బాలికపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష…

బాలికపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష

రూ.50 వేల జరిమానా విధించిన పోక్సో ప్రత్యేక కోర్టు

మహబూబాబాద్/ నేటి ధాత్రి

మారిపెడ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన బాలికపై అత్యాచారం, హత్యకు సంబంధించిన దారుణ ఘటనలో నిందితుడికి మహబూబాబాద్ జిల్లా పోక్సో ప్రత్యేక కోర్టు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.50,000 జరిమానా విధిస్తూ కఠిన తీర్పు వెలువరించింది.

2021 సంవత్సరంలో బాధిత బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మారిపెడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. భారతీయ దండన చట్టం సెక్షన్లు 376(2)( ఎన్), 302 మరియు పోక్సో చట్టం-2012 సెక్షన్ 3 ఆర్/ డబ్ల్యూ 4 కింద కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేపట్టారు.
ఈ కేసులో నిందితుడైన ధర్మసోత్ రాజేష్ (22), తండ్రి మంగీలాల్, ధర్మారం తండా గ్రామం, మారిపెడ మండలం నివాసి అనే వ్యక్తిని కోర్టు దోషిగా నిర్ధారించింది. న్యాయమూర్తి ఎండీ . అబ్దుల్ రఫీ, సెక్షన్ 235(2) ప్రకారం యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.50,000 జరిమానా విధించారు.

ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేలా పోలీస్ అధికారులు ఎంతో శ్రమించి, ప్రతి ఆధారాన్ని శాస్త్రీయంగా సేకరించి, సాక్ష్యాలను పకడ్బందీగా సమర్పించారు. అప్పుడు దర్యాప్తు అధికారిగా పనిచేసిన సాగర్, సీఐ మారిపెడ ఘటనకు సంబంధించిన ప్రతి అంశాన్ని సూక్ష్మంగా పరిశీలించి, సాక్ష్యాలను బలంగా రూపొందించారు. కోర్టు లైజన్ అధికారిగా ఎన్ . జీనత్ (ఎస్.ఐ –డీసీఆర్బి ) కోర్టు ప్రక్రియలో సమన్వయం నిర్వహించారు. బ్రీఫింగ్ అధికారిగా ఎస్ . రాజ్‌కుమార్ గౌడ్, సీఐ – మారిపెడ సమగ్ర మార్గదర్శకత్వం అందించారు. కేసు డాక్యుమెంటేషన్ బాధ్యతలను సి.హెచ్ శ్రీనివాస్ (హెడ్ కానిస్టేబుల్–1777) సమర్థంగా నిర్వహించారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొంపెల్లి వెంకటయ్య బలమైన వాదనలు వినిపించడం ద్వారా కేసు విజయవంతంగా ముగియడానికి కీలక పాత్ర పోషించారు.

పోలీస్ బృందం నిరంతర కృషి, సమన్వయం, పట్టుదల ఫలితంగానే నిందితుడికి కఠిన శిక్ష పడిందని అధికారులు తెలిపారు. బాలలపై జరిగే ఘోర నేరాలకు చట్టపరంగా గట్టి చర్యలు తీసుకుంటామని మహబూబాబాద్ జిల్లా పోలీస్ శాఖ స్పష్టం చేసి ప్రజలలో నమ్మకం పెంచిందని ఈ సందర్భంగా తెలిపారు.

నటుడు దర్శన్కు బెయిల్ ఇవ్వడంపై సుప్రీంకోర్టు.!

నటుడు దర్శన్కు బెయిల్ ఇవ్వడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం

రేణుకాస్వామి హత్య కేసులో నింధితుడిగా ఉన్న హీరో దర్శన్కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ తీర్పుపై సుప్రీం ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. హైకోర్టు తన విచక్షణాధికారాన్ని ఉపయోగించిన విధానంతో తాము ఏకీభవించలేమని చెప్పింది. బెయిల్ ఉత్తర్వుల విషయంలో తాము ఎందుకు జోక్యం చేసుకోకూడదో తెలపాలని నింధుతుడి తరపు లాయర్ ను ప్రశ్నించింది. ఇదిలా ఉంటే రేణుకాస్వామి హత్య కేసులో నింధితుడుగా ఉన్న దర్శన్కు గతేడాది అక్టోబర్ లో మధ్యంతర బెయిల్ ఇవ్వగా డిసెంబర్ 13న కర్నాటక హైకోర్టు రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది. దానిని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. విచారణ జరిపిన సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేసింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version