పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి..
ఏబీవీపీ రాష్ట్ర నాయకులు బండారి ప్రశాంత్..
రామాయంపేట, సెప్టెంబర్ 11 నేటి ధాత్రి (మెదక్)
రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న ₹8,300 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్‌లను తక్షణమే విడుదల చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) రామాయంపేట శాఖ డిమాండ్ చేసింది.
స్థానిక బస్టాండ్ వద్ద గురువారం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రామాయంపేట శాఖ ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న 8300 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ విడుదల చేయాలని స్థానిక బస్టాండ్ వద్ద బయట నుంచి నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర నాయకుడు బండారి ప్రశాంత్ మాట్లాడుతూ –
ఫీజు రీయింబర్స్మెంట్ అనేది విద్యార్థుల హక్కు, ప్రభుత్వం ఇచ్చే దానం కాదు. పేద, మధ్యతరగతి విద్యార్థులు ఈ నిధుల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థుల సమస్యలపై స్పందించకపోగా కేవలం డైవర్షన్ రాజకీయాలతోనే రోజులు గడుపుతున్నారని విమర్శించారు.
అతను హెచ్చరిస్తూ, విద్యార్థుల సమస్యలు, స్కాలర్‌షిప్‌లు తక్షణమే పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఏబీవీపీ విస్తృత స్థాయి ఆందోళనలు, ధర్నాలు చేపడతామని తెలిపారు.
ఈ నిరసనలో నగర కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి అర్జున్, హరిహర, ఆదర్శ్, చందు, మల్లికార్జున్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.