అధ్యాపకుడిగా జిల్లా కలెక్టర్…

అధ్యాపకుడిగా జిల్లా కలెక్టర్
మల్లాపూర్ సెప్టెంబర్ 11 నేటి ధాత్రి

 

 

మల్లాపూర్ మండల కేంద్రంలోని గిరిజన బాలికల (మినీ గురుకుల)పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్
పాఠశాలలోని విద్యార్థులకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను నేర్పించాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అధికారులను ఆదేశించారు.
గురువారం రోజున జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం కేందంలోని గిరిజన పాఠశాలను సందర్శించిన కలెక్టర్.
పాఠశాలను మొత్తం సందర్శించి విద్యార్థుల స్థితిగతులను, వారికి కల్పిస్తున్న వసతులను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా విద్యా ప్రమాణాలు, మౌళిక సదుపాయాల తీరును కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు.
క్లాస్ రూమ్ లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అని కలెక్టర్ ఆరా తీశారు. అదే విధంగా ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తున్నారా లేదా అని కలెక్టర్ హాజరు పట్టికను పరిశీలించారు. పాఠశాలలోని ప్రతీ విద్యార్థి పై ప్రత్యేక దృష్టి సారించాలని, సర్కారు బడుల్లో క్వాలిఫైడ్ ఉపాద్యాయులు పనిచేస్తున్నారని, భావి తరాలకు అవసరమైన విద్యా బోధన చేయడం జరుగుతున్నదని తెలిపారు.
విద్యార్థులతో ముఖాముఖి సంభాషణ జరిపి వారికి పాఠాలు చదివించి వారి బోధన స్థితిగతులను ప్రత్యేకంగా పరిశీలించారు.

 

District Collector Inspects Tribal Girls School in Mallapur

 

పాఠశాలలో విద్యార్థుల హాజరు, తరగతుల నిర్వహణ, పారిశుద్ధ్య సౌకర్యాలు వంటి అంశాలను పరిశీలించారు.. విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం భోజనం అందుతున్నదా అనే విషయాన్ని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, భోజన తయారీ విషయంలో నాణ్యతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అదేవిదంగా ఒప్పంద నిర్వాహకుడితో మాట్లాడి నాణ్యతతో కూడిన సరుకులు అందించాలని తెలిపారు.
పాఠశాల తరగతి గదులలో పరిసరాల పరిశుభ్రతను పాటించాలని ఉపాధ్యాయులకు ఆదేశించారు. వర్షాకాలం దొమలు వృద్ధి చెందే అవకాశం ఉన్నందున పాఠశాల ఆవరణంలో పిచ్చి మొక్కలు తొలగించి, శానిటేషన్ చేయించాలని సూచించారు. ముఖ్యంగా పాఠశాల ఉపాధ్యాయులు సమయపాలన తప్పకుండా పాటించాలని చెప్పడం జరిగింది.
కలెక్టర్ వెంట మెట్ పల్లి రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాస్, ఎస్సీ వెల్ఫేర్ జిల్లా అధికారి రాజ్ కుమార్, తహసీల్దార్, సంబంంధిత అధికారులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version