ఎంపీడీవో కార్యాలయాన్ని పరిశీలించిన జడ్పీ సీఈవో….

ఎంపీడీవో కార్యాలయాన్ని పరిశీలించిన జడ్పీ సీఈవో.

నడికూడ,నేటిధాత్రి:

 

హనుమకొండ జిల్లా జడ్పీ సీఈవో రవి నడికూడ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం, తహసిల్దార్ కార్యాలయం ఆవరణలో నిర్మిస్తున్న మోడల్ ఇందిరమ్మ ఇల్లును పరిశీలించారు.ఈ సందర్భంగా ఎంపీడీవో జీ.విమల మాట్లాడుతూ మండల పరిషత్ కార్యాలయం శిథిలావస్థకు చేరుకున్నదని వర్షాలు కురవడంతో పైకప్పు పెచ్చులు వూడి పడుతుండటంతో సిబ్బంది ఆందోళన చెందుతున్నారని సీఈఓ కు వివరించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు ఉచితంగా షూ పంపిణీ.

విద్యార్థులకు ఉచితంగా షూ పంపిణీ.

మరిపెడ నేటిధాత్రి.

మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పరకజాల తండా పూర్వ విద్యార్థి భానోత్ అనిల్ కుమార్, ప్రస్తుతం వారి స్వంత తండ పాఠశాల లోని విద్యార్థులకు షూ పంపిణీ చేశారు. అదేవిధంగా పాఠశాలకు ప్రహరీ గోడ లేక ఇబ్బంది పడుతున్న దృష్ట్యా ప్రహారీగా గ్రీన్ మ్యాట్ ను సైతము బహుకరణ చేసి పెద్ద మనసును చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్పర్సన్ బానోత్ వినోద, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహమ్మద్ . హఫీజర్, సహోపాధ్యాయురాలు గీతా దేవి మరియు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశాంత్, గౌస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ ని అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ మరియు ఉపాధ్యాయ బృందం సత్కరించడం జరిగింది.

గ్రామాల్లో రోజూ పారిశుధ్య నిర్వాహణ చేయాలి

గ్రామాల్లో రోజూ పారిశుధ్య నిర్వాహణ చేయాలి

మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ది ఆంజనేయులు

పరకాల నేటిధాత్రి

 

గ్రామాలల్లో ప్రతిరోజు పారిశుధ్య పనులు చేయించాలని పరకాల ఎంపిడిఓ పెద్ది ఆంజనేయులు అన్నారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభమై వర్షాలు కురిసి నీరు నిలిచి దోమలు వ్యాప్తి చెంది సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అందరు పంచాయతీ కార్యదర్శులు తమ గ్రామాలలో మురికి కాలువలు శుభ్రం చేయడం,దోమల నివారణ మందు పిచికారి చేయడం ఆయిల్ బాల్స్ తయారు చేసి నీరు నిల్వ ఉన్న ప్రాంతాలలో వేయడం లాంటి ముందస్తు చర్యలు తీసుకుని అంటు వ్యాధులు ప్రబలకుండా చూడాలని ప్రజల పట్ల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తే సహించబొమని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు.అలాగే గ్రామాలలో ఎవరైనా జ్వరం తో బాద పడుతున్నట్లు గమనిస్తే వైద్య సిబ్బందికి వెంటనే తెలియ చేయాలని తెలిపారు.

డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం .

డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం

ఇబ్రహీంపట్నం. నేటిధాత్రి

 

 

అంతర్జాతీయ మాదకద్రవ్యా దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్బంగా మండల పరిషత్ ప్రాథమికొన్నత పాఠశాల కోమటి కొండాపూర్ లో విద్యార్థులచే స్కిట్ (నాటిక ) ప్లకార్డ్స్ లను ప్రదర్శించడం జరిగింది. ఈ సందర్బంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రధానోపాధ్యాయులు గడ్డం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నేటి యువత పోకడ చూస్తుంటే జీవితమంటేనే మత్తు. మత్తులోనే వుంది గమ్మత్తు అనుకుంటున్నారు. నిజానికి జీవితమంటే మత్తు కాదు. జీవితాన్ని చిత్తు, చిత్తుగా ఓడించేది మత్తు అనే నిజాన్ని తెలుసుకోవాలి నేటి యువత. ఈ విధంగా యువతరాన్ని దారి మల్లించి చెడు మార్గంలో నడిపిస్తున్న దురాలవాట్లలో గంజాయి, హెరాయిన్, కొకైను, మార్ఫిన్, ఆల్కహాల్ వంటి మాదక ద్రవ్యాల వినియోగం తీవ్రమైనదని తెలిపారు.డ్రగ్స్ వాడినట్టు, అమ్మినట్టు తెలిస్తే మన రాష్ట్రం లో కొత్తగా అమల్లోకి వచ్చిన ఎమర్జెన్సీ నెంబర్ 112 కు తెలిపినట్లైతే తగు చర్యలు తీసుకొంటారని విద్యార్థులకు సూచించారు. చివరగా విద్యార్థులచే డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న మన తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సుధారాణి, విశాల్, నర్మదా, జ్యోష్ణ, రాణి, విద్యార్థులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version