మునిసిపల్ ఫలితాలే బేస్…పాత పద్ధతిపై పరిషత్ ఎన్నికలు…

మునిసిపల్ ఫలితాలే బేస్…పాత పద్ధతిపై పరిషత్ ఎన్నికలు

*ఎంపీటీసీ, జడ్పీటీసీ పదవులు రద్దు!*

జహీరాబాద్ నేటి ధాత్రి;

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం జరిగిన మునిసిపల్ ఎన్నికలు కాంగ్రెస్ కి రాజకీయంగా కీలక టర్నింగ్ పాయింట్‌ అయ్యాయి. ఇదే జోష్తో ఎన్నికల పోవాలని ఆలోచన రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణులు రాబోయే మండల, జిల్లా పరిషత్ ఎన్నికల వ్యూహంపై దృష్టి పెట్టాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న వేగవంతమైన నిర్ణయాలు, పరిపాలనలో చూపుతున్న చురుకుదనం, స్థానిక సంస్థలపై ఫోకస్ కారణంగా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. గ్రామ స్థాయి నుండి పట్టణాల వరకు నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ కాంగ్రెస్ ప్రక్షాళన కొనసాగితే, రాబోయే మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో 90 శాతం వరకు విజయం సాధించే అవకాశముందని రాజకీయ వర్గాల అంచనా. ఇక ఎన్నికల విధానంలో కూడా మార్పులపై చర్చ జోరందుకుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ వ్యవస్థకు బదులుగా దాదాపు 35 ఏళ్ల క్రితం అమలులో ఉన్న పరోక్ష ఎన్నికల విధానాన్ని తిరిగి తీసుకురావాలన్న అభిప్రాయం ఈరోజు జరిగే సమావేశాల్లో వినిపిస్తున్నట్టు సమాచారం. ఆ పాత పద్ధతిలో రెండు బ్యాలెట్ పత్రాల ద్వారా మండల పరిషత్, జిల్లా పరిషత్ అధ్యక్షులను ఎన్నుకునే విధానం అమలు చేస్తే క్షేత్ర స్థాయిలో బలమైన నెట్‌వర్క్ కలిగిన కాంగ్రెస్ పార్టీలకు ఈ విధానం వల్ల ప్రయోజనం చేకూరుస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గడిచిన మునిసిపల్ ఎన్నికల ట్రెండ్‌ను బేస్‌గా తీసుకుని పలువురు నాయకులు “ఇదే సరైన పద్ధతి” అంటూ తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారని సమాచారం. పార్టీ కొంత ప్రక్షాళన పూర్తిగా జరిగి, స్థానిక నాయకత్వం మరింత బలోపేతం అయితే కాంగ్రెస్‌కు భారీ రాజకీయ లాభం కలుగుతుందని అంతర్గత చర్చలు సూచిస్తున్నాయి. ఈరోజు జరగనున్న కీలక సమావేశంలో పరిషత్ ఎన్నికల విధానం, సభ్యుల పాత్ర, బ్యాలెట్ విధానం వంటి అంశాలపై స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశముందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీయగా, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల సమీకరణాలు పూర్తిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ శ్రేణులు మాత్రం “పునర్వ్యవస్థీకరణలో చాలా కాలం క్రితం అమలులో ఉన్న పాత ఎన్నికల విధానం” ప్రకారం ఎన్నికల్లోకి వెళ్తే, గ్రామీణ స్థాయిలో పార్టీ మరింత బలపడుతుందని ధీమా కాంగ్రెస్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి,

బహుజనుల రాజకీయాల ఐక్యతే…

బహుజనుల రాజకీయాల ఐక్యతే
అగ్రవర్ణాల రాజకీయ ఆధిపత్యానికి విరుగుడు…
పొన్నం బిక్షపతి గౌడ్ BSP జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు
మొగులపల్లి నేటి ధాత్రి
మొగుళ్లపల్లి మండల కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన బహుజన్ సమాజ్ పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు పొన్నం బిక్షపతి గౌడ్ గారు హాజరై మాట్లాడుతూ… కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ ఎస్సీ ఎస్టీల ప్రజలను సంక్షేమ పథకాల పేరుతో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంచుతూ అందకారానికి దగ్గర చేస్తున్నాయని విద్య- వైద్యం- గూడు కనీస అవసరాలను తీర్చలేని ప్రభుత్వాలను రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో వారి దొంగ నాటకాలను అరికట్టాలని 42% BC రిజర్వేషన్ల పేరుతో బీసీలను మభ్యపెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించాలని భారత రాజ్యాంగాన్ని మేనిఫెస్టోగా పెట్టుకొని ముందుకు వెళ్తున్న బహుజన్ సమాజ్ పార్టీనీ ఆదరించాలని పార్టీ పునర్నిర్మాణంలో భాగంగా మొగుళ్లపల్లి మండల అధ్యక్షులుగా కళాశ చిరంజీవి మొగుళ్లపల్లి మండల ఉపాధ్యక్షులుగా మురారి మనోజ్ గార్లను ఏకగ్రీవంగా నియామకం చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో బొచ్చు తిరుపతి జయశంకర్ భూపాలపల్లి జిల్లా EC మెంబర్ భూపాలపల్లి నియోజకవర్గ కార్యదర్శి పుల్యాల భగత్ మరియు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version