ఉపాధ్యాయురాలిగా ప్రతిభ, గానంతో మన్ననలు పొందుతున్న స్వరూపరాణి
జహీరాబాద్ నేటి ధాత్రి:.
ఝరాసంగం మండలం బిడేకన్న గ్రామ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న కే. స్వరూపరాణి, బోధనలో తన ప్రతిభతో పాటు గాన మాధుర్యంతో అందరి మన్ననలు అందుకుంటున్నారు. ఇటీవల శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి దేవస్థానంలో విడుదలైన ఆడియో, వీడియో ఆల్బంలో ఆమె పాడిన పాటలు విశేష ప్రశంసలు పొందాయి. ఈదులపల్లి గోరఖ్ నాథ్ బృందం స్వరపరిచిన పాటల ఆల్బంలో ఆమె గానానికి ఆలయ కార్యనిర్వాణాధికారి, రాజకీయ నాయకులు ఘనంగా సన్మానించారు. తన అభిమాన ఆశీర్వాదాలతో రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించి ప్రాంతానికి పేరు ప్రఖ్యాతులు తెస్తానని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు..
