ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలి…

ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలి

* మల్లారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మూడు చింతలపల్లి పాలకవర్గం

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

ప్రజా సమస్యలను పరిష్కరిస్తూనే అన్ని రంగాల్లో అభివృద్ధిని చేయాలని మాజీ మంత్రి, మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి అన్నారు. మూడు చింతలపల్లి మున్సిపాలిటీకి నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్ జామ్ రవి, వైస్ చైర్మన్ శశిరేఖ లతో పాటు కౌన్సిలర్లు బోయినపల్లి క్యాంపు కార్యాలయంలో గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. మేడ్చల్ ఎమ్మెల్యేగా మూడు చింతలపల్లి అభివృద్ధి కోసం అన్ని విధాల తోడ్పాటు అందించాలని పాలకవర్గ సభ్యులకు కోరారు. అనంతరం నూతనంగా ఎన్నికైన పాలకవర్గాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి సన్మానం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి అనిత, మాజీ సర్పంచ్ ఇస్తారి, మాజీ ఎంపిటిసి నాగరాజు, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, వెంకట నరసింహారెడ్డి, మురళి గౌడ్, సంజీవ, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

చత్రపతి శివాజీ ని ఆదర్శంగా తీసుకోవాలి…

చత్రపతి శివాజీ ని ఆదర్శంగా తీసుకోవాలి

* విగ్రహ ఆవిష్కరణలో మాజీ మంత్రి, మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

 

యువత చత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకోవాలని మాజీ మంత్రి, మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి అన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్బంగా తుంకుంట మున్సిపాలిటీ మందయిపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గోని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు ఉమా ఆంజనేయులు, రాజ్ కుమార్ యాదవ్, బిఆర్ఎస్ అధ్యక్షుడు పాముల శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ నాలుక యాదగిరి, కృష్ణారెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, మందాయపల్లి వాసులు, యువకులు పాల్గొన్నారు.

మాజీ మంత్రి, మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి…

మరచిపోయి కాంగ్రెస్ కు ఓటు వేయొద్దు : మాజీ మంత్రి, మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఓరిగిందేమి లేదని, తెలంగాణ 60 ఏండ్ల వెనక్కి వెళ్లిందని మాజీ మంత్రి, మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మేడ్చల్ నియోజకవర్గం ముడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని జగన్ గూడ, లాల్ గడి మలక్పేట్ గ్రామంల్లో ఆదివారం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొని, భారీ ఎత్తున్న రోడ్ షో, కార్నర్ మీటింగ్ నిర్వహించారు. మునిసిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి బి ఆర్ ఎస్ అభ్యర్థులను గెలిపియ్యాలని కోరారు.

 

ఈ కార్యక్రమలలో ఇంచార్జ్ గజ్జెల నాగేష్, పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ రాగిడి లక్ష్మ రెడ్డి, యువనాయకులు dr భద్ర రెడ్డి, మధుకర్ రెడ్డి, మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మల్లేష్ గౌడ్, నాయకులు, బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు పాల్గొన్నారు.

యువత అన్ని రంగాల్లో రానించాలి : మాజీ మంత్రివర్యులు…

యువత అన్ని రంగాల్లో రానించాలి : మాజీ మంత్రివర్యులు
మేడ్చల్ ఎంఎల్ఏ చామకూర మల్లారెడ్డి
* మున్సిపాలిటీలో ముగిసిన సీఎంఆర్ క్రికెట్ ట్రోఫీ లు
* బహుమతుల ప్రధానోత్సవం

మేడ్చల్  ప్రతినిధి, నేటిధాత్రి :

 

యువతను ప్రోత్సహించినప్పుడే అన్ని రంగాల్లో రాణించ గలుగుతారని మాజీ మంత్రివర్యులు మేడ్చల్ ఎంఎల్ఏ చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ నియోజకవర్గం అలియాబాద్ సిర్వి క్రికెట్ గ్రౌండ్ లో సంక్రాతి పండగా సందర్బంగా సీఎంఆర్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ అలియాబాద్, ముడుచింతలపల్లి మున్సిపాలిటీల క్రికెట్ పోటీలను నిర్వహించిన విషయం తెలిసిందే.

 

ఆదివారం ఫైనల్ మ్యాచ్ లను తిలకించి ముడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలో విన్నర్ టీం లింగాపూర్ తండా క్రీడాకారులకు రూ.25వేలు, రన్నర్ టీం ఆనంతరంకు రూ.15వేలు నగదు బహుమతి ట్రోఫీలు, అలియాబాద్ మున్సిపాలిటీ విన్నర్ టీం లాల్ గడి మలక్పేట్ కు రూ. 25వేలు, రన్నర్ టీం అలియాబాద్ కు రూ.15వేలు నగదు బహుమతి ట్రోఫీ మాన్ ఆఫ్ సిరీస్, మాన్ అఫ్ మ్యాచ్ ట్రోపి లను అందజేయడం జరిగింది. సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతను మహిళలను ప్రోత్సహించాలని ఉద్దేశంతో సంక్రాంతి ముగ్గుల పోటీలు, సిఎంఆర్ క్రికెట్ పోటీలు అలియాబాద్, మూడు చింతలపల్లి, ఎల్లంపేట మున్సిపాలిటీలో నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ భద్రారెడ్డి, మున్సిపాలిటీల అధ్యక్షులు సరసం మోహన్ రెడ్డి, మల్లేష్ గౌడ్, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ ప్రజా ప్రతినిధులు, మాజీ వార్డు నెంబర్లు, టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

మునిసిపల్ ఎన్నికల్లో గెలిచి చూపండి: మల్లారెడ్డి సవాల్

మీ దమ్ము మునిసిపల్ ఎన్నికల్లో గెలవండి
* కాంగ్రెస్ నేతలకు మల్లారెడ్డి బహిరంగ సవాల్
* మేడ్చల్ జిల్లా ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మాజీ మంత్రి, ఎంఎల్ఏ

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

 

దమ్ముంటే మునిసిపల్ ఎన్నికల్లో గెలవందని మాజీ మంత్రి, మేడ్చల్ ఎంఎల్ఏ చామకూర మల్లారెడ్డి కాంగ్రెస్ నేతలకు బహిరంగ సవాల్ విసిరారు. జిహెచ్ఎంసి పరిధిలోని కిష్టాపూర్ – పూడూర్ సర్కిల్ పరిధిలోని కెఎల్ఆర్ వెంచర్ లో మేడ్చల్ మున్సిపాలిటీ మాజీ కో ఆప్షన్ సభ్యులు ఆకిటి నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం సంక్రాతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్బంగా మల్లారెడ్డి మాట్లాడుతూ నన్ను ఆదరిస్తున్న మేడ్చల్ నియోజకవర్గ ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కరించి రుణం తీర్చుకుంటానన్నారు. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ హాయాంలో నిత్యం సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేధన వ్యక్తం చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో గత పదేళ్లుగా రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామని గుర్తు చేశారు. ఇక రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేయడం ఖాయమని, ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎవరి దమ్ము ఎంతుందో చూసుకుందామని కాంగ్రెస్ కు సవాల్ విసిరారు. అనంతరం పోటీల్లో గెలిచిన వారికీ మేడ్చల్ మున్సిపాలిటీ మాజీ కో ఆప్షన్ సభ్యులు ఆకిటి నవీన్ రెడ్డి చేతుల మీదుగా పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దయానంద్ యాదవ్, మేడ్చల్ జిల్లా మాజీ గ్రంధాలయ ఛైర్మన్ భాస్కర్ యాదవ్, మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్ లు, నాయకులు, మహిళలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version