క్రీడలతో వ్యక్తిత్వ వికాసం దోహదపడుతుంది :
◆:- పార్లమెంట్ ఇంచార్జ్ జి శుక్లవర్ధన్ రెడ్డి*
◆:- హజ్రత్ షేక్ శహబుద్దిన్ మెగా వాలీబాల్ విజేత జట్టుకు ట్రాఫి నగదు బహుకరణ
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్. మండలంలోని శేకపూర్ గ్రామంలో హజ్రత్ షేక్ శహబుద్దిన్ మెగా వాలీబాల్ ట్రాఫీ సీజన్. 4(2025) దిడిగి ఫ్రెండ్స్ విజేతగా నిలిచింది. గత నాలుగు సంవత్సరాలుగా ఉర్సు ఉత్సవాలకు ఒక రోజు ముందు క్రీడలను నిర్వహించి క్రీడకలరులను ప్రోత్సహిస్తారు. ఫైనల్ విజేతగా నిలిచిన దిడిగి ఫ్రెండ్స్ జట్టుకు ఆకర్షణీయమైన ట్రాఫీతో పాటు నగదు బహుమతిని పార్లమెంట్ ఇంచార్జ్ గంకటి శుక్లవర్ధన్ రెడ్డి, పవార్ శ్రీనివాస్ నాయక్ చేతుల మీదుగా అందించారు. రన్నరప్ జట్టు అయిన అల్గోల్ టెంరిస్ జట్టుకు మాజీ ఎంపిటిసి దేశెట్టి పాటిల్, న్యాయవాది నతనియల్, ఆచార్య డిగ్రీ కళాశాల డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా ట్రాఫితో పాటు నగదు బహుమానం అందించారు. తృతీయ స్థానంలో నిలిచిన రాయపల్లి జట్టుకు కాంగ్రెస్ నాయకులు రాథోడ్ ప్రేమ్ సింగ్, ఇనాయత్ పటేల్ మల్చేల్మా చేతుల మీదుగా ట్రాఫీతో పాటు నగదు బహుమతి అందజేశారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన పార్లమెంట్ ఇంచార్జ్ శుక్లవర్ధన్ రెడ్డి, సర్పంచ్ ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి, మొహమ్మద్ జమిల్, ఇనాయత్ పటేల్ లకు నిర్వాహకులు ఘనంగా శాలువా పులమలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఇంచార్జ్ శుక్లవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ క్రీడలతో వ్యక్తిత్వ వికాసం పెంపొందుతుందని, క్రీడల్లో రాణించిన ఎందరో యువత నేడు స్పోర్ట్స్ కోటా కింద ప్రభుత్వ ఉద్యోగాల్లో రాణిస్తున్నరాని, భవిషత్తులో తనవంతు సహాయ సహకారాలు అందిస్తూ ఇలాంటి మరిన్ని టౌర్నీలు జరిగేవిధంగా తోడ్పాటు అందిస్తామని, శేకపూర్ గ్రామ ప్రజలకు హజ్రత్ షేక్ శహబుద్దిన్ 675 వ జాతర ఉత్సవ శుభాకాంక్షలు తెలువుతున్నానని, భవిష్యత్తులో కూడా ఇలాగే ఐకమత్యంగా ముందుకు వెళ్లి అనేక విజయాలు సాధించలని, గతంలో మా నాన్న ఎంపిటిసిగా ఉన్నప్పుడు శేకపూర్ గ్రామంతో ప్రత్యేక అనుభందం ఉండేదని, ఇప్పుడు దానికి వారసులుగా మేము ముందుకు వెళ్ళడానికి శయశక్తులు ప్రయత్నిస్తానని అన్నారు. కార్యక్రమంలో ఉర్సు కమిటీ అధ్యక్షుడు మొహమ్మద్ చష్మోద్దీన్, నియోజకవర్గ మైనారిటీ అధ్యక్షుడు మొహమ్మద్ జమిలోద్దీన్, జిల్లా ఎస్టీ కాంగ్రెస్ నాయకులు రాథోడ్ ప్రేమ్ సింగ్ జిడిగడ్డ తండా, సర్పంచ్ ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి, మొహమ్మద్ ఖుర్శిద్ మియా, మొహమ్మద్ అరిఫ్ అలీ, మహేబూబ్ పాష సదర్, జావిద్ ముసవలె, ముజాహిద్ ముసవలె, ఇనాయత్ పటేల్ మల్చేల్మా, మొయిజ్ లష్కరి, నవాజ్ పటేల్, అబ్దుల్లా సిద్దిఖీ, అసద్ యఫై, అమెర్ యఫై, షాకిర్ ఓస్తద్, మొహమ్మద్ మజీద్ తదితరులు పాల్గొన్నారు.