సిపిఐ ది వందేళ్ల త్యాగాల చరిత్ర
ఎర్రజెండా పార్టీల ఐక్యతే దేశానికి ప్రత్యామ్నాయం-చాడ
కరీంనగర్, నేటిధాత్రి:
భారత కమ్యూనిస్టు పార్టీ వందేళ్ల ప్రస్తానంలో ప్రజాపోరాటాలు, ఉద్యమాలు, నిర్భంధాలు త్యాగాలతో కూడిన చరిత్ర అని, ప్రజల పక్షాన నిలబడి కొట్లాడిన పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని సిపిఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి అన్నారు. కరీంనగర్ లో ఆదివారం కమ్యూనిస్టు పార్టీ జిల్లా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన పార్టీ శతవసంతాల ముగింపు ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ ర్యాలీ, బహిరంగ సభకు పల్లా వెంకటరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నగరంలోని సర్కస్ గ్రౌండ్ నుండి భారీ ర్యాలీ రెవెన్యూ గార్డెన్ వరకు సాగింది. అనంతరం రెవెన్యూ గార్డెన్ లో జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన సభలో వక్తలు మాట్లాడారు. ఈసందర్భంగా పల్లా వెంకటరెడ్డి మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ డిసెంబర్ 26తో వందేళ్లు పూర్తి చేసుకుందని, ఈదేశంలో వందేళ్లు పూర్తి చేసుకున్న ఏకైక రాజకీయ పార్టీ కమ్యూనిస్టు పార్టీ అని అన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో కమ్యూనిస్టు పార్టీ పాత్ర ఎనలేనిదని కొనియాడారు. దేశ సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం మొదట పిలుపునిచ్చిన పార్టీ సిపిఐ అని వెంకటరెడ్డి గుర్తు చేశారు. దేశంలోని అన్ని రంగాల్లోని ప్రజలను ప్రజాసంఘాలను ఏర్పాటు చేసి స్వాతంత్ర్య పోరాటంలో బాగస్వాములను చేసిందని వివరించారు. కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీ నాయకులు స్వాతంత్ర్య పోరాటంలో బాగస్వాములైనారని, కానీ నేడు దేశంలో అధికారంలో ఉన్న బిజేపి పార్టీ ఆపార్టీ నాయకులు అప్పుడు లేరని అన్నారు. ఆర్ ఎస్ఎస్ మాత్రం కమ్యూనిస్టు పార్టీ కంటే ఆరు నెలల ముందు ఆవిర్భవించిందని తెలిపారు. స్వాతంత్ర్య పోరాట అనంతరం తెలంగాణాలో రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మగ్దుం మొయినోద్దీన్ లాంటి కమ్యూనిస్టు పార్టీ నాయకులు తెలంగాణ సాయిధ పోరాటానికి పిలుపునిచ్చారని తెలిపారు. నిజాం కు వ్యతిరేకంగా పోరాడి ఈప్రాంతంలోని గ్రామాలను వెట్టి నుంచి విముక్తి చేసి లక్షల ఎకరాలు పంచిన చరిత్ర సిపిఐకుందని అన్నారు. ఆపోరాటంలో వేల మంది కార్యకర్తల ప్రాణాలను త్యాగం చేసిన ఘనత కమ్యూనిస్టు పార్టీదన్నారు. సాయిధ పోరాటానికి వణికి పోయిన పెత్తందారులు, భూస్వాములు, నిజాం తెలంగాణ ప్రాంతాన్ని భారత దేశంలో విలీనం చేశాడని అన్నారు. కమ్యూనిస్టు పార్టీ నుంచి గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రజా ప్రయోజనాలు, ప్రజా సమస్యల పరిష్కారం ఎంతగానో క్రుషి చేశారని తెలిపారు. భూ సంస్కరణలు, బ్యాంకుల జాతీయీకరణ,రాజభరణాల రద్దు వంటి కార్యక్రమాలు సిపిఐ పోరాటాల ఫలితంగానేమ అమలయ్యాయన్నారు.
ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బిజేపి ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు దారదత్తం చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వ రంగంలోని బ్యాంకులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నం కొనసాగుతుందన్నారు. కమ్యూనిస్టుల సూచనతో ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకాన్ని ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బిజేపి ప్రభుత్వం నీరుగార్చేందుకు ప్రయత్నం చేస్తుందని అన్నారు. ఉపాధి చట్టంలో సవరణలు చేసి రాష్ట్రాలపై భారాన్ని మోపుతుందన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని యధాతదంగా కొనసాగించాలని వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. అనంతరం చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో కమ్యూనిస్టు పార్టీ పాత్ర గొప్పదని అన్నారు. తెలంగాణ సాయిధ పోరాటంలో పది లక్షల ఎకరాల భూమిని పంచిన చరిత్ర… ముఫైఐదు వందల గ్రామాలను విముక్తి చేసిన చరిత్ర, నలభై ఐదు వందల మంది ప్రాణాలను త్యాగం చేసిన చరిత్ర ఏపార్టీకి లేదన్నారు. తెలంగాణ సాయుధ పోరాంటలో కరీంనగర్ కు ప్రత్యేక స్థానముందన్నారు. అనభేరి ప్రబాకర్ రావు లాంటి వాళ్లు పేదల పక్షాన కొట్లాడి తన ప్రాణాలను ఫణంగా పెట్టి అమరుడైనారని గుర్తు చేశారు. ఎర్ర జెండా పార్టీలన్నీ ఏకమైతేనే దేశంలో ప్రత్యామ్నాయం కాగలమన్నారు. కమ్యూనిస్టు పార్టీ వందేళ్ల సందర్భంగా కమ్యూనిస్టులు, ప్రజాస్వామిక వాదులు ఏకం కావాలని కోరారు. అప్పుడు ఈదేశంలో మార్పు తప్పకుండా వస్తుందన్నారు. నరేంద్రమోడి అధికారంలో వచ్చాక రైతు వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేశారు. కమ్యూనిస్టు సిద్దాంతం అజేయమైందని, సమసమాజ స్థాపన కోసం దోపిడి రహిత సమాజం కోసం పార్టీ శ్రేణులు క్రుషి చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను భారీ సంఖ్యలో గెలిపించుకోవాలని కోరారు. అనంతరం సిపిఐ రాష్ట్ర సమాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేణ శంకర్ ప్రసంగించారు. ఈకార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా కార్యదర్శి సదానందం, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి పల్లె నరసింహా, డిహెచ్ పి ఎస్ రాష్ట్ర కార్యదర్శి మారుపాక అనిల్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు అందే స్వామి, పొన్నగంటి కేదారి, శంకర్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కసిరెడ్డి సురేందర్ రెడ్డి, కోయడ సృజన్ కుమార్, బోయిన అశోక్, న్యాలపట్ల రాజు, నాగేల్లి లక్ష్మారెడ్డి, గూడెం లక్ష్మి, బత్తుల బాబు, బోయిన తిరుపతి,పిట్టల సమ్మయ్య, కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్, బండ రాజిరెడ్డి, గోవిందుల రవి, కొట్ట అంజలి, ఉమ్మెత్తల రవీందర్ రెడ్డి, కళ్యాణ్, చో క్కల శ్రీశైలం, గజ్జ ఐలయ్య, మౌలానా, మచ్చ రమేష్, బ్రాహ్మణపల్లి యుగంధర్, రామారావు, వెంకటేష్, సుజాత, లక్ష్మీ మమత, బిర్లా రమ, స్వాతి, పైడిపల్లి వెంకటేష్, బోయిని పటేల్, తదితరులు పాల్గొన్నారు.
