ఎమ్మెల్యేలకు చిట్ బాధితులు గోడు పట్టదా!

-“నేటిధాత్రి” వార్తకు సిపిఐ ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు స్పందించారు.

-కూనమనేనికి ఉన్న బాధ్యత మిగతా ఎమ్మెల్యేలకు లేదా!

-కళ్ళముందు కష్టాలు పడుతున్న బాధితులు కనిపించడం లేదా!

-ఎమ్మెల్యేల చుట్టూ బాధితులు తిరుగుతున్నా ఎమ్మెల్యేలకు తీరిక లేదా?

-బాధితులకు న్యాయం చేయాలన్న ఉద్దేశ్యం లేదా?

-ముగ్గురు ఎమ్మెల్యేలు తీసుకున్న చొరవ మిగతా ఎమ్మెల్యే లు తీసుకోరా.

-చిట్టీలు కట్టి చితికి పోయారు!

-చిట్ కంపెనీలు బాధితులకు చితి పెర్చుతున్నారు!

-కార్యాలయాల ముందు నిప్పంటిచుకుంటున్న కనికరించడం లేదు.

-చిట్టీలు కట్టిన పాపానికి నరకం చూస్తున్నారు.

-చిట్ కంపెనీలను నమ్మి వేలాది మంది మోసపోయారు.

-నిండా మునిగి దినదిన గండంగా బతుకుతున్నారు.

-చిట్ కంపెనీల యజమానులు విలాసంగా బతుకుతున్నారు.

-విదేశాలు తిరుగుతూ విలసాలు చేస్తున్నారు.

-కంపెనీలు మూసి కోట్లతో పారిపోయారు.

-పొరుగు రాష్ట్రాలలో ఆస్తులు సంపాదించుకున్నారు.

-జనం సొమ్ముతో బంగాళాలు కట్టుకున్నారు.

-జనం సొమ్ము దిగమింగి దివాళా తీశామంటున్నారు.

-ప్రజల సొమ్ముతో జల్సా జీవితాలు గడుపుతున్నారు.

-బాధితులు గోసపడుతున్నా పట్టించుకునే వారు లేరు.

-కొంత మంది ఎమ్మెల్యేలు చొరవ తీసుకున్నారు.

-హరీష్ రావు బాధితుల పక్షాన నిలిచి సొమ్ములిప్పించారు.

-చిట్ బాధితుల ముందు కంపెనీల యాజమాన్యాలను నిలబెట్టారు.

-బాధితులకు దగ్గరుండి న్యాయం జరిపించారు.

-వరంగల్ ఎం ఎల్ ఏ నాయని రాజేందర్ రెడ్డి కొంత చొరవ తీసుకున్నారు.

-నేటిధాత్రి వార్తకు సిపిఐ ఎం ఎల్ ఏ కూనంనేని సాంబశివరావు స్పందించారు.

-కొత్తగూడెం లో వున్న చిట్ ఫండ్ బాధితుల పక్షాన నిలిచారు.

-ప్రభుత్వనికి ఉత్తరం రాశారు.. తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.

-చిట్ కంపెనీల బాధితులు తెలంగాణా మొత్తం వున్నారు.

-అన్ని జిల్లాలలో కలిసి లక్షలాది మంది బాధితులున్నారు.

-మిగతా ఎం ఎల్ ఏ లకు బాధితులు కనిపించడం లేదా.

-బాధితుల గోడు ఆ ఎమ్మెల్యే లకు పట్టదా!

-నేటిధాత్రి వరుస కథనాలు రాస్తున్న ఎమ్మెల్యే లు కదలరా.

-ఎమ్మెల్యే కూనం నేనికి వున్న బాధ్యత మిగతా ఎమ్మెల్యే లకు లేదా!

-లక్షలాది మంది చిట్ బాధితులు రోడ్డు మీద పడ్డ కనిపించడం లేదా.

-ఎమ్మెల్యే లకు బాధితుల బాధలు పట్టవా!

-ప్రభుత్వం చిట్ బాధితుల కోసం జీ వో జారీ చేసిన విషయమైనా ఎమ్మెల్యే లకు తెలుసా?

-బోర్డులు తిప్పేసిన కంపెనీల ఆస్తులు జాప్తు చేసైనా బాధితులకు న్యాయం చేయాలి.

-ప్రభుత్వ లక్ష్యం నెరవేర్చడం కాంగ్రెస్ ఎమ్మెల్యేల బాధ్యత కాదా!

-చిట్ కంపెనీల మీద సిట్ వేసి దర్యాప్తు చేయించండి.

-దశబ్ద కాలంగా జరగని న్యాయం ప్రజా ప్రభుత్వం చేసి చూపించండి.

-సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లు జారీ చేసిన జీ వో అమలుకు ఎమ్మెల్యే లు చొరవ తీసుకోండి.

-జీవితాంతం ఆ బాధితులు కాంగ్రెస్ పార్టీ కి రుణపడి వుంటారు చూసుకోండి.

 

హైదరాబాద్, నేటిధాత్రి: 

 చిట్ కంపనీల మోసాలు, బాదితులు పడుతున్న కష్టాలు, చిట్టి కట్టిన పాపానికి చితికిపోతున్న జీవితాలు తెలంగా ణలో ఎమ్మెల్యేలకు కనిపించడం లేదా? బాధితులు ఎమ్మెల్యేల వద్దకు వచ్చి గోడు వెళ్లబోసుకుంటున్నా కనికరించాలనిపించడ ంలేదా? వారికి న్యాయం చేయాలనిపించడం లేదా? వారి గోడు తీర్చే తీరిక ఎమ్మెల్యేలకు లేకుండాపోయిందా? గడచిన పదేళ్ల కాలంలో నాటి ఎమ్మెల్యేల నుంచి నేటి ఎమ్మెల్యేల దాకా బాదితులు కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఎమ్మెల్యేల కాళ్లా వేళ్లా పడుతున్నారు. అయినా ఎమ్మెల్యేలకు మనసు కరగడం లేదు? బాధితుల పక్షాన నిలిచే సమయం చాలడం లేదు? నిజం చెప్పాలంటే ఎమ్మెల్యేలు తల్చుకుంటే బాదితులకు సొమ్ములు అణాపైసాలతో సహా ఇప్పించొచ్చు. అలా నిరూపించిన ఎమ్మెల్యేలు కూడా వున్నారు. సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్‌రావు వద్దకు బాదితులు వెళ్తే ఆ సమస్యను నాన్చలేదు. జాప్యం చేయలేదు. చూద్దాం..చేద్దామని దాటేయలేదు. బాదితుల ఆయనకు పిర్యాదు చేసిన వెంటనే సమస్యలు తెలుసుకున్నారు. చిట్ కంపనీల మోసాలు తెలుసుకున్నారు. బాధితుల కష్టాలు విన్నారు. బాధితులకు ముందుకు చిట్ కంపనీ యాజమాన్యాలను పిలిపించారు. వారం, పది రోజుల గడువు మాత్రమే ఇచ్చిన నెల రోజుల్లో దాదాపు బాదితులందరి బకాయిలు వసూలు చేయించి ఇప్పించారు. ప్రజల పక్షాన నిలబడం అంటే ఇది. ప్రజలకు న్యాయం చేయడం అంటే ఇది. అలాగే వరంగల్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి వద్దకు కొన్నేళ్లుగా బాధితులు తిరుగుతూ వున్నారు. ఆయన గత ఎన్నికల్లో ఎమ్మెల్యే అయ్యారు. బాదితులకు న్యాయం చేయాలనుకున్నారు. చేస్తున్నారు. నిజం చెప్పాలంటే నాయిని రాజేందర్‌రెడ్డి గతంలోనే ఎమ్మెల్యే అయితే కూడా బాదితులకు ఐదారేళ్ల ముందే న్యాయం జరిగేదేమో? అంతలా బాధితుల కన్నీళ్లు తుడుస్తున్నారు. ఎన్నికల ముందు ఇదే చిట్ కంపనీలు నాయిని ఓడించే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే నాయినికి వ్యతిరేకంగా ప్రచారం కూడా చేశారు. ఎందుకంటే నాయిని రాజేందర్ రెడ్డి గెలిస్తే బాదితుల పక్షాన నిలుచుంటాడని తెలుసు. అందుకే నాయినిని గెలవకుండా చిట్ కంపనీలు కుట్రలు కూడా చేశాయి. బాధితులు చేసుకున్న పుణ్యం కొద్ది నాయిని రాజేందర్ రెడ్డి గెలిచారు. బాధితులను న్యాయం చేయిస్తున్నారు. అందుకోసం. కషి చేశారు. సిఎం. రేవంత్‌రెడ్డిని అనేకసార్లు కలిశారు. బాదితుల సమస్యలు వివరించారు. రేవంత్‌రెడ్డిని ఒప్పించారు. మంత్రి పొంగులేటి దష్టికి బాదితుల గోడు తీసుకెళ్లారు. స్వయంగా గతంలోనూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా బాదితుల గోడు విన్నారు. అప్ప్పుడు అవకాశం వచ్చింది. సిఎం. రేవంత్‌రెడ్డితో మాట్లాడి, మంత్రి పొంగులేటి జీవో జారీ చేశారు. చిట్ బాదితులు తెలంగాణలో ఎక్కడ వున్నా వారికి న్యాయం జరిగేలా జీవో తెచ్చారు. అది నాయిని రాజేందర్‌రెడ్డి చొరవ వల్ల వచ్చింది. ఆ జీవోను వరంగల్ జిల్లాలో పకడ్బందీగా అమలు చేసేందుకు నాయిని రాజేందర్ రెడ్డి చొరవ తీసుకుంటున్నారు. ఇప్పటికే కొంత మంది బాదితులకు న్యాయం చేయించారు. ఆ వ్యవహారం కొంత కొలిక్కి వస్తోంది. అయితే ఇంకా అనేక కంపనీలు కూడా చిట్ ఖాతాదాలను ఇబ్బందులు పెట్టాయి. ఆ కంపనీల బాదితులకు న్యాయం జరిగేందుకు చొరవ తీసుకుంటున్నారు. చిట్ బాదితుల సమస్యలపై నేటి ధాత్రి కొన్ని సంవత్సరాలుగా అక్షర పోరాటం సాగిస్తూ వస్తోంది. అయినా గత ప్రభుత్వంలో ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఆప్పటి పాలకులు చిట్ భాదితులను పట్టించుకోలేదు. వారి గోడు వినిపించుకోలేదు. కాని ప్రజా ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఇది మంచి పరిణామం. తాజాగా కూడా నేటిధాత్రి కొన్ని వరుస కథనాలు రాసింది. దానికి ఎమ్మెల్యే కూనం నేని సాంబశివరాలు స్పందించారు. నేటిదాత్రి కధనాలను చూశారు. కొత్తగూడెంలో వున్న బాధితులు ఎమ్మెల్యే కూనం నేని సాంబశివరావును కలిసి గోడు వెల్లబోసుకున్నారు. వెంటనే ఆయన ప్రభుత్వానికి ఓ లేఖ రాశారు. చిట్ కంపనీల మోసాలను ఉటంకిస్తూ, బాదితుల సమస్యలు విన్నవిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తరం రాశారు. ఇలా ముగ్గురు ఎమ్మెల్యే స్పందించి బాదితుల పక్షాన నిలుచున్నారు. కాని తెలంగాణ వ్యాప్తంగా వున్న మిగత 116 మంది ఎమ్మెల్యేల కూడా చొరవ తీసుకుంటే బాధితులకు న్యాయం జరగుతుంది. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం చిట్ కంపనీల మోసాలపై సిట్( స్పెషల్ ఇన్వెస్టిగేష్ టీమ్) ను ఏర్పాటు చేస్తే త్వరగా బాదితులకు న్యాయం అందే అవకాశాలున్నాయి. జిల్లాల చిట్ రిజిస్ట్రార్లు, చిట్ కంపనీలు ఆడుతున్న నా{కాలన్నీ వెలుగులోకి వస్తాయి. ప్రజల పక్షాన నిలవాల్సిన చిట్ రిజిస్ట్రార్‌లు కొంత మంది చిట్ కంపనీలకు వంత పాడుతున్నాయి. చిట్ కంపనీలు చెప్పినట్లు ఆడుతున్నారు. కమీషన్లకు Å£క్కుర్తిపడిన కొంత డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్లు బాధితులకు మరింత అన్యాయం చేస్తున్నారు. వారి మూలంగా కూడా బాధితులు ఇంకా మోసపోతున్నారు. వరంగల్ లాంటి పెద్ద జిల్లాలో ఇన్‌చార్జి డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ మాత్రమే కొనసాగుతున్నారు. వరంగల్ జిల్లాకు చిట్ రిజిస్ట్రార్‌ను ఎందుకు వేయడంలేదో అధికారులందికీ తెలుసు. ఇవన్నీ వెలుగులోకి రావాలంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌లను ఏర్పాటు చేస్తే అసలు భండారం అంతా బైట పడుతుంది. చిట్ కంపనీలకు సహకరిస్తూ, బాధితులను వంచన చేస్తున్న అధికారుల వివరాలు కూడా వెల్లడౌతాయి. వారు చిట్ కంపనీల నుంచి ఎంత తిన్నారో కూడా తేలిపోతుంది. బాధితులకు చెక్కులు జారీ చేయాల్సిన డిఆర్‌లు చిట్ కంపనీలు సూచించిన వారికే ఎందుకు చెక్‌లు జారీ చేస్తున్నారు? చిట్ కంపనీలు సూచిస్తున్న పేర్లు బాదితులా? కాదా? చిట్ కంపనీలకు చెందిన వ్యక్తులా? కాదా? అనే విషయాలన్నీ వెలుగులోకి వస్తాయి. అందువల్ల చిట్ కంపనీల బాగోతాలన్నీ బైటకు రావాలంటే ప్రభుత్వం సిట్ వేయాలని బాధితులు కోరుతున్నారు. ఎందుకంటే చిట్టిలు కట్టిన పాపానికి గత పదేళ్లుగా నరకం చూస్తున్నారు. రూపాయి, రూపాయి కష్టపడి సంపాంచిన సొమ్మును కంపనీల పాలు చేసి మోసపోయారు. బాదితుల క ష్టం దోచుకొని కంపనీల యాజమాన్యాలు విలాసాలు సాగిస్తున్నారు. చిట్టీలు కట్టిన పాపానికి ఖాతాదారుల కష్టాలు అనుభవిస్తున్నారు. ఎండనక, వాననక కష్టపడి సంపాదించిన సొమ్ము చిట్టీలు కడితే , ఇన్ని కష్టాలొస్తాయని వాళ్లు ఊహించలేదు. ఏజెంట్ల మాటలు నమ్మారు. మోసపోయారు. ఇప్ప్పుడు వారిని ఆదుకోవాలంటే ఒకటే దిక్కు. ప్రభుత్వం జారీ చేసిన జీవో అమలు కావాలంటే ఎమ్మెల్యేలే కరక్టు. ఎందుకంటే వారి మాటలే వ్యవస్ధలో చెల్లుబాటౌతాయి. ఇతర నాయకులు ఎంత చొరవ తీసుకున్నా బాధితులకు న్యాయం జరగదు. ప్రజా ప్రభుత్వంలో తమకు న్యాయం జరుగుతున్న నమ్మకం పెట్టుకున్న బాధితుల పక్షాన ఓ జీవో జారీ అయ్యింది. ప్రభుత్వ లక్ష్యం పేదలకు న్యాయం జరగడం. ఆ న్యాయం చేయడానికి పాలకపక్ష ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలంతా రంగంలోకి దిగాలి. ఒక్క కొత్తగూడం నియోజకవర్గంలోనే కొన్ని వేలమంది బాదితులున్నారంటే , తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని లక్షల మంది బాదితులున్నారో అర్దం చేసుకోవచ్చు. కొన్ని లక్షల కుటుంబాల బాధలు తీర్చడం కంటే గొప్ప పని మరేదీ వుండదు. తెలంగాణ వ్యప్తంగా సుమారు 10లక్షల మంది చిట్ కంపనీల బాదితులుంటారని ఒక అంచనా. ప్రభుత్వంతోపాటు, ఎమ్మెల్యేలు చొరవ తీసుకుంటే ఆ కుటుంబాలకు ఎంతో మేలు చేసిన వారౌతారు. జీవితాంతం వారు ఆ ఎమ్మెల్యేలను గుర్తుంచుకుంటారు. ఈ పదేళ్ల కాలంలో బాధితులు పడిన శ్రమ అంతా ఇంతా కాదు. చిట్టీలు కట్టి కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగిన వారున్నారు. చేస్తున్న పనులు మానుకొని కార్యాలయాల ముందు సాగిలపడిన వారున్నారు. చిట్టీలు కట్టి చితికిపోయిన వారు ఎంతో మంది వున్నారు. ఆఖరుకు కంపనీలే దగ్గరుండి బాదితులను చితికి పంపేలా వున్నారు. బాధితులు కొంత మంది వరంగల్‌లో కంపనీల మందు ఆహుతి అయ్యే ప్రయత్నాలు కూడా చేశారు. అయినా కంపనీలకు జాలి కలగలేదు. జనం సొమ్ము జనానికి ఇవ్వాలని అనుకోలేదు. పైగా కార్యాలయాల ముందుకు వచ్చిన బాదితుల మీద దౌర్జన్యాలు చేశారు. వారిని కొట్టి,తిట్టి కార్యాలయాల ముందు నుంచి గెంటేశారు. ఇలా అనేక అరాచకాలు చేసిన చిట్ కంపనీలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version