క్రికెట్ విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్సీ

క్రికెట్ విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్సీ

నడికూడ,నేటిధాత్రి:

మండలంలోని కౌకొండ గ్రామంలో పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో
నిర్వహించిన (ఎన్ పి ఎల్ ) నడికూడ ప్రీమియర్ లీగ్ ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్ కి హాజరై క్రికెట్ విజేతలకు బహుమతులు అందజేశారు.మొదటి బహుమతి 30000,రెండవ బహుమతి 20000 , మెడల్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అద్భుతమైన క్రీడా ప్రతిభను వెలికితీయడానికి క్రికెట్ టోర్నమెంట్లు గ్రామీణ క్రీడలు దోహదపడతాయి క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడా స్ఫూర్తిని చాటాలి యువత క్రీడల్లో రాణించి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొన్న ప్రతి జట్టుకు క్రికెట్ క్రీడా సామాగ్రిని అందజేస్తామని తెలిపారు అదేవిధంగా తన ఎమ్మెల్సీ ఫండ్ నుంచి 20 లక్షల నిధులను కౌకొండ గ్రామ అభివృద్ధికి కేటాయిస్తానని హామీ ఇచ్చారు,అదేవిధంగా పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గతంలోనే గ్రామీణ ప్రాంత మహిళలకు కుట్టు మిషన్లు అందజేయడం జరిగింది.ఆత్మకూర్,దామెర మండలాల్లో కుట్టు మిషన్ శిక్షణ ఏర్పటు చేస్తామాన్నరు
పరకాల,నడికూడ మండలాల్లో మరికొన్ని గ్రామాల్లో కుట్టు మిషన్ శిక్షణ ఇచ్చి మిషన్లు అందజేస్తామని తెలిపారు.నాకు జన్మనిచ్చిన నా ఊరు వరికోల్ నా మండలం నడికూడ మండలంను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని అన్నారు. భవిష్యత్తులో పరకాల, నడికూడ మండలాల నిరుద్యోగ యువత కోసం కౌకొండ గ్రామంలో యువతకు అవసరమయ్యే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు,వివిధ పరిశ్రమలను ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ కే.వాసుదేవ రెడ్డి, బిఆర్ఎస్ రాష్ట్ర సోషల్ మీడియ కో ఆర్డినేటర్ వై.సతీష్ రెడ్డి, కౌకొండ గ్రామ సర్పంచ్ ఓదెల శ్రీలత- భాస్కర్, పోచంపల్లి ఫౌండేషన్ కన్వీనర్ నడికూడ మండల మాజీ వైస్ ఎంపీపీ చందా కుమార స్వామి,
బిఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు మేడిపల్లి శోభన్,ఎన్ పి ఎల్ ప్రీమియర్ లీగ్ నిర్వహకులు రామంచ రాజేందర్,
సుహిదర్(లడ్డు) నడికూడ మండల సమన్వయ సమితి సభ్యులు సుధాటి వెంకటేశ్వరరావు,నందికొండ జైపాల్ రెడ్డి,నందికొండ గణపతి రెడ్డి, కోడెపాక కరుణాకర్, తిప్పర్తి సాంబశివరెడ్డి,కౌన్సిలర్, బొచ్చు బాబురావు,రాకేష్ రావు,వరికోల్ సర్పంచ్ దొగ్గేల కుమారస్వామి,ఉప సర్పంచ్ భుజంగరావు,ఆముదాల పెళ్ళి అశోక్,గంట సమ్మిరెడ్డి, మచ్చా రవీందర్,పిఎసిఎస్ మాజీ చైర్మన్ నల్లెల లింగమూర్తి,మేకల సతీష్, లింగాల తిరుపతి,ముక్కెర రాజు,పోశాల అశోక్, రఘుపతి,శివ,నరేష్, మల్లికార్జున్,ప్రశాంత్ రెడ్డి, సునీల్ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర స్థాయి సీఎం కప్ ఖోఖో పోటీలకు ఇస్సిపేట క్రీడాకారుడు…

రాష్ట్ర స్థాయి సీఎం కప్ ఖోఖో పోటీలకు ఇస్సిపేట క్రీడాకారుడు
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

మొగుళ్లపల్లి మండలం ఇస్సిపేట గ్రామానికి చెందిన గాజుల కేదారి, సుజాత కుమారుడు శ్రీ గాజుల మురళి కృష్ణ ఈ నెల 12వ తేదీన భూపాలపల్లి జిల్లా పోటిల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అయినట్లు జిల్లా యువజన క్రీడా అధికారి చిర్ర రఘు, సీనియర్ క్రీడాకారుడు పాడుగుల శివకుమార్, వ్యాయమ ఉపాధ్యయులు, రాజయ్య, అజయ్, సురేష్, ఆనంద్ తెలిపారు, ఈ కార్యక్రమాన్ని ఉద్యేశించి స్థానిక గ్రామ సర్పంచ్ యర ముకుంద రెడ్డి, అభినందనలు తెలిపారు ఈ నెల 20నుండి 23వరకు రాష్ట్ర స్థాయి పోటీలు నల్గొండ లో జరుగుతాయి జిల్లా జట్టు నుండి మంచి ప్రతిభ కనబరిచి రానున్న రోజుల్లో గ్రామానికి జిల్లా కి మంచిపేరు తీసుకురావాలని సీనియర్ క్రీడాకారులు, గ్రామ ప్రజలు మరియు పెద్దలు తెలిపారు

ఖేలో ఇండియా కు గుండాల క్రీడాకారులు ఎంపిక….

ఖేలో ఇండియా కు గుండాల క్రీడాకారులు ఎంపిక

గుండాల,నేటిధాత్రి :

ఈనెల 23న రాజస్థాన్ లో జరగనున్న ఖేలో ఇండియా ట్రైబల్ మీట్ ఫుట్ బాల్ క్రీడలకు గుండాల మండలంకు చెందిన నలుగురు యువకులు ఎంపికయ్యారు. ఈనెల 7,8 తేదీలలో కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జరిగిన ఫుట్ బాల్ క్రీడలో కొమ్ముగూడెం గ్రామానికి చెందిన వాగబోయిన వంశీ, సాయినపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు తాటి మోహన్, పోలేబోయిన హర్షిత్, చింతలపాడు గ్రామానికి చెందిన ఊకె శ్రావణ్ కుమార్ లు ప్రతిభ కనపర్చి తెలంగాణ రాష్ట్రం తరఫున ఆడనున్నారు. ఈ నెల 23 నుండి 27 తేదీ వరకు ఐదు రోజులపాటు జరగనున్న క్రీడలలో తెలంగాణ జట్టు తరపున ఆడనున్నారు. తెలంగాణ, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ ఈ నాలుగు జట్ల మధ్య జరగనున్న ఫుట్ బాల్ పోటీల్లో గెలుపొంది తెలంగాణ కే కాకుండా మారుమూల మన గుండాల మండలం పేరు ప్రఖ్యాతలు నిలబెడతామని ఈ నలుగురు క్రీడాకారులు ఆశా భావం వ్యక్తం చేశారు.

న్యాల్కల్ దర్గాలో అంతర్రాష్ట్ర కుస్తీ విజేత కుశాల్

న్యాల్కల్ దర్గాలో అంతర్రాష్ట్ర కుస్తీ పోటీలు: హైదరాబాద్ కుషాల్ విజేత

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల కేంద్రంలోని ఉర్సే షరీఫ్ పీరైబ్ సాహెబ్ దర్గా ప్రాంగణంలో జరిగిన అంతర్రాష్ట్ర కుస్తీ పోటీలు ఉత్సాహంగా ముగిశాయి.ఈ పోటీలకు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి పలువురు పైల్వాన్లు తరలివచ్చి తమ సత్తా చాటారు. న్యాల్కల్ కుస్తీ పోటీలు ఎంతో ఉత్సాహంగా సాగాయి.మహారాష్ట్ర, హైదరాబాద్ తో పాటు వివిధ ప్రాంతాల మల్లయోధులు పాల్గొన్న ఈ పోటీల్లో, హైదరాబాద్ కు చెందిన కుశాల్, మహారాష్ట్ర ప్రత్యర్థిని ఓడించి విజేతగా నిలిచారు. విజేత కుశాల్ కు రూ.25,000 నగదు బహుమతితో పాటు శాలువా కప్పి సన్మానించారు. యువత కేరింతల మధ్య జరిగిన ఈ పోటీలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి, ఉర్సు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

గిరిజన యువతికి క్రికెట్ కిట్ అందజేత

గిరిజన యువతి కి క్రికెట్ కిట్ అందించిన కుంజ సూర్య

మంగపేట నేటిధాత్రి

 

 

మంగపేట మండలం బ్రాహ్మణపల్లికి చెందిన బీర స్నేహ గిరిజన యువతి కోచ్ బాడిశ ఆదినారాయణ పర్యవే క్షణలొ శిక్షణ పొంది భూపాలపల్లిలో జరిగిన ఉమ్మడి వరంగల్ అండర్ 17 క్రికెట్ సెలక్షన్ అయింది. కుంజ సూర్య స్నేహ అనే యువతికి క్రికెట్ కిట్ అందించారు.గ్రామాల్లోని గిరిజన యువతులు స్నేహని ఆదర్శంగా తీసుకుని మరికొందరు అమ్మాయిలు క్రికెట్ లో రానించి రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో ఎదిగి ములుగు జిల్లా కి పుట్టిన గ్రామానికి పేరు తీసుకురావాలని సూర్య అన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మైల జయరాం రెడ్డి,ములుగు జిల్లా యూత్ అధ్యక్షులు ఇస్సార్, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు పాల్గొన్నారు.

గణపతి ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి టోర్నమెంట్ ప్రారంభం…

గణపతి ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి టోర్నమెంట్ ప్రారంభం

టోర్నమెంట్ను ప్రారంభించిన సిఐ క్రాంతి కుమార్

పరకాల,నేటిధాత్రి

 

గణపతి ఫ్రెండ్స్ షటిల్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి షటిల్ టోర్నమెంట్ ను పరకాల సీఐ క్రాంతి కుమార్ ప్రారంభించారు.ఈ టోర్నమెంట్లో విజేతలుగా మొదటి బహుమతి బండారి గిరిప్రసాద్,మునావత్ రమేష్ గెలుపొందడం జరిగింది.రెండవ బహుమతి మారపెల్లి రణధీర్,మద్దెల దామోదర్,45 ప్లెస్ విభాగంలో మొదటి బహుమతి సుధమల్ల అనిల్ కుమార్,దామోదర్,రెండవ బహుమతి రాజు,ఆజాద్ వీరికి బహుమతులు గణపతి ఫ్రెండ్స్ షటిల్ క్లబ్ సభ్యులు అందజేశారు.వివిధ ప్రాంతాల నుండి వచ్చిన క్రీడాకారులకు క్లబ్ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న క్రీడాకారులు అజ్జు, బాలకృష్ణ,నాగరాజ్,
సాయికృష్ణ,వెంకన్న,
దేవేందర్,ప్రకాష్,సాయి, చందు,బంటి,వర్ధన్,అశోక్,
సురేష్,మార్కండేయ,శ్రీధర్,సతీష్ తదితరులు పాల్గొన్నారు.

వాలి బాల్ టోర్నమెంట్ ఈ నెల 14 వ తారికు నుండి ప్రారంభం….

వాలి బాల్ టోర్నమెంట్ ఈ నెల 14 వ తారికు నుండి ప్రారంభం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

శ్రీజహీరాబాద్ నియోజకవర్గ ము, కోహిర్ మండల్ ,పోతిరెడ్డిపల్లి గ్రామంలో వాలి బాల్ టోర్నమెంట్ ఈ నెల 14 వ తారికు నుండి ప్రారంభించనున్నారు.గత 15 సంవత్సరాల నుండి ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రు.ఈ టోర్నమెంట్ గ్రామం లో నిర్వాహకులు ఇప్పటికే వాలి బాల్ కోట్ ను సిద్ధం చేశారు.ఈ సందర్భంగా నిర్వాహకుడు జాకీర్ మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి , శారీరిక పరిపక్వత కోసం, దోహదం చేస్తాయి అన్నారు. ఈ వాలీ బాల్ టోర్నమెంట్ కు పోతిరెడ్డిపల్లి గ్రామ ఉప సర్పంచ్ వారసుడు నర్సిములు యాదవ్ స్పాన్సర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ టోర్నమెంట్ లో దాదాపు 15 టీం లు వివిధ ప్రాంతాల నుండి పాల్గొంటున్నారు. ఈ వాలి బాల్ టోర్నమెంట్ ప్రారంభించడానికి జహీరాబాద్ డి యస్ పి సైదా నాయక్ ను నిర్వాహకులు ఆహ్వానం అందించారు. నిర్వాకులు శ్రీనివాస్ రెడ్డి, జాకీర్ ,సలీమ్, ప్రభాకర్, మొయిజ్, విష్ణువర్ధన్,శ్రీకాంత్ చిట్టి, శ్రీకాంత్, అసద్,రహీం,వహిద్ తదితరులు ఉన్నారు.

జనవరి 17న సీఎం కప్ 2025 క్రీడా పోటీలు..

జనవరి 17న సీఎం కప్ 2025 క్రీడా పోటీలుజిల్లా యువజన క్రీడల శాఖ అధికారి రఘు

 

ఛైర్మన్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ, హైదరాబాద్ ఆదేశానుసరము సీఎం కప్ 2025 క్రీడా పోటీలు జనవరి 17వ తేదీ నుండి నిర్వహిస్తామని
జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి రఘు తెలిపారుఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
కావున గ్రామ పంచాయితీ మండల నియోజక వర్గం జిల్లా స్థాయిలో పాల్గొనే అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేసుకోవలసినదిగా కోరనైనది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ రోజు నుండి ప్రారంభం అయినది కావున క్రీడాకారులు తమ ఆధార్ కార్డు ఫోటోతో ఈ క్రింద తెలుపబడిన ఆన్లైన్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి https://satg.telangana.gov.in

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version