!

-ఎమ్మెల్యేల చుట్టూ బాధితులు తిరుగుతున్నా ఎమ్మెల్యేలకు తీరిక లేదా?

-బాధితులకు న్యాయం చేయాలన్న ఉద్దేశ్యం లేదా?

-ముగ్గురు ఎమ్మెల్యేలు తీసుకున్న చొరవ మిగతా ఎమ్మెల్యే లు తీసుకోరా.

-చిట్టీలు కట్టి చితికి పోయారు!

-చిట్ కంపెనీలు బాధితులకు చితి పెర్చుతున్నారు!

-కార్యాలయాల ముందు నిప్పంటిచుకుంటున్న కనికరించడం లేదు.

-చిట్టీలు కట్టిన పాపానికి నరకం చూస్తున్నారు.

-చిట్ కంపెనీలను నమ్మి వేలాది మంది మోసపోయారు.

-నిండా మునిగి దినదిన గండంగా బతుకుతున్నారు.

-చిట్ కంపెనీల యజమానులు విలాసంగా బతుకుతున్నారు.

-విదేశాలు తిరుగుతూ విలసాలు చేస్తున్నారు.

-కంపెనీలు మూసి కోట్లతో పారిపోయారు.

-పొరుగు రాష్ట్రాలలో ఆస్తులు సంపాదించుకున్నారు.

-జనం సొమ్ముతో బంగాళాలు కట్టుకున్నారు.

-జనం సొమ్ము దిగమింగి దివాళా తీశామంటున్నారు.

-ప్రజల సొమ్ముతో జల్సా జీవితాలు గడుపుతున్నారు.

-బాధితులు గోసపడుతున్నా పట్టించుకునే వారు లేరు.

-కొంత మంది ఎమ్మెల్యేలు చొరవ తీసుకున్నారు.

-హరీష్ రావు బాధితుల పక్షాన నిలిచి సొమ్ములిప్పించారు.

-చిట్ బాధితుల ముందు కంపెనీల యాజమాన్యాలను నిలబెట్టారు.

-బాధితులకు దగ్గరుండి న్యాయం జరిపించారు.

-వరంగల్ ఎం ఎల్ ఏ నాయని రాజేందర్ రెడ్డి కొంత చొరవ తీసుకున్నారు.

-నేటిధాత్రి వార్తకు సిపిఐ ఎం ఎల్ ఏ కూనంనేని సాంబశివరావు స్పందించారు.

-కొత్తగూడెం లో వున్న చిట్ ఫండ్ బాధితుల పక్షాన నిలిచారు.

-ప్రభుత్వనికి ఉత్తరం రాశారు.. తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.

-చిట్ కంపెనీల బాధితులు తెలంగాణా మొత్తం వున్నారు.

-అన్ని జిల్లాలలో కలిసి లక్షలాది మంది బాధితులున్నారు.

-మిగతా ఎం ఎల్ ఏ లకు బాధితులు కనిపించడం లేదా.

-బాధితుల గోడు ఆ ఎమ్మెల్యే లకు పట్టదా!

-నేటిధాత్రి వరుస కథనాలు రాస్తున్న ఎమ్మెల్యే లు కదలరా.

-ఎమ్మెల్యే కూనం నేనికి వున్న బాధ్యత మిగతా ఎమ్మెల్యే లకు లేదా!

-లక్షలాది మంది చిట్ బాధితులు రోడ్డు మీద పడ్డ కనిపించడం లేదా.

-ఎమ్మెల్యే లకు బాధితుల బాధలు పట్టవా!

-ప్రభుత్వం చిట్ బాధితుల కోసం జీ వో జారీ చేసిన విషయమైనా ఎమ్మెల్యే లకు తెలుసా?

-బోర్డులు తిప్పేసిన కంపెనీల ఆస్తులు జాప్తు చేసైనా బాధితులకు న్యాయం చేయాలి.

-ప్రభుత్వ లక్ష్యం నెరవేర్చడం కాంగ్రెస్ ఎమ్మెల్యేల బాధ్యత కాదా!

-చిట్ కంపెనీల మీద సిట్ వేసి దర్యాప్తు చేయించండి.

-దశబ్ద కాలంగా జరగని న్యాయం ప్రజా ప్రభుత్వం చేసి చూపించండి.

-సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లు జారీ చేసిన జీ వో అమలుకు ఎమ్మెల్యే లు చొరవ తీసుకోండి.

-జీవితాంతం ఆ బాధితులు కాంగ్రెస్ పార్టీ కి రుణపడి వుంటారు చూసుకోండి.

 

హైదరాబాద్, నేటిధాత్రి: 

 చిట్ కంపనీల మోసాలు, బాదితులు పడుతున్న కష్టాలు, చిట్టి కట్టిన పాపానికి చితికిపోతున్న జీవితాలు తెలంగా ణలో ఎమ్మెల్యేలకు కనిపించడం లేదా? బాధితులు ఎమ్మెల్యేల వద్దకు వచ్చి గోడు వెళ్లబోసుకుంటున్నా కనికరించాలనిపించడ ంలేదా? వారికి న్యాయం చేయాలనిపించడం లేదా? వారి గోడు తీర్చే తీరిక ఎమ్మెల్యేలకు లేకుండాపోయిందా? గడచిన పదేళ్ల కాలంలో నాటి ఎమ్మెల్యేల నుంచి నేటి ఎమ్మెల్యేల దాకా బాదితులు కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఎమ్మెల్యేల కాళ్లా వేళ్లా పడుతున్నారు. అయినా ఎమ్మెల్యేలకు మనసు కరగడం లేదు? బాధితుల పక్షాన నిలిచే సమయం చాలడం లేదు? నిజం చెప్పాలంటే ఎమ్మెల్యేలు తల్చుకుంటే బాదితులకు సొమ్ములు అణాపైసాలతో సహా ఇప్పించొచ్చు. అలా నిరూపించిన ఎమ్మెల్యేలు కూడా వున్నారు. సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్‌రావు వద్దకు బాదితులు వెళ్తే ఆ సమస్యను నాన్చలేదు. జాప్యం చేయలేదు. చూద్దాం..చేద్దామని దాటేయలేదు. బాదితుల ఆయనకు పిర్యాదు చేసిన వెంటనే సమస్యలు తెలుసుకున్నారు. చిట్ కంపనీల మోసాలు తెలుసుకున్నారు. బాధితుల కష్టాలు విన్నారు. బాధితులకు ముందుకు చిట్ కంపనీ యాజమాన్యాలను పిలిపించారు. వారం, పది రోజుల గడువు మాత్రమే ఇచ్చిన నెల రోజుల్లో దాదాపు బాదితులందరి బకాయిలు వసూలు చేయించి ఇప్పించారు. ప్రజల పక్షాన నిలబడం అంటే ఇది. ప్రజలకు న్యాయం చేయడం అంటే ఇది. అలాగే వరంగల్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి వద్దకు కొన్నేళ్లుగా బాధితులు తిరుగుతూ వున్నారు. ఆయన గత ఎన్నికల్లో ఎమ్మెల్యే అయ్యారు. బాదితులకు న్యాయం చేయాలనుకున్నారు. చేస్తున్నారు. నిజం చెప్పాలంటే నాయిని రాజేందర్‌రెడ్డి గతంలోనే ఎమ్మెల్యే అయితే కూడా బాదితులకు ఐదారేళ్ల ముందే న్యాయం జరిగేదేమో? అంతలా బాధితుల కన్నీళ్లు తుడుస్తున్నారు. ఎన్నికల ముందు ఇదే చిట్ కంపనీలు నాయిని ఓడించే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే నాయినికి వ్యతిరేకంగా ప్రచారం కూడా చేశారు. ఎందుకంటే నాయిని రాజేందర్ రెడ్డి గెలిస్తే బాదితుల పక్షాన నిలుచుంటాడని తెలుసు. అందుకే నాయినిని గెలవకుండా చిట్ కంపనీలు కుట్రలు కూడా చేశాయి. బాధితులు చేసుకున్న పుణ్యం కొద్ది నాయిని రాజేందర్ రెడ్డి గెలిచారు. బాధితులను న్యాయం చేయిస్తున్నారు. అందుకోసం. కషి చేశారు. సిఎం. రేవంత్‌రెడ్డిని అనేకసార్లు కలిశారు. బాదితుల సమస్యలు వివరించారు. రేవంత్‌రెడ్డిని ఒప్పించారు. మంత్రి పొంగులేటి దష్టికి బాదితుల గోడు తీసుకెళ్లారు. స్వయంగా గతంలోనూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా బాదితుల గోడు విన్నారు. అప్ప్పుడు అవకాశం వచ్చింది. సిఎం. రేవంత్‌రెడ్డితో మాట్లాడి, మంత్రి పొంగులేటి జీవో జారీ చేశారు. చిట్ బాదితులు తెలంగాణలో ఎక్కడ వున్నా వారికి న్యాయం జరిగేలా జీవో తెచ్చారు. అది నాయిని రాజేందర్‌రెడ్డి చొరవ వల్ల వచ్చింది. ఆ జీవోను వరంగల్ జిల్లాలో పకడ్బందీగా అమలు చేసేందుకు నాయిని రాజేందర్ రెడ్డి చొరవ తీసుకుంటున్నారు. ఇప్పటికే కొంత మంది బాదితులకు న్యాయం చేయించారు. ఆ వ్యవహారం కొంత కొలిక్కి వస్తోంది. అయితే ఇంకా అనేక కంపనీలు కూడా చిట్ ఖాతాదాలను ఇబ్బందులు పెట్టాయి. ఆ కంపనీల బాదితులకు న్యాయం జరిగేందుకు చొరవ తీసుకుంటున్నారు. చిట్ బాదితుల సమస్యలపై నేటి ధాత్రి కొన్ని సంవత్సరాలుగా అక్షర పోరాటం సాగిస్తూ వస్తోంది. అయినా గత ప్రభుత్వంలో ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఆప్పటి పాలకులు చిట్ భాదితులను పట్టించుకోలేదు. వారి గోడు వినిపించుకోలేదు. కాని ప్రజా ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఇది మంచి పరిణామం. తాజాగా కూడా నేటిధాత్రి కొన్ని వరుస కథనాలు రాసింది. దానికి ఎమ్మెల్యే కూనం నేని సాంబశివరాలు స్పందించారు. నేటిదాత్రి కధనాలను చూశారు. కొత్తగూడెంలో వున్న బాధితులు ఎమ్మెల్యే కూనం నేని సాంబశివరావును కలిసి గోడు వెల్లబోసుకున్నారు. వెంటనే ఆయన ప్రభుత్వానికి ఓ లేఖ రాశారు. చిట్ కంపనీల మోసాలను ఉటంకిస్తూ, బాదితుల సమస్యలు విన్నవిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తరం రాశారు. ఇలా ముగ్గురు ఎమ్మెల్యే స్పందించి బాదితుల పక్షాన నిలుచున్నారు. కాని తెలంగాణ వ్యాప్తంగా వున్న మిగత 116 మంది ఎమ్మెల్యేల కూడా చొరవ తీసుకుంటే బాధితులకు న్యాయం జరగుతుంది. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం చిట్ కంపనీల మోసాలపై సిట్( స్పెషల్ ఇన్వెస్టిగేష్ టీమ్) ను ఏర్పాటు చేస్తే త్వరగా బాదితులకు న్యాయం అందే అవకాశాలున్నాయి. జిల్లాల చిట్ రిజిస్ట్రార్లు, చిట్ కంపనీలు ఆడుతున్న నా{కాలన్నీ వెలుగులోకి వస్తాయి. ప్రజల పక్షాన నిలవాల్సిన చిట్ రిజిస్ట్రార్‌లు కొంత మంది చిట్ కంపనీలకు వంత పాడుతున్నాయి. చిట్ కంపనీలు చెప్పినట్లు ఆడుతున్నారు. కమీషన్లకు Å£క్కుర్తిపడిన కొంత డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్లు బాధితులకు మరింత అన్యాయం చేస్తున్నారు. వారి మూలంగా కూడా బాధితులు ఇంకా మోసపోతున్నారు. వరంగల్ లాంటి పెద్ద జిల్లాలో ఇన్‌చార్జి డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ మాత్రమే కొనసాగుతున్నారు. వరంగల్ జిల్లాకు చిట్ రిజిస్ట్రార్‌ను ఎందుకు వేయడంలేదో అధికారులందికీ తెలుసు. ఇవన్నీ వెలుగులోకి రావాలంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌లను ఏర్పాటు చేస్తే అసలు భండారం అంతా బైట పడుతుంది. చిట్ కంపనీలకు సహకరిస్తూ, బాధితులను వంచన చేస్తున్న అధికారుల వివరాలు కూడా వెల్లడౌతాయి. వారు చిట్ కంపనీల నుంచి ఎంత తిన్నారో కూడా తేలిపోతుంది. బాధితులకు చెక్కులు జారీ చేయాల్సిన డిఆర్‌లు చిట్ కంపనీలు సూచించిన వారికే ఎందుకు చెక్‌లు జారీ చేస్తున్నారు? చిట్ కంపనీలు సూచిస్తున్న పేర్లు బాదితులా? కాదా? చిట్ కంపనీలకు చెందిన వ్యక్తులా? కాదా? అనే విషయాలన్నీ వెలుగులోకి వస్తాయి. అందువల్ల చిట్ కంపనీల బాగోతాలన్నీ బైటకు రావాలంటే ప్రభుత్వం సిట్ వేయాలని బాధితులు కోరుతున్నారు. ఎందుకంటే చిట్టిలు కట్టిన పాపానికి గత పదేళ్లుగా నరకం చూస్తున్నారు. రూపాయి, రూపాయి కష్టపడి సంపాంచిన సొమ్మును కంపనీల పాలు చేసి మోసపోయారు. బాదితుల క ష్టం దోచుకొని కంపనీల యాజమాన్యాలు విలాసాలు సాగిస్తున్నారు. చిట్టీలు కట్టిన పాపానికి ఖాతాదారుల కష్టాలు అనుభవిస్తున్నారు. ఎండనక, వాననక కష్టపడి సంపాదించిన సొమ్ము చిట్టీలు కడితే , ఇన్ని కష్టాలొస్తాయని వాళ్లు ఊహించలేదు. ఏజెంట్ల మాటలు నమ్మారు. మోసపోయారు. ఇప్ప్పుడు వారిని ఆదుకోవాలంటే ఒకటే దిక్కు. ప్రభుత్వం జారీ చేసిన జీవో అమలు కావాలంటే ఎమ్మెల్యేలే కరక్టు. ఎందుకంటే వారి మాటలే వ్యవస్ధలో చెల్లుబాటౌతాయి. ఇతర నాయకులు ఎంత చొరవ తీసుకున్నా బాధితులకు న్యాయం జరగదు. ప్రజా ప్రభుత్వంలో తమకు న్యాయం జరుగుతున్న నమ్మకం పెట్టుకున్న బాధితుల పక్షాన ఓ జీవో జారీ అయ్యింది. ప్రభుత్వ లక్ష్యం పేదలకు న్యాయం జరగడం. ఆ న్యాయం చేయడానికి పాలకపక్ష ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలంతా రంగంలోకి దిగాలి. ఒక్క కొత్తగూడం నియోజకవర్గంలోనే కొన్ని వేలమంది బాదితులున్నారంటే , తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని లక్షల మంది బాదితులున్నారో అర్దం చేసుకోవచ్చు. కొన్ని లక్షల కుటుంబాల బాధలు తీర్చడం కంటే గొప్ప పని మరేదీ వుండదు. తెలంగాణ వ్యప్తంగా సుమారు 10లక్షల మంది చిట్ కంపనీల బాదితులుంటారని ఒక అంచనా. ప్రభుత్వంతోపాటు, ఎమ్మెల్యేలు చొరవ తీసుకుంటే ఆ కుటుంబాలకు ఎంతో మేలు చేసిన వారౌతారు. జీవితాంతం వారు ఆ ఎమ్మెల్యేలను గుర్తుంచుకుంటారు. ఈ పదేళ్ల కాలంలో బాధితులు పడిన శ్రమ అంతా ఇంతా కాదు. చిట్టీలు కట్టి కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగిన వారున్నారు. చేస్తున్న పనులు మానుకొని కార్యాలయాల ముందు సాగిలపడిన వారున్నారు. చిట్టీలు కట్టి చితికిపోయిన వారు ఎంతో మంది వున్నారు. ఆఖరుకు కంపనీలే దగ్గరుండి బాదితులను చితికి పంపేలా వున్నారు. బాధితులు కొంత మంది వరంగల్‌లో కంపనీల మందు ఆహుతి అయ్యే ప్రయత్నాలు కూడా చేశారు. అయినా కంపనీలకు జాలి కలగలేదు. జనం సొమ్ము జనానికి ఇవ్వాలని అనుకోలేదు. పైగా కార్యాలయాల ముందుకు వచ్చిన బాదితుల మీద దౌర్జన్యాలు చేశారు. వారిని కొట్టి,తిట్టి కార్యాలయాల ముందు నుంచి గెంటేశారు. ఇలా అనేక అరాచకాలు చేసిన చిట్ కంపనీలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ 287 వ జయంతి ఉత్సవాలలో ఎమ్మెల్యే కలెక్టర్…

సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ 287 వ జయంతి ఉత్సవాలలో ఎమ్మెల్యే కలెక్టర్
వనపర్తి నేటిధాత్రి .

సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 287 వ జయంతి ఉత్సవాలను బుధవారం వనపర్తి జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నాగవరం దగ్గర సేవా లాల్ బంజారా భవన్ లో సాంప్రదాయ బద్ధంగా నిర్వహించారు వనపర్తి జిల్లాలో తాండాల నుండి గిరిజనులు పాల్గొన్నారు ముందుగా సేవాలాల్ మహారాజ్, మేరమ యాడి దేవతకు మహాబోగ్ హోమం కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి, అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖిమ్యా నాయక్, లంబాడి పూజారులు రాజ్ పవార్, బిక్ష్యా నాయక్ తో కలిసి సాంప్రదాయ బద్దంగా హోమంలో నెయ్యి కడావ్ ప్రసాదం వేసి నైవేద్యం సమర్పించారు. జిల్లాలోని సమస్త ప్రజలు ఆయురారోగ్యాలు, ధన ధాన్యాలతో వర్ధిల్లె విధంగా ఆశీర్వదించాలని మొక్కారు అనంతరం జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురబి మాట్లాడుతూ సంత్ సేవాలాల్ మహారాజ్ అందరికీ ఆదర్షప్రాయుడని, జీవ హింస చేయరాదనిఅబద్ధం మాట్లాడవద్దుదొంగతనాలు చేయవద్దు,మాంసాహారం చేయవద్దని బోధించారని గుర్తు చేశారుబంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ చూపిన సన్మార్గాలు ప్రతి ఒక్కరికీ ఆచరణీయమని అన్నారు ఎమ్మెల్యే మేఘా రెడ్డి మాట్లాడుతూ సేవాలాల్ 287వ జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారువనపర్తి నియోజకవర్గానికి రూ.2.68 లక్షలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. దౌర్జన్యానికి వ్యతిరేకంగా బ్రిటిష్ వారితో పోరాటం చేసిన యోధుడని అన్నారు.దొంగతనాలు చేయొద్దు, మాంసాహారం తినొద్దు అని బోధించారని గుర్తు చేశారు
ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ పిసీతారాం నాయక్ గిరిజన అభివృద్ధి అధికారి అధికారులు వనపర్తి మున్సిపల్ చైర్ పర్సన్ మిడిదొడ్డి మాధవి రమేష్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్ మార్కెట్ యార్డు చైర్మన్ బిన్ శ్రీనివాస్ గౌడ్ శంకర్ నాయక్ , గిరిజన సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, గిరిజన ఉద్యోగులు, గిరిజన మహిళలు, విద్యార్థులు, యువత తదితరులు పాల్గొన్నారు

రాష్ట్ర స్థాయి సీఎం కప్ ఖోఖో పోటీలకు ఇస్సిపేట క్రీడాకారుడు…

రాష్ట్ర స్థాయి సీఎం కప్ ఖోఖో పోటీలకు ఇస్సిపేట క్రీడాకారుడు
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

మొగుళ్లపల్లి మండలం ఇస్సిపేట గ్రామానికి చెందిన గాజుల కేదారి, సుజాత కుమారుడు శ్రీ గాజుల మురళి కృష్ణ ఈ నెల 12వ తేదీన భూపాలపల్లి జిల్లా పోటిల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అయినట్లు జిల్లా యువజన క్రీడా అధికారి చిర్ర రఘు, సీనియర్ క్రీడాకారుడు పాడుగుల శివకుమార్, వ్యాయమ ఉపాధ్యయులు, రాజయ్య, అజయ్, సురేష్, ఆనంద్ తెలిపారు, ఈ కార్యక్రమాన్ని ఉద్యేశించి స్థానిక గ్రామ సర్పంచ్ యర ముకుంద రెడ్డి, అభినందనలు తెలిపారు ఈ నెల 20నుండి 23వరకు రాష్ట్ర స్థాయి పోటీలు నల్గొండ లో జరుగుతాయి జిల్లా జట్టు నుండి మంచి ప్రతిభ కనబరిచి రానున్న రోజుల్లో గ్రామానికి జిల్లా కి మంచిపేరు తీసుకురావాలని సీనియర్ క్రీడాకారులు, గ్రామ ప్రజలు మరియు పెద్దలు తెలిపారు

పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్…

పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధతో విద్యార్థుల ప్రతిభను వెలికి తీయాలి

న్యూట్రిషన్ లపై పిల్లలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలి

మహబూబాబాద్/ నేటి ధాత్రి

బుధవారం జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్, మహబూబాబాద్ మండలం పర్వతగిరి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల, కురవి మండలం నేరేడ జడ్.పి.హెచ్.ఎస్ లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు,

ఈ సందర్భంగా పిల్లలకు అందిస్తున్న విద్య బోధనలను స్వయంగా పరిశీలించారు, నూతన టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ తరగతుల ద్వారా విద్యా బోధనలు అందించాలని, రానున్న పదవ తరగతి పరీక్షల్లో అన్ని విద్యాసంస్థలలో ఉత్తమ ఫలితాలు సాధించడం కోసం ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించి విద్యార్థిని విద్యార్థుల యొక్క ప్రతిభను వెలికి తీయాలని సూచించారు,

పిల్లలు, ఉపాధ్యాయుల హాజరు శాతం పక్కాగా ఉండే విధంగా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
నాణ్యమైన డైట్ మెనూ అమలు చేయాలని సూచించారు, హెల్త్, ఎడ్యుకేషన్, న్యూట్రిషన్ లపై పిల్లలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని తెలిపారు,
అంతకుముందు పాఠశాల ఆవరణంలోని కిచెన్ షెడ్ డైనింగ్ హాల్ మరుగుదొడ్లు తరగతి గదులు పరిశీలించారు,
భోజనం సిద్ధం చేసే సిబ్బంది తగిన జాగ్రత్తలు వహిస్తూ ఉండాలని, విద్యార్థిని, విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని తెలిపారు,
మండల ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటన సమయంలో అన్ని సంక్షేమ వసతి గృహాలు, విద్యాసంస్థలను తనిఖీలు నిర్వహించాలనీ సూచించారు.

మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన భారత రాష్ట్ర సమితి నాయకులు కార్యకర్తలు…

మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన భారత రాష్ట్ర సమితి నాయకులు కార్యకర్తలు

ఏటూరునాగారం, నేటిధాత్రి

బుట్టాయిగూడెం బిఆర్ఎస్ మండల నాయకుడు సునార్కాని కొమురయ్య తండ్రి
సునార్కని బతకయ్య 80 వయసు
గత వారం రోజుల క్రితం వృద్ధాప్యం అనారోగ్య కారణాలతో తుది శ్వాస విడిచారు వారి కుటుంబ సభ్యులను ఈరోజు పరామర్శించి ఆయన తండ్రి పెద్దకర్మ కోసం బియ్యం వంట సరుకులు అందజేసి వారి కుటుంబ సభ్యులకు భారత రాష్ట్రసమితి తరపున ప్రగాఢ సానుభూతిని విశ్వాసాన్ని తెలియజేసి వారు ఎక్కడ ఉన్నాఆత్మశాంతి చేకూరాలని దేవుని కృప ఉండాలని కోరుకుంటూ
ఈ కార్యక్రమంలో
సీనియర్ నాయకులు కావేరి చిన్ని కృష్ణ గారు
గ్రామా కమిటి అధ్యక్షులు
దేవర సుధాకర్
మావూరి వెంకటయ్య ఎస్సి సెల్ మండల అధ్యక్షులు
సర్పంచ్
కాంటెస్టుడ్ కొండగుర్ల వెంకటయ్య
జనగాం రవీందర్ మండల నాయకులు
కుమ్మరీ నర్సింగరావు మండల నాయకులు
బోసోలా విజయ్ మండల యూత్ నాయకులు
జనగాం సత్యం మండల నాయకులు
యూత్ నాయకులు దుర్గం రాజు
జనగాం సీతయ్య ప్రజలు
మరియు వాడ పెద్దలు అధిక సంఖ్యలోపాల్గొన్నారు…

జహీరాబాద్ మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కైవసం…

జహీరాబాద్ మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కైవసం

◆ -: పట్టణాభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమని నిరూపించిన ప్రజలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్‌, కాంగ్రెస్ పార్టీతోనే పట్టణాభివృద్ధి సాధ్యమని నమ్మి, మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కట్టబెట్టిన జహీరాబాద్ పట్టణ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్. గిరిధర్‌రెడ్డి,రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ సిద్ధం ఉజ్వల్‌రెడ్డి గార్లు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జహీరాబాద్ ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్యానికి నిదర్శనమని,అభివృద్ధి, పారదర్శక పాలన కోసం ప్రజలు కాంగ్రెస్‌పై ఉంచిన నమ్మకానికి ఇది ప్రతీక అని పేర్కొన్నారు. ఈ ఎన్నికలకు పార్లమెంట్ ఇంచార్జిగా మంత్రివర్యులు అజారుద్దీన్, కో-ఆర్డినేటర్‌గా TMREIS చైర్మన్ మహమ్మద్ ఫహీమ్ ఖురేషి,పార్లమెంట్ సభ్యులు సురేష్‌కుమార్ శెట్కార్‌‌ మార్గదర్శకత్వంలో పక్కా ప్రణాళికతో ముందుకు సాగడం వల్లే మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోగలిగామని వివరించారు.ఈ అద్భుత విజయానికి సహకరించిన కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చంద్రశేఖర్,మాజీ టిజిఐడిసి చైర్మన్ మహ్మద్.తన్వీర్,సిడిసి చైర్మన్,ఆత్మకమిటి చైర్మన్ గార్లకి మరియు పట్టణ&మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,సీనియర్ నాయకులకు,యూత్ కాంగ్రెస్ నాయకులకు జహీరాబాద్ పట్టణ ప్రజల తరపున,పార్టీ కార్యకర్తల తరపున వారు కృతజ్ఞతలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం నుండి పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ, పట్టణంలో మౌలిక సదుపాయాల విస్తరణ, సమగ్ర అభివృద్ధి, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్‌లు సమర్థవంతంగా పనిచేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, ప్రతి వర్గానికి అందుబాటులో ఉంటూ విశ్వసనీయమైన పాలనను అందిస్తామని, జహీరాబాద్ పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వారు హామీ ఇచ్చారు

మహా శివరాత్రి వేడుకలను విజయవంతంగా నిర్వహించిన గ్రామ పంచాయతీ కార్యదర్శి…

మహా శివరాత్రి వేడుకలను విజయవంతంగా నిర్వహించిన గ్రామ పంచాయతీ కార్యదర్శి

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించడానికి గ్రామ పంచాయతీ కార్యదర్శి వీరన్న పటేల్ చేసిన ప్రయత్నాలను ఈ వచనం వివరిస్తుంది. ఆలయ ప్రాంగణంలోని రోజువారీ శుభ్రపరచడాన్ని ఆయన స్వయంగా పర్యవేక్షించారు మరియు ఏవైనా సమస్యలను వెంటనే పరిష్కరించారు.
శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలకు గ్రామ పంచాయతీ కార్యదర్శి వీరన్న పటేల్ ఏర్పాట్లు సజావుగా నిర్వహించారు.ఆయన ఆలయ ప్రాంగణంలో పారిశుద్ధ్య కార్మికులతో రోజువారీ శుభ్రపరిచే కార్యకలాపాలను నిర్వహించారు.పండుగ సమయంలో తలెత్తే అన్ని చిన్న సమస్యలను ఆయన ముందుగానే పరిష్కరించారు.భక్తులకు మరియు ఆలయానికి సేవ చేసే అవకాశం లభించినందుకు పటేల్ సంతోషం వ్యక్తం చేశారు.

ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో అక్రమ కేసులపై తాహసిల్దార్ కి వినతిపత్రం…

ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో అక్రమ కేసులపై తాహసిల్దార్ కి వినతిపత్రం.

కల్వకుర్తి/ నేటి ధాత్రి:

 

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో ఉప్పల వెంకటేష్ పాపిశెట్టి రామకృష్ణ లపై పెట్టిన అక్రమ కేసులను బే షరతుగా వెంటనే ఎత్తివేయాలని కల్వకుర్తి పట్టణంలోని ఆర్యవైశ్యులందరూ స్వచ్ఛందంగా వారి యొక్క వ్యాపార సముదాయాలను మూసివేసి బంద్ పాటించి స్థానిక వాసవి మాత దేవాలయం నుండి తహసిల్దార్ కార్యాలయం వరకు బైక్ లతో ర్యాలీగా వెళ్ళి తహసీల్దార్ కి వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కల్వకుర్తి ఆర్యవైశ్య మహాసభ నాయకులు పట్టణంలోని ఆర్య వైశ్యులు అందరూ పాల్గొన్నారు.

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి…

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.బుధవారం జిల్లాలోని చెన్నూర్  మండలంలో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణ పనులను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యారంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్యను అందించే దిశగా చర్యలు తీసుకుంటుందని,ఈ క్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని తెలిపారు.చెన్నూర్ పట్టణంలో చేపట్టిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణ పనులను పరిశీలించారు.స్థానిక ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుందని,ప్రజలకు అందుబాటులో మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.అమృత్ 2.0 పథకం కింద పట్టణంలో చేపట్టి కొనసాగుతున్న నీటి ట్యాంకుల నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తి  చేసే విధంగా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.అనంతరం ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాల పరిశీలించి పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ కు అభినందనల వెల్లువ…

మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ కు అభినందనల వెల్లువ

కేసముద్రం/ నేటి ధాత్రి

ఇటీవల ఎన్నికయిన కేసముద్రం మున్సిపాలిటీ నూతన మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ డాక్టర్ అల్లం రమ-నాగేశ్వర్ రావు ను కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని స్టేషన్ కేసముద్రం . ఉప్పరపల్లి రోడ్ ప్రైమరీ స్కూల్ ముందు మెయిన్ రోడ్డులో లోని పెద్దలు బానోతు బిక్షపతి కందుకూరి రవీంద్ర చారి ఎండి సలీం అడప మురళి బెతు కృష్ణమూర్తి కుమార్ ప్రైమరీ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు దేవ్ సింగ్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది. కేసముద్రం మున్సిపాలిటీ ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని, ప్రభుత్వ చొరవ తో ఇంకా మరిన్నీ నిధులు కేసముద్రం కు కేటాయించేలా చూడాలని వైస్ చైర్ పర్సన్ ని కోరుతూ, ఇంకా తమ ప్రాంతంలో గల వివిధ సమస్యలను పరిష్కరించాలని వారికి విన్నవించడం జరిగింది

బిల్లు రద్దు కై ఉద్యమిస్తూనే,చట్టాన్ని రక్షించుకోవాలి..

బిల్లు రద్దు కై ఉద్యమిస్తూనే,చట్టాన్ని రక్షించుకోవాలి

నిజాంపేట్, నేటి ధాత్రి

 

 

 

ఉపాధి హామీ పనులు జరిగే ప్రదేశంలో డి బిఎఫ్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న కూలీల లో కలవడం జరిగింది. ఈ సందర్భంగా సంజీవ్ మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఉపాధి హామీ కూలీల హక్కులను హరిస్తుందని, కూలీల గొంతును నొక్కేందుకే వీబీ గ్రామ్ జీ బిల్లు 2025 ను తీసుకువస్తుందని,
బిల్లు రద్దుకై ఉపాధి హామీ కూలీలు ఐక్యంగా ఉద్యమించి,ఉపాధి హామీ చట్టాన్ని పరిరక్షించుకోవాలని డిబిఎఫ్ జిల్లా అధ్యక్షులు కూలీలకు పిలుపునిచ్చారు.
సోమవారం నాడు నిజాంపేట మండలం వెంకటాపూర్ కె గ్రామంలో ఉపాధి హామీ పనుచేస్తున్న కూలీలను కలిసి చట్టానికి జరిగే నష్టాలను వివరిస్తూ చట్టాన్ని కాపాడుకోవాలని కోరారు.
కేంద్రములో అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఉపాధి హామీ చట్టాన్ని అడుగడుగున ఉల్లంఘింస్తూ కూలీల హక్కులను పూర్తిగా తీసివేస్తూ పనికి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తుందని అన్నారు.
ఉపాధి హామీ చట్టాన్ని యదవిధంగా కొనసాగించాలని
కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
దేశంలో వామపక్షాలు, సామాజిక శక్తుల తివ్రమైన ఒత్తిడితో వచ్చిన యంజి ఎన్ అర్ ఇజిఎను తీసివేసేందుకు బిజెపి ప్రయత్నం చేస్తుందని అన్నారు.
కూలీలకు పని హక్కులను కల్పించిన మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి విబి గ్రామ్ జి బిల్లు 2025 పేరుతో కేంద్ర ప్రభుత్వం ముందుకు రాబోతుందన్నారు.
దేశంలో రైతాంగ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా దేశంలోని రైతాంగం ఐక్య పోరాటం చేసి నల్ల చట్టాలను రద్దు చేసుకున్నారన్నారు.
నాటి రైతుల స్ఫూర్తితో కూలీలు పోరాటం చేసి ఉపాధి హామీ పని హక్కులను రక్షించుకొవాలన్నారు.
దేశ వ్యాప్తంగా 33 కోట్ల కూలీల హక్కులను కాల రాస్తున్న బిజెపికి వ్యతిరేకంగా కూలీలు ఉద్యమించి తమ హక్కులను కాపాడుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సరిత మధుసూదన్ రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ కైలాస్, డి బిఎఫ్ మండల అధ్యక్షులు బ్యాగరీ చంద్రం, ఉపాధి హామీ కూలీలు మహిళలు పాల్గొన్నారు.

పేటకాంగ్రెస్ విజయం వెనుక త్యాగధనులు…

పేటకాంగ్రెస్ విజయం వెనుక త్యాగధనులు,

,,,, రెబల్గా పార్టీకి అన్యాయం కన్నా గెలుపు కోసం త్యాగం,,,,

,,,, ఐక్యమత్యానికి వారీ సహకారం,,,,,,

ఒక్కొక్క గడ్డిపరక ఏనుగుని బంధించినట్టు,,,,,,

విజయానికి వీ రు కూడా భాగస్తులే,,,,

,, అధినాయకుని గౌరవించి మాటకు విలువ ఇచ్చారు,,,,,,

రామాయంపేట ఫిబ్రవరి 18 నేటి ధాత్రి (మెదక్)

 

జిల్లాలో రాష్ట్రంలో కాంగ్రెస్ అనుకున్నట్టు కాకుండా విజయం చాలాచోట్ల దోబూచులాడింది. అధికారం ఉన్న నాయకులు ఉన్న ప్రజల్లో సంశయమైన దోబూచులాట కాంగ్రెస్ ఓటమికి చాలాచోట్ల ఆటంకాలు ఏర్పడ్డాయి మెదక్ జిల్లాలో కూడా బి ఆర్ఎస్ బిజెపి పార్టీలు మెదక్ జిల్లాలోని కాక రాష్ట్రంలో తీవ్రమైన పోటీని బలమైన అభ్యర్థులను మాజీ అధికార పార్టీ అయితే డబ్బులను పెద్ద ఎత్తు న పెట్టి కాంగ్రెస్కు పెద్ద సవాలే విసిరింది రామాయంపేట మున్సిపల్ కు వస్తే అధికారం ఉన్న ఎమ్మెల్యే పదవి ఉన్నా స్థానిక ఎన్నికల్లో గతం నుండి పది సంవత్సరాలుగా అన్ని స్థానిక సంస్థల పదవులను ఏకపక్షంగా సాధించి కాంగ్రెస్ ను పంజరంలో వేసిన ఘనత విఆర్ఎస్ పార్టీ దే గతంలో అనైక్యత పార్టీలో నుండి కోవట్లు టిఆర్ఎస్కు పెద్ద మొత్తంలో ఉండడమే కాకుండా అధినాయకత్వం కూడా లేకపోవడంతో ఎవరికి వారే యమునా తీరే ఇక్కడ ఉన్న నాయకులు పోతే పోనీ నాకేంటి మాకు మాత్రం నాయకత్వానికి లోటు లేదు అనే ధోరణిలో గడిచింది కాబట్టి టిఆర్ఎస్ కు పోటీ లేకుండా సాధించాలన్నది పరిశీలిస్తున్న భావన కానీ మైనంపల్లి మంత్రాంగం అందర్నీ ఏకతాటిపై తీసుకువచ్చి నయాన భయాన ఓకే అభ్యర్థికి విజయానికి సహకరించాలని ఆదేశాలు చాలా బాగా పనిచేశాయి. యువజన కార్యకర్తలు సాకేత్ రెడ్డి పుట్టి నికుల్ తమ కు టికెట్టు ఇచ్చే అవకాశం ఉన్న కేటాయించకపోవడం పట్ల ఏమాత్రం కూడా స్వార్థంతో ఆలోచించకుండా నిస్వార్ధంగా అభ్యర్థుల గెలవడానికి కారణమయ్యారు..పార్టీ ఐక్యమత్యంతో పాటు కోవట్లను కూడా జాగ్రత్తగా గమనిస్తూ వారికి ఎన్నికలు దూరంగా ఉంచడం మరొక ఆలోచన ఇకపోతే అధినాయకత్వానికి గెలిచే సస్తావున్న అభ్యర్థులు కూడా పార్టీ ధ్రువీకరించిన అభ్యర్థులకు పూర్తి సహకారం అందించడమే కాక ముందుండి ఓట్లను సంపాదించడం మరొకటి విజయానికి సాధ్యమైంది రెబ్బలు ఒకటి రెండు చోట్ల ఇతర పార్టీల అనుమతితో నిలబడ్డ వారిని పూర్తిగా ఓడించే ప్రయత్నం పూర్తిగా సఫలమైంది 12వ వార్డులో గతంలో షరాబు శ్యామ్ కుమార్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో బలంగా ఆర్థికంగా గెలిచి సత్తా ఉన్న గతంలో తనతో ఓడిపోయిన పోచమ్మల గణేష్ కు ఛాయిస్ ఇవ్వడం ప్రచారంలో ఉండి కాంగ్రెస్కు బలంగా ఓట్లు తేవడం నిజంగా అతను త్యాగానికి పార్టీ ప్రతిఫలం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒకటో వార్డులో గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి కొన్ని సీట్లలో టిఆర్ఎస్ గాలిని అడ్డుకొని గెలిచి నిలిచిన బుర్ర అనిల్ కుమార్ చైర్మన్ కాండిడేట్ నాగరాజు లావణ్య కు పెద్ద విజయాన్ని సాధించి పెట్టాడు పట్టణ అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నుకోబడ్డ చింతల స్వామి 11 లో అతనికి అవకాశం ఉన్న కాంగ్రెస్ నిలబెట్టిన అభ్యర్థికి పూర్తి న్యాయం చేయడం ఏడో వార్డులో గొలుపర్తి 700 ఓట్లు గ్రామంలోని ఉండడం గత కొన్ని సంవత్సరాలుగా పచ్చంటి రాము పోటీ కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూర్చేదైన చైర్మన్ భర్త నాగరాజుకు త్యాగం చేసి పార్టీకి లాభం చేకూర్చాడు .అందుకే రామాయంపేట మెదక్ జిల్లాలో వేస్తున్న పోటాపోటీ బిఆర్ఎస్ గారికి ఐకమత్యములు మరియు త్యాగాలతో విజయం చేకూర్చడంలో భాగస్వాములు అయ్యారని చెప్పవచ్చు.

బాలికపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష…

బాలికపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష

రూ.50 వేల జరిమానా విధించిన పోక్సో ప్రత్యేక కోర్టు

మహబూబాబాద్/ నేటి ధాత్రి

మారిపెడ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన బాలికపై అత్యాచారం, హత్యకు సంబంధించిన దారుణ ఘటనలో నిందితుడికి మహబూబాబాద్ జిల్లా పోక్సో ప్రత్యేక కోర్టు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.50,000 జరిమానా విధిస్తూ కఠిన తీర్పు వెలువరించింది.

2021 సంవత్సరంలో బాధిత బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మారిపెడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. భారతీయ దండన చట్టం సెక్షన్లు 376(2)( ఎన్), 302 మరియు పోక్సో చట్టం-2012 సెక్షన్ 3 ఆర్/ డబ్ల్యూ 4 కింద కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేపట్టారు.
ఈ కేసులో నిందితుడైన ధర్మసోత్ రాజేష్ (22), తండ్రి మంగీలాల్, ధర్మారం తండా గ్రామం, మారిపెడ మండలం నివాసి అనే వ్యక్తిని కోర్టు దోషిగా నిర్ధారించింది. న్యాయమూర్తి ఎండీ . అబ్దుల్ రఫీ, సెక్షన్ 235(2) ప్రకారం యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.50,000 జరిమానా విధించారు.

ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేలా పోలీస్ అధికారులు ఎంతో శ్రమించి, ప్రతి ఆధారాన్ని శాస్త్రీయంగా సేకరించి, సాక్ష్యాలను పకడ్బందీగా సమర్పించారు. అప్పుడు దర్యాప్తు అధికారిగా పనిచేసిన సాగర్, సీఐ మారిపెడ ఘటనకు సంబంధించిన ప్రతి అంశాన్ని సూక్ష్మంగా పరిశీలించి, సాక్ష్యాలను బలంగా రూపొందించారు. కోర్టు లైజన్ అధికారిగా ఎన్ . జీనత్ (ఎస్.ఐ –డీసీఆర్బి ) కోర్టు ప్రక్రియలో సమన్వయం నిర్వహించారు. బ్రీఫింగ్ అధికారిగా ఎస్ . రాజ్‌కుమార్ గౌడ్, సీఐ – మారిపెడ సమగ్ర మార్గదర్శకత్వం అందించారు. కేసు డాక్యుమెంటేషన్ బాధ్యతలను సి.హెచ్ శ్రీనివాస్ (హెడ్ కానిస్టేబుల్–1777) సమర్థంగా నిర్వహించారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొంపెల్లి వెంకటయ్య బలమైన వాదనలు వినిపించడం ద్వారా కేసు విజయవంతంగా ముగియడానికి కీలక పాత్ర పోషించారు.

పోలీస్ బృందం నిరంతర కృషి, సమన్వయం, పట్టుదల ఫలితంగానే నిందితుడికి కఠిన శిక్ష పడిందని అధికారులు తెలిపారు. బాలలపై జరిగే ఘోర నేరాలకు చట్టపరంగా గట్టి చర్యలు తీసుకుంటామని మహబూబాబాద్ జిల్లా పోలీస్ శాఖ స్పష్టం చేసి ప్రజలలో నమ్మకం పెంచిందని ఈ సందర్భంగా తెలిపారు.

అన్ని మతాల సారం ఒక్కటే..

అన్ని మతాల సారం ఒక్కటే..

◆-: ఘనంగా ‘అలియా ఇవాద్ మసీద్’ ప్రారంభోత్సవం మత సామరస్యాన్ని గౌరవించడం మన కర్తవ్యం

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్: పట్టణంలోని ఆదర్శ్ నగర్లో నూత
నంగా నిర్మించిన ఆలియా జవాద్ మస్జిద్ ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ, మాజీ మంత్రి మరియు జహీరాబాద్ కాంగ్రెస్ ఇంచార్జ్ డా. ఏ. చంద్రశేఖర్, ఎంపీ సురేష్ కుమార్ శెట్కార్, మరియు మున్సిపల్ చైర్మన్ మొహ్మద్ యూనుస్ హాజరయ్యారు. ముఖ్య అతిథులు మస్జీ దీన్ను ప్రారంభించి, ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఆధ్యాత్మిక కేంద్రాలు సమాజంలో శాంతిని, సోద రభావాన్ని పెంపొందిస్తాయని కొనియాడారు. అన్ని మతాలను గౌర విస్తూ సోదరా భావం తో ముందుకు వెళ్లాలని, అన్ని మతాలసారం ఒక్కటే అని అన్నారు. మస్జీద్ నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరినీ షబ్బీర్ అలీ అభినందించారు. జహీరాబాద్ ప్రాంత అభివృద్ధికి, మైనా రిటీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలియా జవాద్ మస్జిద్ కమిటీ అధ్యక్షులు జేజే మీర్ జవీర్అలీ, కమిటీ సభ్యులు, స్థానిక ముస్లిం సోదరులు మరియు పెద్ద సంఖ్యలో మత పెద్దలు పాల్గొన్నారు.

ఇస్తానని మాట చెప్పి మరిపించి మాయ చేశాడని తెలిపారు 2026 మున్సిపాలిటీ…

ఇస్తానని మాట చెప్పి మరిపించి మాయ చేశాడని తెలిపారు 2026 మున్సిపాలిటీ ఎన్నికలలో భాగంగా అన్ని కులాల వారీగా ఎమ్మెల్సీ ఎమ్మెల్యే గారు న్యాయం చేశారని మున్నూరు ఊరగానికి చైర్ పర్సన్ వైశ్యులకు వైస్ చైర్పర్సన్ మైనార్టీలకు ఐదు కౌన్సిలర్ స్థానాలు రెడ్డి వర్గానికి రెండు స్థానాలు బీసీలకు పెద్ద ఎత్తున కౌన్సిలర్ స్థానాలు కల్పించారని తెలిపారు అన్ని కులాల వారికి సన్మా న్యాయం చేసినందుకు ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారికి జిల్లా ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు

మునిసిపల్ ఫలితాలే బేస్…పాత పద్ధతిపై పరిషత్ ఎన్నికలు…

మునిసిపల్ ఫలితాలే బేస్…పాత పద్ధతిపై పరిషత్ ఎన్నికలు

*ఎంపీటీసీ, జడ్పీటీసీ పదవులు రద్దు!*

జహీరాబాద్ నేటి ధాత్రి;

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం జరిగిన మునిసిపల్ ఎన్నికలు కాంగ్రెస్ కి రాజకీయంగా కీలక టర్నింగ్ పాయింట్‌ అయ్యాయి. ఇదే జోష్తో ఎన్నికల పోవాలని ఆలోచన రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణులు రాబోయే మండల, జిల్లా పరిషత్ ఎన్నికల వ్యూహంపై దృష్టి పెట్టాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న వేగవంతమైన నిర్ణయాలు, పరిపాలనలో చూపుతున్న చురుకుదనం, స్థానిక సంస్థలపై ఫోకస్ కారణంగా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. గ్రామ స్థాయి నుండి పట్టణాల వరకు నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ కాంగ్రెస్ ప్రక్షాళన కొనసాగితే, రాబోయే మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో 90 శాతం వరకు విజయం సాధించే అవకాశముందని రాజకీయ వర్గాల అంచనా. ఇక ఎన్నికల విధానంలో కూడా మార్పులపై చర్చ జోరందుకుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ వ్యవస్థకు బదులుగా దాదాపు 35 ఏళ్ల క్రితం అమలులో ఉన్న పరోక్ష ఎన్నికల విధానాన్ని తిరిగి తీసుకురావాలన్న అభిప్రాయం ఈరోజు జరిగే సమావేశాల్లో వినిపిస్తున్నట్టు సమాచారం. ఆ పాత పద్ధతిలో రెండు బ్యాలెట్ పత్రాల ద్వారా మండల పరిషత్, జిల్లా పరిషత్ అధ్యక్షులను ఎన్నుకునే విధానం అమలు చేస్తే క్షేత్ర స్థాయిలో బలమైన నెట్‌వర్క్ కలిగిన కాంగ్రెస్ పార్టీలకు ఈ విధానం వల్ల ప్రయోజనం చేకూరుస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గడిచిన మునిసిపల్ ఎన్నికల ట్రెండ్‌ను బేస్‌గా తీసుకుని పలువురు నాయకులు “ఇదే సరైన పద్ధతి” అంటూ తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారని సమాచారం. పార్టీ కొంత ప్రక్షాళన పూర్తిగా జరిగి, స్థానిక నాయకత్వం మరింత బలోపేతం అయితే కాంగ్రెస్‌కు భారీ రాజకీయ లాభం కలుగుతుందని అంతర్గత చర్చలు సూచిస్తున్నాయి. ఈరోజు జరగనున్న కీలక సమావేశంలో పరిషత్ ఎన్నికల విధానం, సభ్యుల పాత్ర, బ్యాలెట్ విధానం వంటి అంశాలపై స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశముందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీయగా, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల సమీకరణాలు పూర్తిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ శ్రేణులు మాత్రం “పునర్వ్యవస్థీకరణలో చాలా కాలం క్రితం అమలులో ఉన్న పాత ఎన్నికల విధానం” ప్రకారం ఎన్నికల్లోకి వెళ్తే, గ్రామీణ స్థాయిలో పార్టీ మరింత బలపడుతుందని ధీమా కాంగ్రెస్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి,

error: Content is protected !!
Exit mobile version