మహా శివరాత్రి వేడుకలను విజయవంతంగా నిర్వహించిన గ్రామ పంచాయతీ కార్యదర్శి…

మహా శివరాత్రి వేడుకలను విజయవంతంగా నిర్వహించిన గ్రామ పంచాయతీ కార్యదర్శి

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించడానికి గ్రామ పంచాయతీ కార్యదర్శి వీరన్న పటేల్ చేసిన ప్రయత్నాలను ఈ వచనం వివరిస్తుంది. ఆలయ ప్రాంగణంలోని రోజువారీ శుభ్రపరచడాన్ని ఆయన స్వయంగా పర్యవేక్షించారు మరియు ఏవైనా సమస్యలను వెంటనే పరిష్కరించారు.
శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలకు గ్రామ పంచాయతీ కార్యదర్శి వీరన్న పటేల్ ఏర్పాట్లు సజావుగా నిర్వహించారు.ఆయన ఆలయ ప్రాంగణంలో పారిశుద్ధ్య కార్మికులతో రోజువారీ శుభ్రపరిచే కార్యకలాపాలను నిర్వహించారు.పండుగ సమయంలో తలెత్తే అన్ని చిన్న సమస్యలను ఆయన ముందుగానే పరిష్కరించారు.భక్తులకు మరియు ఆలయానికి సేవ చేసే అవకాశం లభించినందుకు పటేల్ సంతోషం వ్యక్తం చేశారు.

మహాశివరాత్రి సందర్భంగా కేతకిని దర్శించుకున్న గ్రామ కార్యదర్శి..

మహాశివరాత్రి సందర్భంగా కేతకిని దర్శించుకున్న గ్రామ కార్యదర్శి

జహీరాబాద్ నేతి ధాత్రి:

 

మహా శివరాత్రి సందర్భంగా, ఝరాసంగం గ్రామ పంచాయతీ కార్యదర్శి వీరన్న పటేల్, తన బంధువులు, స్నేహితులు కార్యదర్శులతో కలిసి, సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని ప్రసిద్ధ చెందిన శ్రీ కేతకి సంగమేశ్వర స్వామిని అధికారులతో కలిసి దర్శించుకున్నారు. ఈ పవిత్ర స్థలంలోని జలాశయాల అమృత గుండంలో వారు స్నానాలు చేసి, స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మహా శివరాత్రికి భక్తులు, ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో వచ్చినప్పటికీ, వివిధ గ్రామాల కార్యదర్శులు ప్రత్యేక విధుల్లో పాల్గొని, గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికుల సహాయంతో ఆలయ ప్రాంగణాన్ని శుభ్రంగా ఉంచడంలో, జాతర పరిసరాల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవడంలో, సంగమేశ్వర స్వామి ఆలయం అమృత గుండం పరిశుభ్రంగా ఉంచడంలో కీలక పాత్ర పోషించారు.

కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో భక్తిశ్రద్ధలతో అగ్నిగుండ ప్రవేశం…

కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో భక్తిశ్రద్ధలతో అగ్నిగుండ ప్రవేశం

జహీరాబాద్ నేటి ధాత్రి:

దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఝరాసంగం శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి వారి దేవాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 3వ రోజైనా సోమవారం రాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున 4 గంటలకు స్వామి వారికి మేల్కొల్పు సేవ, సుప్రభాత సేవ, రుద్రాభిషేకం నిర్వహించారు.అనంతరం మహా మంగళహారతి విశేష పూజల అనంతరం మంగళ వాయిద్యాల, పురం‌తుల దండకాలు మధ్య పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులను పల్లకిలో తీసుకెళ్లి వైదిక క్రతువులు, శాస్త్రోక్తంగా వేదమంత్రాల నడుమ సకల దేవతలను ఆహ్వానించి అగ్నిదేవునికి పూజలు నిర్వహించి అగ్నిగుండ ప్రవేశాన్ని ప్రారంభించారు.అనంతరం భారీగా తరలివచ్చిన భక్తులు “ఓం నమః శివాయ.. హర హర మహాదేవ” అనుకుంటూ అగ్నిగుండ ప్రవేశం చేసి మొక్కులు చెల్లించుకున్నారు. కాగా ఈరోజు సాయంత్రం 5 గంటలకు పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి వారి కల్యాణోత్సవం, స్వామి వారి రథోత్సవ కార్యక్రమానికి దేవాలయ ధర్మాదాయ శాఖ, పోలీసు వారు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.a

శ్రీరామలింగేశ్వర అభయాంజనేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు…

శ్రీరామలింగేశ్వర అభయాంజనేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు

మాజీ స్పీకర్,శాసనసభ పక్షనేత ప్రస్తుత ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండలం లక్ష్మారెడ్డి పల్లిలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీరామలింగేశ్వర అభయాంజనేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన మాజీ స్పీకర్,శాసనసభ పక్షనేత ప్రస్తుత ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి.శివరాత్రి జాగరణ లో భాగంగా ఆయన అర్ధరాత్రి లింగోద్భావ కాలంలో ఆలయంలో పూజలు జరిపారు.అనంతరం ఆయన గ్రామస్తులను ఆప్యాయంగా పలకరిస్తూ సంభాషించారు.పలువురు గ్రామస్తులు గ్రామంలోని వల సమస్యలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను అధికారంలో ఉన్నప్పుడు ఈ చిన్న గ్రామాన్ని గ్రామపంచాయతీగా ఏర్పాటు చేశానని,గ్రామ అభివృద్ధికి నిధులు కేటాయించి అభివృద్ధి చేశానని అన్నారు.ఇకపై కూడా ప్రజల సుఖ సంతోషాలు అభివృద్ధి కోసమే తన కృషి ఉంటుందని తెలిపారు.

కథలాపూర్ లో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు…

కథలాపూర్ లో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు

నేటి ధాత్రి కథలాపూర్

 

ఈరోజు మహాశివరాత్రి పురస్కరించుకుని కథలాపూర్ గ్రామంలో శివపార్వతుల కళ్యాణం అనంతరం మహా అన్నప్రసాదాన్ని నిర్వహించారు
ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని కనులారా వీక్షించి తరించారు
ఈ కార్యక్రమంలో పంచాయతీ పాలకవర్గం గ్రామ సర్పంచ్ న్యావనంది శేఖర్ మరియు కథలాపూర్ గ్రామ ఉప సర్పంచ్ చెట్పల్లి ప్రసాద్ మరియు ఇతర పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు

మహాశివరాత్రి సందర్భంగా కోటగుళ్లను సందర్శించిన జిల్లా ఎస్పీ…

మహాశివరాత్రి సందర్భంగా కోటగుళ్లను సందర్శించిన జిల్లా ఎస్పీ

రానున్న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఐపిఎస్

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలంలోని ప్రసిద్ధ కోటగుళ్లను గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, దేవుడి ఆశీస్సులు పొందారు.మహాశివరాత్రి వేడుకల సందర్భంగా ఆలయం వద్ద చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లు బందోబస్తు పై పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని, రద్దీని దృష్టిలో ఉంచుకుని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి సంపత్ రావు,సీఐ కరుణాకర్ రావు,ఎస్సై రేఖ అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు._

కేతకి సంగమేశ్వర స్వామి జాతరకు ముస్తాబు…

కేతకి సంగమేశ్వర స్వామి జాతరకు ముస్తాబు

◆-: హర హర మహాదేవ… శంభో శంకర

◆-: శివయ్యని బ్రహ్మదేవుడే మొగలి పువ్వులతో పూజించిన క్షేత్రం

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం: మహాశివరాత్రి ఉత్సవాలకు జిల్లాలోని శైవక్షేత్రాలు ముస్తాబయ్యాయి. అష్ట తీర్థాల సంగమం, తెలుగు రాష్ట్రాలలో ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రాలలో ప్రసిద్ధిగాంచిన ఝరాసంగం శ్రీ పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి దేవాలయంలో నవాహ్నిక మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. రహదారులలో రంగురంగుల దీపాలను, తోరణాలను ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక నుండి వచ్చే భక్తుల కోసం తాత్కాలిక రోడ్ల మరమ్మతు చేశారు. కలెక్టర్ శరత్ పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే పలు దఫాల అధికారులతో సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేశారు. భక్తుల కోసం మంచినీటి సౌకర్యం, చలువ పందిళ్లు, ప్రత్యేక స్నానపు గదులు, మొబైల్ టాయిలెట్స్, ప్రత్యేక సీసీ కెమెరాలతో పాటు భద్రత, ఆలయ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేసేందుకు ప్రత్యేక టీంలను ఏర్పాట్లు చేశారు. కాగా స్వామివారి గర్భాలయాన్ని బంగారు పూతతో మకర తోరణం చేయించారు.

సంగమేశ్వర స్వామి స్థల పురాణం:

ఝరాసంగ క్షేత్రంలో శివ లింగాన్ని సాక్షాత్తు బ్రహ్మదేవుడు ప్రతిష్టించినట్లు ఇక్కడి స్థల పురాణాల ద్వారా తెలుస్తోంది. కృత యుగంలో సూర్య వంశానికి చెందిన కుపేంద్ర అనే రాజు చర్మ వ్యాధితో బాధ పడుతూ ఉండేవాడు. తన వ్యాధి నివారణకు రాజు చేసిన ప్రయత్నం విఫలమయ్యింది. ఒకానొకప్పుడు రాజు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడున్న కేతకీ వనంలో ఉన్న నీటి గుండంలో స్నానం చేసినప్పుడు అతనికి పూర్తిగా స్వస్థత చేకూరిందట. అదేరోజు రాత్రి రాజుకి సంగమేశ్వర స్వామి కలలో కనిపించి తానక్కడ ఉన్నానని, దానిని వెలికి తీసి ఆలయాన్ని నిర్మించమని ఆదేశించాడట. పరమేశ్వరుని ఆదేశం మేరకు రాజు స్వామికి ఆలయాన్ని కట్టించాడట. అక్కడున్న నీటి కుండాన్ని పుష్కరిణిగా మార్చి దానికి అష్ట తీర్ధమని, అమృత కుండంగా పేరు పెట్టినట్లు ఇక్కడి ఆదారాల ద్వారా అవగతమవుతోంది. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి వారి దివ్య మంగళ లింగ రూపాన్ని దర్శించిన భక్తులు అపూర్వమైన ఆధ్యాత్మికానందానికి లోనవుతారు.

మంజీర నదీతీరంలో వెలసిన ఈ స్వామిని సంగమేశ్వర స్వామి అని పిలుస్తారు. కేతకీ సంగమేశ్వర స్వామిగా పూజలందుకుంటున్న ఈ స్వామిని మొదట బ్రహ్మదేవుడు కేతకీ పుష్పాలతో కేతకి అంటే మొగలి పువ్వులతో పూజించాడట. అందుకనే ఈ స్వామిని కేతకీ సంగమేశ్వర స్వామి అని కొలుస్తున్నారు భక్తులు అని శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది.

11/02/2026 బుధవారం నాడు కేతకీ నహ్వానిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

స్వామివారి కార్యక్రమాలు ఇలా ఉన్నాయి

14/02/2026 శనివారం నాడు శేష వాహన సేవ నిర్వహించనున్నారు.

తేదీ 15/02/2026 ఆదివారం నాడు మహాశివరాత్రి సందర్భంగా రాత్రి 12 గంటల నుండి స్వామివారికి లింగోద్భవ సమయమున స్వామివారికి మహన్యాస రుద్రాభిషేకము.

16/02/2026 సోమవారం నాడు మహా రుద్రాభిషేకం, నంది వాహన సేవ,

17/02/2026 మంగళవారం నాడు ఉదయం తెల్లవారుజామున అగ్నిగుండ ప్రవేశం,

సాయంత్రం;5;30 నిమిషాలకు శివపార్వతుల కళ్యాణోత్సవం, రాత్రి 10 గంటలకు రథోత్సవం. తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

మహాశివరాత్రికి ఏర్పాట్లు పూర్తి: ఆలయ ఈవో శివ రుద్రప్ప

కేతకి ఆలయ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఈవో శివ రుద్రప్ప పేర్కొన్నారు. గతంలో కంటే అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంటుందని అందుకు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు. భక్తుల సహకారంతో బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామన్నారు. రేపటి మహాశివరాత్రి జాగరణ కోసం ఇప్పటికే పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసినట్లు ఆయన వెల్లడించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version