మునిసిపల్ ఫలితాలే బేస్…పాత పద్ధతిపై పరిషత్ ఎన్నికలు…

మునిసిపల్ ఫలితాలే బేస్…పాత పద్ధతిపై పరిషత్ ఎన్నికలు

*ఎంపీటీసీ, జడ్పీటీసీ పదవులు రద్దు!*

జహీరాబాద్ నేటి ధాత్రి;

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం జరిగిన మునిసిపల్ ఎన్నికలు కాంగ్రెస్ కి రాజకీయంగా కీలక టర్నింగ్ పాయింట్‌ అయ్యాయి. ఇదే జోష్తో ఎన్నికల పోవాలని ఆలోచన రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణులు రాబోయే మండల, జిల్లా పరిషత్ ఎన్నికల వ్యూహంపై దృష్టి పెట్టాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న వేగవంతమైన నిర్ణయాలు, పరిపాలనలో చూపుతున్న చురుకుదనం, స్థానిక సంస్థలపై ఫోకస్ కారణంగా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. గ్రామ స్థాయి నుండి పట్టణాల వరకు నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ కాంగ్రెస్ ప్రక్షాళన కొనసాగితే, రాబోయే మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో 90 శాతం వరకు విజయం సాధించే అవకాశముందని రాజకీయ వర్గాల అంచనా. ఇక ఎన్నికల విధానంలో కూడా మార్పులపై చర్చ జోరందుకుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ వ్యవస్థకు బదులుగా దాదాపు 35 ఏళ్ల క్రితం అమలులో ఉన్న పరోక్ష ఎన్నికల విధానాన్ని తిరిగి తీసుకురావాలన్న అభిప్రాయం ఈరోజు జరిగే సమావేశాల్లో వినిపిస్తున్నట్టు సమాచారం. ఆ పాత పద్ధతిలో రెండు బ్యాలెట్ పత్రాల ద్వారా మండల పరిషత్, జిల్లా పరిషత్ అధ్యక్షులను ఎన్నుకునే విధానం అమలు చేస్తే క్షేత్ర స్థాయిలో బలమైన నెట్‌వర్క్ కలిగిన కాంగ్రెస్ పార్టీలకు ఈ విధానం వల్ల ప్రయోజనం చేకూరుస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గడిచిన మునిసిపల్ ఎన్నికల ట్రెండ్‌ను బేస్‌గా తీసుకుని పలువురు నాయకులు “ఇదే సరైన పద్ధతి” అంటూ తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారని సమాచారం. పార్టీ కొంత ప్రక్షాళన పూర్తిగా జరిగి, స్థానిక నాయకత్వం మరింత బలోపేతం అయితే కాంగ్రెస్‌కు భారీ రాజకీయ లాభం కలుగుతుందని అంతర్గత చర్చలు సూచిస్తున్నాయి. ఈరోజు జరగనున్న కీలక సమావేశంలో పరిషత్ ఎన్నికల విధానం, సభ్యుల పాత్ర, బ్యాలెట్ విధానం వంటి అంశాలపై స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశముందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీయగా, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల సమీకరణాలు పూర్తిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ శ్రేణులు మాత్రం “పునర్వ్యవస్థీకరణలో చాలా కాలం క్రితం అమలులో ఉన్న పాత ఎన్నికల విధానం” ప్రకారం ఎన్నికల్లోకి వెళ్తే, గ్రామీణ స్థాయిలో పార్టీ మరింత బలపడుతుందని ధీమా కాంగ్రెస్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి,

విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు జిల్లా ఎస్పీ సంకీర్త్….

విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు జిల్లా ఎస్పీ సంకీర్త్

భూపాలపల్లి నేటిధాత్రి

మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు – జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్

మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు, బైక్ ర్యాలీలు, డీజేలు, టపాకాయలు కాల్చడం వంటి చర్యలకు అనుమతి లేదని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. గెలిచిన అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తనా నియమావళికి కట్టుబడి ఉండాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
లెక్కింపు కేంద్రాల వద్ద శాంతిభద్రతలు కాపాడేందుకు పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రత్యేక బందోబస్తు, క్యూ.ఆర్.టి టీములు, డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ టీములు, స్ట్రైకింగ్ ఫోర్సులు సిద్ధంగా ఉంచినట్లు పేర్కొన్నారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలి.

ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు, బైక్ ర్యాలీలు, డీజేలు, టపాకాయలు పూర్తిగా నిషేధం.

శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలు చేయరాదు.
నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు పంపించబడతారు.
ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించాలంటే సంబంధిత అధికారుల అనుమతి మరియు వారు నిర్దేశించిన తేదీల్లో మాత్రమే నిర్వహించాలి.
ప్రజలందరూ శాంతి, సామరస్య వాతావరణాన్ని కాపాడుతూ ఫలితాలను పరస్పర గౌరవంతో స్వీకరించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

ఈ పోరాటం ముగియలేదు.. బీఎంసీ చేజారడంపై ఉద్ధవ్ పార్టీ తొలిస్పందన…

ఈ పోరాటం ముగియలేదు.. బీఎంసీ చేజారడంపై ఉద్ధవ్ పార్టీ తొలిస్పందన

 

బీఎంసీ ఎన్నికల్లో పాతికేళ్ల తర్వాత శివసేన ఆధిపత్యానికి బీజేపీ-షిండే శివసేన కూటమి గండికొట్టింది. అయితే.. మహారాష్ట్రలో రాజకీయ యుద్ధం ఇంతటితో ముగిసినట్టు కాదని.. మరాఠా ప్రజలకు సముచిత గౌరవం దక్కేంత వరకూ ఈ పోరాటం కొనసాగుతుందని ఉద్ధవ్ సారథ్యంలోని శివసేన(యూబీటీ) తెలిపింది.

ముంబై: బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్(BMC) ఎన్నికల్లో 25 ఏళ్ల తర్వాత శివసేన ఆధిపత్యానికి బీజేపీ-షిండే శివసేన కూటమి గండికొట్టడంతో ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని శివసేన(UBT) తొలిసారి స్పందించింది. మహారాష్ట్రలో రాజకీయ యుద్ధం ఇంతటితో ముగిసినట్టు కాదని.. మరాఠా ప్రజలకు సముచిత గౌరవం దక్కేంత వరకూ ఈ పోరాటం కొనసాగుతుందని సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో పేర్కొంది.
‘యుద్ధం ఇప్పటితో ముగియలేదు. మరాఠా వ్యక్తులకు తగినంత గౌరవం దక్కేంత వరకూ ఈ పోరాటం ఇలాగే కొనసాగుతుంది’ అని శివసేన యూబీటీ ట్వీట్ చేసింది.

సీట్లు.. ఓట్లు

బీఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, ఏక్‌నాథ్ షిండే శివసేన కూటమి ఏకైక పెద్ద కూటమిగా నిలిచింది. శివసేన(యూబీటీ), మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) కూటమి సైతం గణనీయంగా సీట్లు, ఓట్లు సాధించింది. ఎన్నికల కమిషన్ విడుదల చేసిన అధికారిక లెక్కల ప్రకారం.. బీజేపీ 89 సీట్లు గెలుచుకుంది. ఆ పార్టీకి 11,79,273 ఓట్లు పోలయ్యాయి. 21.58 శాతం ఓటింగ్ షేర్ సాధించింది. గెలిచిన అభ్యర్థుల్లో బీజేపీ ఓట్ షేర్ 45.22 శాతంగా ఉంది. దీంతో ఏకైక పెద్దపార్టీగా బీజేపీ నిలిచింది. బీజేపీ భాగస్వామి పార్టీ అయిన శివసేన(షిండే వర్గం) 29 సీట్లు గెలుచుకుంది. 2,77,326 ఓట్లు సాధించింది. మొత్తం ఓట్ షేర్‌లో 5 శాతం దక్కించుకుంది. బీజేపీ-శివసేన(షిండే) కలిసి బీఎంసీలో అతిపెద్ద కూటమిగా నిలిచింది.

ఎంఎన్ఎస్‌తో కలిసి పోటీ చేసిన శివసేన(యూబీటీ) 65 సీట్లు గెలుచుకుంది. యూటీబీ సారథ్యంలోని సేనకు 7,17,735 ఓట్లు వచ్చాయి. మొత్తం పోలైన ఓట్లలో ఇది 13.13 శాతం. ఎంఎన్‌ఎస్ 6 సీట్లు దక్కించుకుంది. 74,946 ఓట్లు గెలుచుకుని.. 1.37 శాతం ఓట్ షేర్ సంపాదించింది. కాంగ్రెస్ పార్టీ 24 సీట్లు గెలుచుకుని 4.44 శాతం ఓట్ షేర్ సాధించింది. ఇతర పార్టీల్లో ఎఐఎంఐఎం 8 సీట్లతో 68,072 ఓట్లు సాధించింది. ఎన్‌సీపీ 3 సీట్లు, సమాజ్‌వాదీ పార్టీ 2 సీట్లు, ఎన్‌సీపీ(శరద్‌చంద్ర పవార్) పార్టీ ఒక సీటు గెలుచుకున్నాయి.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version