జహీరాబాద్ మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కైవసం…

జహీరాబాద్ మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కైవసం

◆ -: పట్టణాభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమని నిరూపించిన ప్రజలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్‌, కాంగ్రెస్ పార్టీతోనే పట్టణాభివృద్ధి సాధ్యమని నమ్మి, మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కట్టబెట్టిన జహీరాబాద్ పట్టణ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్. గిరిధర్‌రెడ్డి,రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ సిద్ధం ఉజ్వల్‌రెడ్డి గార్లు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జహీరాబాద్ ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్యానికి నిదర్శనమని,అభివృద్ధి, పారదర్శక పాలన కోసం ప్రజలు కాంగ్రెస్‌పై ఉంచిన నమ్మకానికి ఇది ప్రతీక అని పేర్కొన్నారు. ఈ ఎన్నికలకు పార్లమెంట్ ఇంచార్జిగా మంత్రివర్యులు అజారుద్దీన్, కో-ఆర్డినేటర్‌గా TMREIS చైర్మన్ మహమ్మద్ ఫహీమ్ ఖురేషి,పార్లమెంట్ సభ్యులు సురేష్‌కుమార్ శెట్కార్‌‌ మార్గదర్శకత్వంలో పక్కా ప్రణాళికతో ముందుకు సాగడం వల్లే మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోగలిగామని వివరించారు.ఈ అద్భుత విజయానికి సహకరించిన కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చంద్రశేఖర్,మాజీ టిజిఐడిసి చైర్మన్ మహ్మద్.తన్వీర్,సిడిసి చైర్మన్,ఆత్మకమిటి చైర్మన్ గార్లకి మరియు పట్టణ&మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,సీనియర్ నాయకులకు,యూత్ కాంగ్రెస్ నాయకులకు జహీరాబాద్ పట్టణ ప్రజల తరపున,పార్టీ కార్యకర్తల తరపున వారు కృతజ్ఞతలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం నుండి పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ, పట్టణంలో మౌలిక సదుపాయాల విస్తరణ, సమగ్ర అభివృద్ధి, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్‌లు సమర్థవంతంగా పనిచేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, ప్రతి వర్గానికి అందుబాటులో ఉంటూ విశ్వసనీయమైన పాలనను అందిస్తామని, జహీరాబాద్ పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వారు హామీ ఇచ్చారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version