131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడం ప్రజాస్వామ్య విజయమే

131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడం ప్రజాస్వామ్య విజయమే

మహిళల హక్కుల పేరుతో రాజకీయ ఎత్తుగడలు విఫలం

ఏఐఎఫ్బిడబ్ల్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగల రాగసుధ వ్యాఖ్యలు

నర్సంపేట,నేటిధాత్రి:

131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడాన్ని స్వాగతిస్తూ, దీనిని ప్రజాస్వామ్య శక్తుల విజయంగా అభివర్ణించవచ్చని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగల రాగసుధ అన్నారు.నర్సంపేట పట్టణంలోని మార్క్స్ కాలనీలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమైక్య ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా కమిటీ సభ్యురాలు జన్ను విజయ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన వంగల రాగసుధ మాట్లాడుతూ, మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లు వాస్తవానికి మహిళల సాధికారత కోసం కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం రూపొందించబడిందని విమర్శించారు.ముఖ్యంగా ఈ బిల్లును నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియతో అనుసంధానం చేయడం ద్వారా మహిళల హక్కుల అమలులో అనవసరమైన ఆలస్యం సృష్టించబడిందని పేర్కొన్నారు. బిల్లు వీగిపోవడం ద్వారా కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరి, మహిళల పేరుతో చేస్తున్న రాజకీయ ఎత్తుగడలు బహిర్గతమయ్యాయని అన్నారు.
దేశంలో మహిళలు ఎదుర్కొంటున్న హింస, అసమానతలు, ఆర్థిక సమస్యలు రోజురోజుకీ పెరుగుతున్నాయని, ఇలాంటి సమయంలో మహిళలకు తక్షణ రాజకీయ ప్రతినిధిత్వం అవసరమని తెలిపారు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం వాగ్దానాలు చేస్తూ వాటిని అమలు చేయడంలో విఫలమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్‌ను ఎటువంటి షరతులు లేకుండా తక్షణమే అమలు చేయాలని, నియోజకవర్గాల పునర్విభజన వంటి ప్రక్రియలతో మహిళా హక్కులను అనుసంధానం చేయకూడదని, మహిళల సాధికారతకు స్పష్టమైన కాలపరిమితి గల కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాలని డిమాండ్ చేశారు.మహిళల పేరుతో రాజకీయ లాభాలు పొందే ప్రయత్నాలను దేశ మహిళలు తిరస్కరిస్తారని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం నిజంగా మహిళల పక్షాన ఉందని నిరూపించాలంటే తక్షణ చర్యలు తీసుకోవాలని, లేకపోతే అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమైక్య రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలను సమీకరించి ఆందోళనలు, పోరాటాలు చేపడతామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యురాలు మైదం పద్మ, గణిపాక బిందు, బెజ్జంకి పుష్ప, కాకి కోమల, పిట్టల పద్మ, లక్ష్మి, శారద తదితరులు పాల్గొన్నారు.

బిల్లు రద్దు కై ఉద్యమిస్తూనే,చట్టాన్ని రక్షించుకోవాలి..

బిల్లు రద్దు కై ఉద్యమిస్తూనే,చట్టాన్ని రక్షించుకోవాలి

నిజాంపేట్, నేటి ధాత్రి

 

 

 

ఉపాధి హామీ పనులు జరిగే ప్రదేశంలో డి బిఎఫ్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న కూలీల లో కలవడం జరిగింది. ఈ సందర్భంగా సంజీవ్ మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఉపాధి హామీ కూలీల హక్కులను హరిస్తుందని, కూలీల గొంతును నొక్కేందుకే వీబీ గ్రామ్ జీ బిల్లు 2025 ను తీసుకువస్తుందని,
బిల్లు రద్దుకై ఉపాధి హామీ కూలీలు ఐక్యంగా ఉద్యమించి,ఉపాధి హామీ చట్టాన్ని పరిరక్షించుకోవాలని డిబిఎఫ్ జిల్లా అధ్యక్షులు కూలీలకు పిలుపునిచ్చారు.
సోమవారం నాడు నిజాంపేట మండలం వెంకటాపూర్ కె గ్రామంలో ఉపాధి హామీ పనుచేస్తున్న కూలీలను కలిసి చట్టానికి జరిగే నష్టాలను వివరిస్తూ చట్టాన్ని కాపాడుకోవాలని కోరారు.
కేంద్రములో అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఉపాధి హామీ చట్టాన్ని అడుగడుగున ఉల్లంఘింస్తూ కూలీల హక్కులను పూర్తిగా తీసివేస్తూ పనికి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తుందని అన్నారు.
ఉపాధి హామీ చట్టాన్ని యదవిధంగా కొనసాగించాలని
కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
దేశంలో వామపక్షాలు, సామాజిక శక్తుల తివ్రమైన ఒత్తిడితో వచ్చిన యంజి ఎన్ అర్ ఇజిఎను తీసివేసేందుకు బిజెపి ప్రయత్నం చేస్తుందని అన్నారు.
కూలీలకు పని హక్కులను కల్పించిన మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి విబి గ్రామ్ జి బిల్లు 2025 పేరుతో కేంద్ర ప్రభుత్వం ముందుకు రాబోతుందన్నారు.
దేశంలో రైతాంగ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా దేశంలోని రైతాంగం ఐక్య పోరాటం చేసి నల్ల చట్టాలను రద్దు చేసుకున్నారన్నారు.
నాటి రైతుల స్ఫూర్తితో కూలీలు పోరాటం చేసి ఉపాధి హామీ పని హక్కులను రక్షించుకొవాలన్నారు.
దేశ వ్యాప్తంగా 33 కోట్ల కూలీల హక్కులను కాల రాస్తున్న బిజెపికి వ్యతిరేకంగా కూలీలు ఉద్యమించి తమ హక్కులను కాపాడుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సరిత మధుసూదన్ రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ కైలాస్, డి బిఎఫ్ మండల అధ్యక్షులు బ్యాగరీ చంద్రం, ఉపాధి హామీ కూలీలు మహిళలు పాల్గొన్నారు.

జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలి

జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలి

వీబీ జి రాంజీ పథకాన్ని వెనక్కి తీసుకోవాలి

ఏఐసీటియు జిల్లా కార్యదర్శి కన్నూరి దానియేలు

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించిన ఏఐసీటియు జిల్లా కార్యదర్శి కన్నూరి దానియేలు
ఈ సందర్భంగా ఏఐసీటియుజిల్లా కార్యదర్శి కన్నూరి దానియేలు
మాట్లాడుతూ మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కమ్యూనిస్టుల పోరాట ఫలితంగా 2005 వ సంవత్సరంలో యూపీఏ ప్రభుత్వంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పేద ప్రజల కోసం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసుకురావడం జరిగిందని తెలిపారు. 25 సంవత్సరాల నుండి దేశవ్యాప్తంగా అన్ని గ్రామాలలో 100 రోజుల కరువు పనిని ఇప్పుడున్న బిజెపి కేంద్ర ప్రభుత్వం కుట్ర పొంది మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి విబి జి రామ్ జీ పథకాన్ని పార్లమెంటులో చట్టాన్ని తీసుకువచ్చి బిల్లు ఆమోదించడం జరిగింది. గత 25 సంవత్సరాల నుండి కేంద్ర ప్రభుత్వం 90% నిధులతో గ్రామీణ వ్యవసాయ కూలీలకు ఎంతో గాను ఉపయోగపడే ఉపాధిని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుందని అన్నారు. ఇప్పుడు ఈ చట్టంలో 60% నిధుల కేంద్రం 40% నిధులు రాష్ట్ర ప్రభుత్వం భరించాలని కొత్త చట్టాన్ని తీసుకువచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి భారం వేస్తుందని తెలిపారు. కొత్తగా తీసుకువచ్చిన ఈ జాతీయ ఉపాధి పథకాన్ని భూస్వాముల పెత్తందారులకు, బడా బాబులకు అనుకూలంగా పేద రైతు కూలీలకు వ్యతిరేకంగా ఈ పథకం ఉందని అన్నారు. వెంటనే పాత పథకాన్ని అమలులోకి తీసుకురావాలని కొత్తగా తీసుకువచ్చిన వీబి జి రామ్ జి పథకాన్ని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version