అక్రమ రైస్ మిల్లర్ల మోసాలపై “రాష్ట్ర వ్యాప్త” ఆందోళనలకు “ప్రజా సంఘాల నిర్ణయం”!

అక్రమ రైస్ మిల్లర్ల మోసాలపై “రాష్ట్ర వ్యాప్త” ఆందోళనలకు “ప్రజా సంఘాల నిర్ణయం”!

రాష్ట్ర వ్యాప్తంగా “కోర్టులలో ప్రజా వాజ్యాలు” వేయాలని సమాలోచనలు!

త్వరలో “కోర్టులను” ఆశ్రయించనున్న “ప్రజా సంఘాలు”.

 

అక్రమ మిల్లర్లపై కేసుల నమోదుకు ప్రయత్నాలు.

“రైతులను” మోసం చేసినట్లు తేట తెల్లమైనా అధికారులు చలించకపోవడంపై “ప్రజా సంఘాల” ఆగ్రహం

హన్మకొండ జిల్లాలో ఓ మిలర్ల్ చేసిన మోసం వెలుగులోకి వచ్చింది.

“జాయింట్ కలెక్టర్” కూడా మోసం జరిగినట్లు “కమీషనర్‌”కు నివేదిక పంపడం జరిగింది.

ఖమ్మం “జేసి” సదరు మిల్లర్‌పై చర్యలకు సిఫారసు చేయడం కూడా జరిగిపోయింది.

ఇంకా మిల్లర్ పై చర్యలు తీసుకోకుండా ఎందుకు ఉపేక్షిస్తున్నట్లు ప్రశ్నిస్తున్న “ప్రజా సంఘాలు”.

రైతులను మోసం చేసి తప్పించుకునేందుకు ప్రయత్నించే వారిని ఉపేక్షించేది లేదని “ప్రజా సంఘాల” హెచ్చరిక.

హన్మకొండ జిల్లాలో రైతులను మోసం చేసిన మిర్లర్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని “ప్రజా సంఘాల” డిమాండ్.

“సివిల్ సప్లయ్” అధికారులు స్పందించకపోతే ఆందోళనకు “ప్రజా సంఘాల” కార్యాచరణ.

మీ “నేటిధాత్రి”లో ఎక్స్ క్లూజివ్ గా.

ఆరోగ్య ప్రదాత యోగా గురువు శ్రీనివాస్.

భారతదేశంలోని అతి ప్రాచీనమైన యోగ విద్యను అందరికీ అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో యోగా శిబిరాలను నిర్వహిస్తూ యోగానే తన ఇంటి పేరుగా మార్చుకున్న యోగ గురువు శ్రీనివాస్ యోగా తో సంపూర్ణ ఆరోగ్యం అని భావించి, సమాజమే దేవాలయంగా గత 25 సంవత్సరాలుగా ఉచిత యోగ శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేసి ఎన్నో లక్షలాది మంది ప్రజలకి ఆరోగ్యాన్ని ప్రసాదించిన యోగా గురువు పోశాల శ్రీనివాస్ అభినందనీయుడు.

నేటి ధాత్రి:

 

 

 

ఇల్లంద గ్రామంలో జన్మించిన శ్రీనివాస్ ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ పూర్తి చేసి తదినంతరం తిరుపతిలోని సాంస్క్రిట్ విద్యాపీట్లో యోగ డిప్లమా పూర్తి చేసుకుని, కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎం శ్రీనివాసరావు గారి సూచనతో గ్రామీణ ప్రాంతాలలో అందరికీ ఆరోగ్యాన్ని అందించాలనే సత్సంకల్పంతో సుమారు 157 గ్రామాలలో ఇప్పటివరకు రెండు లక్షల మందికి యోగా లో శిక్షణను ఇవ్వటమే కాకుండా…

 

 

 

 

 

 

20 24 సంవత్సరానికి గాను యోగాలో గోల్డ్ రికార్డ్ సాధించినందుకు గాను వరంగల్ జిల్లా కలెక్టర్ శ్రీమతి సత్య శారద గారు అభినందిస్తున్న ఫోటో.

 

జూన్ 21.2024 వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వరంగల్ జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్ ని అందుకున్న శ్రీనివాస్ మనందరికీ అభినందనీయుడు.

వృద్ధాశ్రమాలలో, అనాధాశ్రమాలలో , అందుల ఆశ్రమాలలో ఇలా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించి సమాజంలోని అనేకమందికి మార్గదర్శకుడిగా నిలిచాడు యోగా గురువు పోశాల శ్రీనివాస్.

సేవే పరమావధిగా భావించి అనేక రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి ఎంతోమంది పునర్జన్మకు కారణమయ్యాడు

యోగా గురువు శ్రీనివాస్ చేసిన సేవలను గుర్తించి తెలంగాణ ప్రభుత్వం 2014వ సంవత్సరం కిలా వరంగల్ లో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అప్పటి డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య గారి చేతుల మీదుగా ఉత్తమ యోగ గురువు అవార్డును పొందడం జరిగింది.

 

శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి జీ వారి చేతుల మీదుగా…

 

2017 వ సంవత్సరంలో జనవరి (12- 18 ) జాతీయ యువజన వారోత్సవాల సందర్భంగా జిల్లా యువజన పురస్కారాన్ని అందుకోవడం జరిగింది.

2018 – 2022 సంవత్సరాలలో వరల్డ్ టూరిజం డే సందర్భంగా జరిగిన కార్యక్రమాలలో ఉత్తమ ప్రదర్శనను అందించినందుకు గాను తెలంగాణ ప్రభుత్వం నుండి అవార్డులను అందుకోవటం జరిగింది.

2019వ సంవత్సరంలో ప్రముఖ చారిత్రాత్మకమైన వేయి స్తంభాల దేవాలయంలో ఒక వెయ్యి మంది విద్యార్థులతో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించినందుకు గాను తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్ ని అందుకోవటం జరిగింది.

 

 

 

 

 

ధరిత్రి దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటుతూ…

 

2019 సంవత్సరంలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో రామప్ప దేవాలయంలో, వేయి స్తంభాల దేవాలయంలో, కిలా వరంగల్ కోటలో అంతర్జాతీయ యోగా డేలను నిర్వహించినందుకు కాను అవార్డులను అందుకోవటం జరిగింది.

 

 

2019 వ సంవత్సరంలో భారతదేశ వ్యాప్తంగా జరిగిన యోగ డే ప్రోగ్రాం లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోస్టల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో అవార్డును కోవడం జరిగింది.

 

శ్రీ శ్రీ శ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామీజీ తో

 

 

 

2021 వ సంవత్సరంలో పెరేడ్ గ్రౌండ్లో జరిగిన స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కరోనా సమయంలో ప్రతిరోజు వేలాదిమంది కి ఫుడ్, మెడిసిన్స్ అందించి రోగుల కొరకు విశేష కృషి చేసిన యోగా గురువుకు తెలంగాణ ప్రభుత్వ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారి చేతుల మీదుగా ప్రతిభా పురస్కారాన్ని అందుకోవటం జరిగింది.

 

25 సంవత్సరాలుగా యోగాలో చేస్తున్న విశేష కృషిని ఆదరించి వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్ ని యోగా గురువు శ్రీనివాస్ కి అందించడం జరిగింది.

 

అదేవిధంగా లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ మరియు శ్రీ షిరిడి సాయి సేవా సమాజ్ ఆధ్వర్యంలో అనేక అవార్డులను యోగా గురువు శ్రీనివాస్ అందుకోవటం జరిగింది. .

 

ప్రముఖ వ్యక్తులైన శ్రీ రాందేవ్ బాబా గారి చేతుల మీదుగా, శ్రీ శ్రీ శ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామీజీ చేతుల మీదుగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల సందర్భంగా అవార్డులను అందుకోవటం జరిగింది.

 

యోగా గురువు శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రభుత్వ మరియు ప్రైవేటు కళాశాలలో మరియు పాఠశాలలోను,

 

NSS, NCC క్యాండిడేట్లకి యోగాలో శిక్షణను ఇవ్వడం జరిగింది.

 

 

ఆరోగ్య ప్రదాత యోగా గురువు శ్రీనివాస్.

మామునూరు లో ఉన్నటువంటి ఫోర్త్ బెటాలియన్ CRPF పోలీస్ ఆఫీసర్లకి, భీమారంలో ఉన్నటువంటి 58వ బెటాలియన్ CRPF ఆఫీసర్ లందరికీ యోగాలో శిక్షణను ఇవ్వడం జరిగింది.తన ఆధ్వర్యంలో శిక్షణ పొందిన ఎంతోమంది విద్యార్థిని విద్యార్థులు జాతీయ మరియు అంతర్జాతీయ వేదికలపై యోగా లో ఉత్తమ ప్రదర్శనలు కనబరిచి అనేక అవార్డులను అందుకోవటం కూడా జరిగింది.

8 వసంతాలు’ ఎలా ఉందంటే.

8 Vasantalu Review: ‘8 వసంతాలు’ ఎలా ఉందంటే

 

 

 

 

 

 

 

‘మను’, ‘మధురం’ చిత్రాల తర్వాత దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి తెరకెక్కించిన ప్రేమకథా చిత్రం ‘8 వసంతాలు’.

 

 శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు మెప్పించింది?

ఫణీంద్ర నర్సెట్టి హిట్‌ అందుకున్నాడా?

రివ్యూలో చూద్దాం.

సినిమా రివ్యూ: 8 వసంతాలు (8 Vasantalu Movie Review)
విడుదల తేది: 20–6–2025

‘మను’, ‘మధురం’ చిత్రాల తర్వాత దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి (Phanindra Narsetti) తెరకెక్కించిన ప్రేమకథా చిత్రం ‘8 వసంతాలు’.

 

అనంతిక సనీల్‌కుమార్‌(ananthika sanilkumar), రవి దుగ్గిరాల, హనురెడ్డి, కన్నా పసునూరి కీలక పాత్రధారులు.

చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా కంటెంట్‌ బేస్డ్‌ సినిమాలకు పట్టం కడుతున్న మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించిన చిత్రమిది.

 

ఫస్ట్‌ లుక్‌ నుంచి ప్రచార చిత్రాలు  ప్రేక్షకుల దృష్టిని ఈ సినిమా వైపు తిప్పుకొన్నాయి.

 

నిర్మాణ సంస్థకు ఉన్న క్రేజ్‌తో సినిమాకు బజ్‌ పెరిగింది.

శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు మెప్పించింది?

ఫణీంద్ర నర్సెట్టి హిట్‌ అందుకున్నాడా?

రివ్యూలో చూద్దాం.

కథ : (8 Vasantalu Story)
శుద్థి అయోధ్య (అనంతిక సనీల్‌ కుమార్‌) స్ట్రాంగ్‌ లేడీ.

 

చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో తన అనుభవాల సమాహారంగా పదిహేడేళ్లకే భావోద్వేగభరితను ఓ పుస్తకంగా రాస్తుంది.

అది చదివి ఎంతోమంది ఆమెకు అభిమానులుగా మారతారు. ఆమెలో చక్కని రచయిత్రే కాదు..

 

తల్లి ప్రేమ, బాధ్యత, మార్షల్‌ ఆర్ట్స్‌ గురువు అంటే గౌరవం, స్నేహితుల పట్ల కరుణ ఉంచే స్వభావం కలది.

 

మార్షల్‌ ఆర్ట్స్‌లోనూ మంచి ప్రావీణ్యం ఉన్న అమ్మాయి శుద్ధి.

ఓ రోజు మార్షల్‌ డోజోలో వరుణ్‌ (హను రెడ్డి) పరిచయం అవుతాడు.

చూసిందే తడవు..

ఆమె ప్రేమకోసం తపిస్తూ వెంటపడతాడు.

కొంత సమయంలో తర్వాత ఆమె తనపై ప్రేమను పెంచుకుని చెప్పేలోపు వరుణ్‌ బర్క్‌లీలో తన గోల్‌ సాధించడం కోసం ఆమెను వదిలించుకుని విదేశాలకు వెళ్లిపోతాడు.

 

పగిలిన గుండెతో ఆమె మరో పుస్తకం రాస్తుంది.

తదుపరి ఊటీలో తెలుగు రచయిత సంజయ్‌ (రవి దుగ్గిరాల) పరిచయం అవుతాడు.

అతనిని శుద్ధి ప్రేమిస్తుంది.

తల్లికి చెబుదామనుకునేలోపు తల్లి ఆరోగ్యం బాగోకపోవడం, ఎస్టేట్స్‌ చూసుకునే బాధ్యత మీద పడటంతో తన ప్రేమ సంగతి తల్లికి చెప్పలేకపోతుంది.

 

తల్లి ఉన్న పరిస్థితిని బట్టి తన ప్రేమను త్యాగం చేయాలనుకుంటుంది.

సంజయ్‌ ఆమె ప్రేమను గెలిచాడా?

8 వసంతాలకు, సంజయ్‌కు సంబంధం ఏంటి?

అన్నది కథ.

  

‘మను’, మధురం వంటి చిత్రాల దర్శకుడి నుంచి వచ్చిన ప్రేమకథ ఇది.

గతంలో ఆయన తీసిన సినిమాల రిజల్ట్‌ బాధ పెట్టి ఉండొచ్చు.

ఆ కసితోనే 8 వసంతాలు చిత్రాన్ని తీసినట్లు సినిమా ప్రారంభంలో అనిపిస్తుంది.

2013 నుంచి 2020 మధ్యలో జరిగే ఓ సున్నిత ప్రేమకథ ఇది.

 

స్ట్రాంగ్‌ అండ్‌ టాలెంటెడ్‌ లేడీకి జీవితంలో ఎదురైన చేదు జ్ఞాపకాల నేపథ్యంలో ఓ ప్రేమకథగా మలిచారు దర్శకుడు.

 

సినిమా ప్రారంభం నుంచి ఇంటర్వెల్‌ వరకూ ఫ్లో బావుంది.

అయితే అక్కడక్కడా కాస్త సాగదీతగా ఉన్నా..

శుద్ధి పాత్ర తెరపై కనిపించిన ప్రతిసారీ సాగదీత అనేది గుర్తుకు రాదు.

దర్శకుడు పూర్తిగా కవితాత్మక కథ తెరపై చూపించాలనుకున్నాడు.

ఆ తరుణంలో అతనిలోని రచయిత దర్శకుడిని డామినేట్‌ చేసిన భావన కలుగుతుంది.

మాటలు బాగా రాసుకున్నాడు అయితే తన రాతతో కథను మించి కవిత్వం పెరిగింది.

ప్రాసల కోసం తపన కనిపించింది.

కొన్ని సందర్భాల్లో డైలాగ్‌ నలిగిపోయింది.

దాని వల్ల క్యారెక్టర్స్‌ మీద ఉన్న ఎఫెక్ట్‌ తగ్గిందనిపిస్తుంది.

తండ్రి మరణం, ఆ తర్వాతి సంఘటనలు శుద్ధికు రైటర్‌గా జన్మ ఇచ్చింది.

వరుణ్‌తో లవ్‌ ట్రాక్‌ బావుంది.

ఆమె ప్రేమను చెప్పాలనుకునే లోపు అతను విడిచివెళ్లిపోయాడు.

వరుణ్‌ క్యారెక్టర్‌ ఎంట్రీ, అతని రన్‌ చూస్తే నెగటివ్‌ అని గెస్‌ చేసేలా ఉంది.

ఇంటర్వెల్‌ వరకూ సినిమా ఒకలా ఉంటే..

అక్కడి మరోలా ఉంది.

తనని వదిలించుకుని వెళ్లున్న వరుణ్‌కి వర్షంలో నిలబడి చెప్పే డైలాగ్‌లో ప్రేక్షకుల హృదయాన్ని కదిలిస్తాయి.

‘మనిషికి మనిషి దూరంగా ఉన్నా..

దగ్గరగా ఉన్నా డిగ్నిటీ మాత్రం మారకూడదు’ అంటూ తల్లి గురించి చెప్పే డైలాగ్‌లు,


‘నేను వద్దు అనుకున్నానంటే నేను వేసుకున్న దుస్తులు  పొరపాటున గాలి వల్ల కూడా నీ వైపు రావు. అంత స్ట్రాంగ్‌ నేను’

 

అంటూ మహిళల్ని మహారాణిలా పోలుస్తూ రాసిన డైలాగులు పేలాయి. ఆ డైలాగ్‌లు చప్పట్లు కొట్టించాయి.

తర్వాత ఇంటర్వెల్‌..

మార్షల్‌ ఆర్ట్స్‌ గురువు మరణం, అస్తికలు కలపడానికి కాశీకి వెళ్తే అక్కడ చేదు అనుభవం, సంజయ్‌ ఎంట్రీ, తల్లి అనారోగ్యం ఇవన్నీ పార్టుపార్టులుగా కథను, రన్నింగ్‌ ఫ్లోన్‌ డల్‌ చేసేశాయి. కాశీలో శుద్ధి తీసిన యాక్షన్‌ సీన్‌ బావుంది.

కానీ అంత యాక్షన్‌ పార్ట్‌ అవసరం లేదేమో అనిపిస్తుంది.

అమ్మాయి ఎంత స్ట్రాంగ్‌ అయినా లోపల సున్నితత్వం అనేది ఒకటి ఉంటుంది.

అలాంటి అమ్మాయి గుండెకు ప్రేమ పేరుతో బలమైన గాయమైనప్పుడు మళ్ళీ ప్రేమలో పడాలంటే ఎంత ఆలోచించాలి?

ఎంత బలమైన సిచ్చువేషన్‌ క్రియేట్‌ చేయాలి.

కానీ ఇక్కడ దర్శకుడు దానిని మిస్‌ చేశాడు.

 ఓ వేశ్య కథకు అక్షర రూపం ఇవ్వడంతో పాటు పాఠకులలో ఆశ నింపాలని చూసిన ఓ రచయితను చూడగానే మనసిచ్చేస్తుంది శుద్ధి.

రెండో విజిట్‌కే ప్రేమమైకంలో పడుతుంది. అది సహజంగా లేదు.

నమ్మసఖ్యంగా లేదు.

రచయిత రాసిన మాటలు ప్రేక్షకుడి మదిలో రిజిస్టర్‌ అయ్యేలా రాయాలి, కానీ రిజిస్టర్‌ అవ్వడం కోసమే మాటలు రాయకూడదు.

కానీ దర్శకుడు ఇక్కడ అదే చేశాడు.

ఓ బుక్‌ స్టోర్‌లో మా రోజుల్లో చలంకు అమ్మాయిల్లో ఇంత క్రేజ్‌ ఉండేది..

ఇప్పుడు ఈ అబ్బాయికి’ అని ఇద్దరు మహిళలు మాట్లాడుకోవడం, ఓ సందర్భంలో  ప్రేమికుడిని చెరకు తోటలో పడిన ఏనుగుతో పోల్చారు’ అని జనాలు యాక్సెప్ట్‌ చేసేలా లేవు.

 

కొన్ని సందర్భాల్లో పాత్రలు తమ వయసుకు మించి మాట్లాడుతున్న భావన కలుగుతుంది.

 

నటీనటులు పనితీరు..

 శుద్థి అయోధ్య పాత్రలో అనంతిక సనీల్‌ కుమార్‌ అద్భుతంగా నటించింది.

హవభావాలు అద్భుతం. ప్రేక్షకుడి కన్ను తిప్పుకోనివ్వకుండా ఆమె నటన ఉంది.

ప్రతి సీన్‌లోను మెప్పించింది. ఒకటి రెండు సన్నివేశాల్లో ఎమోషన్‌ క్యారీ చేయలేకపోయిందనిపించింది.

పాత్ర పరంగా ఆమె ఈ సినిమాకు బిగ్‌ ఎసెట్‌. హను రెడ్డి వరుణ్‌ పాత్రకు న్యాయం చేశాడు.

అనంతిక, హనురెడ్డి పెయిర్‌ తెరపై బావుంది.

ఇద్దరి మధ్య యాక్టింగ్‌ కెమిస్ట్రీ బావుంది.

సెకెండాఫ్‌లో వచ్చిన రవి దుగ్గిరాల నటనలో ఇంకా బాలుడే.

ఇంప్రూవ్‌ కావాలి.

శుద్ధి స్నేహితుడి కన్నా పసునూరి కార్తిక్‌ పాత్రకు న్యాయం చేశాడు.

మిగతా నటీనటుల్లో గుర్తు పెట్టుకునేవారు ఎవరూ లేదు.

తమ పరిధి మేరకు యాక్ట్‌ చేశారు.  

దర్శకుడికి మంచి టీమ్‌ కుదిరింది.

సినిమాటోగ్రాఫర్‌ విశ్వనాధ్‌రెడ్డి విజువల్‌ పరంగా ఎక్కడా పేరు పెట్టకుండా ప్రతీ సీన్‌ను అందంగా క్యాప్చర్‌ చేశారు.

అలాగే సినిమాకు మ్యూజిక్‌ ఎసెట్‌.

హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌ చక్కని పాటలు, ఆర్‌ఆర్‌ అందించారు.

సాహిత్యం బావుంది.

ఎడిటర్‌ శశాంక్ మాలి సెకెండాఫ్‌కు కాస్త కత్తెర వేసుంటే బావుండేది.

దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి సినిమాను బాగానే గ్రాండ్‌గా తీశారు.

నిర్మాతలు ఖర్చు తెరపై కనిపించింది.

రచనపై ఎక్కువ దృష్టి పెట్టడంతో సినిమా మధ్యలో డ్రాప్‌ అయింది.

ఇంటర్వెల్‌, క్లైమాక్స్‌ అద్భుతం అనేలా తీశారు.

ఆ రెండు సీన్స్‌ చాలు సినిమాకు హిట్టుకు అనుకున్నారో ఏమో?

ఎక్కువ దృష్టి అక్కడే పెట్టి మిగిలినది సోసోగా కానిచ్చారు.

కానీ ఎక్కడా అసభ్యకర సన్నివేశాలు లేవు.

పొయిటిక్‌ లవ్‌స్టోరీగా తీసే ప్రయత్నం చేశారు కాబట్టి కామెడీకి ఎక్కడా చోటు ఇవ్వలేదు.

8 ఏళ్ల ప్రేమకథను దర్శకుడు సున్నితంగా చూపించారు కానీ..

అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కించడంలో విఫలం అయ్యాడు.

సింపుల్‌, కూల్‌ లవ్‌స్టోరీలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది.

కమర్షియల్‌ యాక్షన్‌ హంగామా కోరుకునే ప్రేక్షకుల నుంచి ఆదరణ తక్కువే ఉంటుంది.

యోగా డే.. త‌ర‌లివ‌చ్చిన సినీతార‌లు.

యోగా డే.. త‌ర‌లివ‌చ్చిన సినీతార‌లు

 

 

 

హైద‌రాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వ‌హించిన యోగా డే కౌంట్‌డౌన్ శుక్ర‌వారం క‌ల‌ర్‌ఫుల్‌గా మారింది.

జూన్ 21న అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వం సంద‌ర్భంగా హైద‌రాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వ‌హించిన యోగా డే (Yoga Day) కౌంట్‌డౌన్ శుక్ర‌వారం క‌ల‌ర్‌ఫుల్‌గా మారింది. కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి (Union Minister Kishan Reddy) ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన ఈ కార్య‌క్ర‌మానికి తెలంగాణ గవర్నర్ జిష్ణుడేవ్ వర్మ (Telangana Governor Jishnu Dev Varma), మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Venkaiah Naidu)ల‌తో పాటు ప‌లువురు కేంద్రమంత్రులు, బీజేపీ నేతలు,పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజలు యోగాసనాలు వేశారు.

ఆపై సినీ తార‌లు తేజ స‌జ్జా (Teja Sajja), సాయుధ‌ర‌మ్ తేజ్ (Sai Dharam Tej), మీనాక్షి చౌద‌రి (Meenakshi Chaudhary), ఖుష్బూ (Kushboo) వంటి తార‌లు సైతం త‌ర‌లివ‌చ్చి ప్రొగ్రాంకు కొత్త క‌ళ తీసుకు వ‌చ్చారు. త‌మ ప్ర‌సంగంతో అక్క‌డికి చ్చిన వారిలో ఉత్తేజం నింపారు. అంద‌రితో పాటుగా యోగా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

ఈ సంద‌ర్భంగా మంత్రి కిష‌న్ రెడ్డి మాట్లాడుతూ.. మోదీ ప్రధాని అయిన తర్వాత భారత దేశం ప్రపంచానికి ఇచ్చిన అద్భుతమైన బహుమతి యోగా అని అన్నారు. ఈ యోగాను ప్రపంచవ్యాప్తంగా గుర్తించారని.. మోదీ నాయత్వంలో యావత్ ప్రపంచంలో ఉన్న 2 వందల దేశాల నాయకులు, ప్రజలు యోగాను ఆచరిస్తున్నారంటే.. ప్రతి భారతీయుడు గర్వించాల్సిన విషయమని కిషన్ రెడ్డి అన్నారు.

లేటెస్ట్‌ ఇంటెన్స్ హ‌ర్ర‌ర్‌, సస్పెన్స్ థ్రిల్లర్‌.

స‌డ‌న్‌గా ఓటీటీకి.. లేటెస్ట్‌ ఇంటెన్స్ హ‌ర్ర‌ర్‌, సస్పెన్స్ థ్రిల్లర్‌

 

 

 

ఇటీవ‌ల థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఓ హ‌ర్ర‌ర్‌, సస్పెన్స్ థ్రిల్లర్‌ చిత్రం ప‌క్షం రోజుల‌కే ఎలాంటి ముంద‌స్తు ప్ర‌క‌ట‌న లేకుండానే స‌డ‌న్‌గా డిజిట‌ల్ స్ట్రీమింగ్ కు వ‌చ్చి షాకిచ్చింది

నిఖిల్ దేవాదుల (Nikhil Devadula) హీరోగా వాస్త‌వ‌ ‘హ‌ర్ర‌ర్’ ఘ‌ట‌న‌ల‌తో ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన‌ చిత్రం ‘ఘటికాచలం’ (Ghatikachalam).

అమర్ కామెపల్లి (Amar Kamepalli) దర్శకత్వం వహించగా ప్రభాకర్, ఆర్వికా గుప్తా, జోగి నాయుడు, సంజయ్ రాయ్ చుర, దుర్గాదేవి  కీలక పాత్రల్లో న‌టించారు.

 

ఎం.సి రాజు నిర్మాత.

 మే31న‌ ప్రేక్షకుల ముందుకు వ‌చ్చిన ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న‌ప‌ట్ప‌టికీ ప్ర‌చార లోపం వ‌ళ్ల జ‌నాల‌కు చేర‌లేక పోయింది.

 

బేబీ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాను నిర్మించిన ఎస్ కేఎన్ మారుతితో క‌లిసి

ఈ సినిమాను రిలీజ్ చేయ‌డం విశేషం.

అయితే ఇప్పుడీ చిత్రం ప‌క్షం రోజుల‌కే ఎలాంటి ముంద‌స్తు ప్ర‌క‌ట‌న లేకుండానే స‌డ‌న్‌గా డిజిట‌ల్ స్ట్రీమింగ్ కు వ‌చ్చి షాకిచ్చింది.

క‌థ విష‌యానికి వ‌స్తే..

త‌న తండ్రి కోరిక మేర‌కు మెడిస‌న్ చేస్తున్న కౌశిక్ ఇంట్రొవ‌ర్ట్‌.
బాగా పిరికిత‌నం, అంత‌కుమించి భ‌య‌స్తుడు కావ‌డంతో ఎవ‌రు స్నేహం చేయ‌రు. పైగా హేళ‌న చేస్తూ ఇబ్బంది పెడుతుంటారు.
అయితే కౌశిక్ త‌న క్లాస్‌మేట్‌ను ల‌వ్ చేస్తుంటాడు గానీ త‌ను వేరే అత‌నితో ప్రేమ‌లో ఉంటుంది.
అయితే త‌న ప‌రిస్థితిని, త‌న పాత జ్ఞాప‌కాల‌ను గుర్తు చేసుకుంటూ మాన‌సిక సంఘ‌ర్ష‌ణ ప‌డుతుంటాడు.
ఏ శ‌క్తులు వెంటాడుతున్నాయ‌ని ఫీల్ అవుతుంటాడు.
అదే స‌మ‌యంలో అప్ప‌టికే చ‌నిపోయిన ఘ‌టికాచ‌లం అనే వ్య‌క్తి వాయిస్ వినిపిస్తూ కౌశిక్‌ను కంట్రోల్ చేస్తుంటుంది.
ఈ నేప‌థ్యంలో హీరో ఆ స‌మ‌స్య‌ల నుంచి ఎలా బ‌య‌ట ప‌డ్డాడు, ఇంత‌కు త‌న‌ను వెంబ‌డించేవి, ఆత్మ‌ల‌, ఇంఏమైనా ఉన్నాయి, ఘటికాచ‌లం ఎవ‌రు అనే ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌నాల‌తో సినిమా సాగుతుంది.

 

నిర్మాత రాజు నిజ జీవితంలో జ‌రిగిన ఘ‌ట‌న‌ల అధారంగా రెడీ చేసుకున్న‌క‌థ‌తో సైక‌లాజిక‌ల్ హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన

 

ఈ సినిమా చూసే ప్రేక్ష‌కుల‌కు ఓ ఢిప‌రెంట్ చిత్రం చూస్తున్నామ‌నే ఫీల్‌ ఇస్తుంది.

 

అక్క‌డ‌క్క‌డ లాగ్ ఉన్న‌ప్ప‌టికీ త‌ల్లిదండ్రులు పిల్ల‌లతో స‌రిగ్గా లేక‌పోతే ఎలాంటి ఘ‌ట‌న‌లు జ‌రుగుతాయ‌నే అంశంతో మంచి సోష‌ల్ మెసేజ్ అందించారు.

హ‌ర్ర‌ర్‌, సైక‌లాజిక‌ల్ సినిన‌మాల‌ను ఇష్ట‌ప‌డేవారు ఒక‌సారి ఈ మూవీని చూడ‌వ‌చ్చు.

 

ఇప్పుడీ ఘటికాచలం’ (Ghatikachalam).

 

సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఫ్యామిలీతో క‌లిసి చూడ‌వ‌చ్చు.

డ్రగ్స్ గంజాయి నివారణలో విద్యార్థులు యువత భాగస్వాములు కావాలి.

డ్రగ్స్ గంజాయి నివారణలో విద్యార్థులు యువత భాగస్వాములు కావాలి

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి ):

 

సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పాఠశాల,కళాశాలలో విద్యార్థులకు మాదకద్రవ్యాల వలన కలుగు అనర్ధాలపై రేపటి నుండి వారం రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు.
నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ఆంటీ నార్కోటిక్స్ బ్యూరో ద్వారా జిల్లా వ్యాప్తంగా పాఠశాల, కళాశాలలో విద్యార్థిని విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే పరిణామాలపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపిఎస్ గారు తెలిపారు..
ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ….
విద్యార్థులు,యువత కు డ్రగ్ అవర్నెస్ వీక్ లో బాగంగా రేపటి నుండి వారం రోజుల పాటుగా ప్రతి పోలీస్ స్టేషన్లలో మత్తు పదార్థాల వలన కలుగు ఆనర్ధాలపై వివిధ కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించనున్నారు.
1. జిల్లా, మండల కమిటీ సమావేశం(20.06)
2. అంతర్జాతీయ యోగా దినోత్సవం(21.06)
3. డ్రగ్ హాట్ స్పాట్ లలో అవగాహన కార్యక్రమం(22.06)
4. మొక్కలు నాటడం(23.06)
5. స్లోగన్ రైటింగ్ కాంపిటీషన్(24.06)
6. పెయింటింగ్ కాంపిటీషన్(25.06)
7. అంతర్జాతీయ మాదక ద్రవ్య సేవన వ్యతిరేక దినోత్సవం , ర్యాలీ, ప్రతిజ్ఞ, సమావేశం(26.06)
డ్రగ్స్ నిర్ములనకోసం జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యమై డ్రగ్స్ మహమ్మరిని నిర్ములించి భావితరాలకు మంచి భవిష్యత్ అందించాలని,యవత , విద్యార్థులు మత్తు పదార్థాలకు,గంజాయికి దూరంగా ఉంటూ భవిష్యత్తులో ఉన్నత స్థానాల్లో ఉండాలన్నారు.

మ‌రో సినిమా.. లైన్లో పెట్టిన సూప‌ర్‌స్టార్‌!

మ‌రో సినిమా.. లైన్లో పెట్టిన సూప‌ర్‌స్టార్‌!

 

 

 

కుర్ర హీరోలను మించి వ‌రుస సినిమాల‌ను లైన్‌లో పెడుతూ పుల్ స్వింగ్‌లో ఉన్నాడు సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్.

కుర్ర హీరోలను మించి వ‌రుస సినిమాల‌ను లైన్‌లో పెడుతూ పుల్ స్వింగ్‌లో ఉన్నాడు సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ (Rajinikanth) ఇప్ప‌టికే లోకేశ్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన కూలీ ఆగ‌ష్టులో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుండ‌గా నెల్స్ డైరెక్ష‌న్‌లో జైల‌ర్2 షూటింగ్‌లో ఉంది. ఇది ఇలా ఉండ‌గానే తాజాగా మ‌రో చిత్రాన్ని లైన్‌లో పెట్టాడు. త‌మిళ ఆగ్ర హీరోలు అజిత్‌తో తునీవు, వాలిమై, పింక్ రిమేక్ సినిమాల‌తో పాటు ప్ర‌స్తుతం విజ‌య్‌తో జ‌న నాయ‌గ‌న్ సినిమ రూపొందిస్తున్న హెచ్ వినోద్ (H. Vinoth) ద‌ర్శ‌క‌త్వంలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్ తన తదుపరి చిత్రం చేయనున్నట్టు కోలీవుడ్‌ వర్గాల సమాచారం.

వీరిద్దరి కాంబినేషన్‌లో రూపుదిద్దుకునే ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో వెల్లడి కానున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రజనీకాంత్‌.. యువ దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో ‘కూలీ’లో నటించారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టులో విడుదలకానుంది. అలాగే, నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ డైరెక్షన్‌లో ‘జైలర్‌’ వంటి మెగా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ మూవీకి సీక్వెల్‌గా రూపొందే ‘జైలర్‌-2’లో రజనీకాంత్‌ నటిస్తున్నారు.

అదేవిధంగా హెచ్‌.వినోద్‌ కూడా అగ్రహీరో విజయ్‌ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత రజనీ – హెచ్‌.వినోద్‌ కలిసి పనిచేయనున్నట్టు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. ఈ విషయంపై రజనీతో హెచ్‌.వినోద్‌ రెండుసార్లు కలిసి చర్చించడంతో వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ చిత్రం రావడం ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదిలాఉంటే స‌రిపోదా శ‌నివారం వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్‌ అందించిన వివేక్ అత్రేయ సైతం ర‌జ‌నీతో సినిమా కోసం చ‌ర్చలు జ‌రుపుతున్న‌ట్లు స‌మాచారం.

గాజర్ల రవి అలియాస్ గణేష్ మృతదేహం గ్రామానికి తరలింపు.

గాజర్ల రవి అలియాస్ గణేష్ మృతదేహం గ్రామానికి తరలింపు.

నేడే అంత్యక్రియలు ముగిసిన 33 ఏళ్ల గాజర్ల కుటుంబ ప్రస్థానం.

సెంట్రల్ కమిటీ సభ్యుడు హోదాలో మరణం. జీర్ణించుకోలేని కుటుంబ సభ్యులు.

చిట్యాల నేటి ధాత్రి:

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉమ్మడి చిట్యాల మండలంలోని వెలిశాల గ్రామానికి ఓ చరిత్ర ఉంది ఆ చరిత్ర నేటితో ముగియనుందా అనే సందేహం కలుగుతుంది వెలిశాల తల్లడిల్లుతుంది ఈ ప్రాంతంలో నక్సల్స్ ఉద్యమానికి పురుడు పోసిన గాజర్ల కుటుంబంలో మరొకరు పోలీసుల ఎన్కౌంటర్లో మృతి చెందారు, వివరాల్లోకి వెళితే గాజర్ల సారయ్య అలియాస్ ఆజాద్ 2008 ఎన్కౌంటర్లో చనిపోగా తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుపల్లి అడవుల్లో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో గాజర్ల రవి అలియాస్ గణేష్ మృతి.

చెందిన విషయం తెలిసిందే దీంతో గాజర్ల కుటుంబ ప్రస్థానం ఉద్యమంలో ముగిసినట్లయింది, రవి మృతదేహం కోసం బయలుదేరిన గాజర్ల అశోక్ అలియాస్( ఐతు) ఆంధ్రప్రదేశ్లోని రంపచోడవరం కు బయలుదేరి మృతదేహాన్ని తీసుకొస్తున్న క్రమంలో చిట్యాల చౌరస్తాలో రవి మృతదేహానికి గౌడ సంఘం నేతలు మరియు తన చిన్ననాటి స్నేహితులు బంధువులు ప్రజలు నివాళులర్పించి రవన్న అమరహే అంటూ నినాదాలు చేశారు ,ఈ సందర్భంగా గాజర్ల రవి అలియాస్ గణేష్ తమ్ముడు అశోక్ మీడియాతో మాట్లాడుతూ డెడ్ బాడీ కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరం అని కావాలని కాలయాపన చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ చనిపోయిన శవాలను చూసి భయపడాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వానికి రావడం నిజంగా చాలా దురదృష్టకరం అని కనీసం డెడ్ బాడీనికూడా చూపించడానికి ఉదయం 8 గంటల నుండి వేడుకుంటే రాత్రి 12 గంటలకు డెడ్ బాడీని అప్పజెప్పారు అని ఫోరోనిక్స్ వాళ్ళు లేరని నిర్లక్ష్యం సమాధానం చెబుతూ చాలా కాలయాపన చేశారు అని.
ఈ ప్రాంత పోరాటం కోసం ఎన్నో పోరాటాలు చేసిన రవి మృతదేహాన్ని చూడడానికి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు కడసారి చూపు కోసం నోచుకునే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు, డెడ్ బాడీ కోసం ఆంక్షలు పెట్టి ఇచ్చారని ఈ విషయం తెలంగాణ గవర్నమెంట్ కు మరియు పోలీస్ శాఖ వారికి ముందస్తుగా సమాచారం ఇవ్వడం జరిగిందని అట్లాంటి సంఘటనలు ఏమీ జరగవు అని ఈ సందర్భంగా తెలిపారు, కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అభిమానులు అందరూ శుక్రవారం రోజు జరిగే జరిగే అంత్యక్రియలో పాల్గొనాలని అన్నారు, మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించినవారు తెలంగాణ గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీపతి గౌడ్ ఉపాధ్యక్షులు తడక సుధాకర్ ప్రధాన కార్యదర్శి బుర్ర రమేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బుర్ర లక్ష్మణ్ గౌడ్ జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య అభిమానులు బంధువులు తదితరులు ఉన్నారు.

బిలియన్ పాస్‌వర్డ్స్ లీక్..

బిలియన్ పాస్‌వర్డ్స్ లీక్.. గూగుల్ సహా అనేక సంస్థల యూజర్ డాటా బట్టబయలు

 

 

 

 

 

యాపిల్, గూగుల్ సహా పలు డిజిటల్ సర్వీసులకు చెందిన 16 బిలియన్ పాస్‌వర్డ్స్, ఇతర లాగిన్ డీటెయిల్స్ బహిర్గతం కావడం సంచలనంగా మారింది.

ఇంటర్నెట్ డెస్క్: ఒకటి కాదు రెండు కాదు..
ఏకంగా 16 బిలియన్‌ల పాస్‌వర్డ్స్, ఇతర లాగిన్ క్రెడెన్షియల్స్ బహిర్గతమవడం ప్రస్తుతం సైబర్ ప్రపంచంలో సంచలనం రేకెత్తిస్తోంది.
గూగుల్, యాపిల్, గిట్ హబ్, ఫేస్‌బుక్, టెలిగ్రామ్ మొదలు ప్రభుత్వ సర్వీసుల వరకూ అనేక సంస్థల్లోని యూజర్ల లాగిన్ క్రెడెన్షియల్స్ బయటకుపొక్కడం కలకలం రేపుతోంది.
ఈ మేరకు ఫోర్బ్స్ ఓ సంచలన నివేదిక వెలువరించింది.

ఇప్పటికే 184 మిలియన్‌ యూజర్ రికార్డులు బట్టబయలు అయినట్టు సైబర్ నిపుణులు ఇటీవల ప్రకటించారు.

ఇప్పుడు ఏకంగా 16 బిలియన్ లాగిన్ వివరాలు బహిర్గతమవడంపై సైబర్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఫోర్బ్స్ పత్రిక కథనం ప్రకారం, లాగిన్ వివరాలకు సంబంధించి 30 డాటా సెట్స్ బయటపడ్డాయి.
ఒక్కో సెట్‌లో 3.5 బిలియన్ వివరాలు ఉన్నాయి. సోషల్ మీడియా లాగిన్ వివరాలు, వీపీఎన్ లాగిన్ డీటెయిల్స్‌తో పాటు కార్పొరేట్, డెవలపర్‌ వేదికల లాగిన్ వివరాలు కూడా
ఈ డాటా సెట్స్‌లో ఉన్నాయి.

ఇదేమీ సాధారణమైన లీక్ కాదని సైబర్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

ఈ డాటాను భారీ స్థాయిలో దుర్వినియోగపరిచే ఆస్కారం ఉందని అంటున్నారు.

 

వీటిని ఆయుధంగా మలిచే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

ఫిషింగ్ ఎటాక్స్, అకౌంట్ టేకోవర్స్, బిజినెస్ ఈమెయిల్ కాంప్రమైజ్ ఎటాక్స్‌కు వినియోగించే అవకాశం ఉందని అంటున్నారు.

 

అత్యంత విలువైన లాగిన్ క్రెడెన్షియల్స్ కూడా ఇలా బహిర్గతమవడంతో దీర్ఘకాలిక పరిణామాలు ఉంటాయని కీపర్ సెక్యూరిటీ కోఫౌండర్, సీఈఓ డేరెన్ గుసియోన్ హెచ్చరించారు.

 

ఇలాంటి దాడుల జరిగే అవకాశం ఉందని గూగుల్ లాంటి సంస్థలు ముందే ఊహించాయి.

 

యూజర్లు తమ డిజిటల్ అకౌంట్స్‌కు తాళం వేసుకునేందుకు పాస్‌వర్డ్స్‌, టూ ఫాక్టర్ ఆథెంటికేషన్‌లకు బదులు పాస్‌కీలు వాడాలని చెబుతున్నాయి.

 

ఇది బయోమెట్రిక్ ఆధారంగా పనిచేసే గుర్తింపు ధ్రువీకరణ వ్యవస్థ.

 

పాస్‌వర్డ్స్ వినియోగం ఇక ఎంత మాత్రం సురక్షితం కాదని భావిస్తున్న అనేక డిజిటల్ సంస్థలు పాస్‌కీల వైపు మళ్లుతున్నాయి.

 

పాస్‌కీతో యూజర్లు స్మార్ట్‌ఫోన్ల ద్వారా తమ బయోమెట్రిక్ ధ్రువీకరించుకున్నాకే లాగిన్ అయ్యే అవకాశం కలుగుతుంది.

 

పాస్‌కీలతో ఫిషింగ్ దాడులనుంచి పూర్తి రక్షణ లభిస్తుందని గూగుల్ చెబుతోంది.

 

పాస్‌కీలు వాడేటప్పుడు వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లో ఫింగర్ ప్రింట్, ఫేషియల్ స్కాన్ లేదా ప్యాటర్న్ లాక్ ఉపయోగించి తమ అకౌంట్‌లోకి లాగిన్ కావొచ్చు.

రైతు భరోసా పథకం.

రైతు భరోసా పథకం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం మండల ఆయా గ్రామాల ప్రజలకు
కొత్తగా వచ్చిన పట్టాదారు పాస్ పుస్తకం గల రైతులు ధరఖాస్తు పెట్టుకోవడానికి .చివరి తేదీ 20 జూన్ 2025 శుక్రవారం.(వ్యవసాయ పెట్టుబడి సహాయం పథకం వానాకాలం 2025-26)
05.06.2025 వరకు కొత్తగా వచ్చిన పట్టాదారు పాస్ పుస్తకం గల రైతులు దరఖాస్తు పెట్టుకోవడానికి అవసరమైన పత్రాలు:
1. పట్టాదారు పాస్ పుస్తకం లేదా డిజిటల్ సంతకం అయినా జిరాక్స్ 2. ఆధార్ కార్డు జిరాక్స్. 3. బ్యాంకు సేవింగ్ ఖాతా జిరాక్స్. 4. పూర్తిగా నింపబడిన దరఖాస్తు ఫారం.
ఈ పత్రాలను మీ క్లస్టర్ అధికారి అయిన వ్యవసాయ విస్తీర్ణ అధికారి గారికి సమర్పించాలి.
గమనిక 1 : 05.06.2025 నాటికి భూ భారతి (ధరణి) పోర్టల్ లో ఉన్న పట్టాదారుల డేటా రైతు భరోసా పథకం కింద అర్హులైన రైతులకు సాయం అందించేందుకు భూమి పరిపాలన ప్రధాన కమిషనర్ (CCLA) నుండి పొందబడింది. డిజిటల్ సంతకం అయినా రైతులు అర్హులు.
గమనిక 2: గతంలో రైతు బంధు పొందిన రైతులు మళ్లీ దరఖాస్తు చేయవలసిన అవసరం లేదు హారి
వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించగలరు

ఆరోగ్యశాఖ మంత్రి నియోజకవర్గంలో నాణ్యతలోపం.

ఆరోగ్యశాఖ మంత్రి నియోజకవర్గంలో నాణ్యతలోపం

◆ ఏడాది గడవకుండానే రోడ్ కు మరమ్మ త్తులు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల కేంద్రం నుంచి ఝరాసంగం మండలం కప్పాడు గ్రామం వరకు నిర్మించిన తారు రోడ్డు ఏడాది గడవకుండానే పాడవటం పై బిఎస్పి జిల్లా ఇంచార్జి మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సిహ్మ ఇలాకాలో సంబంధిత అధికారులు నాణ్యత ప్రమాణం పాటించకపోవడంపై బీఎస్పీ ఇంచార్జి మోహన్ ఎద్దేవా చేశారు.. పాడైన రోడ్డు ను, ప్యాచ్ వేసేందుకు చేపట్టిన పనులను గురువారం అయన పరిశీలించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ అధికారులు రోడ్డు నిర్మాణ సమయం లో నిర్లక్షంగా వ్యవహరించడం వల్లనే మూన్నాలకే రోడ్డు పై తారు లేచిపోయి గుంతల మాయంగా మారిపోయిందని, దీంతో ప్రయాణికుల, వాహన దారుల కష్టాలు పునరావృతం అయ్యయన్నారు. రోడ్ లు, భావనలు నిర్మాణ క్రమంలోనే సంబంధిత ఇంజనీర్ లు తగిన విధులు నిబద్దతతో నిర్వహిస్తే ప్రజలకు ఇబ్బందులు ఉండవన్నారు. ఇప్పటికైనా అధికారులు, తారు, సీసీ రోడ్డు లు, భవనాలను ఎస్టిమేషన్ లకు తగ్గట్లు నిర్మించి తమ విధులను సక్రమంగా నిర్వహించాలని కోరారు. రోడ్ లు, భవనాల నిర్మాణం లో మరోసారి నిర్లక్ష్యం వహిస్తే జిల్లా, రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులకు పిర్యాదు చేసి నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరానున్నట్లు తెలిపారు. కొన్ని రోజుల క్రితం వర్షంలో చెర్ల రాయిపల్లి లోని వంతెన నిర్మాణాన్ని కొనసాగించిన అంశం, పలు గ్రామాల్లో నాసిరకం ఇసుకతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. నిబంధనల మేరకు అధికారులు నడుచుకోకపోతే ప్రజలతో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

ఉర్దూ సైన్ బోర్డుకు విజయవంతమైన ప్రాతినిధ్యం.

ఉర్దూ సైన్ బోర్డుకు విజయవంతమైన ప్రాతినిధ్యం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

మజ్లిస్ ఇత్తెహాద్-ఉల్-ముస్లిమీన్ మరియు జహీరాబాద్ జిల్లాలోని వివిధ సామాజిక నాయకులు ఈద్గా ముందు ఉన్న కొత్త ఫ్లైఓవర్ వంతెన పైన ఉన్న సైన్ బోర్డుపై ఉర్దూ భాషను విస్మరించారు. మజ్లిస్ ఇత్తెహాద్-ఉల్-ముస్లిమీన్ జహీరాబాద్ అధ్యక్షుడు ముహమ్మద్ అథర్ అహ్మద్ పార్టీ నాయకులు మరియు సామాజిక నాయకులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు మరియు సైన్ బోర్డు ఏర్పాటును నిలిపివేశారు మరియు ఉర్దూ సైన్ బోర్డు ఏర్పాటు చేసే వరకు పనిని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. దీనిపై, ఆర్ అండ్ బి అసిస్టెంట్ ఇంజనీర్ సింధియా మరియు సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జహీరాబాద్-2-IN వినయ్ కుమార్ అధ్యక్షుడు మజ్లిస్ జహీరాబాద్ ముహమ్మద్ అథర్ అహ్మద్ కు 24 గంటల్లోగా సైన్ బోర్డును ఉర్దూలో రాయించుకుంటామని హామీ ఇచ్చారు. బుధవారం, సైన్ బోర్డు ఉర్దూలో వ్రాయబడింది.దీనిపై, మజ్లిస్ జహీరాబాద్ అధ్యక్షుడు ముహమ్మద్ అథర్ అహ్మద్,మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ తరపున మరియు జహీరాబాద్ ముస్లింల తరపున, R&B విభాగం మరియు పోలీసు శాఖకు ధన్యవాదాలు మరియు ఈ నిరసనలో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు.ఈ సందర్భంగా, మజ్లిస్ పార్టీ సభ్యులు ముతామర్ బిన్ అమీర్ బిన్ అబ్దుల్లా, షేక్ ఇలియాజ్,మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ మహమ్మద్ అలీమ్,మహమ్మద్ సమీర్ మహమ్మద్ అఫ్సర్ మహమ్మద్ ఖవాజా తదితరులు పాల్గొన్నారు.

700 కోట్ల భూమిలో 225 మంది అక్రమంగా రాజ్యమేలుతున్నారు.

 

`‘‘సీఎం రేవంత్‌’’ ఇచ్చిన మాట నిలబెట్టుకునేది ఎప్పుడు.

`’’మ్యానిఫెస్టో’’లో పెట్టిన అంశానికి తూట్లు పొడుస్తారా.

 

`సినీ కార్మికులకు ఇళ్ల కళ నెరవేర్చరా.

`‘‘నేటిధాత్రి’’ చిత్రపురి పై కార్మికుల పక్షాన అక్షర పోరాటం చేసినప్పుడల్లా చర్యలు తీసుకొని ఆ తరువాత మరచి పోవడం ఉన్నతాధికారులకు సాధారణంగా మారిపోయింది.

`‘‘రోహౌస్‌’’ లే అక్రమం..పైన అంతస్తుల ‘‘చట్ట విరుద్ధం’’!

`72 ‘‘రో హౌస్‌’’ లపై చట్ట విరుద్ధంగా అంతస్తులు వేస్తున్నారు.

`ఎవరికివారు ఇష్టానుసారంగా నిర్మాణం.

`కళ్ళు మూసుకున్న యంత్రాంగం.

`రో హౌస్‌ లు కూల్చితే తప్ప కార్మికులకు న్యాయం జరగదు.

`ఓ వైపు రోహౌస్‌లు కూల్చేయాలని డిమాండ్లున్నాయి.

`వాటినే నిబంధనలను అతిక్రమించి నిర్మాణం చేశారు.

`ఇప్పుడు మళ్ళీ పై అంతస్తుల మీద అంతస్తులేస్తున్నారు.

`రో హౌస్‌ ల నిర్మాణమప్పుడే పైన మరొకరికి అవకాశం వుంటుందన్న ప్రతిపాదన వుంది.

`దానిని కూడా తుంగలో తొక్కి నిర్మాణాలు సాగిస్తున్నారు.

`72 రో హౌస్‌ లపై చట్టవిరుద్ధంగా అంతస్తులు వేస్తున్నారు.

`కార్మికుల స్థలంలో సినీ పెద్దలు వాలడమే అన్యాయం.

`14 ఎకరాలలో వాలిన సినీ గద్దలు.

`కార్మికులను తరిమి ఆవాసాలు.

`ఇంత కాలమైన కార్మికుల కల కలగానే మిగిలిపోయింది.

`మున్సిపల్‌ ఆదేశాలు బుట్ట దాఖలు.

`చిత్రపురి సొసైటీ నామ్స్‌కు సమాధులు.

`భూమి కార్మకులది…రో హౌస్‌లు సినీ గద్దలకి.

`కష్టం కార్మికులది…వైభోగం గద్దలది.

`సొమ్ము కార్మికులది…ఆవాసం పెద్దలది.

`అన్ని రకాల హక్కులు కార్మికులవి.

`ఆక్రమణలో సినీ గద్దల చోటది.

`అన్యాయమైన కార్మికుల కన్నీళ్లు ఆవిరి.

`రో హౌస్‌ల పేరుతో అంతస్తుల గద్దల సొంతమైంది.

`సీఎం రేవంత్‌ రెడ్డి గారు ఎన్నికల ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకునేదెప్పుడు.

 

హైదరాబాద్‌,నేటిధాత్రి:                                         

చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్లు చిత్ర సీమలో సినీ గద్దలు దూరారు. 14 ఎకరాలు సొంతం చేసుకున్నారు. అందులో రోహౌస్‌లు నిర్మాణం చేసుకున్నారు. వాటిపై ఇప్పుడు అంతస్ధులు పెంచుకుంటున్నారు. అడిగే దిక్కులేదు. అడిరదేందుకు ముందుకు వచ్చేవారు లేరు. అటు ప్రభుత్వానికి పట్టింపు లేదు. ఇటు మున్సిపల్‌ శాఖ నిర్లక్ష్యం వెరసి, కార్మికులకు తీరని అన్యాయం జరిగింది. ఇంకా జరుగుతూనేవుంది. కార్మిక పక్షపాతిగా ఒకప్పటి తెలంగాణకు చెందిన సీనియర్‌ నటుడు సినీ కార్మికుల సంక్షేమాన్ని కోరి, తన స్ధలం కొంత ఇచ్చారు. ఆయనే దగ్గరుండి ప్రభుత్వం చేత 64ఎకరాలు ఇప్పించాడు. కార్మికులు రూపాయి, రూపాయి వేసుకున్నారు. ఒక సంఘంగా ఏర్పడ్డారు. ఇంతలో ఆ నటుడు కాలం చేశాడు. ఆ స్ధలం మీద పెత్తనం కోసం గద్దలు వాలాయి. కార్మికులను తరిమేశాయి. కార్మికులకు చోటులేకుండాచేశాయి. కార్మికుల చెమటను గద్దలు అత్తరు చేసుకొని కులుకుతున్నాయి. ఇంత దుర్మార్గం ఎక్కడా వుండదు. సమాజంలో ఇంత నీతి మాలిన పని ఎక్కడా కనిపించదు. పైకి కార్మిక పక్షపాతుల్లా ఫోజులు కొట్టి, ఆఖరుకు ఆ కార్మికులకే చోటు లేకుండా చేసిన దుర్మార్గపు సమాజం సినీ లోకం. సినిమా పేరుతో ఎంతో మందిని మోసం చేస్తారు. వెట్టి చారికీ చేయించుకుంటారు. నిర్మాతలుగా మారిన వారు కోట్లు కూడబెట్టుకున్నారు. కార్మికుల కష్టం దోచుకొని వారి రక్తం తాగారు. సినీ సంక్షేమం అనగానే ఇలాంటి చిన్న చిన్న కార్మికుల చేత రక్తదానాలు చేయిస్తారు. ప్రచారం చేయించుకుంటారు. సినిమాల నిర్మాణంలో వెట్టి చాకిరీ చేయించుకుంటారు. ఇలా అన్ని రకాలుగా అన్యాయమైపోతున్నా సినీ కళామ తల్లిని నమ్ముకొని మంచిరోజులు రాకపోతాయా? అని జీవితం కాలం ఎదరుచూసి తనువు చాలించి సినీ కార్మికులు ఎంతో మంది వున్నారు. తాము లేకపోయినా తమ కుటుంబాలకు ఓ నీడ కావాలని కలలుగని, సంపాదించిన సొమ్మును చిత్రపురిలో ఇండ్లకోసం పెట్టుబడి పెట్టినవాళ్లున్నారు. ఇప్పటికీ నీడ లేక, అటు అవకాశాలు లేక, ఇటు సంపాదన చాలక, చస్తూ బతుకుతున్న కార్మికులు వేలల్లో వున్నారు. ఇది నాచిత్రపురి. ఇక్కడ నాకు ఇంత చోటొస్తుందని కలలుగన్న కార్మికులు ఎంతో మంది వున్నారు. శ్రమకోర్చి సంపాదించిన సొమ్మును చెమట చేతులతో సభ్యతాలు తీసుకున్న వాళ్లు ఇప్పుడు కన్నీళ్లు కారుస్తున్నారు. దుఖం అనుభవిస్తున్నారు. శాపాలు పెడుతున్నారు. అయినా గద్దలకు సిగ్గు శరం ఏమీ రావడం లేదు. సిగ్గూ ఎగ్గులేని సమాజంగా తయారైన సినిమా ప్రపంచంలో కార్మికుల కన్నీళ్లకు విలువ లేకుండా చేశారు. తెరమీద నటనలో కన్నీటికి కోట్లు కుమ్మరిస్తున్నారు. కొంత మంది కబంధహస్తాలలో పరిశ్రమను పెట్టుకొని కార్మికుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. సినీ సభ్యత్వముంటే చాలు అదే ఐఎఎస్‌ పాసైనంత అల్ప సంతోషులు మోసం చేయడానికి చిత్ర పరిశ్రమ పెద్దలకు ఎలా మనసొస్తుందో తెలియదు. సినిమాల్లో కన్నీళ్లు, కష్టాలు, మనసులు, మమతలు, అనుబందాలు, ప్రేమలు, తిరుగుబాటు, చైతన్యం అన్ని చూపిస్తుంటారు. ప్రేక్షకులను రంజింపజేసి కోట్లు మూట గట్టుకుంటారు. ఆ సినిమాలకు పనిచేసిన కార్మికులకు మాత్రం ఇవేవీ లేకుండా చేస్తున్నారు. వారి జీవితాలు వీది పాలు చేస్తున్నారు. కూడులేని, గూడు లేని రోడ్డుమీద బతుకులు చేస్తున్నారు. కార్మికుల కోసం ప్రభుత్వం ఇచ్చిన చిత్రపురిలో అసలైన సినీ పెద్దలు గద్దలుమా మారి 14 ఎకరాల్లో వాలిపోయారు. నిజానికి చిత్రపురికి సంబంధించిన 67 ఎకరాల్లో జీవో.నెంబర్‌. 658ప్రకారం అన్ని అప్పార్టుమెంట్లు మాత్రమే నిర్మాణం చేయాలి. అప్పార్టుమెంటు ప్లాట్లే కార్మికులు ఎవరైనా సరే అందించాలి. అందులో చిన్న చితాక నటుల, ఇతర కార్మికుల అందించాలని అప్పటి ప్రభుత్వం జీవో జారి చేసింది. దాన్ని కొంత మంది పెద్దలు అప్పట్లో తిమ్మిని బమ్మిని చేసి, అప్పటి మున్సిపల్‌ అధికారులకు తప్పు తోవ పట్టించి,నమ్మించి 14 ఎకరాలు వారి పరం చేసుకున్నారు. అలా 14 ఎకరాలు సొంతం చేసుకున్న సినీ పెద్దలు రోహౌజ్‌లు నిర్మాణం కోసం ప్రతిపాదనలు పెట్టుకున్నారు. అప్పటి సొసైటీ కూడా సినీ పెద్దలకు వంతపాడి వారికి కట్టబెట్టింది. తొలుత 1450 ఎస్‌ఎఫ్‌టిల స్ధలం కేటాయించి, మళ్లీ దాన్ని 2250 ఎస్‌ఎఫ్‌టికు మార్చుకున్నారు. కాని అది మున్సిపల్‌లో అప్రూవ్‌ కాలేదు. అయినా సినీ పెద్దలమనే అహంకారంతో అందర్ని బెదిరంచి రోహౌజ్‌లు నిర్మానం చేసుకున్నారు. అయితే అక్కడ కూడా రోహౌజ్‌ల నిర్మాణం జరిగినా, అవి కూడా అప్పార్టుమెంట్లలాగా, మిగిలిన మరింత మందికి పైన నిర్మాణాలు చేసి, ఇతరులు అందిస్తామని చెప్పారు. ఆ మాట తప్పారు. అవి వారి సొంతం చేసుకున్నారు. వాటిపై పూర్తి ఆదిపత్యం కొనసాగిస్తున్నారు. చిత్ర పురి సొసైటినీ కూడా దిక్కరించి, వారి ఇష్టాను సారం నిర్మాణాలు చేసుకుంటున్నారు. మొత్తం 225 రో హౌజ్‌లు నిర్మాణం జరిగాయి. అందులో ఇప్పుడు 72 రోహౌజ్‌ల పెద్దలు వాటిపై అంతస్ధుల మీద అంతస్ధులు నిర్మాణాలు చేసుకుంటున్నారు. అందుకు మున్సిపల్‌ అనుమతులు ఎక్కడా లేవు. రో హౌజ్‌ల నిర్మాణం జరుగుతున్నప్పటి నుంచి కార్మిక లోకం అడ్డుకుంటూనే వుంది. ఉద్యమాలు చేసింది. పోరాటాలు చేసింది. అయినా వారి వేదన అరణ్య రోధనే అయింది. ఆ స్ధలం విలువ కోట్లలో వుంటుంది. సినీ పెద్దలకు అసలు చిత్రపురిలో చోటు లేదు. వుండొద్దు కూడా..అలాంటి రోహౌజ్‌లు ఏకపక్షంగా నిర్మాణం చేసుకోవడం చట్టరిత్యా నేరం. వాటిని కూల్చేయాలిన కార్మికులు ఎప్పటినుంచో పోరాటాలు చేస్తున్నారు. రోహౌజ్‌లు నిర్మాణాలున్న చోట అప్పార్టుమెంట్లు నిర్మాణం చేస్తే కనీసం మరో 3వేల మంది కార్మికులకు ఇండ్లు ఇవ్వొచ్చు. కాని కేవలం 225మంది పెద్దలు వాటిలో దూరిపోయారు. ఆ స్ధలాన్ని ఆక్రమించుకున్నారు. ఇప్పటికైనా మించిపోయంది లేదు. ప్రభుత్వం చొరవ తీసుకొని రోహౌజ్‌లను కూల్చివేస్తే కొన్ని వేల మంది కార్మికులకు న్యాయం జరుగుతుంది. అసలు రోహౌజ్‌ల నిర్మాణాలే చట్ట విరుద్దమంటుంటే, లెక్క చేయకుండా 72 మంది సినీ పెద్దలు వాటిపై మరిన్ని నిర్మాణాలు సాగిస్తున్నారు. అక్కడ ఎలాంటి అదనపు నిర్మాణాలకు అనుమతులు లేవు. అయినా నిర్మాణాలు చేపడుతున్నారు. అధికారులు చోద్యం చూస్తున్నారు. అలాంటి నిర్మాణాలు చేపడుతుంటే చిత్రపురి సొసైటీ ఏం చేస్తుందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. చిత్రపురి విషయంలో సొసైటీకి పూర్తి స్ధాయి అధికారాలున్నాయి. ఆ 67 ఎకరాల్లో ఎలాంటి నిర్మాణాలు సాగించాలన్నదానిపై పూర్తి హక్కులు సొసైటీకి మాత్రమే వున్నాయ. ఆ సొసైటీలో ఎవరి జోక్యం వుండకూడదు. సినీ పెద్దలు ఎంతటి వారైనా సరే వారి మాటలను సొసైటీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాని సొసైటీ పెద్దలను కూడా లెక్క చేయకుండా, సినీ పెద్దలు ఇలాంటి అక్రమ నిర్మాణాలు సాగించడం నేరం. కార్మికులలో కొంతమంది సినీ పెద్దలకు వంతపాడుతూ, సొసైటీలోని ఇతర అప్పార్టుమెంట్ల విషయంలోనూ, ట్విన్‌ టవర్స్‌ లలో వివాదాలు సృష్టిస్తున్నారు. కాని 14 ఎకరాలు అక్రమంగా సినీ పెద్దలు ఆక్రమించుకున్నారన్నదానిపై కొన్ని కార్మిక సంఘాలు ప్రశ్నించకపోవడం విడ్డూరం. కార్మికుల్లో వున్న అనైక్యతను ఆసరా చేసుకొని సినీ పెద్దలు ఆటలాడుతున్నారు. కార్మికులను విభజించి పాలించు అనే రాజకీయం చేసి, కార్మికులకే తీరని అన్యాయం చేస్తున్నారు. ఈ సంగతి కొంత మంది కార్మికులు గుర్తించలేకపోవడం గమనార్హం. అందుకే కార్మికులను వర్గాలుగా విభజించి, సినీ పెద్దలు నాటకాలు ఆడుతున్నారు. అందరు కార్మికులు ఏకమైతే తమ పప్పులుడకవని, కార్మికుల్లో వారికి వారికే లేనిపోని పంచాయతీలు పెడుతున్నారు. కొంత మంది కార్మికులకు అండగా వున్నట్లు నటించి, వారిని ఉసిగొల్పి చిత్రపురిని అబాసు పాలు చేయిస్తున్నారు. దాంతో సొసైటీ కూడా ఏం చేయలేకపోతోంది. ఇప్పటికైనా మించిపోలేదు. కార్మికులంతా ఏకమైన రోహౌజ్‌లు కూల్చివేత వరకు పోరాటం చేయాలి. అసలైన పోరాటం ఇక్కడి నుంచే మొదలు పెట్టాలి. ముందు రోహౌజ్‌ల కూల్చివేత జరిగితే, ఆ స్ధలంలో ఎంత లేదన్నా కనీసం మరో 3వేల మంది కార్మికులకు నీడ కల్పించొచ్చు. ప్రస్తుతం చేపడుతున్న ట్విన్‌ టవర్స్‌లాగా మరిన్ని అప్పార్టుమెంట్లు నిర్మాణం చేయొచ్చు. కార్మికలందిరకీ న్యాయంచేయొచ్చు. కార్మిక సోదరులు వాళ్ల మధ్య విభేదాలు పక్కన పెడితే, కార్మికుల సొంతింటి కల నెరవేరడం ఖాయం. లేకుంటే జీవితాంతం గూడు కోసం పోరాటమే శరణ్యం. ఏది కావాలో తేల్చుకుంటే సమీప భవిష్యత్తులోనే సొంతిళ్లు సొంతం చేసుకోవచ్చు. కార్మికులపక్షాన నేటిధాత్రి చేస్తున్న అక్షరపోరాటం నిజం చేసుకోండి. మీ సొంతింటికల నెరవేర్చుకోండి.

తప్పించుకోవడానికి జగన్‌ తప్పుల మీద తప్పులు!

`కమిషనర్‌ చౌహన్‌ ను అందరూ కలిసి మభ్యపెడుతున్నారా!

`మిల్లర్‌ అసోసియేషన్‌ అంతర్లీనంగా జగన్‌ ను ఎందుకు కాపాడుతున్నట్లు!

`జగన్‌ వెనుక ఉండి మిల్లర్ల అసోసియేషన్‌ రాష్ట్ర నాయకుడు నడిపిస్తున్నాడా?

`కమీషనర్‌ కు హన్మకొండ జేసి రాసిన లేఖతో బట్టబయలు.

`రైతులను ఒప్పించిన తర్వాతే బస్తాలలో కోత అని జగన్‌ వాదనలు.

`హన్మకొండ జిల్లాకు వడ్లను పంపించింది ఖమ్మం జేసి.

`వడ్లను అప్పగిస్తూ హన్మకొండ లోని ఇతర మిల్లులకు ఆర్వోలు.

`హన్మకొండ అధికారుల అత్యుత్సాహంతో జగన్‌ మిల్లులకు చేరిన వడ్లు.

`రైతుల వద్ద జగన్‌ వడ్లు కొనుగోలు చేయలేదు.

`అలా అయితే నేరుగా జగన్‌ మిల్లుల పేరు మీదే వడ్లు వచ్చేవి.

`ఇంతటి గందరగోళం నెలకొని వుండకపోయేది.

`అసలు ఖమ్మం నుంచి వచ్చింది వడ్లకు జగన్‌కు సంబంధమే లేదు.

`కనీసం మధ్య వర్తిత్వం కూడా జరగలేదు.

`జగన్‌ అసలు ఖమ్మం వెళ్లనే లేదు. రైతులను కలిసిందే లేదు.

`అలాంటప్పుడు జగన్‌ రైతులను ఎలా ఒప్పించినట్లు!

`జగన్‌ చెప్పిన విషయాలకు హన్మకొండ జిల్లా సివిల్‌ సప్లయ్‌ అధికారులు ఎలా తలూపినట్లు?

`కమీషనర్‌ కు హన్మకొండ జేసి లేఖలో ఈ ప్రస్తావన ఎందుకు చేసినట్లు?

`జేసిని హన్మకొండ సివిల్‌ సప్లయ్‌ అధికారులు తప్పు దోవ పట్టించారా?

`జగన్‌ను కాపాడతామని గతంలో అధికారులు అన్నంత పని చేశారా?

`కులమే ముఖ్యమని గతంలో చెప్పిన అధికారులు జగన్‌ను కాపాడుతున్నారా!

`రైతులను అడ్డంగా మోసం చేసిన జగన్‌ను ఎందుకు వెనకేసుకొస్తున్నట్లు?

హైదరాబాద్‌,నేటిధాత్రి:
ఒక తప్పు వంద తప్పులు చేయిస్తుంది. ఒక మోసం వంద మోసాలు చేసేలా చేస్తుంది. ఒక అబద్దం వెయ్యి అసత్యాలను చెప్పిస్తుంది. కాని తప్పు చేయొద్దన్న భావన వుంటేనే మనిషంటారు. లేకుంటే మోసగాడంటారు. రైతులను మోసం చేసిన వారిని దుర్మార్గులంటారు. ఆరు గాలం కష్టపడి ఎండననక, వాననక, రాత్రి పగలు తేడా లేకుండా ఒక్కొ గింజను అపురూపంగా చూసుకుంటాడు. చేలు నుంచి ఒక్క వడ్ల గింజ రాలినా కన్నీరు కారుస్తాడు. వరి చేలును కంటికి రెప్పలా చూసుకుంటాడు. కన్న బిడ్డలను పెంచుకున్నట్లు పెంచుకుంటాడు. అలాంటి రైతులను మోసం చేయడం పాపం. చట్టపరంగా నేరం. అన్నీ తెలిసినా కొంత మంది జగన్‌ లాంటి మిల్లర్లు మోసాలు చేస్తూనే వుంటారు. రైతుల గోస పుచ్చుకుంటూనే వుంటారు. అలాంటి వారిని ప్రభుత్వాలు ఉపేక్షించకూడదు. రైతులు చెమట కష్టంతో పండిరచే ఒక్కవడ్ల గింజను మోసం చేసినా, అది క్షమించరానిదే. ఇప్పుడున్న టెక్నాకలజీ ప్రకారం వడ్లలో వున్న తేమను క్షణాల్లో గుర్తించే అవకాశంవుంది. గతంలో వ్యాపారులు చెప్పిందే రైతు వినేవారు. రైతులను బెదిరించేవారు. ఇప్పుడున్న సదుపాయలు రైతులకు అప్పుడు లేవు. రైతులే తమ ఎడ్ల బండ్ల ద్వారా రైస్‌ మిల్లులకు, వ్యాపారులు వడ్లను తీసుకెళ్లేవారు. అప్పుడు వ్యాపారి చెప్పిందే చేసేవారు. అయినా అప్పుడు ఇంతగా మోసాలు లేవు. అరచేతిలో వడ్లుపట్టుకొని రైతుల రెండు చేతులతో నలిపి బియ్యం తీసి చూపించి, వ్యాపారుల నోరు మూయించేవారు. ఇప్పుడు ఆపరిస్దితి అవసరం కూడా లేదు. వడ్లలో వున్న తేమను ఖచ్చితంగా కొలిచే యంత్రాలు వచ్చాయి. అయినా రైతులను మోసంచేసేందుకు జగన్‌ లాంటి వ్యాపారులు చూస్తూనే వున్నారు. అయితే అవి అలాంటి ఇలాంటి మోసాలు ఏకంగా ప్రభుత్వం కల్లుగప్పే మోసం. రైతులకు తీరని అన్యాయంచేసే మోసానికి పాల్పడుతున్నారు. ఇక్కడ మిల్లర్‌ చేసిన మోసం గురించి వివరంగా చెప్పుకుందాం..తప్పుల మీద తప్పులు చేసి ఎలా తప్పించుకోవాలనుకుంటున్నాడో చూద్దాం..ఖమ్మం జిల్లాకు చెందిన జాయింట్‌ కలెక్టర్‌ హన్మకొండ సివిల్‌ సప్లయ్‌కు మిల్లర్ల పేరు మీద పంపింపిన ఆర్వోలను రికవరీ చేశారు. ఇది ముమ్మాటికీ నేటిధాత్రి దినపత్రిక విజయం. రైతులకు మేలు చేసే విషయంలో అలుపెరగని అక్షర పోరాటం చేసిన నేటిధాత్రి వల్ల రైతులకు మరింత మేలు జరిగింది. అందుకు రైతులు కూడా నేటిధాత్రి దినపత్రికకు ధన్యవాదాలు తెలిపారు. ఖమ్మం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌తోపాటు, సవిల్‌ సప్లై సిబ్బంది కూడా అభినందలు తెలిపారు. ఇది రైతుల కోసం నేటిధాత్రికి దక్కిన గౌరవం. ఇక అసలు విషయానికి వద్దాం. ఇటీవల హన్మకొండ జాయింట్‌ కలెక్టర్‌ కూడా మిల్లర్‌ జగన్‌ వడ్లను మాయం చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ సివిల్‌ సప్లైశాఖ కమీషనర్‌ కు లేఖ రాశారు. దాంతో జగన్‌ బండారం పూర్తిగా బైటపడిపోయింది. జగన్‌ చేసిన మోసం రుజువైంది. అయినా జగన్‌ తన వితండవాదాన్ని వదిలిపెట్టడం లేదు. తాను రైతులను ఒప్పించిన తర్వాతే వారి అనుమతితోనే వడ్లలో కోత పెట్టడం జరిగిందంటున్నాడని సమాచారం. అందువల్లనే బస్తాలను మాయం చేసినట్లు కూడ చెప్పినట్లు తెలుస్తోంది. ఇక్కడే జగన్‌ మరోసారి తప్పులో కాలేశాడు. ఖమ్మంజిల్లా జాయింట్‌ కలెక్టర్‌ హన్మకొండకు చెందిన మిల్లర్‌ జగన్‌కు వడ్లు పంపలేదు. ఇది మొదటి అంశం. ఖమ్మం జేసి జగన్‌కు ఎలాంటి ఆర్వోలు కూడా జారీ చేయలేదు. ఆర్వోలు హన్మకొండ జిల్లాలోని ఇతర మిల్లుల పేరు మీద ఆర్వోలు జారీ చేయడం జరిగింది. మిల్లర్‌ జగన్‌కు వ్యాపార పరంగా అత్యంత అనుకూలమైన కొంత మంది సివిల్‌ సప్లై అధికారులు ఆర్వోలు అందిన మిల్లర్‌ అన్‌ లోడ్‌ చేయాల్సిన బస్తాలను జగన్‌ మిల్లుకు మళ్లించారు. ఆర్వోలు జారీ అయిన మిల్లుల వద్దకు చేరిన వడ్ల బస్తాలను సంబంధిత మిల్లర్లు అన్‌ లోడ్‌ చేసుకోవడం లేదంటూ హన్మకొండ జిల్లా కలెక్టర్‌కు తప్పుడు సమాచారం అందించి, వాటిని జగన్‌ మిల్లులకు మల్లించారు. ఆర్వోలు జారీ అయిన మిల్లర్లు అడ్డుకున్నా, నిర్ధాక్షిణ్యంగా వాటిని జగన్‌ మిల్లులకు మళ్లించడం అదికారులు చేసిన పెద్ద పెరపాటు. అయినా ఇతర మిల్లర్లు ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. ఆర్వోలు జారీ అయిన మిల్లర్లు కూడా ఎదిరించలేదు. అధికారుల వద్ద జగన్‌కు వున్న పలుకుబడితో వారు కూడా సైలెంట్‌ అయ్యారు. ఒకప్పుడు వడ్లు వద్దే వద్దు అని మొండికేసిన జగన్‌ ఇప్పుడు కొట్లాడి మరీ వడ్లు తీసుకున్నాడు. జగన్‌కు వున్నవి రా రైస్‌ మిల్లులుకాదు. బాయిల్డ్‌ రైస్‌ మిల్లులు. అయినా ఇప్పుడు రా రైస్‌ మిల్లర్ల పొట్టగొట్టి వారి వ్యాపారానికి అడ్డు తగిలి మరీ వడ్లు తీసుకున్నాడు. పైగా రైతులను మోసం చేశాడు. వడ్ల బస్తాల మాయంపై హన్మకొండ జాయింట్‌ కలెక్టర్‌ విచారణకు ఆదేశించారు. దాంతో జగన్‌ తాను రైతులను ఒప్పించి, మెప్పించి వడ్లలో తేమ శాతం ఎక్కువ వుండడంతో కోత కోశానని వివరణ ఇచ్చుకున్నాడని సమాచారం. అసలు హన్మకొండ జిల్లా మిల్లులకు ఖమ్మం నుంచి వడ్లు వస్తున్న సంగతే జగన్‌కు తెలియదు. హన్మకొండ జిల్లాకు చెందిన ఇతర రైస్‌ మిల్లుల వరకు లారీలు చేరే దాకా జగన్‌కు సమాచారమే లేదు. ఖమ్మం జేసి నుంచి ఆర్వోలు జగన్‌కు మిల్లులకు వచ్చింది కాదు. అలాంటప్పుడు జగన్‌ రైతులను ఎప్పుడు కలిసినట్లు? ఎలా కలిసినట్లు? అదే నిజమైతే ఖమ్మం జేసి మొదట నేరుగా జగన్‌కే ఆర్వోలు జారీ చేసేవారు. జగన్‌కు కాదని ఇతర మిల్లులకు జారీ చేసేవారు కాదు. ఇతర మిల్లులకు జారీ చేసిన వడ్లను తన మిల్లులకు తోలుకుపోవాల్సిన అవసరమే వచ్చేది కాదు. జగన్‌ ఒప్పించిన రైతులు ఎవరు? ఏఏ ఐకేపి సెంటర్ల నుంచి వచ్చిన వడ్లో జగన్‌కు ఎలా తెలుసు? ఖమ్మం నుంచి హన్మకొండకు వడ్లు వచ్చిన తర్వాతే జగన్‌ వాటిని తన మిల్లులకు మరల్చుకున్నాడు. అలాంటప్పుడు ఏ రైతులను జగన్‌ ఒప్పించుకున్నాడో చెప్పాలి. ఆ రైతులు ఎవరో జగన్‌ వెల్లడిరచాలి. వారి చేత చెప్పించాలి? తప్పు చేసి కూడా ఇంకా ప్రబుత్వాన్ని మోసం చేస్తూ, రైతుల పేరు చెప్పి మాయమాటలు చెబుతున్న జగన్‌ మిల్లులను సీజ్‌ చేయాలి. విజిలెన్స్‌ ఎంక్వౌరీ చేయించి, జగన్‌పై కేసులు నమోదు చేయాల్సి వుంటుంది. జగన్‌ వివరణతో రిపోర్టు తయారు చేసిన అదికారులు ఈ చిన్న విషయాన్ని కూడా పసిగట్టలేకపోయారా? జగన్‌ చెబుతున్నది అవాస్తవమని తేలిపోతుందని గమనించలేకపోయారా? జగన్‌ ఏది చెబితే దానిని సమర్దిస్తూ హన్మకొండ జిల్లా అదికారులు రిపోర్టు తయారుచేస్తారా? ఇలాంటి తప్పుడు వివరణల ద్వారా మళ్లీ జగన్‌ తనగోతిని తానే తవ్వుకుంటున్నాడని అదికారులు కూడా గుర్తించలేకపోయారా? అసలు ఈ ఆలోచన జగన్‌కే వచ్చిందా? లేక అదికారులే జగన్‌కు ఇలాంటి సలహా ఇచ్చారా? రైతులను ఒప్పించుకున్నానని చెప్పు. సమస్య తీరిపోతుందని భరోసా ఇచ్చారా? ఎందుకంటే గతంలో జగన్‌కు కాపాడేందుకు కొంత మంది అదికారులు సన్నిహితులతో చెప్పిన మాటలు కూడా నేటిధాత్రి ప్రస్తావించింది. తమకు కులమే ముఖ్యమని, తమ కులానికి చెందిన జగన్‌న కాపాడతామని చెప్పిన అదికారులే కాపాడుతున్నట్లు స్పష్టమౌతోంది. గతంలో వారు చెప్పినట్లే జగన్‌ను వెనకేసుకొస్తున్నారనిపిస్తోంది. అందుకే ఆర్వోలు జారీ అయిన మిల్లులకు కాకుండా, జగన్‌ మిల్లులకు వడ్లు తరలించారు. ఆర్వోలు జారీ అయిన మిల్లర్లను అన్యాయం చేశారు. జగన్‌కు ఖమ్మం నుంచి వచ్చిన వడ్లన్నీ అంటగట్టారు. జగన్‌కు ఎల్ల వేళలా అండదండలు అందిస్తున్నారు. ఇక జగన్‌కు వెనక మిల్లర్ల అసోసియేషన్‌కు చెందిన ఓ నాయకుడు వున్నట్లు కూడా సమాచారం. అంతా ఆయన వెనకుండి నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ నాయకుడి స్వలాభం కోసం జగన్‌కు మద్దతు పలుకుతున్నట్లు చెప్పుకుంటున్నారు. జగన్‌కు అదికారుల పూర్తి లభించడంలో కూడా యూనియన్‌ రాష్ట్ర నాయకుడి హస్తం వుందని అంటున్నారు. ఏది ఏమైనా జగన్‌ రైతులను మోసం చేయడం నేరం. తప్పు చేసిన దొరికిన జగన్‌ తప్పును అంగీకరించకుండా ఇంకా కుప్పిగంతులు వేయడం విడ్డూరం. అదికారుల సహాకారం వుందన్న దీమాతో వారి చేత కూడా తప్పులు చేయిస్తున్నాడు. ఉద్యోగులు తమ ఉద్యోగాలకు ఎసరు వచ్చే పరిస్దితులు తెచ్చుకుంటున్నారు. జగన్‌పై చర్యలు తీసుకునేందుకు కమీషనర్‌ స్ధాయిలో కసరత్తు జరుగుతోంది. అప్పుడు జగన్‌ బండారం, ఉద్యోగుల వ్యవహారం అంతా బట్టబయలౌతుంది.

ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు.

ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

 

మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలో కాంగ్రెస్ పార్టీ జాతీయ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. జన్మదిన వేడుకల్లో ముఖ్య అతిధిగా చిట్యాల ఎ ఎం సి వైస్ చైర్మన్ మహ్మద్ రఫీ పాల్గొని కేక్ కట్ చేసి స్వీట్లు, పండ్లు పంపిణి చేశారు.అనంతరం రఫీ మాట్లాడుతూ. దేశ వ్యాప్తంగా ప్రతి గుండెను హత్తుకునేలా చేపట్టిన జూడో యాత్రతో ప్రజల కష్టాలను దగ్గరుండి చూసిన రాహుల్ గాంధీ ప్రతి పక్షనేతగా పేద ప్రజలకు న్యాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వంపై అలుపెరుగని పోరాటం చేస్తూ. దేశ ప్రజల అభ్యున్నతికై అనుక్షణం పరితపించే మృధుస్వభావి రాహుల్ గాంధీ అని. అలాంటి మహా నాయకునికి మొగుళ్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు. ఈవేడుకల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు తక్కళ్లపెల్లి రాజు, నడిగోటి రాము,ఏలేటి శివారెడ్డి, ఆకుతోట కుమార్, నీల రాజు, మంగళపల్లి శ్రీనివాస్, చంద్రబోస్, నాయకులు పాల్గొన్నారు.

ప్రభుత్వ క్రీడా పాఠశాలల ఎంపికలను ప్రారంభించిన.

ప్రభుత్వ క్రీడా పాఠశాలల ఎంపికలను..ప్రారంభించిన. ఎంఈఓ కాలేరు యాదగిరి

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

 

తెలంగాణ ప్రభుత్వం క్రీడా పాఠశాలల ఎంపికలను(హకీంపేట, కరీంనగర్, అదిలాబాద్) గురువారం నాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కేసముద్రం స్టేషన్ నందు మండల ఎంఈఓ కాలేరు యాదగిరి గారు క్రీడ ఎంపికలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ ఇప్పుడు నిర్వహించే ఫిజికల్ పరీక్షలు తొమ్మిది విభాగంలో నిర్వహిస్తారని. ప్రతి విద్యార్థిని, విద్యార్థులు, ఇందులో పాల్గొని ఈ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించి రాష్ట్రస్థాయి క్రీడా పాఠశాలకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. ఇక్కడ ఎంపికైన వారు ఈనెల 24వ తేదీన జిల్లాలో జరిగే ఎంపిక పోటీలకు హాజరు కావాల్సిందిగా సూచించారు. కాగా మండలం నుండి సుమారుగా 26 మంది విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజు, ఫిజికల్ డైరెక్టర్స్ డాక్టర్.కొమ్మురాజేందర్, కొప్పుల శంకర్, దామల్ల విజయ చందర్, పద్మ, మధు, తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలభిషేకం.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలభిషేకం

మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వరరావు

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

 

 

 

 

కేసముద్రం మండల కేంద్రంలో అంబేద్కర్ సెంటర్ నందు మండలానికి చెందిన 13620 మంది రైతులకు 11 కోట్ల 83 లక్షల రూపాయలు రైతుల ఖాతాలో రైతు భరోసా జమ చేసిన సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వర్ రావు, డిసిసి ఉపాధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి,

ఈ సందర్భంగా నాగేశ్వర్ రావు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ తో పాటు రైతులు పండించిన వరి ధాన్యానికి గిట్టుబాటు ధర అలాగే సన్న రకం ధాన్యానికి 500 బోనస్, రైతు భరోసా అందించి రైతులకు ఎంతో మేలు చేసిందన్నారు.

ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డికి, ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్ కు, ఎంపీ పొరిక బలరాం నాయక్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి,ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ రావుల మురళి,మాజీ ఎంపీపీ కదిరే సురేందర్,మాజీ ఎంపీపీ భూక్యా మల్సూర్,మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ ఓలం రమేష్,వసంత రావు, ఎండీ ఆయుబ్ ఖాన్, చింతకుంట్ల యాదగిరి,బ్లాక్ కాంగ్రెస్ కార్యదర్శి పోలేపాక నాగరాజు,మాజీ సర్పంచ్ వెంకన్న,మాజీ ఉపసర్పంచ్ బానోత్ వెంకన్న,యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు అల్లం గణేష్ యాదవ్,మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కళ్ళెం శ్రీనివాస్ రెడ్డి,గ్రామ పార్టీ అధ్యక్షులు కొండ సురేష్,నూకల వెంకటేశ్వర్లు, నేరేటి కొమరయ్య,గండి శ్రీనివాస్, సమ సుధాకర్, పోలేపల్లి వెంకట్ రెడ్డి,బలు,ఎండీ తాజోద్దీన్,రషీద్ ఖాన్, ఎండీ నవాజ్,తరాల సుధాకర్,బోడ విక్కి,శేఖర్ రెడ్డి, ఎలందర్,బాల,హనుమ,బాధ్య,శ్రీనివాస్,యాకాంతచారి,పరకాల కుమార్,ముజ్జు షేక్,యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధానకార్యదర్శి తోట అఖిల్,సామల నరసయ్య,అజిత్ రెడ్డి, నియోజవర్గ ఉపాధ్యక్షుడు హరి కృష్ణ,మండల ఉపాధ్యక్షుడు ఎండీ సమీర్,సుందర్ వెంకన్న,మామిడిచెట్టు మల్లయ్య,తోట సుధాకర్,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

నకిలీ పత్తి విత్తనాలను స్వాధీన పరుచుకున్న.

నకిలీ పత్తి విత్తనాలను స్వాధీన పరుచుకున్న కోటపల్లి పోలీసులు

జైపూర్,నేటి ధాత్రి:

 

 

 

 

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం లో నకిలీ పత్తి విత్తనాలు స్వాధీన పరుచుకున్నట్లు జైపూర్ ఏసిపి వెంకటేశ్వర్లు తెలిపారు.నకిలీ పత్తి విత్తనాలు చేరవేస్తున్నట్లు నమ్మదగిన సమాచారం రావడంతో కోటపల్లి పోలీసులు,వ్యవసాయ శాఖ అధికారితో కలిసి అంతరాష్ట్ర బ్రిడ్జి రాపనపల్లి వద్దకు వెళ్లి తనిఖీలు చేపట్టగా టాటా టియాగో కారులో తరలిస్తున్న1,45,800 రూపాయల విలువ గల 46.6 కిలోల నకిలీ పత్తి విత్తనాలను రవాణా చేస్తున్న నిందితులను పట్టుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.నకిలీ పత్తి విత్తనాలను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన కోటపల్లి ఎస్సై రాజేందర్,పోలీస్ సిబ్బంది పిల్లి శ్రీనివాస్,శ్యాంసుందర్, హోంగార్డ్స్ శ్యామ్,తిరుపతి రెడ్డిలను జైపూర్ ఎసిపి ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో ఏసిపి వెంకటేశ్వర్లు,చెన్నూరు సిఐ దేవేందర్రావు,శ్రీరాంపూర్ సిఐ వేణు చందర్,కోటపల్లి ఎస్సై రాజేందర్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

అరెస్ట్ చేయకపోవడానికి కారణాలేంటి.!

అరెస్ట్ చేయకపోవడానికి కారణాలేంటి?

నిజాంపేట్, నేటి ధాత్రి

 

 

 

నిజాంపేట మండల పరిధిలోని బచ్చిరాజుపల్లి గ్రామానికి చెందిన దళిత రైతు గాజులపల్లి స్వామి పై దాడి జరిగిన కేసు నమోదు చేసి డిఎస్పి ఇన్విస్టిగేషన్ చేసిన నిందితుని ఇంతవరకు అరెస్టు చేయలేదని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య గారిని కలిసి వినతిపత్రం సమర్పించడం జరిగింది. నిధులను వెంటనే అరెస్టు చేయాలని కమిషన్ చైర్మన్ డి.ఎస్.పి కి కీరవాణి ద్వారా తెలపడం జరిగింది చట్టాన్ని పరిరక్షించుకోవడం మన హక్కుగా ఆయన తెలపడం జరిగింది. నిందితులను అరెస్టు చేసి బాధితులకు రక్షణ కల్పించాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిబిఎఫ్ జిల్లా అధ్యక్షులు దుబాసి సంజీవ్, ఎమ్మార్పీఎస్ టీఎస్ అధ్యక్షులు గరుగుల శ్రీనివాస్, మాల పరిరక్షణ వేదిక జాతీయ అధ్యక్షులు బొమ్మల మైసయ్య, బాధితులు స్వామి రాజు తదితరులు పాల్గొన్నారు.

బడిబాట ముగింపులో.. దాతలకు సన్మానం

— బడిబాట ముగింపులో.. దాతలకు సన్మానం

నిజాంపేట: నేటి ధాత్రి

 

 

 

 

ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం జూన్ 6 నుండి 19వ తేదీ వరకు కొనసాగిందని చివరి రోజు ముగింపు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ప్రధానోపాధ్యాయులు పద్మా రెడ్డి అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండలంలోని రాంపూర్ గ్రామంలో గురువారం ముగింపు సన్మాన కార్యక్రమం లో భాగంగా పాఠశాలకు కంప్యూటర్ బహుకరించిన శ్రీకాంత్, మినరల్ వాటర్ అందిస్తున్న అంజా గౌడ్ లను ప్రధానోపాధ్యాయులు పద్మా రెడ్డి సన్మానించారు. ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయులు ఈశ్వరయ్య, అర్జున్, సుకన్య, నరేష్, చంద్రకాంత్, కుమారస్వామి లు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version