బెంగళూరు ట్రాఫిక్‌తో ఇక్కట్లపాలు.

బెంగళూరు ట్రాఫిక్‌తో ఇక్కట్లపాలు.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సమాజ్ వాదీ పార్టీ ఎంపీ

 

బెంగళూరు ట్రాఫిక్‌ నిర్వహణపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సమాజ్‌వాదీ ఎంపీ రాజీవ్‌రాయ్ పెట్టిన పోస్టు ప్రస్తుతం నెట్టింట సంచలనంగా మారింది. ట్రాఫిక్‌ జామ్‌ను సరిచేసేందుకు ఒక్క పోలీసు కూడా కనిపించట్లేదన్న ఆయన కర్ణాటక సీఎంను ట్యాగ్ చేస్తూ నెట్టింట పోస్టు పెట్టారు.

ఇంటర్నెట్ డెస్క్: బెంగళూరు ట్రాఫిక్ పేరు చెబితే సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ భయపడిపోతుంటారు. తాజాగా నగర ట్రాఫిక్ నిర్వహణ తీరుపై సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రాజీవ్ రాయ్ ఆదివారం ఎక్స్ వేదికగా మండిపడ్డారు. గంటకు పైగా ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయానని, పోలీసుల ట్రాఫిక్ నిర్వహణ సరిగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక సీఎంను కూడా తన పోస్టులో ట్యాగ్ చేశారు. ట్రాఫిక్ చిక్కుల కారణంగా బెంగళూరుకు చెడ్డ పేరు వస్తోందని అన్నారు. ట్రాఫిక్ పోలీసులతో ఎలాంటి ఉపయోగం లేదని, వారు బాధ్యతారాహిత్యంతో ఉన్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు (Rajeev Rai Statment on Bengaluru Traffic).‘బెంగళూరులో ట్రాఫిక్ నిర్వహణ చాలా దారుణంగా ఉంది. ట్రాఫిక్ పోలీసులతో ప్రయోజనం శూన్యం. కనీసం ఫోన్ కూడా ఎత్తట్లేదు. చాలా సార్లు వాళ్లకు ఫోన్ చేసేందుకు ప్రయత్నించాను. ఒక్కరు కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. గంట నుంచీ మేము రాజ్‌కుమార్ సమాధి రోడ్‌లోనే ఉన్నాము. ఫ్లైట్ మిస్ అయ్యేటట్టు ఉన్నాము. చుట్టుపక్కల ఒక్క ట్రాఫిక్ పోలీసు కూడా కనిపించట్లేదు. బెంగళూరుకు చెడ్డ పేరు తేవడానికి ఇలాంటి అసమర్థ ఆఫీసర్లు చాలు. ట్రాఫిక్ రద్దీ వల్ల బెంగళూరుకు చెడ్డ పేరు వస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు’ అని పోస్టు పెట్టారు. పోలీసు ఉన్నతాధికారులను కూడా తన పోస్టులో ట్యాగ్ చేశారు.ఇటీవల వ్యాపారవేత్త కిరణ్ మజుందార్‌షా కూడా నగర రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతకుముందు వ్యోమగామి శుభాన్షూ శుక్లా కూడా బెంగళూరు ట్రాఫిక్‌పై సెటైర్లు పేల్చారు. నగర ట్రాఫిక్‌లో ప్రయాణం కంటే అంతరిక్ష యాత్ర కాస్తంత ఈజీగా ఉన్నట్టు అనిపిస్తోందని అన్నారు. ఇదిలా ఉంటే, ట్రాఫిక్ కష్టాలకు పరిష్కారంగా రూ.19 వేల బడ్జెట్‌తో భూగర్భ సొరంగమార్గ నెట్వర్క్‌ను నిర్మించాలని ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రతిపాదించారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ధర్మస్థల కేసుపట్ల వేగవంతంతో దర్యాప్తును నిర్ధారించాలి….

ధర్మస్థల కేసుపట్ల వేగవంతంతో దర్యాప్తును నిర్ధారించాలి.*

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

కర్ణాటక ప్రభుత్వం ధర్మస్థల కేసులో శాస్త్రీయ,నిష్పాక్షిక వేగవంతమైన దర్యాప్తును నిర్ధారించాలని పిఓడబ్ల్యు జిల్లా కార్యదర్శి పూలక్క డిమాండ్ చేశారు.నర్సంపేటలోని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పిఓడబ్ల్యు సదస్సు జక్కుల విజయ అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా పిఓడబ్ల్యు జిల్లా కార్యదర్శి పూలక్క మాట్లాడుతూ
కర్ణాటకలోని ధర్మస్థల ఆలయంతో పాటు చుట్టుపక్కల 400 మంది నివేదికల ప్రకారం బాలికలు,మహిళల సామూహిక అత్యాచారాలు,లైంగిక దాడులు,సామూహిక హత్యలు,సామూహిక ఖననంపై అందుకు సంబంధించిన ఎఫ్ఐఆర్‌పై కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు ఇప్పటికీ కొనసాగుతోందని పేర్కొన్నారు. ఈ క్రమంలో దర్యాప్తులో కొన్ని సమస్యల తర్వాత భట్ తల్లి తనకు ఎప్పుడైనా కూతురు ఉందా లేదా అనే దానిపై తిరగబడటం, విజిల్‌బ్లోయర్ అరెస్టు నివేదికలు వంటి సమస్యలను మళ్లించడానికి అలాగే సమస్యను మతంచేయడం ద్వారా, న్యాయవాదులు,కార్యకర్తలను కించపరచడం, ఆలయ స్థాపనకు నైతిక మద్దతు కవాతులను ప్రకటించడం ద్వారా ఒత్తిడిని పెంచడానికి ప్రచారం జరుగుతోందని తెలిపారు.ధర్మస్థల కేసులో ఆధారాలు, సాక్షులు, న్యాయవాదుల రక్షణ కొనసాగించి ప్రజల పోరాటం నిఘా మాత్రమే పూర్తి వాస్తవాలు వెలుగులోకి వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
అనంతరం పిఓడబ్ల్యు నూతన డివిజన్ కమిటీని ఏర్పాటు చేయగా నూతన అధ్యక్ష కార్యదర్శులు జక్కుల విజయ,ఆకుల శైలజ, డివిజన్ నాయకులు సంధ్య, వీరలక్ష్మి, సుక్కక్కలను ఎన్నుకున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version