కొమ్మాల లక్ష్మీనరసింహుడి ఆదాయం 21. 22 లక్షలు…

కొమ్మాల లక్ష్మీనరసింహుడి ఆదాయం 21. 22 లక్షలు

13 హుండీల ఆదాయం 13.39 లక్షలు, వివిధ టికెట్లకు రూ. 7 లక్షల 82 వేల ఆదాయం

సీసీ కెమెరాలు పర్యవేక్షణతో 13 హుండీల లెక్కింపు..

శ్రీరామ నవమి పండుగ వరకు జాతర కొనసాగింపు..ఉత్సవ కమిటీ చైర్మన్ వీరాటి రవీందర్ రెడ్డి

నర్సంపేట,గీసుకొండ,నేటిధాత్రి:

 

కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆదాయం 21 లక్షల 22 వేల 410 రూపాయల ఆదాయం వచ్చింది.వరంగల్ జిల్లా గీసుకొండ మండలం కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం జాతర హుండీల లెక్కింపు ఎండోమెంట్ జిల్లా శాఖ, దేవస్థానం ఈ.వో ప్రసాద్,కొమ్మాల జాతర ఉత్సవ కమిటీ చైర్మన్ వీరాటి రవీందర్ రెడ్డి,దేవాలయ శాశ్వత ధర్మకర్త శ్రీనివాసచార్యులు, కమిటి సభ్యులు,అర్చకులు రామాచార్యులు ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టారు.జనవరి 3 వ తేదీ నుండి జాతర బ్రహ్మోత్సవాల నేపథ్యంలో మార్చి 11 వరకు హుండీలలో భక్తులు వేసిన కానుకలను లెక్కింపు చేశారు. దేవస్థానంలోని 13 హుండీలలో గల కానుకలను 18 బ్యాగులలో ప్యాక్ చేసిన అనంతరం దేవస్థానం పరిధిలోని కళ్యాణ మండపంలో సీసీ కెమెరాల పర్యవేక్షణలో కానుకలను లెక్కించగా శ్రీ రాజరాజేశ్వరి సేవాసమితి ఆధ్వర్యంలో 120 మంది మహిళా సేవకులు కుండీల లెక్కింపులో పాల్గొన్నారు.

అలాగే శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చిన అభక్తులు శ్రీఘ దర్శనం,ప్రత్యేక దర్శనం, కేశవకండనము, జాతరలో అష్టోత్తరము వివిధ టిక్కెట్ల ద్వారా వచ్చిన ఆదాయం లెక్కింపు చేశారు.ఈ సందర్భంగా దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రసాద్ మాట్లాడుతూ కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి జాతర బ్రహ్మోత్సవాలలో భాగంగా జనవరి 3 నుండి మార్చి 11 వరకు దేవస్థానం హుండీలలో భక్తులు వేసిన కానుకలను లెక్కించామని అన్నారు.2 నెలల 8 రోజుల పాటు హుండీలల్లో వచ్చిన ఆదాయం రూ.13 లక్షల 39 వేల 701 రూపాయలను,అలాగే శ్రీఘ దర్శనం,ప్రత్యేక దర్శనం, కేశవకండనము, జాతరలో అష్టోత్తరము వివిధ టిక్కెట్ల ద్వారా వచ్చిన ఆదాయం 7 లక్షల 82 వేల 700 రూపాయలు మొత్తం 21 లక్షల 22 వేల 410 రూపాయల ఆదాయం దేవస్థానం బ్యాంకు అకౌంట్లో జమ చేస్తున్నట్లు తెలిపారు.ఉత్సవ కమిటీలో చైర్మన్ వీరాటి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ దేవాలయానికి వివిధ రూపాల్లో వచ్చిన ఆదాయాన్ని బ్యాంకు ఖాతా లో జమ చేస్తామని అన్నారు. జాతర బ్రహ్మోత్సవాల నేతంలో చంద్రగ్రహణం ప్రభావంతో మొదటగా భక్తులు తక్కువగా ఉన్నప్పటికీ రోజురోజుకు భక్తుల తాకిడి పెరుగుతున్నదని తెలిపారు. ఈ జాతర శ్రీరామనవమి వరకు కొనసాగనున్నట్లు దీనితో దేవస్థానానికి మరింత ఆదాయం పెరిగే అవకాశం ఉన్నదని చైర్మన్ రవీందర్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎండోమెంట్ శాఖ ఇన్స్పెక్టర్ డి.అనిల్ కుమార్,ఉత్సవ కమిటి సభ్యులు అజ్మీర సమ్మయ్య, కందారి సంతోష్, హలావత్ వీరన్న, మంద రమేష్, బధావత్ రమేష్, ఊరుగొండ రాజు, లాడే రాజేశ్వర్ రావు, గోనెల మల్లేష్, మండల నరేష్,మార్తాల రాజు, దుకిరే వినయ్, మామూనూరి వనిత, నాగిరెడ్డి నాగన్న,కొమ్మాల సర్పంచ్ కన్నేబోయిన జమున ప్రవీణ్, దేవాలయ ప్రధాన అర్చకులు విష్ణు,జూనియర్ అసిస్టెంట్ కనకయ్య, పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి రథోత్సవ ఏర్పాట్ల పరిశీలన..

కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి రథోత్సవ ఏర్పాట్ల పరిశీలన..

గీసుకొండ ఎంపీఓ పాక శ్రీనివాసులు

సుమారు నాలుగు లక్షల మంది భక్తుల దర్శనం

*నర్సంపేట/గీసుకొండ,నేటిధాత్రి:

 

వరంగల్ జిల్లా గీసుకొండ మండలం కొమ్మాల లక్ష్మీ నరసింహ స్వామి జాతర ఉత్సవాల్లో భాగంగా శనివారం అంగరంగ వైభవంగా రథోత్సవ కార్యక్రమం చేపట్టనున్న నేపథ్యంలో
గీసుకొండ ఎంపీఓ పాక శ్రీనివాసులు ఉత్సవ కమిటీ చైర్మన్ వీరాటి రవీందర్ రెడ్డితో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. రథోత్సవం జరిగే క్రమంలో భక్తులకు సౌకర్యాలు కలిగించాలని సూచించారు. జాతరలో పారిశుద్ధం లోపించకుండా జాగ్రత్తలు పడాలని తెలిపారు. ఆదివారం భక్తుల రద్దీనీ దృష్టిలో పెట్టుకొని మంచినీటి సౌకర్యం పట్ల సిబ్బందితో పర్యవేక్షించాలని పంచాయతీ కార్యదర్శి శంకర్ రావుకు సూచించారు.

శ్రీ కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి ఉత్సవ కమిటీ చైర్మన్ వీరాటి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటివరకు సుమారు నాలుగు లక్షల మంది భక్తులు లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారన్నారు. రథోత్సవం సందర్భంగా శనివారం రాత్రి ఆదివారం రోజుల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొమ్మాల సర్పంచ్ కన్నేబోయిన జమున ప్రవీణ్, దేవాలయ ప్రధాన అర్చకులు
రామాచార్యులు,ఉత్సవ కమిటీ సభ్యులు ప్రజా ప్రతినిధులు ఉన్నారు.

శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శించుకున్న ఎమ్మెల్యే జీఎస్సార్ దంపతులు…

శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శించుకున్న ఎమ్మెల్యే జీఎస్సార్ దంపతులు

భూపాలపల్లి నేటిధాత్రి

శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు శుక్రవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయ అర్చకులు ఎమ్మెల్యే కి ఆలయ ప్రాంగణంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు.
అనంతరం జగిత్యాల జిల్లా కొండగట్టు లోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని సందర్శించి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు

చంద్ర గ్రహణం సందర్భంగా శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయం ముసివేత…

చంద్ర గ్రహణం సందర్భంగా శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయం ముసివేత

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

2026 మార్చి 3న చంద్రగ్రహణం సందర్బంగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగం గ్రామంలోని శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయాన్ని మూసివేశారు. గ్రహణ సమయానికి ఆరు గంటల ముందు (సుమారుగా ఉదయం 9:00 నుండి సాయంత్రం 7:30 వరకు) ఆలయ తలుపులు మూసివేయబడతాయి మరియు శుద్ధి ఆచారాల తర్వాత మాత్రమే తెరవబడతాయి.

మహా శివరాత్రి వేడుకలను విజయవంతంగా నిర్వహించిన గ్రామ పంచాయతీ కార్యదర్శి…

మహా శివరాత్రి వేడుకలను విజయవంతంగా నిర్వహించిన గ్రామ పంచాయతీ కార్యదర్శి

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించడానికి గ్రామ పంచాయతీ కార్యదర్శి వీరన్న పటేల్ చేసిన ప్రయత్నాలను ఈ వచనం వివరిస్తుంది. ఆలయ ప్రాంగణంలోని రోజువారీ శుభ్రపరచడాన్ని ఆయన స్వయంగా పర్యవేక్షించారు మరియు ఏవైనా సమస్యలను వెంటనే పరిష్కరించారు.
శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలకు గ్రామ పంచాయతీ కార్యదర్శి వీరన్న పటేల్ ఏర్పాట్లు సజావుగా నిర్వహించారు.ఆయన ఆలయ ప్రాంగణంలో పారిశుద్ధ్య కార్మికులతో రోజువారీ శుభ్రపరిచే కార్యకలాపాలను నిర్వహించారు.పండుగ సమయంలో తలెత్తే అన్ని చిన్న సమస్యలను ఆయన ముందుగానే పరిష్కరించారు.భక్తులకు మరియు ఆలయానికి సేవ చేసే అవకాశం లభించినందుకు పటేల్ సంతోషం వ్యక్తం చేశారు.

ఘనంగా శ్రీ సంఘమేశ్వర స్వామి ఆలయంలో శివ పార్వతుల కల్యాణ మహోత్సవం….

ఘనంగా శ్రీ సంఘమేశ్వర స్వామి ఆలయంలో శివ పార్వతుల కల్యాణ మహోత్సవం:

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షెట్కార్ మరియు కర్ణాటక రాష్ట్ర మంత్రి వర్యులు ఈశ్వర్ కాండ్రే శివరాత్రి పండుగ సందర్బంగా శివపార్వతుల కల్యాణ మహోత్సవ కార్యక్రమములో పాల్గోనడం జరిగింది…ఈ మహోత్సవంలో ఝరాసంగం మండల అధ్యక్షులు హనుమంత్ రావు పాటిల్, ఆలయ చైర్మన్ శేఖర్ పాటిల్ , ఆలయం పాలకవర్గం మరియు మండల పెద్దలు, ప్రజాప్రతినిధులు,వివిధ గ్రామ సర్పంచులు,అధ్యక్షులు,నాయకులు,భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని శివపార్వతుల ఆశీర్వాదములు తీస్కున్నారు..

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల కోసం భజన మండలి అనుమతికి వినతిపత్రం…

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల కోసం భజన మండలి అనుమతికి వినతిపత్రం

జహీరాబాద్, నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి వారి దేవస్థానంలో జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భజన మండలి ప్రత్యేక కార్యక్రమాల కోసం అనుమతి కోరుతూ ఒక వినతిపత్రాన్ని దేవస్థాన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌కు అందజేశారు.తుమ్మన్ పల్లి గ్రామానికి చెందిన మల్లిపటిల్ సిద్ధారెడ్డి ఈ వినతిపత్రం ద్వారా తమ గ్రామంలోని “శివ శరన్నే – హేమరెడ్డి మల్లమ్మ” భజన బృందం ద్వారా శైవతత్వాన్ని ప్రతిబింబించే ఆధ్యాత్మిక–సాంప్రదాయ కళాప్రదర్శన నిర్వహించేందుకు ఆలయ ప్రాంగణంలో సమయాన్ని కేటాయించాలని కోరారు.భక్తులకు శైవభక్తి, సాంప్రదాయ కళలను చేరవేయాలనే ఉద్దేశంతో ఈ ప్రదర్శనను మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా నిర్వహించాలనుకుంటున్నట్లు తెలిపింది భజన మండలి. వినతిపత్రాన్ని స్వీకరించిన ఆలయ అధికారులు త్వరలో నిర్ణయం తెలియజేస్తామని వెల్లడించారు.

శివ దీక్ష స్వీకరించిన చిల్లపల్లి గ్రామ స్వాములు…

శివ దీక్ష స్వీకరించిన చిల్లపల్లి గ్రామ స్వాములు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయంలో శివ దీక్ష స్వీకరించిన చిల్లపల్లి స్వాములు ఝరా సంఘం మండలంలోని చిలేపల్లి గ్రామ యువకులు సోమవారం ఉదయం శ్రీ కేతకి సంగమేశ్వర స్వామిని దర్శించుకొని ఆలయ అర్చకుల సమక్షంలో నియమనిష్టాలతో మాలధారణ వేశారు 41 రోజులు పాటు కొనసాగే మండల శివ దీక్షను శివ స్వాములు భక్తిశ్రద్ధలతో ప్రారంభించారు. శివదీక్ష ప్రారంభించిన చీలపల్లి స్వాములు చిలపల్లి గ్రామంలోని శ్రీ సిద్దేశ్వర దేవాలయంలో 41 రోజు పాటు మండల దీక్షను కొనసాగిస్తారు. అక్కడ నాగిరెడ్డి గురుస్వామి గారి ఆధ్వర్యం అనిల్ శివ స్వామి నర్సింలు శివ స్వామి నరేందర్ రెడ్డి శివ స్వామి భాస్కర్ రెడ్డి శివ స్వామి సిద్దు స్వామి సంగమేశ్వ రెడ్డి స్వామి కార్తిక్ స్వామి తదితర స్వాములు ఉంటున్నారు,

భక్తులతో పోటెత్తిన దేవాలయాలు

భక్తులతో పోటెత్తిన దేవాలయాలు
* వివిధ ఆలయాలను దర్శించుకున్న ఎంపీ ఈటెల, డిసిసి ప్రెసిడెంట్ వజ్రేష్ యాదవ్

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి 30 :

 

 

వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులతో దేవాలయాలు కిటకిటలాడాయి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని జిహెచ్ఎంసి ఘట్కేసర్, మూడు చింతలపల్లి మున్సిపల్ పరిధిలోని ఉద్దేమర్రి శ్రీ శివాలయంలో ఎంపీ ఈటెల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, డిసిసి అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్, డిసిసి మాజీ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి, నక్క ప్రభాకర్ గౌడ్, బీజేపీ జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్, మాజీ అధ్యక్షులు విక్రమ్ రెడ్డి, ఏనుగు సుదర్శన్ రెడ్డి,

 

డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, మాజీ సర్పంచులు జాము రవి, విష్ణువర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దోసకాయల వెంకటేష్, ఆలయ కమిటీ చైర్మన్, డైరెక్టర్లు, వివిధ పార్టీలకు చెందిన నేతలు, భక్తులు స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకున్నారు.

ఘనంగా ముక్కోటి వైకుంఠ ఏకాదశి వేడుకలు

ఘనంగా ముక్కోటి వైకుంఠ ఏకాదశి వేడుకలు

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండల కేంద్రం లోని అతి పురాతనమైన ఆరు శతాబ్దాల చరిత్ర గలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాల యంలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారా దర్శన ఏర్పాట్లను వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా దేవాలయ అర్చ కులు ఆరుట్ల కృష్ణమాచార్య ప్రత్యేక పూజలు చేసినారు అర్చకులు మాట్లాడుతూ నెలకు రెండు చొప్పున ఒక సంవత్సరంలో 24 ఏకాదశిలు వస్తాయని అందులో అత్యంత ముఖ్యమైనది వైకుంఠ ఏకాదశి అని ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశి లతో సమాన మని అందుకోసమే ఈ పర్వది నాన్ని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారని అన్నారు. ఈ పూజా కార్యక్రమంలో కార్య క్రమంలో దేవాలయ చైర్మన్ గురుస్వామి సామల బిక్షపతి చిందంరవి, వినుకొండ శంక రాచారి,సామల శంకర్ స్వా ములు కందగట్లరమేష్ సామలనాగరాజు,వనం విశాల్ నామనిశివ,కొత్తపెళ్లి రవీందర్ భాసని బాలకృష్ణ మామిడి రాజు మార్తసుమన్ గట్టు కిషన్ సురేష్ గన్నువేణు, కాంబత్తుల ప్రకాష్, బెరుగు రాజు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

కొడవటంచలో అన్నదాన సత్రములను ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎస్సార్..

కొడవటంచలో అన్నదాన సత్రములను ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎస్సార్

భూపాలపల్లి నేటిధాత్రి

 

రేగొండ మండలం కొడవటంచ శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి ఆలయంలో ఎస్ డీ ఎఫ్ నిధులు రూ.90 లక్షలతో నూతనంగా నిర్మించిన పూజారుల వసతి గృహము అన్నదాన సత్రముల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరై, శాస్త్రోక్తంగా ప్రారంభించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలేకాక సామాజిక సేవకు నిలయాలుగా ఉండాలని తెలిపారు. పూజారుల సౌకర్యార్థం వసతి గృహము ఏర్పాటు చేయడం అభినందనీయమని, అలాగే భక్తులకు అన్నదానం అందించే సత్రం ద్వారా సేవాభావం మరింత పెరుగుతుందన్నారు. ప్రభుత్వం ఆలయాల అభివృద్ధి, పూజారుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని, భవిష్యత్తులో కూడా ఇలాంటి సదుపాయాలు మరింత విస్తరించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బిక్షపతి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఐనవోలు జాతర సమీక్ష సమావేశంలో పాల్గొన్న మంత్రి సురేఖ,ఎమ్మెల్యే నాగరాజు..

ఐనవోలు జాతర సమీక్ష సమావేశంలో పాల్గొన్న మంత్రి సురేఖ,ఎమ్మెల్యే నాగరాజు

హన్మకొండ, నేటిధాత్రి:

 

ఐనవోలు హన్మకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ స్నేహ శభరీష్ అధ్యక్షతన జనవరి నెల 13వ తేదీ నుంచి జరగబోయే ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించిన జాతర సమీక్ష సమావేశంలో అటవీ–పర్యావరణ–దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రివర్యులు కొండ సురేఖతో కలిసి పాల్గొని జాతరలో పటిష్ట ఏర్పాట్లపై అధికారులతో సమీక్షిస్తున్న వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు పాల్గొన్నారు…
అనంతరం ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా గోడ పత్రికను మంత్రి సురేఖ, ఎమ్మెల్యే నాగరాజు, జిల్లా కలెక్టర్, కమిషనర్, అధికారులతో కలిసి ఆవిష్కరించారు…
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ
ఐనవోలు మండలం పరిధిలోని వివిధ గ్రామాల నుంచి స్వామివారి ఊరేగింపుకు వచ్చే డీజేలను 20–30 సంఖ్యకు పరిమితం చేస్తూ కట్టడి చేయాలి.
మహిళలు బట్టలు మార్చుకునేందుకు శాశ్వతంగా బాత్రూమ్ సదుపాయాలు ఏర్పాటు చేయాలి.
ఆలయ పరిసర ప్రాంతాల్లో హైమాస్ట్ (ఐమాక్స్) లైట్లు మరియు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.
జాతర సమయంలో నిర్వహించే షాపుల్లో రాత్రి వేళ ఎవరు నిద్రించకుండా చర్యలు తీసుకోవాలి.
దుకాణదారులు వారికి కేటాయించిన స్థల పరిమితిలోనే వస్తువులు పెట్టేలా కట్టడి చేసి, ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాలి.
ఆలయంలో క్యూఆర్ కోడ్ సౌకర్యం ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు.
ఐనవోలు పరిసర ప్రాంతాల్లో అనుసంధానమయ్యే రోడ్లపై మలుపుల వద్ద సైన్ బోర్డులు, ప్రికాషన్ బోర్డులు ఏర్పాటు చేయాలి.
రోడ్డు ఇరువైపులా ఉన్న ప్రమాదకరమైన చెట్లను తొలగించాలి.
జాతరకు వచ్చే మార్గాల్లో ఉన్న బావులు, మలుపుల దగ్గర హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి.
ఐనవోలు గ్రామ చెరువు చుట్టూ పూర్తి ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి.
ఐనవోలు ఆలయం నుంచి పున్నెల్ క్రాస్ రోడ్డు వరకు వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేక బస్సు ఏర్పాటు చేయాలి.
ఐనవోలు ఆలయ ప్రవేశ ద్వారం మరియు బయటకు వెళ్ళే మార్గాల వద్ద హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలి.
జాతర జరిగే పరిసర ప్రాంతాల్లో డీజేలు పూర్తిగా నిషేధిస్తూ కట్టడి చేయాలి.
జాతర సమయంలో తాగునీటి కొరత లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలి.
అన్నదానం సమయంలో భక్తులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలి.
జాతర పరిసర ప్రాంతాల్లో గుడుంబా, లిక్కర్, గాంజా వంటి మత్తు పదార్థాలు రాకుండా ఎక్సైజ్ శాఖ కఠిన చర్యలు తీసుకోవాలి.
పోలీస్ శాఖ వారు సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టి, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలి.
వీఐపీ దర్శనం చేసుకోవాలనే భక్తులు 500 రూ ప్రత్యేక దర్శన టికెట్‌తోనే దర్శనం చేసుకోవాలి దానిపై ఆలయ ఈవో పకడ్బంది చర్యలు చేపట్టాలి….
అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో ఐనవోలు జాతరను విజయవంతంగా నిర్వహించాలని సూచిస్తూ, విధులను సమర్థవంతంగా నిర్వర్తించిన అధికారులకు తగిన ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు…
ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ చాహత్ వాజ్పాయ్, డీసీపీ అంకిత్ కుమార్, అదనపు కలెక్టర్ వై.వి గణేష్, ఆర్డిఓ రమేష్ రాథోడ్, కుడపీవో అజిత్ రెడ్డి, ఐనవోలు ఆలయ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్ గౌడ్, కమిటీ సభ్యులు ఆలయ ఈవో సుధాకర్, వివిధ శాఖల ఉన్నతాధికారులు అధికారులు తదితరులు పాల్గొన్నారు….

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version