అధికారులు ఎవరైనా ప్రశ్నిస్తే కులస్థంగాల నాయకులతోటి బెదిరింపులు
చందానగర్ టౌన్ ప్లానింగ్ ఏసిపి శిష్యుడుగా*
చందానగర్ సర్కిల్లో సామాన్యులు అధికారులను
కలవాలంటే శ్రీనివాస్ ను
కలిసిన తర్వాతనే అధికారులని
అపార్ట్మెంట్ ఇప్పిస్తాడు
గత సంవత్సరం క్రితమే సర్కిల్ పటాన్చెరు ట్రాన్స్ఫర్ అయ్యి
మళ్లీ చందానగర్ సర్కిల్ కు రావడం ఆశ్చర్యమేంటి
చందానగర్ సర్కిల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగి చెప్పిందే వేదం గత 20 పైనే సంవత్సరాలుగా చందానగర్ సర్కిల్లో పాతుకపోయాడు బిల్లింగ్ పర్మిషన్ కావాలన్నా శ్రీనివాస్ నీ కలవాల్సిందే
అయ్యప్ప సొసైటీలో ఎలాంటి పర్మిషన్లు ఉండవు అది అలుసుగా తీసుకొని, శ్రీనివాస్ బిల్డర్స్ దగ్గర భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసి ఆఫీసర్లకు,లీడర్లకు, రిపోర్టర్స్ నేను*
చూసుకుంటానని చెబుతాడు
ఒక బిల్డర్ ఔట్సోర్సింగ్, శ్రీనివాస్ నా దగ్గర మొత్తం డబ్బులు, తీసుకొని నేను ఇస్తానని చెప్పాడు, కావలసి అంటే శ్రీనివాసు డబ్బులు తీసుకుపోయిన వీడియో, ఆడియో, నా దగ్గర ఉన్నది నేను దేనికైనా రెడీ అని బిల్డర్ చెప్తున్నాడు
*చందానగర్ సర్కిల్-21లో కింగ్ మేకర్ ఔట్ సోర్సింగ్, ఉద్యోగి, శ్రీనివాస్,
నిర్మాణాలు జరగాలంటే వీరు అడిగినంత ఇవ్వాల్సిందే
శేరిలింగంపల్లి, నేటి ధాత్రి, :-
చందానగర్ సర్కిల్లో ,ఔట్ సోర్సింగ్ కింగ్ మేకర్ శ్రీనివాస్ అవతారమెత్తారు. చందానగర్ లో ఆడిందే ఆట..పాడిందే పాటన్న చందనంగా మారిపోయింది. చందానగర్ సర్కిల్ లిమిట్స్ లో ప్రతీరోజు అనేక చోట్ల కొత్త భవనాలు,అదనపు బిల్డింగ్స్ నిర్మాణాలు,సెల్లార్ల కన్స్ట్రక్షన్స్ జరుగుతుంటాయి. అయితే ఎక్కడ కొత్త నిర్మాణాలు ప్రారంభమైనా చైన్ మెన్ లేకపోవడంతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు గద్దల్లా వాలిపోవడం పరిపాటిగా మారిపోయింది. భవన నిర్మాణ యాజమానులు వీరికి అడిగినంత ఇస్తే కానీ,అస్సలు ఊరుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. జీరో పర్మిషన్ కు ఎంత చెల్లించాలి,అదనపు ఫోర్స్ కన్స్ట్రక్షన్ కు ఎంత ముట్టజెప్పాలి..కొత్త భవనాల నిర్మాణాలకు ఎంత చెల్లించాలి అనే విషయాలపై వీరే ఓ ధరను నిర్ణయించేస్తున్నారు.
ఒకవేళ వీరు చెప్పినంత ఇవ్వకుంటే వెంటనే ఉన్నతాధికారులకు సదరు నిర్మాణ యాజమానుల వివరాలను చేరవేసి పనులను నిలిపివేయిస్తున్నారనే విమర్శలున్నాయి. ఫైర్ సెఫ్టీ,సెట్ బ్యాక్,ఇతరత్రా కారణాలు చెప్పి నిర్మాణాలు నిలుపుదల చేయిస్తున్నారు. ఈ విషయంలో ఔట్ సోర్సింగ్ శ్రీనివాస్ ఉన్నతాధికారుల నుంచి అండదండలు పుష్కలంగా అందుతున్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులు ఇచ్చిన సపోర్టుతోనే ఈ అవినీతి చేప పిల్లలు రెచ్చిపోతున్నట్లు సమాచారం. రోజు వారిగా బిల్డింగ్ నిర్మాణ యాజమానుల దగ్గర వసూల్ చేసుకొచ్చిన అవినీతి సోమ్మును పై అధికారులకు వారి వారి స్థాయిలను బట్టి ఎవరి ముల్లే వారికి అప్పజెబుతున్నట్లు తెలుస్తోంది. చందానగర్ సర్కిల్-21 లిమిట్స్ లో వీరి ఆగడాలకు అడ్డూ-అదుపులేని పరిస్థితి దాపురించింది. ఈ వ్యవహరాలపై పలుమార్లు పత్రికల్లో వార్తలు వచ్చినా..ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. అయితే వీరి లీలలను భరించలేని పబ్లిక్ మాత్రం మున్సిపల్ అధికారులపై దుమ్మెత్తిపోస్తున్నారు