సర్పంచుల ప్రమాణస్వీకారంలో పాల్గొన్న గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్
#సర్పంచుల విజయంలో కీలక పాత్ర పోషించిన గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్
ములుగు, నేటిధాత్రి:
రాష్ట్ర మంత్రి వర్యులు దనసరి అనసూయ సీతక్క ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ సూచన మేరకు
ఇటీవలే జరిగిన స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల్లో ములుగు మండలం పత్తిపల్లి గ్రామంలో 12 కి 12 వార్డులు కాంగ్రెస్ పార్టీ బలపరచిన వార్డు సభ్యులు విజయం సాధించి 806 ఓట్ల భారీ మెజారిటీతో బిఆర్ఎస్ బలపరచిన అభ్యర్థిపై గెలుపొందిన ధారావత్ సరిత & సారయ్య,ఉప సర్పంచ్ పోరిక భద్రు నాయక్ మరియు వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో అదే విధంగా
దేవగిరిపట్నం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరచిన అభ్యర్థి ఇస్లావత్ పూలమ్మ &సంతోష్ మరియు ఉప సర్పంచ్ ఇట్టబోయిన రాజు యాదవ్ మరియు వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పొట్లాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరచిన సర్పంచ్ అభ్యర్థి కందికొండ భాగ్యలక్ష్మి & రమేష్ ఉప సర్పంచ్ పాలడుగుల మురళి,వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపిన ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్ ములుగు మండల పార్టీ అధ్యక్షుడు ఎండీ చాంద్ పాషా ఈ సందర్భంగా మాట్లాడుతూ నూతనంగా ఎన్నికయిన సర్పంచులు గ్రామంలోని ప్రతి సమస్యనీ పరిష్కరించే విధంగా పని చేస్తూ గ్రామాభివృద్ధిలో ప్రతి ఒక్కరికి సహకరించాలని సూచించారు
ఎన్నికల సమయంలో మంత్రి సీతక్క ఇచ్చిన ప్రతి హామీని తొందరలోనే ప్రారంభించి ప్రతి హామీ పూర్తి చేస్తామని అన్నారు
ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, పాక్స్ మాజీ వైస్ చైర్మన్ మర్రి రాజు యాదవ్,ములుగు మాజీ ఎంపీటీసీ మావురపు తిరుపతి రెడ్డి,యూత్ నాయకులు జిల్లా ఉపాధ్యక్షుడు జక్కుల రేవంత్ యాదవ్,పత్తిపల్లి మాజీ సర్పంచులు బుర్రి రజిత,శ్రీలమంతుల రవీంద్రాచారి,దేవగిరిపట్నం మాజీ సర్పంచ్ ఎన్నారెడ్డి,పొట్లపూర్ మాజీ సర్పంచ్ అంకిరెడ్డి ములుగు పట్టణ యూత్ అధ్యక్షుడు అభినయ్ చారి,మైనారిటీ నాయకులు అజ్జు,యూత్ నాయకులు చందు, కన్ని,ఆయా గ్రామ కమిటీల అధ్యక్షులు సీనియర్ నాయకులు, యూత్ నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
