ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం ఆదర్శప్రాయం…

ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం ఆదర్శప్రాయం
ఎంఎల్ఏ గూడెం మహిపాల్ రెడ్డి

నేటి ధాత్రి, పఠాన్ చెరువు :

మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం ప్రతి ఒక్కరికి
ఆదర్శప్రాయమని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శివాజీ మహారాజ్ 396 వ జయంతినిపురస్కరించుకొని.. పటాన్చెరు మండలం భానూరు గ్రామంలో, ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని ఐనోలు గ్రామాలలో శివాజీ మహారాజ్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివాజీ తన పరిపాలనలో లౌకికవాదానికి పెద్దపీట వేశారని గుర్తు చేశారు. శివాజీ అనుసరించిన పరిపాలన విధానాలు, వ్యక్తిత్వం నేటి తరానికి ఆదర్శప్రాయమని అన్నారు. భవిష్యత్ తరాలకు శివాజీ ఆదర్శాలను అందించాలన్న లక్ష్యంతో నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ గ్రామాలు, పట్టణాల పరిధిలో సొంత నిధులతో విగ్రహాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమాల్లో సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, శంకర్ రెడ్డి, శ్యాంసుందర్ రెడ్డి, రాజి రెడ్డి, శివాజీ జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

తంగళ్ళపల్లి ఎరువులదుకాణంలో అకస్మికతనికి…

తంగళ్ళపల్లి ఎరువులదుకాణంలో అకస్మికతనికి…

తంగళ్ళపల్లి నేటిధాత్రి….

తంగళ్ళపల్లి మండలంలో నీ ఎరువుల దుకాణంలో రాజన్న సిరిసిల్ల జిల్లా.ఇంచార్జ్ జిల్లా కలెక్టర్ గరీమ అగ్రవాల్ ఆకస్మిక అతనికి చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫర్టిలైజర్. యాప్ ద్వారా ప్రవేశపెట్టిన ఎరువుల బుకింగ్ ను రైతులు వినియోగించుకోవాలని. యాప్ ద్వారా ఎందరు రైతులు ఎరువులు బుకింగ్ చేసుకున్నారని ఆరా తీస్తూ యాప్ ద్వారా ఎరువులు కొనుగోలు చేసిన రైతుల వివరాలను .రిజిస్టర్లు.తనిఖీ చేశారు .షాపులోని. స్టాక్ వివరాలు ఈరోజు . వివరాలు ఉదయం స్టాకు వివరాలు పరిశీలించారు అలాగే గోదాములో.ప్రస్తుతం ఉన్న ఎరువుల నిల్వలను అక్కడ ఉన్న సిబ్బందితో .లెక్కింపజేసి అనంతరం రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన .పెర్టిలైజర్ యాప్ రైతుల డౌన్లోడ్ చేసుకోవాలని ఎరువుల బుకింగ్ చేసుకోవాలని మన అన్ని .ఫెర్టిలైజర్ షాపులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వద్ద రైతులకు సహాయం అందించేందుకు హెల్ప్ డెస్క్ ఒక సహాయకుడు ఉంటారని తెలియజేస్తూ.జిల్లాలోని రైతులందరూ యాప్ లోడ్ యూరియా బుక్ చేసుకుని తీసుకోవాలని వ్యవసాయ అధికారులు నిత్యం తమ పరిధిలోని అన్ని ఎరువుల షాపులలో తనిఖీ చేయాలని సూచించారు. యాప్ డౌన్లోడ్ బుకింగ్ విషయంలో రైతులకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని సూచిస్తూ. జిల్లాలోని ఈనెల. 1.వ. తేదీ నుండి ఈరోజు వరకు 92, 735. సంచుల యూరియా వచ్చిందని యాప్ ద్వారా జిల్లాలోని 84 వేల. 68 మంది. రైతులు ఎరువుల కోసం బుకింగ్ చేసుకున్నారని. 79 వేల 948. మంది కొనుగోలు చేయగా. ఇంకా 11694 నిలువ ఉందని. ఇంకా 740. మంది రైతులు యూరియా కోసం బుకింగ్ చేసుకొని ఇంకా తీసుకు వెళ్లలేదని వివరించారు. జిల్లాలో ఎరువుల .కొరతలేదని. జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గరీమ అగ్రవాల్ తెలియజేశారు. ఇట్టి తనిఖీలలో. ADA. ప్రదీప్. త తంగళ్ళపల్లి ఎమ్మార్వో. విజయ ప్రకాష్ రావు. ఫర్టిలైజర్ షాప్ వారు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు

జహీరాబాద్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సరికాదు.

జహీరాబాద్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సరికాదు.

◆-: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు, జిల్లా కలెక్టర్ కు కౌన్సిలర్ స్రవంతి రవి కిరణ్ ఫిర్యాదు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో తీవ్ర అవకతవకలు జరిగాయని, నిబంధనలకు విరుద్ధంగా సాగిన ఈ ఎన్నికను రద్దు చేసి, తిరిగి కొత్తగా ఎన్నిక నిర్వహించాలని వార్డు నంబర్ 27 కౌన్సిలర్ స్రవంతి డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్టీ అధిష్టానం, స్థానిక శాసనసభ్యులు మాణిక్ రావు గారి ఆదేశాల మేరకు గురువారం ఆమె తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదినిని, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావిణ్య కలిసి రాతపూర్వక ఫిర్యాదును అందజేశారు.
ఈ సందర్భంగా స్రవంతి మాట్లాడుతూ తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల నిబంధనలు (2020) ప్రకారం..చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సమయంలో ఓటింగ్ కోసం కౌన్సిలర్ల పేర్లను ఖచ్చితంగా అక్షర క్రమంలో పిలవాలి. అక్షర క్రమం ప్రకారం తన పేరు మొదటి స్థానంలో రావాల్సి ఉండగా, రిటర్నింగ్ అధికారి నిబంధనలను పక్కనబెట్టి తమకు నచ్చిన విధంగా పేర్లను పిలిచారని స్రవంతి ఆరోపించారు.
అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి ప్రయోజనం చేకూర్చేలా ఎన్నికల అధికారులు వ్యవహరించారని, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆమె పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత లోపించిందని దుయ్యబట్టారు.
తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019, సెక్షన్ 14(3), రూల్ 4 నిబంధనలను రిటర్నింగ్ అధికారి ఉల్లంఘించారని, తద్వారా ఈ ఎన్నిక ప్రక్రియ మొత్తం చట్టవిరుద్ధంగా మారిందని ఆమె తన ఫిర్యాదులో వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికైన మొహమ్మద్ యూనుస్ ఎన్నికను తక్షణమే చెల్లనిదిగా ప్రకటించాలని పారదర్శక పద్ధతిలో మళ్ళీ కొత్తగా ఎన్నిక నిర్వహించాలని ఆమె పేర్కొన్నారు. న్యాయం జరిగే వరకు, ప్రజాస్వామ్య విలువలను కాపాడే వరకు తన పోరాటం కొనసాగుతుందని, ఈ విషయంలో ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి విచారణ జరిపించాలని స్రవంతి విజ్ఞప్తి చేశారు.

ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలి…

ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలి

* మల్లారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మూడు చింతలపల్లి పాలకవర్గం

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

ప్రజా సమస్యలను పరిష్కరిస్తూనే అన్ని రంగాల్లో అభివృద్ధిని చేయాలని మాజీ మంత్రి, మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి అన్నారు. మూడు చింతలపల్లి మున్సిపాలిటీకి నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్ జామ్ రవి, వైస్ చైర్మన్ శశిరేఖ లతో పాటు కౌన్సిలర్లు బోయినపల్లి క్యాంపు కార్యాలయంలో గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. మేడ్చల్ ఎమ్మెల్యేగా మూడు చింతలపల్లి అభివృద్ధి కోసం అన్ని విధాల తోడ్పాటు అందించాలని పాలకవర్గ సభ్యులకు కోరారు. అనంతరం నూతనంగా ఎన్నికైన పాలకవర్గాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి సన్మానం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి అనిత, మాజీ సర్పంచ్ ఇస్తారి, మాజీ ఎంపిటిసి నాగరాజు, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, వెంకట నరసింహారెడ్డి, మురళి గౌడ్, సంజీవ, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

హిందూ ఐక్యత వేదిక ఆధ్వర్యంలో శివాజీ చిత్రపటానికి పూలమాలలు.

హిందూ ఐక్యత వేదిక ఆధ్వర్యంలో శివాజీ చిత్రపటానికి పూలమాలలు.

కల్వకుర్తి/ నేటి ధాత్రి :

కల్వకుర్తి మున్సిపాలిటీలో హిందూ ఐక్యత వేదిక ఆధ్వర్యంలోఘనంగా నిర్వహించిన 396వ చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవoగురువారం ఘనంగా జరిపారుఈ సందర్భంగా చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పిoచారు.శివాజీ మహారాజ్ దేశభక్తి, మాట్లాడుతూ, బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడిన మహావీరుడు, స్వరాజ్య స్థాపనకు పునాది వేసిన గొప్ప యోధుడు శివాజీ మహారాజ్ అని పేర్కొన్నారు. చిన్న వయసులోనే స్వరాజ్య స్వప్నాన్ని సాకారం చేసిన నాయకుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారని అన్నారు.
మహిళలకు అత్యున్నత గౌరవం ఇచ్చిన పరిపాలకుడిగా, మత సామరస్యాన్ని కాపాడిన నాయకుడిగా, ప్రజల సంక్షేమం కోసం ప్రాణాలను పణంగా పెట్టిన మహానుభావుడిగా శివాజీ మహారాజ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని తెలిపారు. గెరిల్లా యుద్ధ తంత్రానికి ఆద్యుడిగా, భారత నౌకాదళ పితామహుడిగా ఆయన సేవలను గుర్తుచేశారు.సనాతన ధర్మ పరిరక్షణ కోసం కోటలను నిర్మించి శక్తి సాధనకు శ్రీశైల క్షేత్రాన్ని దర్శించిన సందర్భాలను కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. భవానీ అమ్మవారి ఆశీర్వాదంతో ధర్మ స్థాపనకు కట్టుబడి పనిచేసిన మహానాయకుడు శివాజీ మహారాజ్ అని కొనియాడారు.యువకులు పెద్ద ఎత్తున పాల్గొని జయంతిని విజయవంతం చేశారు. ధైర్యసాహసాలు, పరిపాలనా దక్షత యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. వారి ఆశయాలు, త్యాగస్ఫూర్తి ప్రతి ఒక్కరికీ ప్రేరణగా నిలుస్తాయని తెలిపారు. సమాజ సేవా కార్యక్రమాల ద్వారా మహనీయుల జయంతులను నిర్వహించడం అభినందనీయమని అన్నారు.ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

కొడవటంచ దేవాలయం నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం…

కొడవటంచ దేవాలయం నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం

నూతన పాలక వర్గం సభ్యులు ఐక్యంగా పనిచేయాలి ఎమ్మెల్యే జి ఎస్ ఆర్

భూపాలపల్లి నేటిధాత్రి

గురువారం భూపాలపల్లి నియోజకవర్గం రేగొండ మండలం కొడవటంచ గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరయ్యారు దేవాలయం నూతన చైర్మన్‌గా నాయినేని సంపత్ రావు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి శాలువాతో సన్మానం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, దేవాలయాలు భక్తి, ఆధ్యాత్మికతకు నిలయాలే కాకుండా సమాజానికి సాంస్కృతిక కేంద్రాలుగా నిలుస్తాయని పేర్కొన్నారు. నూతన పాలక వర్గం సభ్యులు ఐక్యంగా పనిచేసి దేవాలయ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.అలాగే భక్తులకు మరింత సౌకర్యాలు కల్పించే దిశగా అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు,గ్రామ పెద్దలు, భక్తులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

నూతన గ్రామ పంచాయతీ భవననిర్మాణానికి ముగ్గు పోసిన…

నూతన గ్రామ పంచాయతీ భవననిర్మాణానికి ముగ్గు పోసిన
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ

ముత్తారం :- నేటి ధాత్రి

 

ఐటి శాఖ మంత్రిదుద్దిళ్ల శ్రీధర్ బాబు
ఆదేశాల మేరకు ముత్తారం మండలం
జిల్లెలపల్లి గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనానికి సంప్రదాయబద్ధంగా మాజీ జడ్పీటీసీ చొప్పరి సధానందం మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ ఆధ్వర్యంలో ముగ్గు పోయడం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గడ్డం రాజేశం మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఉపసర్పంచ్ జన్నె శ్రీవాణి ప్రవీణ్ గ్రామ పంచాయతీ భవనం నిర్మాణం గ్రామ అభివృద్ధికి ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు
ముఖ్య అతిథులుగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఎక్స్ జడ్పీటీసీ చొప్పరి సదానందం , మండల అధ్యక్షులు దొడ్డ బాలాజీ ,వాజిద్ పాషా (మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు), అల్లం కుమారస్వామి (ఓబీసీ సెల్ మండల అధ్యక్షులు) హాజరై గ్రామ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రసంగించి నూతన పంచాయతీ భవనం గ్రామ ప్రజలకు ఎంతో ఉపయోగకరమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వార్డుమెంబెర్స్ గడ్డం గట్టయ్య,చిగురు పోచయ్య, రుద్రవేణ రేవతి-శంకర్, సిద్ద సమ్మయ్య, అనవేన తిరుమల-సాయికుమార్ సీనియర్ నాయకులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు మరియు గ్రామ ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

మున్సిపాలిటీ కార్మికులతో సమానంగా వేతనాలు చెల్లించాలి…

మున్సిపాలిటీ కార్మికులతో సమానంగా వేతనాలు చెల్లించాలి

మున్సిపాలిటీ కమిషనర్ కు వినతి పత్రం

10 వార్డు కౌన్సిలర్ హన్మకొండ శ్రీధర్.

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట విలీన గ్రామాల కార్మికులను మున్సిపాలిటీ కార్మికులుగా గుర్తించి, మున్సిపాలిటీ కార్మికులకు చెల్లిస్తున్న వేతనాలతో పాటు చెల్లించాలని 10 వార్డ్ కౌన్సిలర్ హన్మకొండ శ్రీధర్ అన్నారు.విలీన గ్రామాల కార్మికులతో కలిసి మున్సిపల్ కమిషనర్ గురువారం వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ హన్మకొండ శ్రీధర్ మాట్లాడుతూ నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో 2025 ఫిబ్రవరి 6 తేదీన 8 గ్రామ పంచాయతీలను విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నాటి నుండి నర్సంపేట మున్సిపాలిటీ విలీనమైన 8 గ్రామల కార్మికులు 36 మంది గత సంవత్సర కాలంగా నర్సంపేట మున్సిపాలిటీలో పనిచేస్తున్నారు, విలీనం చేసిన 8 గ్రామల కార్మికులకు మున్సిపాలిటీ కార్మికులకు చెల్లిస్తున్న 16,600 వేతనాన్ని చెల్లించపోవడం దారుణమని అన్నారు.గత సంవత్సరకాలంగా చేస్తున్నది మున్సిపాలిటీ పని అయినప్పటికీ మున్సిపాలిటీ కార్మికులగా గుర్తించకుండా పంచాయతీ కార్మికులకు చెల్లిస్తున్న వేతనాలు చెల్లించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సమస్యను పరిష్కరించాలని 36 మంది కార్మికులు అనేకసార్లు మున్సిపల్ కమిషనర్ కు విన్నవించిన పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వివరించడం సరికాదన్నారు.కొంతమంది మున్సిపాలిటీ అధికారులు మీకు జీతాలు పెంచే ప్రయత్నం చేస్తానని కార్మికుల దగ్గర నుండి డబ్బులు వసూలు చేసి అవినీతికి పాల్పడడం సిగ్గుమాలిన చర్యఅని ఎద్దేవా చేశారు.ఇప్పటికైనా విలీన గ్రామాల కార్మికులను మున్సిపాలిటీ కార్మికులతో సమానంగా పనిచేస్తున్నటువంటి కార్మికులకు 16600 జీతాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
మున్సిపాలిటీ కార్మికుల సౌకర్యాలు అమలు చేయకపోతే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కార్మికులు ఎండీ యాకుబ్, నర్రా కృష్ణ,కొర్ర వీరన్న,నల్ల మహేందర్, ముత్తినేని రమేష్,పోలబోయిన శ్రీను,బొల్ల పరాశరములు,కల్వచర్ల రమణాచారి, జెట్టబోయిన మల్లయ్య కుమ్మరి రాజు తదితరులు పాల్గొన్నారు.

పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి…

పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి

నిజాంపేట: నేటి ధాత్రి

 

గ్రామంలో పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు గ్రామ సర్పంచ్ పొన్నబోయిన ప్రవీణ్ తెలిపారు. నిజాంపేట మండలం రాంపూర్ గ్రామంలో గురువారం పారిశుద్ధ్య కార్మికులు మురికి కాలువలో గల మురికిని తీసేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులు నేపథ్యంలో.. వ్యాధులు ప్రభలకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. రాత్రిపూట దోమలకు పొగ వెయ్యడం జరుగుతుందన్నారు.

రాంపూర్ లో ఉచిత పశు వైద్య శిబిరం…

రాంపూర్ లో ఉచిత పశు వైద్య శిబిరం

నిజాంపేట: నేటి ధాత్రి

 

నిజాంపేట మండలం రాంపూర్ గ్రామంలో గురువారం గ్రామ సర్పంచ్ పొన్నబోయిన ప్రవీణ్, జిల్లా పశు వైద్య గణనభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గ్రామంలో పాడి పశువులకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైద్య అధికారి మణికుమార్ మాట్లాడుతూ.. గర్భ కోశ వ్యాధి నివారణ వ్యాధి టీకాలు రైతులు పశువులకు వేయించాలన్నారు. 90 రోజుల ఎద లక్షణాలను గుర్తించి గోపాల మిత్ర ద్వారా కృత్రిమ గర్భాదారణ చేయించుకోవాలని రైతులకు సూచించారు. 15 రోజుల తర్వాత ఆరు నెలల వరకు నట్ట నివారణ మందులు వాడాలన్నారు.

అగ్ని ప్రమాదంలో వస్తువులు ఇల్లు దహనం….

అగ్ని ప్రమాదంలో వస్తువులు ఇల్లు దహనం….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

తంగళ్ళపల్లి మండలం ఇందిరానగర్ కాలనీలో అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం ప్రకారం తంగళ్ళపల్లి మండలంలోని ఇందిరా నగర్ కాలనీలో వానరాశి. శ్రీనివాస్. అనే వ్యక్తికి చెందిన ఇంటిలో అగ్ని ప్రమాదం జరిగినట్టు సమాచారం ఇంటిలోని రిఫ్రిజిరేటర్ పెళ్లి అగ్గి ప్రమాదం జరిగినట్టు ఆనవాళ్లు ఉన్నాయని ఇంటి వారు తెలియజేశారు అగ్నిప్రమాదం జరిగిన సమయంలో ఇంటిలో ఎవరూ లేరని ఈ సందర్భంగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఇంటిలోని వస్తువులన్నీ కాలి.పోయాయని అలాగే ఇంటిలో 90 వేల నగదు కూడా .కాలిపోయినట్లు. ఇంటి వారు తెలిపారని తెలియజేయడం జరిగిందని. ఇంటిలో షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగినట్లు అనుమానం ఉందని వెంటనే ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పి ఎటువంటి నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు అగ్నిప్రమాద సంఘటనపై పూర్తి వివరాలు సేకరించి తగిన దర్యాప్తు చేపడుతామని సంబంధిత అధికారులు పోలీసులు తెలియజేశారు

శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించిన ఎంపీ కావ్య..

శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించిన ఎంపీ కావ్య

భూపాలపల్లి నేటిధాత్రి

 

రేగొండ మండలం, కొడవటంచ గ్రామంలో ఈ నెల 21వ తేదీన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము పున:ప్రతిష్ఠాపన నేపథ్యంలో గురువారం ఆలయానికి చేరుకున్న వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ తో కలిసి ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ… రేగొండ మండలం కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని తెలంగాణలో రెండవ యాదాద్రిగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ. 12.15 కోట్ల భారీ నిధులతో పునరుద్ధరణ పనులు చేపట్టిందన్నారు. ఇటీవల ఫిబ్రవరి 8న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అభివృద్ధి పనులను, అతిథి గృహాన్ని ప్రారంభించారని తెలిపారు. యాదాద్రి తరహాలో కొడవటంచను తీర్చిదిద్ది, గ్రామీణ పర్యాటక రంగాన్ని, ఆర్థిక ప్రగతిని పెంపొందించడం ప్రభుత్వ లక్ష్యం అని ఎంపీ డా.కడియం కావ్య స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నాయినేని సంపత్ రావు, మాజీ వరంగల్ డిసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ – వరద రాజేశ్వరరావు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

శివాజీ జయంతి వేడుకల్లో గజవాడ లావణ్య సత్కారం..

శివాజీ జయంతి వేడుకల్లో గజవాడ లావణ్య సత్కారం..

రామాయంపేట ఫిబ్రవరి 19 నేటి ధాత్రి (మెదక్)

రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో గురువారం నిర్వహించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు చత్రపతి యువసేన ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. పట్టణంలోని పలు ప్రాంతాల్లో శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ గజవాడ లావణ్యకు నిర్వాహకులు సత్కారం నిర్వహించారు.
జయంతి ఉత్సవాల్లో భాగంగా జరిగిన కార్యక్రమంలో వైస్ చైర్‌పర్సన్ నవనీతతో పాటు పలువురు కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, యువకులు పాల్గొన్నారు. శివాజీ మహారాజ్ ధైర్యసాహసాలు, దేశభక్తి, పరిపాలనా నైపుణ్యం నేటి తరానికి ఆదర్శమని వక్తలు పేర్కొన్నారు. సమాజంలో స్వాభిమానం, స్వాతంత్ర్య భావాలు పెంపొందించడంలో శివాజీ పాత్ర చిరస్మరణీయమని అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా గజవాడ లావణ్య మాట్లాడుతూ, శివాజీ చూపిన స్ఫూర్తితో ప్రజాసేవలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పట్టణాభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం మున్సిపాలిటీ కృషి చేస్తోందని తెలిపారు. యువత శివాజీ ఆదర్శాలను ఆచరణలో పెట్టాలని సూచించారు.
కార్యక్రమం ముగింపులో శివాజీ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సి లర్లు గజవాడ నాగరాజు. దేవుని రంజిత్. రవి.డాకి స్వామి. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చింతల స్వామి. చింతల యాదగిరి. ఎనీశెట్టి అశోక్. రాధా కిషన్ బొందుగుల రాజు. తదితరులు పాల్గొన్నారు.

నల్లగండ్లలో ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు…

నల్లగండ్లలో ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు
​ శివాజీ మహారాజ్ పరాక్రమం అందరికీ స్ఫూర్తిదాయకం: పల్లపు సురేందర్

శేరిలింగంపల్లి, నేటి ధాత్రి

నల్లగండ్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పల్లపు సురేందర్ ఆధ్వర్యంలో స్వరాజ్య స్థాపకుడు, ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రధాన కూడలి వద్ద శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.​ఈ సందర్భంగా పల్లపు సురేందర్ మాట్లాడుతూ.. హిందూ ధర్మ రక్షకుడిగా, అపార ధైర్య సాహసాలకు ప్రతీకగా నిలిచిన శివాజీ మహారాజ్ దేశభక్తి మనందరికీ ఆదర్శమని కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ముఖ్యంగా యువత శివాజీ జీవితం నుంచి స్ఫూర్తి పొంది సమాజ సేవలో ముందుండాలని పిలుపునిచ్చారు. క్రమశిక్షణ, ధైర్యం కలిగిన సమాజం కోసమే శివాజీ నిరంతరం శ్రమించారని ఆయన గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో నల్లగండ్ల గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు మరియు యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఘనంగా ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి వేడుకలు…

ఘనంగా ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి వేడుకలు :

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

శ్రీ శ్రీ ఛత్రపతి శివాజీ మహరాజ్ యువజన సభ్యులకు శివాజీ విగ్రహ ప్రతిష్టాపనకి కాళీ స్థలాన్ని ఇవ్వాలని కోరిన ఛత్రపతి శివాజీ మహరాజ్ యువజన సభ్యుల కోరికమేరకు గ్రామ సర్పంచ్ చింతలగట్టు శివరాజ్ గ్రామకంఠంలోని కొంత కాళీ స్థలాన్ని కొల్లూరు గ్రామ పంచాయతీ అధ్వర్యం లో ఇవ్వడం జరిగింది…ఈ రోజు శివాజీ మహరాజ్ జయంతి సందర్బంగా కాళీ స్థలంలో శివాజీ మహారాజ్ జెండాను ఎగురవేసి పూజ చేసి కొబ్బరికాయలు కొట్టి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు…ఈ కార్యక్రమములో మాజీ ఎంపీటీసీ రాజ్‌కుమార్, గ్రామ సర్పంచ్ చింతలగట్టు శివరాజ్, మాజీ వార్డు సభ్యులు ఎం విష్ణు గ్రామ పెద్దలు మంగలి మొగులయ్య, చింతలగట్టు మొగులయ్య, డప్పూరు రాములు, డప్పూరు బీరప్ప మరియు శివాజీ మహారాజ్ యువజన సంఘ అధ్యక్షులు మరియూ నాయకులు,సభ్యులు యువకులు పాల్గొని శివాజీయహరాజ్ విగ్రహానికి పూలమాల వేసి పూజ చేసి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఛత్రపతి శివాజీ విగ్రహానికి భూమి పూజ, శోభయాత్ర…

ఛత్రపతి శివాజీ విగ్రహానికి భూమి పూజ, శోభయాత్ర

నిజాంపేట: నేటి ధాత్రి

ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి పురస్కరించుకొని నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో శివాజీ విగ్రహానికి భూమి పూజ , శోభయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. శివాజీ హిందూ మత స్థాపన కోసం పోరాటం చేసిన మహా యోధుడని కొనియాడారు. శివాజీ సేవలు మాటల్లో చెప్పలేనివని కొనియాడారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నాతి అంజమ్మ లక్ష్మా గౌడ్, ఉప సర్పంచ్ దేవరాజ్ యాదవ్, మాజీ ఎంపీపీ దేశెట్టి సిద్ధరాములు, వార్డ్ సభ్యులు, చత్రపతి శివాజీ సభ్యులు, గ్రామ పెద్దలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

మున్సిపల్ కమిషనర్ ని కలిసిన నూతన బిఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్ లు….

మున్సిపల్ కమిషనర్ ని కలిసిన నూతన బిఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్ లు*

జహీరాబాద్ నేటి ధాత్రి:

రంజాన్ పండగ సందర్భంగా ఎమ్మెల్యే మాణిక్ రావు గారి ఆదేశాల మేరకు ప్రజల సౌకర్యార్థం పట్టణంలో తగు ఏర్పాట్లు చేయాలని ,ముఖ్యంగా ప్రార్థన మందిరాల వద్ద పరిశుభ్రత,స్ట్రీట్ లైట్ లు,రోడ్లు యొక్క మరమత్తులు ,ప్రతి రోజు త్రాగు నీరు సరఫరా, పండగ రోజు ఈద్గా వద్ద భద్రత ఏర్పాట్లకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఈరోజు నూతన బిఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్ లు మున్సిపల్ కమిషనర్ గారిని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లు 4వ వార్డ్ కౌన్సిలర్ స్వప్న – ప్రవీణ్ కుమార్ ,5వ వార్డ్ కౌన్సిలర్ ప్రేమలత శంకర్ రెడ్డి, 9వ వార్డ్ కౌన్సిలర్ పాండు ముదిరాజ్,11 వ వార్డ్ కౌన్సిలర్ గౌస్ఉద్దీన్ గోరి 12 వ వార్డ్ కౌన్సిలర్ తంజీమ్,20వ వార్డ్ కౌన్సిలర్ విజయ రాజు 24 వ వార్డ్ కౌన్సిలర్ పర్వీన్ జహాన్ యాకూబ్ ,31 వ వార్డ్ కౌన్సిలర్ జహీద్,32 వ వార్డ్ కౌన్సిలర్ సుజిత విశ్వేశ్వర్, 35 వ వార్డ్ కౌన్సిలర్ పర్వీన్ బేగం అబ్దుల్లా ,మైనారిటీ నాయకులు హంజా తదితరులు పాల్గొన్నారు..

పెరిగిన బంగారం ధరలు..

పెరిగిన బంగారం ధరలు..

దేశంలో బంగారం ధరలు ఇవాళ పెరిగాయి. 24క్యారెట్ల బంగారం మీద గ్రాముకు రూ.229 పెరిగింది. 22 క్యారెట్ల బంగారం గ్రాముకు నిన్నటి ధరతో పోలిస్తే రూ.210 ఎక్కువైంది.

 నిన్న, మొన్న స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఇవాళ (గురువారం) పెరిగాయి. దేశంలో 24 క్యారెట్ల పసిడి ధర గ్రాము రూ.15,649గా ఉంది. ఇది నిన్నటి ధరతో పోలిస్తే రూ.229 అధికం. ఇక 22క్యారెట్ల గోల్డ్ రేటు గ్రాము రూ.14,345గా ఉంది. ఇది నిన్నటి ధరతో పోలిస్తే రూ.210 ఎక్కువ. ఇక, 18క్యారెట్ల బంగారం గ్రాము రూ.11,737గా ఉంది. ఇది నిన్నటి ధరతో పోలిస్తే రూ.172 అధికం.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు గ్రాముకు (24 క్యారెట్, 22 క్యారెట్)

హైదరాబాద్ రూ.15,649, రూ.14,345

విజయవాడ రూ.15,649, రూ.14,345

చెన్నై రూ.15,818, రూ.14,500

ముంబై రూ.15,649, రూ.14,345

ఢిల్లీ రూ.15,664, రూ.14,360

కోల్‌కతా రూ.15,649, రూ.14,345

బెంగళూరు రూ.15,649, రూ.14,345

కేరళ రూ.15,649, రూ.14,345

పూణే రూ.15,649, రూ.14,345

గమనిక: ఈ సమాచారం కేవలం పాఠకులకు అవగాహన కోసం మాత్రమే. బంగారం ధరలు పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. అంతేకాదు, నగరాన్ని బట్టి, మేకర్/జ్యువెలర్ ఆధారంగా కొద్దిగా తేడా ఉండవచ్చు. కచ్చితమైన ధరల కోసం స్థానిక బంగారు షాపులతో పోల్చి చూసుకోవాల్సి ఉంటుంది.

సమీప విజయమా… లేక చేజారిన అవకాశం…

సమీప విజయమా… లేక చేజారిన అవకాశం?

రామాయంపేటలో బీజేపీకి ఓట్ల జోరు – సీట్లలో మాత్రం చేదు అనుభవం..

రామాయంపేట ఫిబ్రవరి 19 నేటి ధాత్రి (మెదక్)

రామాయంపేట మున్సిపల్ ఎన్నికల ఫలితాలు స్థానిక రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. ఓట్ల శాతంలో గణనీయమైన పెరుగుదల సాధించినప్పటికీ, సీట్ల పరంగా ఆశించిన ఫలితం రాకపోవడం భారతీయ జనతా పార్టీ శిబిరంలో మిశ్రమ స్పందనకు దారితీసింది. రాజకీయ విశ్లేషకుల మాటల్లో ఇది ఓటమి కాదని, “సమీప విజయాల పరంపర”గా చూడాల్సిన ఫలితమని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఎక్కడ తప్పింది…?

ప్రారంభం నుంచే నియోజకవర్గ ఏర్పాటు, రెవెన్యూ డివిజన్ హోదా, బస్ డిపో నిర్మాణం, పాలిటెక్నిక్, ఐటీఐ వంటి అభివృద్ధి అజెండాలతో ముందుకు వచ్చిన బీజేపీ, ప్రజల్లో చర్చ రేకెత్తించడంలో విజయవంతమైంది. గత ఎన్నికల్లో 4–5 శాతం వద్ద నిలిచిన ఓటు బ్యాంక్‌ను ఈసారి సుమారు 30 శాతానికి చేర్చుకోవడం చిన్న విషయం కాదు. కానీ ఆ ఓటు శాతం సీట్లుగా మారడంలో కీలక లోపం కనిపించింది.
పదో, రెండో, మూడో వార్డుల్లో కేవలం 16, 25, 35 ఓట్ల తేడాతో పరాజయం — ఇవే ఫలితాన్ని మలిచిన మలుపులు. ఆ మూడు సీట్లు దక్కివుంటే మున్సిపల్ పాలకవర్గంలో నిర్ణయాత్మక శక్తిగా ఎదిగే స్థితి ఏర్పడేది. కానీ చివరి నిమిషంలో మద్దతు సమీకరణాలు ఇండియా నేషనల్ కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి వైపు మళ్లడం బీజేపీకి గట్టి దెబ్బగా మారింది.

వ్యూహంలో లోటా… లేక సమీకరణాల్లో మార్పా?

పార్టీ నాయకత్వం సమిష్టిగా కృషి చేసినప్పటికీ, బూత్ స్థాయిలో ప్రత్యక్ష అనుసంధానం మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అభివృద్ధి అంశాలు యువత, విద్యావంతులను ఆకర్షించినా, చివరి క్షణాల్లో ప్రత్యర్థుల బూత్ మేనేజ్‌మెంట్ ఆధిక్యం ఫలితాన్ని తారుమారు చేసింది. ఓటు పెరిగింది… కానీ ఓటును సీటుగా మలిచే రాజకీయ గణితం పూర్తిగా కలిసిరాలేదు.

రాష్ట్ర నాయకత్వం ఫ్యాక్టర్
నియోజకవర్గ పునర్విభజన అంశంలో కేంద్ర మంత్రి G. కిషన్ రెడ్డి కమిటీ చైర్మన్‌గా ఉండటం, మెదక్ ఎంపీ M. రఘునందన్ రావు బీజేపీకి చెందినవారే కావడం పార్టీకి మానసిక బలాన్నిస్తోంది. “నియోజకవర్గం సాధన” అజెండాను మరింత దూకుడుగా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం బీజేపీకి ఉంది.
అయినా సవాలు విసిరిందే….

కాంగ్రెస్, బీఆర్ఎస్ బలంగా ఉన్న రామాయంపేటలో బీజేపీ ప్రతి వార్డులో పోరాట పటిమ ప్రదర్శించింది. సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు కసితో పనిచేసిన తీరు గమనార్హం. ఒకే సీటుతో సరిపెట్టుకున్నప్పటికీ, ఓట్ల శాతం గణనీయంగా పెరగడం రాబోయే రోజుల్లో పార్టీకి పునాది వేస్తుందనే విశ్లేషణ వినిపిస్తోంది.

ఇక ముందేమిటి?

నియోజకవర్గ ఏర్పాటు, రెవెన్యూ డివిజన్, బస్ డిపో నిర్మాణం — ఈ మూడు అంశాలపై ఉద్యమరేఖ గీసుకుని ముందుకు వెళ్లాలని బీజేపీ వ్యూహరచన చేస్తున్నట్టు సమాచారం. అధికార పక్షాన్ని నిలదీయడంలో, ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో పోరాటం చేయడంలో పార్టీ మరింత దూకుడు ప్రదర్శించనుంది.

రామాయంపేట ప్రజల కల — ప్రత్యేక నియోజకవర్గం.

దాన్ని ముందుగా సాధించేది ఏ పార్టీ?

సమాధానం రాబోయే రాజకీయ పరిణామాల్లో దాగి ఉంది.
ఓట్లలో ఊపు తెచ్చుకున్న బీజేపీకి ఇది హెచ్చరికా… లేక హెచ్చరికతో కూడిన అవకాశమా?

రామాయంపేట రాజకీయాలు ఇప్పుడు కొత్త దశలోకి అడుగుపెట్టాయి.

కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలి..

కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలి..

బీసీలకు రూ.20,000 కోట్ల కేటాయింపే న్యాయం..

మెట్టు గంగారాం డిమాండ్..

రామాయంపేట ఫిబ్రవరి 19 నేటి ధాత్రి (మెదక్)

వచ్చే ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ బడ్జెట్‌లో కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీల సంక్షేమానికి రూ.20,000 కోట్లు కేటాయించి చట్టబద్ధమైన బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం మెదక్ జిల్లా గౌరవ అధ్యక్షులు మెట్టు గంగారాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ప్రకటించిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో భాగంగా మహాత్మా జ్యోతిబా పూలే పేరుతో చట్టబద్ధమైన బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేస్తామని, కాంట్రాక్టుల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, బీసీ ఉపాధి కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే ఇప్పటివరకు ఆ హామీలు అమలు కాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
2024-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో బీసీల సంక్షేమానికి రూ.9,200 కోట్లు, 2025-26 బడ్జెట్‌లో రూ.11,405 కోట్లు కేటాయించినప్పటికీ, వాస్తవంగా ప్రతి ఏడాది సుమారు రూ.300 కోట్లు మాత్రమే వినియోగించబడుతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణలో సుమారు 60 శాతం జనాభా బీసీలే ఉన్నప్పటికీ, కేవలం మూడు శాతం నిధులు మాత్రమే కేటాయించడం, అందులోనూ ఒక్క శాతం కూడా పూర్తిస్థాయిలో అభివృద్ధికి వినియోగించకపోవడం దురదృష్టకరమని విమర్శించారు.
ప్రభుత్వం బీసీ సంఘాలతో చర్చించి, రానున్న బడ్జెట్‌లో కామారెడ్డి డిక్లరేషన్‌కు అనుగుణంగా రూ.20,000 కోట్లు కేటాయించి, చట్టబద్ధమైన బీసీ కార్పొరేషన్ ద్వారా అమలు చేయాలని కోరారు. కేటాయించిన ప్రతి రూపాయి కూడా బీసీల అభివృద్ధికే ఖర్చు అయ్యేలా పారదర్శక వ్యవస్థ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
బడ్జెట్‌లో భారీ కేటాయింపులు చేస్తున్నట్లు ప్రకటించి, వాస్తవ ఖర్చుల్లో వెనుకబడటం సరికాదని, ఇప్పటికైనా బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మెట్టు గంగారాం ప్రభుత్వాన్ని కోరారు.

error: Content is protected !!
Exit mobile version