సంక్షేమ సారధి మంత్రి సీతక్క…

సంక్షేమ సారధి మంత్రి సీతక్క…

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు…

సీనియర్ కాంగ్రెస్ నాయకులు జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ మెంబర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి…

మంగపేట-నేటిధాత్రి

 

 

 

 

 

సంక్షేమ సారధి మంత్రి సీతక్క అని అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని సీనియర్ కాంగ్రెస్ నాయకులు మరియు జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ మెంబర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి అన్నారు శుక్రవారం మంగపేట మండలం అకినేపల్లి మల్లారం గ్రామంలో ఇటీవల మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల కి ముగ్గులు పోసి నిర్మాణ పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా సాంబశివరెడ్డి మాట్లాడుతూ గత పది సంవత్సరాల్లో మంజూరు కానీ పేదవాడి సొంతింటి కలని నేడు మంత్రి సీతక్క సాకారం చేస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు మొదటి విడతలో అకినేపల్లి మల్లారం గ్రామ పంచాయతీ కి మొత్తం పదమూడు ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని త్వరలోనే మరో విడతలో అర్హులైన పేదలందరికీ పార్టీలకతీతంగా ఇందిరమ్మ పక్కా ఇండ్లు మంత్రి సీతక్క సహకారంతో మంజూరు అవుతాయని అర్హులైన వారు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సాంబశివరెడ్డి అన్నారు ఇంటి నిర్మాణం చేపట్టేటప్పుడు ప్రభుత్వ నిబంధనలను పాటించాలని గ్రామపంచాయతీ కార్యదర్శి మరియు గృహ నిర్మాణ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి లబ్ధిదారులకు సేవలు అందించాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఆమని కాంగ్రెస్ పార్టీ నాయకులు ధూళిపాల బాలకృష్ణ కటుకూరి శేషయ్య శెట్టిపల్లి నర్సింహారావు రవి సాంబశివరావు రాజు శెట్టిపల్లి పూలమ్మ గ్రామపంచాయతీ సిబ్బంది చెట్టిపల్లి వెంకటేశ్వర్లు ఇందిరమ్మ లబ్ధిదారులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

ప్రజా పాలనలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కారానికి.

ప్రజా పాలనలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో

◆ పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి*

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

 

 

ప్రజా సమస్యల పరిష్కారానికై టీపీసీసీ కీలక నిర్ణయం నిర్ణయం తీసుకుంది.అందులో తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి గారిని నియమించారు.వారు శుక్రవారం 20/06/2025,ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు ప్రజల సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలు స్వీకరించారు.అనంతరం సెట్విన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి గారు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా గాంధీ భవన్లో ప్రజల సమస్య లకు సంబంధించిన వినతి పత్రాలు స్వీకరించి వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరిస్తామన్నారు.ఈకార్యక్రమంలో తెలంగాణ ఫిషరిస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు.సాయి కుమార్ మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ చైర్మెన్ బాడిశ నాగరమేష్ ఆర్ధిక సహాయం.

దశ దిన కర్మలకు శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ చైర్మెన్ బాడిశ నాగరమేష్ ఆర్ధిక సహాయం

మంగపేట నేటిధాత్రి:

 

ములుగు జిల్లా మంగపేట మండలం ప్రొద్దుమూర్ గ్రానానికి చెందిన బద్ది పాపారావు ఇటీవల రోడ్ ఆక్సిడెంట్ లో మరణించగా వారి కుటుంబం తీవ్ర దుఃఖం లో వున్నారు.రోజు వారి పనులకు వెళ్లి జీవనం సాగించే ఇంటి పెద్ద అనుకోని ప్రమాదం లో చనిపోవడం ,మృతునికి ఇద్దరు చిన్న పిల్లలు ఉండటం ఏం చేయలేని నిస్సహాయ స్థితి లో ఉన్న వారి కుటుంబ పరిస్థితి ని స్థానికులు శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ వారికి తెలియజేయగా దశదినకర్మల నిమిత్తం (4000 రూపాయలవిలువైన)50 కేజీల బియ్యం,నిత్యవసర సరుకులు స్థానికులు చే వారి కుటుంబానికి అందజేశారు.అడగగానే సహాయం అందజేసిన శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ చైర్మన్ బాడిశ నాగ రమేష్ కు మరియు ట్రస్ట్ సభ్యులకు స్థానికులు కృతజ్ఞతలు తెలియచేసారు .ఈ కార్యక్రమంలో మాను పెళ్లి. వేణు,కలల రాంబాబు,గుగ్గిల సురేష్,బద్ది రఘుబాబు,మానపల్లి రోహిత్. బద్ది సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

శరణార్థులను ఆదుకోవాలి.

శరణార్థులను ఆదుకోవాలి.

సోషలిస్ట్ రిపబ్లికం అసోసియేషన్ అధ్యక్షుడు రాజలింగు మోతే

మంచిర్యాల జూన్ 20 నేటి ధాత్రి:

శరణార్థులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ అధ్యక్షుడు, అడ్వకేట్ రాజలింగు మోతే అన్నారు. శుక్రవారం అంతర్జాతీయ శరణార్థుల దినోత్సవం సందర్భంగా మంచిర్యాల ఎస్ ఆర్ ఏ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ… యుద్ధాలు, హింస, లేదా ఇతర కారణాల వల్ల తమ దేశాలను వదిలి వలస వచ్చిన ప్రజలకు ఆహారం, నీరు, వసతి, వైద్య సహాయం, విద్యను అందించి వారికి ప్రభుత్వాలు రక్షణ కల్పించాలని ఆయన అన్నారు.
శరణార్థుల చట్టపరమైన న్యాయపరమైన హక్కులను కాపాడే బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు.వారు సమాజంలో కలిసిపోయేలా మరియు సమాన అవకాశాలు పొందేలా చూడాలన్నారు. వారిని సామాజిక దృక్పథంతో అర్థం చేసుకోవాలన్నారు.కార్యక్రమంలో ఎస్ ఆర్ ఏ రాష్ట్ర నాయకులు సైకాలజిస్ట్ డాక్టర్ అంబాల సమ్మయ్య, జిల్లా నాయకుడు కాంపెల్లి హరి చరణ్, సాయి తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన చదువు.!

ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన చదువు తల్లిదండ్రులారా ఆలోచించండి

ట్రైనింగ్ పొందిన టీచర్స్

చదువులో అనుభవం ఉన్న టీచర్స్

పిల్లలకు అనుగుణంగా చదువు చెప్పే టీచర్స్

పిల్లలలోని ప్రతిభను గుర్తించే టీచర్స్

గణపురం నేటి ధాత్రి

 

 

 

గణపురం మండల బస్వ రాజు పల్లి పాఠశాల లో సౌకర్యాలు మెరుగుపరుస్తున్నారు . ప్రభుత్వ పాఠశాల లో బోదించే ఉపాధ్యాయులు మంచి ప్రతిబావంతులు ఉన్నారు ప్రజలు వారి పిల్లలని తమ దగ్గరలోని ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని అనవసరంగా డబ్బులు ప్రయివేట్ విద్యా సంస్థలకి వృధా చేసుకోవద్దని తీన్మార్ మల్లన్న టీమ్ గణపురం మండల అధ్యక్షులు గండు కర్ణాకర్ ప్రజలకి సూచించారు. తాను కూడా తమ గ్రామం బస్వరాజపల్లి లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలకి అతని కూతురుని పంపిస్తూన్నానని ప్రజలు కూడా ప్రభుత్వ పాఠశాలల వైవు చూడాలని, ముక్యంగా వివిధ పార్టీల నాయకులు, రాజకీయ నాయకులు తప్పనిసరిగా వాళ్ళ పిల్లలని ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని డిమాండ్ చేసారు. ఇలా చేస్తే ప్రజలకి ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కలుగుతుందని చెప్పారు

మృతి చెందిన ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్థిక చేయూత.

మృతి చెందిన ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్థిక చేయూత..

రామకృష్ణాపూర్ నేటిధాత్రి:

 

రామకృష్ణాపూర్ పట్టణంలోని ఆర్కే ఫోర్ గడ్డ ఏరియాలో నివాసం ఉండే ఆటో డ్రైవర్ గోగర్ల భీమయ్య గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఈ నెల 9న మృతి చెందగా శుక్రవారం గోగర్ల భీమయ్య కుటుంబానికి ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు గాండ్ల సమ్మయ్య, అధ్యక్షులు ఎనగంటి సంపత్ ఆధ్వర్యంలో 10 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తూ మనోధైర్యాన్ని అందించారు. భీమయ్య మృతి తోటి డ్రైవర్లను కలిచివేసింధని తోటి డ్రైవర్లు అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ఉపాధ్యక్షులు పాక అంజయ్య, కమిటీ సభ్యులు ఆల్క పున్నం, చెన్నాల సారయ్య, శ్రీనివాస్, కున్సోత్ సీతారాం నాయక్, నర్సయ్య, రవి,కిషన్ తదితరులు పాల్గొన్నారు.

పైడిపల్లిలో ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నం..!

పైడిపల్లిలో ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నం..!

నగరంలో బండి కుమారస్వామి కబ్జా విషయం ఇంకా కనుమరుగక ముందే, ఎల్లవుల కుమార్ యాదవ్ కబ్జాకు ప్రయత్నం?

ప్రభుత్వ భూమిని కబ్జాకు ప్రయత్నం చేస్తున్న ఎల్లావుల కుమార్ యాదవ్ పై రౌడీషీట్ ఓపెన్ చేయాలి :_ సంఘీ ఎలేందర్, దళిత హక్కుల పోరాట సమితి వరంగల్ జిల్లా అధ్యక్షులు.

పైడిపల్లి, నేటిధాత్రి.

 

 

 

 

వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం పైడిపల్లి గ్రామ శివారు సర్వే నెంబరు 264లో ఎల్లావుల కుమార్ యాదవ్ ప్రభుత్వ భూమిని కబ్జాకు ప్రయత్నం చేస్తున్న విషయం తెలుసుకొని, దళిత హక్కుల పోరాట సమితి వరంగల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శి సంఘీ ఎలేందర్, జన్ను రవి లు అట్టి ప్రభుత్వ భూమిని సందర్శించిన అనంతరం మాట్లాడుతూ ఎల్లవుల కుమార్ యాదవ్ సర్వేనెంబర్ 263లో రిజిస్ట్రేషన్ చూపించి సర్వే నంబర్ 264 భూములను అమ్మినాడని, ఇట్టి విషయంపై గత కొన్ని ఏళ్లుగా పోరాటం చేయుచుండగా, వరంగల్ తహశీల్దార్ ఇట్టి భూమిలో, ఇది ప్రభుత్వ భూమి ఎవరు అక్రమించరాదని బోర్డు పెట్టడం జరిగినది అని, అయినా కానీ తన వైఖరి మార్చుకోకుండా కొందరి రాజకీయ నాయకుల పేర్లు చెప్పి, అక్కడున్న గుడిసె వాసులను భయభ్రాంతులకు గురిచేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. కావున ఎల్లవుల కుమార్ యాదవ్ పై నమోదైన కేసుల సంఖ్యలు పరిశీలించి వరంగల్ పోలీస్ కమిషనర్ అతడిపై రౌడీ షీటర్ ఓపెన్ చేయాలని కోరడమైనది. నగరంలో బండి కుమారస్వామి కబ్జా విషయం ఇంకా కనుమరుగక ముందే ఎల్లవుల కుమార్ యాదవ్ కబ్జాకు ప్రయత్నం చేయడం వరంగల్ జిల్లాలో పెద్ద హాట్ టాపిక్ గా మారిందని భూకబ్జాదారులను వెంటనే వరంగల్ పోలీస్ కమిషనర్ కట్టడి చేయాలని దళిత హక్కుల పోరాట సమితి నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో
సిపిఐ నాయకులు ఆరే రాజు, మాస్కే సుదీర్, బెజ్జంకి యాకంబ్రచారి, రాచర్ల రాజేందర్, మంద నవీన్ లు పాల్గొన్నారు.

హామీ మేరకు రైతులకు అన్ని వడ్లకు బోనస్ ఇవ్వాలి.

ఎన్నికల హామీ మేరకు రైతులకు అన్ని వడ్లకు బోనస్ ఇవ్వాలి,

ప్రతి రైతుకు రైతు భరోసా నిధులు ఇవ్వాలి,

యూరియా సరఫరా లో ప్రభుత్వం విఫలం

గణపురం మాజీ సొసైటీ ఛైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండల కేంద్రంలో వడ్లు పండించిన ప్రతి రైతుకు ఎన్నికల హామీ మేరకు బోనస్ ఇవ్వాలని గణపురం మాజీ సొసైటీ ఛైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు హామీల అమలు విషయంలో కాలయాపన చేస్తున్నారని అన్నారు, ఇప్పటికైనా రైతులు పండించిన అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని, ప్రతి రైతుకు రైతు బంధు పథకం అమలు చేయాలని, లేని పక్షంలో రైతుల పక్షాన ధర్నా చేపడతామని అన్నారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో అనేక కొర్రీలు పెట్టి రైతులను ఇబ్బంది పెట్టారని, కొందరు రైతులకు ఇప్పటికీ ధాన్యం డబ్బులు పడలేదని, జిల్లా యంత్రాంగం రైతులకు అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. వానకాలం పంట సాగు సమీపిస్తున్న ఇప్పటికీ యూరియా అందుబాటులో లేదని, రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు.

హఫీజ్ భాయ్ సోదరుని రిసెప్షన్ వేడుకలో పాల్గొన్న నాయకులు.

హఫీజ్ భాయ్ సోదరుని రిసెప్షన్ వేడుకలో పాల్గొన్న నాయకులు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం మండలం చిలపల్లి మాజీ ఎంపీటీసీ హఫీజ్ భాయ్ సోదరుని రిసెప్షన్ వేడుకలో పాల్గొన్నా జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ మరియు జహీరాబాద్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి ఝరాసంగం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హనుమంతరావు పాటిల్ మరియు ఉదయ్ శంకర్ అశ్విన్ పటేల్ మొహమ్మద్ జఫర్ ప్రసాద్ ఫక్రుద్దీన్ సద్దాం హుస్సేన్ రవి శీను పార్టీ పెద్దలు, నాయకులు,యుత్ కాంగ్రెస్ నాయకులు. పాల్గొన్నారు.

ఎమ్మెల్యే పల్లా గారిని పరామర్శించిన మాజీ మంత్రి.

ఎమ్మెల్యే పల్లా గారిని పరామర్శించిన మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

ఇటీవల స్వల్ప ప్రమాదానికి గురై హైదరాబాద్ లోని సోమాజిగూడ యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న జనగామ ఎమ్మెల్యే డా.పల్లా రాజేశ్వర్ రెడ్డి గారిని శుక్రవారం మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు,జహీరాబాద్ శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు పరామర్శించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే పల్లా గారిని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఎమ్మెల్యేలు సంగారెడ్డి, కుత్బుల్లాపూర్ వివేక్ గౌడ్,ఎమ్మెల్సీ నవీన్ రావు గార్లు ఉన్నారు.

ఉచిత కంటి శిబిరం ఘనంగా జరిగింది.

ఉచిత కంటి శిబిరం ఘనంగా జరిగింది.

మెట్ పల్లి జూన్ 20 నేటి ధాత్రి:

మెట్ పల్లి మండలం ఆత్మకూర్ గ్రామంలో మెట్ పల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిబిరం ఘనంగా జరిగింది.
లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఇల్లెందుల శ్రీనివాస్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ మెట్పల్లి వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం రేకుర్తి హాస్పిటల్ వైద్యులు డాక్టర్ చే కంటి పరీక్షలు చేశారని దాదాపు 300 మంది కంటి వైద్య శిబిరానికి హాజరైనారు .
ఇందులో 50. మందికి ఆపరేషన్ అవసరం ఉన్న వారికి లయన్స్ క్లబ్ నుండి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసి రేకుర్తి హాస్పిటల్కు పంపించడం జరిగిందని అక్కడ ఆపరేషన్ చేసి అనంతరం తిరిగి ఆత్మకూర్ గ్రామం కు ఉచితంగానే బస్సులో తీసుకు వస్తామని అన్నారు. ప్రతి ఒక్కరూ కంటి వైద్య పరీక్షలు చేయించుకొని లబ్ధి పొందాలని అదేవిధంగా సంవత్సరం ఆరు సార్లు కంటి వైద్య శిబిరం రెండుసార్లు గుండె వైద్య శిబిరం చేస్తామని ఇటీవల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్యాన్సర్ వైద్య శిబిరం ఏర్పాటు చేశామని పట్టణ గ్రామీణ ప్రజలు అత్యధిక మంది సద్వినియోగం చేసుకున్నారని ప్రభుత్వ పాఠశాలలో గాని హాస్టల్లో గాని ఇతర పేదవారికి ఫుట్పాత్ వ్యాపారులకు అంబ్రెల్లాల్సు లయన్స్ క్లబ్ ద్వారా ఉచితంగా అందిస్తుందని పట్టణ గ్రామీణ ప్రజలు లయన్స్ క్లబ్ సేవలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు .
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఇల్లెందుల శ్రీనివాస్, సెక్రెటరీ గూండా రాకేష్ క్యాషియర్ నాంపల్లి వేణు గోపాల్, వెల్ముల శ్రీనివాసరావు, మర్రి భాస్కర్,ఆల్ రౌండర్ గంగాధర్ లయన్స్ క్లబ్ సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

పదోన్నతి పొందిన లక్ష్మణ్ సన్మానం.

పదోన్నతి పొందిన లక్ష్మణ్ సన్మానం

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నర్సంపేట డిపోలో సెక్యూరిటీ హెడ్ గార్డ్ గా పదోన్నతి పొంది బదిలీపై కరీంనగర్ వర్క్ షాప్ వెళ్తున్న భోజనపు లక్ష్మణ్ ను ఆర్టీసీ సిబ్బంది ఘన సన్మానం చేశారు.ఈ సందర్భంగా
డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీతో పాటు డిపో సెక్యూరిటీ హెడ్ వీరారెడ్డి, సెక్యూరిటీ టీం గోవర్ధన్,దేవేందర్ లక్ష్మణ్ ను శాలువాలు,పుష్ప గుచ్చo తో సన్మానం చేశారు.అనంతరం శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం లో డిపో ఆఫీస్ సీనియర్ అసిస్టెంట్ వెంకట్ రెడ్డి,గ్యారేజ్ సిబ్బంది,డిపో ఉద్యోగులు పాల్గొన్నారు.

మున్సిపాలిటీ పరిధిలోని సమస్యలను పరిష్కరించాలి.

మున్సిపాలిటీ పరిధిలోని సమస్యలను పరిష్కరించాలి

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

 

 

 

మున్సిపాలిటీ పరిధిలోని విలీన గ్రామాలలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిపిఐ మండల కార్యదర్శి చొప్పరి శేఖర్, సిపిఐ మండల సహాయ కార్యదర్శి మంద భాస్కర్ డిమాండ్ చేశారు. శుక్రవారం కేసముద్రం మున్సిపాలిటీ కేంద్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) పట్టణ ఆర్గనైజింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చొప్పరి శేఖర్, మంద భాస్కర్ మాట్లాడుతూ కేసముద్రం మున్సిపాలిటీగా ఏర్పడినప్పటి నుంచి పాలన గాడి తప్పిందన్నారు. ఫుల్ టైం కమిషనర్ లేక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందన్నారు. విలీన గ్రామాలలో వీధిలైట్లు వెలగక పోవడంతో బయటకు రావాలంటే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాల నేపథ్యంలో సీజనల్ వ్యాధుల బారిన ప్రజలు పడకుండా పారిశుధ్యం పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. అంతేకాకుండా దోమలు రాత్రి వేళల్లో స్వ్యేరా విహారం చేయడం వలన కంటిమీద కునుకు లేకుండా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, అదేవిధంగా విష జ్వరాల బారిన పడకుండా తక్షణమే ఫాగింగ్ చేపట్టాలని, సైడ్ కాల్వల్లో ఆయిల్ బాల్స్ వేయాలని అన్నారు. తక్షణమే మున్సిపాలిటీ అధికారులు స్పందించి సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా 100 సంవత్సరాల చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) శాఖ మహాసభలు జూన్ 21 నుండి 29 వరకు జరుగుతాయని, జూన్ 30న మున్సిపాలిటీ కేంద్రంలో మండల మహాసభ జరుగుతుందని,ఈ మహాసభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం సిపిఐ నాయకులు కాసు సాయిచరణ్, ఎస్కే ఇమామ్ తదితరులు పాల్గొన్నారు.

రూపాదేవి వర్ధంతి వేడుకలు.

రూపాదేవి వర్ధంతి వేడుకలు

గంగాధర నేటిధాత్రి:

 

చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారి సతీమణి రూపాదేవి మొదటి వర్ధంతి వేడుకలను శుక్రవారం గంగాధర మండలంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గంగాధర ప్రజా కార్యాలయంలో రూపా దేవి చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గంగాధర ప్రభుత్వ పాఠశాలలో 200 మంది విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

నూతన ఎస్ఐ ని కలిసిన ఎస్ఎఫ్ఐ నాయకులు.

నూతన ఎస్ఐ ని కలిసిన ఎస్ఎఫ్ఐ నాయకులు

పరకాల నేటిధాత్రి

 

 

పరకాల పట్టణానికి నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్ఐ విటల్ ని ఎస్ఎఫ్ఐ నాయకులు ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్,మండల అధ్యక్షుడు మడికొండ ప్రశాంత్ పట్టణ అధ్యక్షుడు బొచ్చు ఈశ్వర్ మర్యాదపూర్వకంగా కలిసారు.

గణేష్ పార్థీవ దేహానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే.

ఆవోయిస్టు గణేష్ పార్థీవ దేహానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే జిఎస్ఆర్

భూపాలపల్లి నేటిధాత్రి:

 

టేకుమట్ల మండలం వెలిశాల గ్రామానికి చెందిన మావోయిస్ట్ పార్టీ నాయకుడు గాజర్ల రవి అలియాస్‌ గణేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి జిల్లా మారేడుమిల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కింటుకూరు అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటరులో మరణించారు విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు వెలిశాల గ్రామంలో గాజర్ల రవి అలియాస్ గణేష్ ఉదయ్ పార్థీవ దేహానికి పూల మాల వేసి నివాళులు అర్పించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. అనంతరం మృతి చెందిన మావోయిస్టు కేంద్ర కమిటీ నేత గాజర్ల రవి ఉదయ్, గణేష్ సోదరుడు అయినటువంటి మాజీ మావోయిస్టు నేత, ప్రస్తుత పిసిసి అధికార ప్రతినిధి గాజర్ల అశోక్ ఐతుతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకుని ఆయనను ఓదార్చారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

కొత్తరంగులతో కనుసొంపైన హనుమాన్ దేవాలయ కమాన్.

కొత్తరంగులతో కనుసొంపైన హనుమాన్ దేవాలయ కమాన్

 

పరకాల నేటిధాత్రి:

 

హన్మకొండ జిల్లా పరకాల మండలపరిధిలోని మల్లక్కపేట గ్రామంలో గల భక్తంజనేయ స్వామి దేవాలయ కమాన్ కొత్త హంగులను పులుముకుంది.ఆలయ ముఖ ద్వారానికి భక్తుల సహ కారంతో నూతనంగా రంగులు మరియు విద్యుత్ దీపాల కాంతులతో కొత్త శోభ సంతరించుకుంది.సమారుగా 80 వేల రూపాయలతో ఈ పనులు జరిగినట్టు ఆలయ చైర్మన్ అంబీరు మహేందర్ ఒక ప్రకటనలో తెలిపారు.నూతనంగా ఎన్నికైన ఆలయ కమిటీ చైర్మన్ అంబీర్ మహేందర్ ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో ఆలయం నూతన వసతులతో విరాజీళ్ళుతుందని చెప్పడానికి ఇదే నిదర్శనంగా చెప్పుకోవచ్చు.ఆలయ అభివృద్దికి సహకరించే దాతలు ఆలయ చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి లను సంప్రదించాలని కోరారు.

ప్రైవేట్ పాఠశాలను తలపిస్తున్న సర్కార్ బడి.

ప్రైవేట్ పాఠశాలను తలపిస్తున్న సర్కార్ బడి

ఇబ్రహీంపట్నం. నేటిధాత్రి

 

 

 

ఇబ్రహీంపట్నం మండలంలోని వర్ష కొండ గ్రామంలో మండల్ పరిషత్ పాఠశాల గత ఏడాది జూన్ నెలలో 20. మంది పిల్లలతో ఉన్న బడి ఈ సంవత్సరం 70.విద్యార్థులతో ప్రవేట్ పాఠశాలకు దీటుగా కేవలం ఒక సంవత్సరంలో పాఠశాలక మారిపోయింది ప్రమోషన్ ద్వారా ప్రధానోపాధ్యాయులుగా బాధ్యతలు స్వీకరించిన అచ్చ విజయ్ భాస్కర్ కేవలం సంవత్సర కాలంలోనే పూర్తిగా మార్చుకున్నారు దీని కొరకు గ్రామంలో ఇంటింటికి తిరిగి పిల్లల తల్లిదండ్రులకు నమ్మకం కలిగించేట్లు భరోసా ఇవ్వగలిగాడు వెంటనే గ్రామ పెద్దలను కలిసి బడికి కావలసిన అవసరాలపై చర్చించి ఒక్కొక్కటిగా రాబట్టుకునే ప్రయత్నం చేశాడు మొదట గ్రామ ఎంపీటీసీ పోనుకంటి చిన్న వెంకట్ పిల్లలకు టై. బెల్ట్. ఐడి కార్డు ఇచ్చారు తరగతి లో పాఠ్యాంశ బోధనకు గ్రామంలోకి తీసుకుపోయే విధంగా యూట్యూబ్ ఛానల్ లలో ఏర్పాటు చేశారు తద్వారా బడిని గ్రామానికి అనుసంధానం చేయడంలో సఫలం అయ్యారు అంతటితో ఆగకుండా గ్రామంలోని పెద్దలను. మరియు యువతను సభ్యులుగా చేస్తూ ఒక వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేసి బడిలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని గ్రామంలోకి తీసుకువెళ్లారు దీనితో బడి వైపు దాతలు ముందుకు వచ్చారు జియో ఫైబర్.

 

బడికి అవసరం కొరకు ప్రింటర్ మరియు బడి రక్షణ కొరకై సీసీ కెమెరాలు దాతల సహకారంతో ఏర్పాటు చేశారు ఈ దశలో దుబాయిలో ఉండే గ్రామ నివాసి మంగలి పెళ్లి మహిపాల్.

 

private school

 

 

దృష్టికి తీసుకువెళ్లారు బడి డెవలప్మెంట్ కోసం ఏమన్నా సహాయం చేయాలని కోరారు అతను వెంటనే స్పందించి బడికి టాయిలెట్స్ రిపేరు మరియు రన్నింగ్ వాటర్ కొరకు 110.000లక్ష పది రూపాయలు మరియు అంతేకాకుండా మరమూర్తులకు బడి ప్రైవేట్ పాఠశాల లాగా కనపడే విధంగా 90 వేల రూపాయలతో పెయింటింగ్. మరియు పిల్లలకు ఆడుకునేటట్లు పాట వస్తువులకు 80000 రూపాయలతో పాటవస్తులు ఏర్పాటు చేశారు ప్రజల ఉపాధ్యాయుల గదిలో 5000 రూపాయలతో దేశ నాయకుల ఫోటోలు ఏర్పాటు చేశారు అలాగే బడి వార్షికోత్సవ కార్యక్రమానికి పదిహేడు వేల రూపాయలు ఇచ్చారు మొత్తం కలిపి 300000 రూపాయలు తన సొంత డబ్బులతో పాఠశాలకు ఖర్చు చేశారు సొంత గ్రామ బడిని నిలబెట్టిన మంగలి పెళ్లి మహిపాల్ గ్రామస్తులు అభినందించారు లో ఉండేది మనుగడే ప్రశ్నార్థకంగా ఉన్నప్పటి పరిస్థితుల నుండి ఈ సంవత్సరం 70 మంది విద్యార్థులతో ప్రైవేట్ పాఠశాలకు దీటుగా కేవలం ఒక సంవత్సరంలోనే పాఠశాల మారిపోయింది

అంతర్జాతీయ యోగా దినోత్సవం విజయవంతం చేయండి.

అంతర్జాతీయ యోగా దినోత్సవం విజయవంతం చేయండి

సిరిసిల్ల టౌన్:( నేటి ధాత్రి )

 

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు ప్రెస్ క్లబ్ లో రేపు జరగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవ దశాబ్ద వేడుకల్లో భాగంగా ఈరోజు ప్రెస్ క్లబ్ లో ఆయుష్ యునాని డిస్పెన్సరీ యోగా శిక్షకులు బీ.శ్రీనివాస్ మాట్లాడుతూ భారత ప్రధాని అయిన నరేంద్ర మోడీ గారు 2014లో జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగినది. అందుకు రేపు సిరిసిల్ల జిల్లాలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రభుత్వం నుండి జరుపుతూ స్వచ్ఛంద సేవా సంస్థలు, విద్యార్థులు, యువకులు, అధికారులు, నాయకులు, ప్రజలు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని కోరడం జరిగినది. నేటి పరిస్థితుల్లో మానవ జీవన గమనానికి యోగా ప్రతి వ్యక్తికి అవసరమైనటువంటిదని తెలిపారు. రేపు జరగబోయే యోగా దినోత్సవం విజయవంతం చేయవలసిందిగా కోరడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఆయుష్ యునాని డిస్పెన్సరీ యోగా శిక్షకులు బీ.శ్రీనివాస్,మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడెపు రవీందర్, బెల్లాజి శ్రీనివాస్,దూస రమేష్. ఉప్పరపల్లి విజయ్. వడ్నాల శ్రీనివాస్. కోడం రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

గ్రామపంచాయతీ సందర్శించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు.

మర్యాదపూర్వకంగా గ్రామపంచాయతీ సందర్శించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి:

 

తంగళ్ళపల్లి మండల నేరెళ్ల గ్రామపంచాయతీలో. తంగళ్ళపల్లి మండల అధ్యక్షులు ప్రవీణ్. మర్యాదపూర్వకంగా కలిసి ప్రభుత్వం ప్రవేశపెట్టిన. రైతు భరోసా. గ్రామంలో రైతులందరికీ సక్రమంగా పడుతుందా. ఏమైనా సందేహాలు ఉంటే సంబంధిత అధికారుల.దృష్టికి తీసుకెళ్లి రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని. తరతరాలుగా పంటలు సాగు చేస్తూ జీవనోపాధి.పొందుతున్న రైతులకు రైతు భరోసా వచ్చేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత. అధికారులకు.సూచించారు అలాగే మండలంలో రైతులు. ఎలాంటి మాయమాటలు నమ్మి మోసపోవద్దని ఈ సందర్భంగా తెలియజేశారు అలాగే నేను రైతులను దృష్టిలో ఉంచుకొని వచ్చాను తప్ప అధికారికంగా కాదు దయచేసి ప్రజలు గమనించాలి. ఈయన వెంట ఏ ఎం సి వైస్ చైర్మన్ నేరెళ్ళ నరసింహ గౌడ్. ఆరేపల్లి బాలు. రైతులు నాయకులు తదితరులు ఉన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version