సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ 287 వ జయంతి ఉత్సవాలలో ఎమ్మెల్యే కలెక్టర్…

సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ 287 వ జయంతి ఉత్సవాలలో ఎమ్మెల్యే కలెక్టర్
వనపర్తి నేటిధాత్రి .

సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 287 వ జయంతి ఉత్సవాలను బుధవారం వనపర్తి జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నాగవరం దగ్గర సేవా లాల్ బంజారా భవన్ లో సాంప్రదాయ బద్ధంగా నిర్వహించారు వనపర్తి జిల్లాలో తాండాల నుండి గిరిజనులు పాల్గొన్నారు ముందుగా సేవాలాల్ మహారాజ్, మేరమ యాడి దేవతకు మహాబోగ్ హోమం కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి, అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖిమ్యా నాయక్, లంబాడి పూజారులు రాజ్ పవార్, బిక్ష్యా నాయక్ తో కలిసి సాంప్రదాయ బద్దంగా హోమంలో నెయ్యి కడావ్ ప్రసాదం వేసి నైవేద్యం సమర్పించారు. జిల్లాలోని సమస్త ప్రజలు ఆయురారోగ్యాలు, ధన ధాన్యాలతో వర్ధిల్లె విధంగా ఆశీర్వదించాలని మొక్కారు అనంతరం జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురబి మాట్లాడుతూ సంత్ సేవాలాల్ మహారాజ్ అందరికీ ఆదర్షప్రాయుడని, జీవ హింస చేయరాదనిఅబద్ధం మాట్లాడవద్దుదొంగతనాలు చేయవద్దు,మాంసాహారం చేయవద్దని బోధించారని గుర్తు చేశారుబంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ చూపిన సన్మార్గాలు ప్రతి ఒక్కరికీ ఆచరణీయమని అన్నారు ఎమ్మెల్యే మేఘా రెడ్డి మాట్లాడుతూ సేవాలాల్ 287వ జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారువనపర్తి నియోజకవర్గానికి రూ.2.68 లక్షలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. దౌర్జన్యానికి వ్యతిరేకంగా బ్రిటిష్ వారితో పోరాటం చేసిన యోధుడని అన్నారు.దొంగతనాలు చేయొద్దు, మాంసాహారం తినొద్దు అని బోధించారని గుర్తు చేశారు
ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ పిసీతారాం నాయక్ గిరిజన అభివృద్ధి అధికారి అధికారులు వనపర్తి మున్సిపల్ చైర్ పర్సన్ మిడిదొడ్డి మాధవి రమేష్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్ మార్కెట్ యార్డు చైర్మన్ బిన్ శ్రీనివాస్ గౌడ్ శంకర్ నాయక్ , గిరిజన సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, గిరిజన ఉద్యోగులు, గిరిజన మహిళలు, విద్యార్థులు, యువత తదితరులు పాల్గొన్నారు

సద్గురు సేవలాల్ మహరాజ్ సేవలు మరువలేనివి…

సద్గురు సేవలాల్ మహరాజ్ సేవలు మరువలేనివి

బంజారా జాతి ఐక్యం కోసం వివిధ రాష్ట్రాల్లో పర్యటన

జగదాంబ సేనా వరంగల్ జిల్లా అధ్యక్షుడు అజ్మీర యాకుబ్ మహరాజ్

ఘనంగా సేవలాల్ మహరాజ్ 287 వ జయంతి వేడుకలు

వందలాదిగా హాజరైజన గిరిజనులు.

నర్సంపేట,నేటిధాత్రి:

 

బంజారా జాతి గిరిజనుల కోసం గిరిజనుల ఆరాధ్య దైవం సద్గురు సేవలాల్ మహరాజ్ చేసిన సేవలు మరువలేనివని జగదాంబ సేనా వరంగల్ జిల్లా అధ్యక్షుడు అజ్మీర యాకుబ్ మహరాజ్ అన్నారు.సద్గురు సేవలాల్ మహరాజ్ 287 వ జయంతిని పురస్కరించుకొని వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని మేడపల్లి గ్రామ పంచాయతీ శివారు లక్ష్మీతండాలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.అలాగే వారి కుల దైవం భోగ్ బండారో వేడుక సాంప్రదాయ పద్ధతిలో వైభవంగా నిర్వహించారు.జగదాంబ సేనా వరంగల్ జిల్లా అధ్యక్షుడు అజ్మీర యాకుబ్ మహరాజ్
తో పాటు కుటుంబ సభ్యులు,ఆయా గ్రామాల గిరిజనులు వారి సాంప్రదాయ దుస్తుల అలంకరణతో ఆ గ్రామం ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకున్నది.బంజారా సమాజ ఆరాధ్య దైవం సద్గురు సేవలాల్ మహరాజ్ విగ్రహానికి వివిధ రకాల పంచామృత అభిషేకాలు ఘనంగా చేపట్టారు.
భోగ్ బండారో వేడుక నేపధ్యంలో అజ్మీర యాకుబ్ మహరాజ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.నెయ్యితో చేపట్టిన ప్రత్యేక పూజలో అగ్నిజ్వాలలు ఒక్కసారిగా బారీ ఎత్తున వెలువడంతో సాక్షాత్తు వారి దేవతలు నిజస్వరూపం కనిపించిందని భక్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపద్యంలో బంజారా కులదైవాలు,సద్గురు సేవలాల్ మహరాజ్ నామస్మరణతో లక్ష్మీతండా మారుమ్రోగింది.బంజారా మహిళలు వారి సాంప్రదాయ వేషధారణతో పలు ఆధ్యాత్మిక భజనలు చేస్తూ నృత్యాలు చేపట్టారు.
ఈ సందర్భంగా జగదాంబ సేనా వరంగల్ జిల్లా అధ్యక్షుడు అజ్మీర యాకుబ్ మహరాజ్ మాట్లాడుతూ బంజారా ఆరాధ్య దైవం సద్గురు సేవలాల్ మహరాజ్ బోధనలు సమాజంలో ఐక్యత,సేవాభావాలు,నీతి నియమాలు పెంపొందించాయని పేర్కొన్నారు.ప్రస్తుత ఆధునిక సాంకేతిక వలన బంజారా సంప్రదాయాలు రోజురోజుకు వెనకపడుతున్నాయని,కొందరు సాంప్రాయాలను వదిలేసి ఇతర మతాలను ఆశ్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.బంజారా జాతి ఆవిర్భావ ప్రాంతాలైన మహారాష్ట్ర,రాజస్తాన్,కర్ణాటక రాష్ట్రాలలో పర్యటనలు చేస్తూ జాతి విశిష్టత ప్రాముఖ్యత తెలుసుకుంటున్నట్లు అజ్మీర యాకుబ్ మహరాజ్ వివరించారు.ఈ నేపద్యంలో గిరిజన బంజారా జాతి గొప్పతనాన్ని తెలంగాణ రాష్ట్రంలో తెలియపరచడానికి,ఐక్యత పెంపొందించడానికి రాష్ట్ర స్థాయిలో మహా సభలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.బంజారా జాతి సంప్రదాయాల వలన అనేక అద్భుతమైన ఆధ్యాత్మికత కలిగివున్నది అన్నారు.బంజారాలను సన్మార్గంలో నడిపిస్తూ అహింస అహింస సిద్ధాంతాలను ప్రబోధించడమే లక్ష్యమని
జగదాంబ సేనా వరంగల్ జిల్లా అధ్యక్షుడు అజ్మీర యాకుబ్ మహరాజ్ స్పష్టం చేశారు.అనంతరం అన్నదాన వితరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ, అజ్మీర తుల్చ నాయక్,భాస్కర్ నాయక్,మంజుల, అనిల్ నాయక్,వివిధ గ్రామాల ప్రజలు,భక్తులు హాజరయ్యారు.

సంత్ సేవాలాల్‌కు నివాళులర్పించిన సీఎం చంద్రబాబు..

సంత్ సేవాలాల్‌కు నివాళులర్పించిన సీఎం చంద్రబాబు..

 

గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనూ సేవాలాల్ జయంతి వేడుకలను గిరిపుత్రులు వేడుకగా చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు.

అమరావతి: గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనూ సేవాలాల్ జయంతి వేడుకలను గిరిపుత్రులు వేడుకగా చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు.న్యాయవాది స్వప్న హత్య కేసులో మరో ట్విస్ట్..
ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అహింస, మానవత్వం, సమానత్వానికి సేవాలాల్ మార్గదర్శనం చేశారని ముఖ్యమంత్రి కొనియాడారు. సేవాలాల్‌ మహరాజ్ జయంతి సందర్భంగా ఆ మహానీయుడు చూపిన శాంతి మార్గాన్ని, ఆయన బోధించిన జీవన విలువలను మనసారా స్మరించుకుందామని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.

కాగా, ఉండవల్లిలోని తన కార్యాలయంలో శనివారం నాడు నిర్వహించిన సంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌ 287 జయంతి వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..’రూ.50లక్షలు కేటాయించి సేవాలాల్‌ జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నాం. రానున్న రోజుల్లో మరిన్ని నిధులు కేటాయిస్తాం. ఆయన మన రాష్ట్రంలో జన్మించడం మనందరి అదృష్ట

సేవాలాల్ సిద్ధాంతాలు ఎప్పటికీ ఆదర్శమే. సేవాలాల్‌ స్ఫూర్తితో గిరిజనుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పని చేస్తోంది. నీట్‌, ఐఐటీ సీట్లు సాధించేలా గురుకులాల్లో ఎస్టీ విద్యార్థులకు శిక్షణ అందిస్తాం. ఆదివాసీ ప్రాంతాల్లో పెద్దఎత్తున మౌలిక వసతులు కల్పిస్తున్నాం. ఉచితంగా సోలార్‌ రూఫ్‌ టాప్‌ ఏర్పాటు చేస్తున్నాం. 2026-27 వార్షిక బడ్జెట్‌లో రూ.9,190 కోట్లు ఎస్టీల కోసం కేటాయించాం’ అని చెప్పారు.

సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవాలను జయప్రదం చెయ్యాలి…

సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవాలను జయప్రదం చెయ్యాలి

◆-: జయంతి ఉత్సవాల వాల్ పోస్టర్ ని ఆవిష్కరించిన మహామండలేశ్వర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్: గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ 287వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి విజయవంతం చేయాలని ఆదివారం నాడు బర్దిపూర్ ఆశ్రమ పీఠాధిపతి మహామండలేశ్వర్ సిద్ధేశ్వరానందగిరి పిలుపునిచ్చారు.జహీరాబాద్ పట్టణంలో ఈ నెల 15న నిర్వహించనున్న సేవాలాల్ జయంతి ఉత్సవాలు, శోభాయాత్రకు సంబంధించిన గోడపత్రికను జయంతి ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి ఆశ్రమ ప్రాంగణంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహామండలేశ్వర్ సిద్ధేశ్వరానందగిరి మాట్లాడుతు సేవాలాల్ మహారాజ్ బోధనలు యువత అనుసరించాలని, సమాజంలో ఐక్యత, సేవాభావం పెంపొందించుకోవాలని, సేవాలాల్ మహరాజ్ బోధనలను తూచా తప్పకుండా పాటించి జీవితంలో విజయం సాధించాలని సూచించారు. జయంతి కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. భారీ ఎత్తున జరగనున్న ఉత్సవాలకు తన బృందం ద్వారా తప్పకుండా హాజరు అవుతానని ఈ సందర్భంగా అన్నారు. సేవాలాల్ మహరాజ్ జీవిత చరిత్ర పుస్తకాన్ని స్థానిక కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుభాష్ రాథోడ్ బర్దిపూర్ ఆశ్రమ పీఠాధిపతి శ్రీశ్రీ మహామండలేశ్వర్ సిద్ధగిరినందగిరి కి బహుకరించాగ, వారు పిపి సుభాష్ రాథోడ్ కి శాలువకప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి రఘునాథ్ రాథోడ్, డాక్టర్ సుభాష్ జాదవ్, కోశాధికారి నరేష్ చవాన్, విజయ్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version