ఈజీఎస్ అధికారుల నిర్లక్ష్యంతో కూలీలకు మంజూరు కానీ డబ్బులు.

ఈజీఎస్ అధికారుల నిర్లక్ష్యంతో కూలీలకు మంజూరు కానీ డబ్బులు.

సిపిఐ ఎం ఎల్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్.

చిట్యాల, నేటి ధాత్రి ,

 

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులు చేసిన కూలీలకు నేటి వరకు కూలీ డబ్బులు రాకపోవడంతో కూలీలు ఇబ్బందులు పడుతున్నారని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో మాట్లాడుతూ ఈ సంవత్సరం మార్చి నుండి జూన్ వరకు ఉపాధి ఉపాధి కూలీలు ఎండను సైతం లెక్కచేయకుండా అర్ధాకలితో పస్తులు ఉంటూ ఉపాధి పనులు చేస్తే ప్రభుత్వం కూలి డబ్బులు మంజూరు చేయకపోవడం సరైంది కాదు అని తెలుపుతున్నాం. సంబంధిత మండల ఈజిఎస్ అధికారుల నిర్లక్ష్యం మూలంగానే కూలీలకు సకాలంలో డబ్బులు అందడం లేదని ఆరోపిస్తున్నాం. కూలీలు పస్తులు ఉండి పనులు చేస్తే కూలీ డబ్బులు రాకపోవడంతో కూలీలు నానా ఇబ్బందులు పడుతున్నారని తెలుపుచున్నాం.
ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి ఉపాధి హామీ కూలీలకు రావలసిన కూలీ డబ్బులు మంజూరు చేసే వారి అకౌంట్లలో జమ చేయాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు.

నిర్మాణ రంగ కార్మికులకు అండగా రేవంత్ సర్కార్

నిర్మాణ రంగ కార్మికులకు అండగా రేవంత్ సర్కార్

రాష్ట్రంలో పదిహేను లక్షల మంది వర్కర్లకు వర్తింపు

యాక్సిడెంట్ డెత్ ఎక్స్గ్రేగే షియా రూ.5 లక్షల నుంచి రూ10 లక్షలకు

సహజ మరణానికి రూ 1.30 లక్షల నుంచి 2 లక్షలకు పెంచిన ప్రభుత్వం

ఐఎన్ టి యు సి శాయం పేట మండల అధ్యక్షుడు మారపెల్లి రాజేందర్

శాయంపేట నేటిధాత్రి:

 

 

నిర్మాణ రంగ కార్మికుల ఎక్స్ గ్రేషియా పెంపు వలన రాష్ట్రంలో పదిహేను లక్షల మంది వర్కర్లకు ఉపయోగ ఉంటుందని ఐ ఎన్ టి యు సి మండల అధ్యక్షుడు మారపల్లి రాజేందర్ తెలిపారు.మండల అధ్యక్షుడు మాట్లాడుతూ యాక్సిడెంటల్‌ చనిపోతే ఎక్స్‌గ్రేషియా రూ ఆరు లక్షల నుంచి రూ పది లక్షలకు, సహజ మరణానికి రూ లక్ష ముప్పై వేల నుంచి రూ రెండు లక్షలకు ప్రభుత్వం పెంచింది అన్నారు. దీనివలన భవన నిర్మాణ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నరు అన్నారు. భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికులకు ఇచ్చే ఎక్స్‌గ్రేషియా పెంచేందుకు ప్రభుత్వం నిర్ణ యించిందని అన్నారు.ఇందు లో భాగంగా యాక్సిడెంటల్‌ డెత్‌ ఎక్స్‌గ్రేషియాను రూ పది లక్షలకు, సహజ మరణానికి ఇచ్చే సాయాన్ని రూ రెండు లక్షలకు పెంచుతున్నట్లు కార్మిక శాఖ నిర్ణయించిందని అన్నా రు . వివిధ నిర్మాణ పనులు చేస్తున్న వారు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోతే వారి కుటుం బాలకు అండగా నిలిచేందుకు ఈ ఆర్థిక సాయాన్ని అందించ నుంది. ఎక్స్‌గ్రేషియా పెంచాల ని గత సర్కార్‌ హయాంలో ఎన్నో సార్లు ఆందోళనలు చేసినా పట్టించుకోలేదని, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక పరిహారాన్ని పెంచడం పట్ల కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు అన్నారు. వీరితో పాటు వెల్డర్లు, వాచ్‌మ న్లు, టన్నెల్‌వర్కర్స్‌,బావి పూడిక తీసేవాళ్లు, మార్బుల్, టైల్స్‌ వర్కర్లు, రాళ్లు కొట్టేవా ళ్లు, రోడ్డు నిర్మాణ కార్మికులు, పంపు ఆపరేటర్స్, మున్సిపల్‌ డ్రైనేజీ వర్కర్స్‌, మిక్సర్‌ డ్రైవ ర్లు, మెకానిక్, ల్యాండ్ స్కేపింగ్‌ వర్కర్స్ తదితర యాభై నాలు గు రకాల కేటగిరీల కార్మికులు ఉన్నారు. వీళ్లలో అరవై ఏండ్ల లోపు ఉండి లేబర్‌కార్డు కలిగి న వారందరికీ ఈ బీమా వర్తిం చనుంది అన్నారు. వీటితో పాటు భవన నిర్మాణ కార్మికుల కూతురి పెండ్లికి రూ ముప్పై వేలు, వర్కర్ భార్యకు లేదా కూతురు ప్రసూతికి రూ ముప్పై వేలు, ప్రమాదవశాత్తు గాయ పడి ఇక పనిచేయలేని పరిస్థితి ఏర్పడితే రూ నాలుగు లక్షలు, పూర్తిగా వికలాంగులైతే రూ ఐదు లక్షలు అనగా భవన నిర్మాణ కార్మికుల యాక్సిడెంట ల్‌ డెత్‌, సహజ మరణానికి సంబంధించిన ఎక్స్‌గ్రేషియా పెంపుపై కార్మికులు కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.గత ప్రభుత్వ హయాంలో అనేక సార్లు ఆందోళనలు చేసినా పట్టించుకోలేదని, ప్రస్తుతం కాంగ్రెస్‌ సర్కార్‌ ఎక్స్‌గ్రేషియా ను పెంచడం ఆనందంగా ఉందన్నారు.రిజిస్ట్రేషన్‌ కు అర్హతలివే తెలంగాణ బిల్డింగ్‌ అండ్‌ అదర్‌ కన్స్‌స్ట్రక్షన్స్‌ వర్కర్స్‌ వెల్ఫేర్‌ బోర్డు కింద సభ్యులుగా పద్దెనిమిది ఏండ్ల నుంచి యాభై తొమ్మిది ఏళ్ల మధ్య వయస్సు గల నిర్మాణరంగ కార్మికులు మాత్రమే అర్హులు అన్నారు. వీరు ఏడాదిలో కనీసం తొంబై రోజులు నిర్మాణ రంగంలో పనిచేసిన అనుభవం ఉండాలి అన్నారు.రెండు పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు, వయస్సు నిర్ధారణ కు రుజువుగా స్కూల్‌ సర్టిఫికే ట్‌ లేదా డాక్టర్‌ సర్టిఫికెట్‌ను సమర్పించి మెంబర్‌ షిప్‌
సంబంధిత అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌కు అందజేసి లేబర్‌ కార్డును పొందొచ్చు అన్నారు . లేబర్ కార్డు పొందిన ఐదేళ్ల తర్వాత రెన్యూవల్‌ చేసుకో వాలి అన్నారు. ప్రభుత్వం నిర్మాణరంగ కార్మికులకు ఎక్స్ గ్రేషియా పెంచడం పట్ల ఐఎన్ టి యు సి మం డల అధ్యక్షు డు మారపల్లి రాజేందర్ హర్షం వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్ర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం

తెలంగాణ రాష్ట్ర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం

◆:- పి.రాములు నేత

*జహీరాబాద్ నేటి ధాత్రి:

జాగో తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపకులు
తేదీ 8-9-2025 నాడుమధ్యనం 2 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం ఈ సమావేశమునకు తెలంగాణ రాష్ట్ర మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి ఆధ్వర్యంలో జరుగును కావున తెలంగాణ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోరే ప్రజా సంఘాల నాయకులు రాజకీయ పార్టీల నాయకులు కార్మిక నాయకులు వ్యవసాయ కార్మిక నాయకులు స్వచ్ఛందంగా రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని సమావేశాన్ని దిగ్విజయం చేయగలరు సమావేశంలోని ముఖ్యంశాలు ఎప్పటికప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలను చైతన్యం చేయడం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర భారత దేశానికి సంబంధించిన వర్తకులు కార్మికులు మన రాష్ట్రానికి వలస వచ్చి మన యొక్క వర్తకులను మన కార్మికులను మరియు వ్యవసాయ కార్మికులను వ్యాపార రంగంలో శ్రామిక రంగంలో కృంగదీస్తున్నారు దీని మూలంగా తెలంగాణ రాష్ట్రంలోని వర్తకులు కార్మికులు వ్యవసాయదారులు అనేక రకాలుగా నష్టపోతున్నారు ఈ విషయాల పైన ప్రత్యేకమైన చర్చా ఉంటుంది అదేవిధంగా ఇంకా కొంతమంది ఉత్తరభారతీయులు రాష్ట్రం లోపల అనేక రకాల మోసాలకు పాల్పడుతూ ప్రజలను మోసం చేస్తున్నారు ఉదాహరణకు నకిలీ వస్తువుల విక్రయం కల్తీ తినుబండ రాళ్ల తయారీ చేస్తూ మోసపూరితమైన స్కీమ్ లతో వ్యాపారం చేస్తూ తెలంగాణ రాష్ట్రంలోని సామాన్య ప్రజలకు అనేక రకాలుగా అనారోగ్యాలకు గురి చేయడమే కాకుండా వారికి నకిలీ వ్యక్తులు విక్రయించి వారి ధనాన్ని కూడా దోచుకెళుతున్నారు అనేక సందర్భాలలో రకరకాల మోసపూరిత వ్యాపారాలు నిర్వహించి తెలంగాణ సామాన్య ప్రజానీకానికి పెద్ద ఎత్తున మోసం చేస్తున్నారు ఇట్టి విషయాల మీద ప్రత్యేకమైన చర్చ అదేవిధంగా భవిష్యత్ కార్యాచరణ తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రజల శ్రేయస్ కోసం అనేక రకాల ప్రజా సంఘాలు వారికి తోచిన విధంగా తమకు తామే వాళ్లకు ప్రజా సంఘాన్ని నామకరణం చేసుకొని ముందుకెళుతున్న సంగతి తెలిసినదే అయినప్పటికిని ఏది ఏమైనా ప్రతి సంఘం యొక్క లక్ష్యం తెలంగాణ ప్రజల రక్షణ తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం కాబట్టి ఎవరు ఏ రకంగా ముందుకు వెళ్లిన అందరం కూడా మాసానికి ఒకసారి రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా ఏకమై ముందుకు కదలాలని కార్యచరణలో భాగంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగినది ఇటి సమావేశానికి అందరూ కూడా సమయపాలన పాటించి స్వచ్ఛందంగా పాల్గొని దిగ్విజయం చేయగలరని కోరుకుంటున్నాము కార్యక్రమంలో జాగో తెలంగాణ ప్రధాన కార్యవర్గ సభ్యులు మహమ్మద్ ఇమ్రాన్ బెడబుడగజంగం నాయకులు మాదినం శివ ప్రసాద్ ,పి.దేషరథ్ ,వడ్డెర సంఘం నాయకులు పల్లెపు శేఖర్ ,డివిజన్ మాల మహానాడు ప్రధాన కార్యదర్శి ధనరాజ్ జాగో తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విద్యార్థి నాయకులు కార్తీక్ రామ్ చరణ్ బాలకృష్ణ రవి కిషోర్ విష్ణు గార్లు పాల్గొన్నారు,

నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ డ్రైవర్….

నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ డ్రైవర్

అభినంధించిన డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ

నర్సంపేట,నేటిధాత్రి:

 

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నర్సంపేట డిపో బస్టాండ్ లో
శుక్రవారం ఉదయం 6గంటలకు నర్సంపేట నుండి వేములవాడ బస్సు ముందుగా ఎక్కిన నర్సంపేట టౌన్ ఎన్జీవో కాలనీకి చెందిన కీసర రజిత అనే ప్రయాణికురాలు దిగి వెంటనే హన్మకొండ బస్సు ఎక్కి
మనీ పర్సు పోగొట్టుకుంది.బస్సు డ్రైవర్ మహేష్ సహకారంతో బస్టాండు కంట్రోలర్ మల్లికార్జున్ ఆ మనిపర్సు అందజేశారు.కాగా అందులో ఆధార్ కార్డు, రూ.7200 నగదు, రెండు బంగారు ఉంగరాలు ఆ ప్రయాణికురాలకు రజిత అందజేశారు.నిజాయితీ చాటుకున్న సిబ్బంది డ్రైవర్ మహేష్ ను డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ అభినందించారు.

రాష్ట్ర స్థాయి పత్రికా కథన రూపంలో…

రాష్ట్ర స్థాయి పత్రికా కథన రూపంలో

గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్..

రామాయంపేట, సెప్టెంబర్ 5 నేటి ధాత్రి (మెదక్)

రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని సర్వయికుంట వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ శుక్రవారం సందర్శించి సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో గణేష్ నిమజ్జనం శాంతియుతంగా, సాఫీగా జరిగేలా మున్సిపల్ అధికారులు, పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. పట్టణ ప్రధాన రహదారుల గుండా నిమజ్జనానికి వెళ్లే వినాయక విగ్రహాల ర్యాలీలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి, రాకపోకలు అంతరాయం కలగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
స్థానిక మున్సిపల్ కమిషనర్ ఎం.దేవేందర్‌కు తగు సూచనలు ఇస్తూ, సర్వయికుంట చెరువులో జరిగే నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా ప్రజాప్రతినిధులు కూడా చొరవ తీసుకొని భద్రతా చర్యలకు సహకరించాలని ఆయన కోరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని విభాగాలు సమన్వయంతో ముందస్తు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రత్యేకంగా ఆదేశించారు.
కలెక్టర్ పర్యటనలో మండల తహసీల్దార్ రజనీకుమారి, మున్సిపల్ కమిషనర్ ఎం.దేవేందర్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ సైదయ్య, మున్సిపల్ వార్డు అధికారులు, ప్రజాప్రతినిధులు సుప్రభాత రావు. తదితరులు పాల్గొన్నారు.

నిమజ్జనానికి ముస్తాబైన మట్టి గణపతి…

నిమజ్జనానికి ముస్తాబైన మట్టి గణపతి

ఆదర్శవంతంగా నిలిచిన మల్టీ వర్కర్ గట్టయ్య

జైపూర్,నేటి ధాత్రి:

జైపూర్ మండలం టేకుమట్ల గ్రామంలో మల్టీ వర్కర్ గా విధులు నిర్వహిస్తున్న జల్లంపల్లి గట్టయ్య గణేష్ నవరాత్రి లో భాగంగా తన కుమారుడితో మూడున్నర ఫీట్ల గణపతి విగ్రహం తయారు చేపించి తొమ్మిది రోజులు మట్టి గణపతికి అంగరంగ వైభవంగా పూజలు జరిపించారు.అలాగే గణపతి వద్ద అన్నదాత కార్యక్రమం నిర్వహించారు.అనేక రకాల కెమికల్స్ కలిపి తయారు చేసిన విగ్రహాలు ఏర్పాటు చేయడం వల్ల కాలుష్యం వెదజల్లి పర్యావరణం కలుషితం అవుతుందని అన్నారు.మట్టి గణేష్ విగ్రహాన్ని తయారు చేసుకొని పూజలు చేయడం చాలా సంతోషంగా ఉందని వారు తెలిపారు.

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు…

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను విజయవంతం చేయండి

* సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కే రామస్వామి

చేవెళ్ల, నేటిధాత్రి:

 

ఈనెల 11 నుండి 17 వరకు జరిగే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను విజయవంతం చేయాలని సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కే రామస్వామి పిలుపునిచ్చారు. శుక్రవారం చేవెళ్ల మండల కేంద్రంలో సిపిఐ మండల కార్యదర్శి సత్తిరెడ్డి అధ్యక్షతన సిపిఐ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కే రామస్వామి హాజరై మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటం 1946 నుండి 1951 వరకు కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో 7వ నిజాం మీర్ ఉస్మాన్ ఆలీ ఖాన్ కు వ్యతిరేకంగా జరిగిన సాయిధ రైతాంగం తిరుగుబాటు చేశారని అన్నారు. ఈ పోరాటంలో దాదాపు 4500 మంది తెలంగాణ రైతులు, ప్రజలు ప్రాణాలు కోల్పోయారని ఈ పోరాటం ప్రధానంగా హైదరాబాద్ రాష్ట్రంలోని భూస్వామ్య వ్యవస్థకు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిందని తెలిపారు. నిజాం పాలనను అంతం చేసి హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనం కావడానికి ఈ పోరాటం దారితీసిందని, భూస్వాముల దోపిడీని నిలిపి రైతుల హక్కుల పరిరక్షణకు ఈ పోరాటం ఎంతో స్ఫూర్తినిచ్చిందనిఅన్నారు. ఈ స్ఫూర్తితోనే ఈనెల 11 నుండి 17 వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటవారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 17వ తేదీన హైదరాబాదులోని రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో ముగింపు సభ ఉంటుందని ఈ సభకు పార్టీ శ్రేణులు గ్రామ కార్యదర్శులు ప్రజాసంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ వారోత్సవాలను విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం ప్రభు లింగం, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు వడ్ల సత్యనారాయణ, ఇన్సాబ్ జిల్లా అధ్యక్షుడు ఎండి మక్బుల్, ఎన్ ఎఫ్ ఐ డబ్లు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్ల మంజుల తదితరులు పాల్గొన్నారు.

అంకితభావంతో ఉపాధ్యాయులకు గుర్తింపు…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-05T155335.272.wav?_=1

 

అంకితభావంతో ఉపాధ్యాయులకు గుర్తింపు

విద్యారంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి

ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

ఘనంగా సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి, ఉపాధ్యాయ దినోత్సవం

17మంది ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం

హాజరైన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )

సిరిసిల్ల జిల్లాలోని అంకితభావంతో విధులు నిర్వహించే ఉపాధ్యాయులకు గుర్తింపు ఉంటుందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జిల్లా సమీకృత కార్యాలయంలోని ఆడిటోరియంలో శుక్రవారం నిర్వహించగా, ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అతిథులు హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేశారు.

 

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడారు. విద్యారంగ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తుందని తెలిపారు. ఇందులో భాగంగా 11వేల టీచర్ పోస్టులు భర్తీ చేసిందని, ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించిందని, బదిలీలకు అవకాశం కల్పించిందని వివరించారు ఉపాధ్యాయ హక్కుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. అన్ని పాఠశాలల్లో వసతులు కల్పించేందుకు నిధులు మంజూరు చేస్తున్నదని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో రూ. 200 కోట్లతో 25 ఎకరాల విస్తీర్ణంలో అన్ని వర్గాల విద్యార్థులకు యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుందని వెల్లడించారు. అలాగే ఏ.టి. సి సెంటర్లు మంజూరు చేసిందని దీంతో విద్యార్థులు యువతకు వివిధ రంగాల్లో నైపుణ్యత అది పుచ్చుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. మారుతున్న కాలానికి అణుగుణంగా ఉపాధ్యాయులు కూడా సాంకేతిక, నైపుణ్యతను అందిపుచ్చుకోవాలని, విద్యార్థులను తీర్చిదిద్దాలని సూచించారు. తల్లిదండ్రులు జన్మనిస్తే ఉపాధ్యాయులు విద్యార్థులను ఉన్నత స్థానాలకు ఎదిగేలా కృషి చేస్తారని వివరించారు. రాష్ట్రంలో జిల్లాను విద్యారంగంలో ఉన్న స్థానంలో నిలిపేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని పిలుపు ఇచ్చారు.

 

ఉత్తమ అవార్డులు పొందిన టీచర్లను స్ఫూర్తిగా తీసుకొని మిగతా ఉపాధ్యాయులు కూడా విశేష కృషి చేసి అవార్డులు స్వీకరించాలని ఆకాంక్షించారు. ఉపాధ్యాయులకు సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం ఉపాధ్యాయులు అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.జాతీయ, రాష్ట్రస్థాయి అవార్డులకు ఎంపిక అవ్వాలి.జిల్లాలోని టీచర్లు జాతీయ, రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపిక అవ్వాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకాంక్షించారు. ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా టీచర్లు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుందని గుర్తు చేశారు. ఆయన సేవాగుణం, అంకితభావం, విలువలు, నైపుణ్యతను ఉపాధ్యాయులు అందరూ స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని సూచించారు. రాధాకృష్ణన్ తనకు వచ్చే జీతంలో 75 శాతం పేద బడుగు బలహీన వర్గాలు ప్రజలకు అందించే వారిని గుర్తు చేశారు. (హెల్ప్ ఏజ్ ఇండియా) సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగించారని, బ్రిటిష్ ఇండియా లో నైట్ హుడ్ అవార్డు స్వీకరించారని గుర్తు చేశారు.భారతీయ సాంప్రదాయాలు, సంస్కృతి, విద్యావిధానం గొప్పదని తన రచనల్లో వివరించారని పేర్కొన్నారు. రాధాకృష్ణన్ భారత ఉపరాష్ట్రపతిగా సేవలందించారని గుర్తు చేశారు. ఆయన సేవా గుణం, ఉపాధ్యాయ వృత్తిలో అందించిన విలువైన సేవలు ఆయనను ఇప్పటికీ నిలిచిపోయేలా చేశాయని పేర్కొన్నారు. తనది మద్రాస్ రాష్ట్రమైన కూడా కలకత్తా ఇతర ప్రాంతాల్లో సేవలందించారని తెలిపారు. ఉపాధ్యాయులకు బదిలీలు సహజమని గుర్తు చేశారు. ఎక్కడ ఉన్నా కూడా పాఠశాల, విద్యార్థుల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఉపాధ్యాయులు తాము బోధిస్తున్న పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేలా కృషి చేయాలని, విద్యార్థులకు సులభమైన రీతిలో పాఠాలు బోధించాలని తెలిపారు. విలువలు, క్రమశిక్షణ పాటిస్తూ విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. పదో తరగతి ఫలితాల్లో మన జిల్లా రాష్ట్రస్థాయిలో ఐదో స్థానంలో నిలిచిందని, జిల్లా ప్రథమ స్థానంలో నిలిచేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు ఉపాధ్యాయులందరూ అంకితభావంతో సేవలందిం చాలని సూచించారు. ప్రభుత్వ విద్యా సంస్థలపై విద్యార్థులు, తల్లిదండ్రులకు నమ్మకం కలిగించేలా బోధించాలని, విద్యార్థులను తీర్చిదిద్దాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు..
చకినాల శ్రీనివాస్, గుర్రం కృష్ణారెడ్డి, కైరి పద్మ, సీహెచ్ సత్తయ్య, గోలి రాధాకిషన్, అరుకాల బాల్ రెడ్డి, బోగారపు నవీన్, కట్ట రవీందర్, గోవులకొండ శ్రీనివాస్, ఎన్ దేవేందర్, నరహరి నాగమణి, జంగిటి రాజు, పీచు సుభాష్ రెడ్డి, గుండమనేని మహేందర్ రావు, దిడిగం స్రవంతి, బద్దం రవీందర్ ఓరుగంటి పద్మకళకు అవార్డులు అందజేసి, సన్మానించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, సిరిసిల్ల, వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్లు స్వరూపారెడ్డి, రాజు, డీఈవో వినోద్ కుమార్, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం తదితరులు పాల్గొన్నారు.

బండి సంజయ్ కుమార్ సైబర్ నేరాల అవగాహన పోస్టర్ విడుదల…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-05T153439.457.wav?_=2

 

“సరైన అవగాహనే సైబర్ క్రైమ్స్ కు నివారణ” అనే పోస్టర్‌ను ఆవిష్కరించిన బండి సంజయ్ కుమార్

కరీంనగర్, నేటిధాత్రి:

 

తెలుగు రాష్ట్రాలలో సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన సరైన అవగాహనే సైబర్ క్రైమ్స్ కు నివారణ అనే పోస్టర్‌ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈకార్యక్రమం సైబర్ సత్యాగ్రహ తెలుగు రాష్ట్రాల కన్వీనర్, యువజన అవార్డు గ్రహీత గజ్జెల అశోక్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈసందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుత డిజిటల్ యుగంలో చిన్న పొరపాటే పెద్ద నష్టానికి దారితీసే ప్రమాదం ఉంది. ప్రజల్లో సైబర్ భద్రతపై అవగాహన కల్పించాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉందని, ఇలాంటి కార్యక్రమాలు ప్రతి గ్రామానికి, ప్రతి పాఠశాలకు చేరాలన్నారు. అనంతరం గజ్జెల అశోక్ మాట్లాడుతూ “సైబర్ నేరాల నుండి రక్షణకు సామాన్య ప్రజలలో అవగాహనే ప్రధాన ఆయుధం యువత, మహిళలు, ఉద్యోగస్తులు ఇలా అందరికీ ఇది అవసరం. అందుకే ఈపోస్టర్ రూపంలో ప్రామాణికమైన సమాచారాన్ని పోతిరెడ్డి మాధవ రెడ్డి, సైబర్ వారియర్ సహకారంతో అందించేందుకు ముందుకువచ్చాం అని తెలిపారు. ఈకార్యక్రమంలో బిజేవైఎం జిల్లా కార్యదర్శి వేముండ్ల కుమార్, జేరిపోతుల పోచయ్య, జేరిపోతుల నర్సయ్య, జేరిపోతుల మహేష్, గజ్జెల నవీన్ కుమార్, అజయ్ జేరిపోతుల, వెంకటేష్ జేరిపోతుల, సతీష్ జేరిపోతుల, చందు, సామాజిక సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

జహీరాబాద్‌లో గణేష్ నిమజ్జనంలో పాల్గొన్న డా. చంద్రశేఖర్..

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-05T124221.030-2.wav?_=3

సర్వజనిక్ గణేష్ ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నా

◆:- మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డా౹౹ఏ.చంద్రశేఖర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్:-పట్టణంలోని సర్వజనిక్ ఉత్సవ కమిటీ మరియు లింగాయత్, పద్మశాలి, ముదిరాజ్,కమిటీ ల ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక గణేష్ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది..
కమిటీల సంఘాల ఆహ్వాన మేరకు ఆయా సంఘాల నేతలను కలుసుకొని శ్రీ.గణేష్ ఆశీస్సులు అందుకొని నియోజకవర్గ ప్రజలందరికీ గణేష్ మహారాజ్ దీవెనలు ఉండాలని కోరుకున్నారు..
మరియు సర్వజనిక్ కేంద్రంగా ఏర్పాటు చేసినా నిమజ్జన కార్యక్రమం శాంతియుతంగా జరుపుకోవాలని వారిని కోరడం జరిగింది..
ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ రామలింగారెడ్డి మండల అధ్యక్షులు మాక్సూద్ అహ్మద్ పట్టణ అధ్యక్షులు కండేం.నర్సింలు కేతకి సంగమేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ పాటిల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్షద్ అలీ ఏ.యం.సి.డైరెక్టర్ శేఖర్ ముదిరాజ్ మాజీ ఎంపీటీసీలు శంకర్ పాటిల్ జామీల్ కాంగ్రెస్ నాయకులు హుగ్గేల్లి రాములు ఖాజా మొయిజ్ జయరాజ్ చిన్న జామీల్ బర్కత్ విష్ణు వర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..

జహీరాబాద్‌లో గణేశ నవరాత్రి నిమజ్జన వేడుకలు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-05T123027.941.wav?_=4

గణేశ నవరాత్రి వేడుకలు సాంప్రదాయాలకు ప్రతీకగా సమాజంలో ఐక్యత స్నేహభావాలను పెంపొందించే వేదికలు

◆:- ఎమ్మెల్యే మాణిక్ రావు

◆:- డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

విగ్నేశ్వరుల నిమజ్జన కార్యక్రమంలో బాగంగా ఈరోజు జహీరాబాద్ పట్టణం లోని భవాని మందిర్ చౌరస్తా వద్ద సార్వజనిక్ గణేష్ ఉత్సవ కమిటి వారి ఆహ్వానం మేరకు కార్యక్రమం లో ముఖ్య అతిధులుగా పాల్గొన్న శాసనసభ్యులు కోనింటి మాణిక్ రావు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు
ఈ సందర్భంగా సార్వజనిక్ గణేష్ ఉత్సవ కమిటి వారు ఎమ్మెల్యే గారిని చైర్మన్ ను నాయకులను సన్మానించారు
ఈ సందర్భంగ ఎమ్మెల్యే డిసిఎంఎస్ చైర్మన్ మాట్లాడుతూ వినాయకుని ఆశీస్సులతో ప్రజలందరికీ ఆరోగ్యం ఆనందం శాంతి శ్రేయస్సు కలగాలని కోరుకున్నారు గణేశ నవరాత్రి వేడుకలు సాంప్రదాయాలకు ప్రతీకగా సమాజంలో ఐక్యత స్నేహభావాలను పెంపొందించే వేదికలని పేర్కొన్నారు.
అనంతరం నాయకులతో కలిసి వివిధ సంస్కృతిక కార్యక్రమలలో పాల్గొన్న వారికి చిన్నారులకు జ్ఞాపకాలను అందజేశారు భక్తులకు ప్రసాదాన్ని పంచుతూ వివిధ కుల సంఘాలు ప్రసాదా పంపిణీ కార్యక్రమాలలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ గుండప్ప, జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం మాజి పట్టణ అధ్యక్షులు మొహియుద్దీన్ మాజి ఆలయ చైర్మన్ నరసింహ గౌడ్,పట్టణ యూత్ అధ్యక్షులు కళ్లెం రవి, ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు శివప్ప మాజి సర్పంచ్ ప్రభు పటేల్ నాయకులు వెంకట్ రెడ్డి బరూర్ దత్తాత్రి,ఇబ్రహీం సంజీవ్ పవార్ అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కుప్పానగర్ ఉన్నత పాఠశాలలో ఎఫ్ఎల్ఎన్ – టిఎల్ఎం మేళా..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-05T122159.817.wav?_=5

 

కుప్పానగర్ ఉన్నత పాఠశాలలో ఎఫ్ఎల్ఎన్ – టిఎల్ఎం మేళా

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండలం లోని కుప్పానగర్ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి ఎఫ్ఎల్ఎన్ )- టిఎల్ఎం మేళా కార్యక్రమాన్ని మండల విద్యాధికారి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి( ఎంఈఓ ) మాట్లాడుతూ మండలంలోని ఉపాధ్యాయులు అందరూ బోధనోపకరణాలతో పాల్గొని విద్యా ప్రమాణాలు పెంచేలా కృషి చేశారన్నారు. కార్యక్రమంలో వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రసాద్, అంజనేయులు, విష్ణు వర్ధన్ రెడ్డి, నాగేశ్వరరావులు మాట్లాడుతూ వివిధ విషయాలు తెలుసుకుని విద్యార్థుల అభివృద్ధికై కృషి చేయాలని అన్నారు.

 

కార్యక్రమంలో ఎఫ్ ఎల్ ఎన్ ( ఎఫ్ఎల్ఎన్ )- టిఎల్ఎం బోధనోపకణాల పట్ల అన్ని అంశాలు తెలుసుకోవడం జరుగుతుందన్నారు. అనంతరం మండలం నుండి ఉత్తమ బోధనోపకణాలు( టిఎల్ఎం ) ప్రదర్శించిన ఉపాధ్యాయుల వివరాలు జిల్లా స్థాయికి పంపిస్తామన్నారు. ఈ మేళాలో మండలంలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సీ ఆర్ పీ లు పాల్గొన్నారు.

జహీరాబాద్‌లో గణేశ నవరాత్రి వేడుకలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-05T114710.672.wav?_=6

 

గణేశ నవరాత్రి వేడుకలు సాంప్రదాయాలకు ప్రతీకగా సమాజంలో ఐక్యత స్నేహభావాలను పెంపొందించే వేదికలు

◆:- ఎమ్మెల్యే మాణిక్ రావు

◆:- డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్

జహీరాబాద్ నేటి ధాత్రి:

విగ్నేశ్వరుల నిమజ్జన కార్యక్రమంలో బాగంగా ఈరోజు జహీరాబాద్ పట్టణం లోని భవాని మందిర్ చౌరస్తా వద్ద సార్వజనిక్ గణేష్ ఉత్సవ కమిటి వారి ఆహ్వానం మేరకు కార్యక్రమం లో ముఖ్య అతిధులుగా పాల్గొన్న శాసనసభ్యులు కోనింటి మాణిక్ రావు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు
ఈ సందర్భంగా సార్వజనిక్ గణేష్ ఉత్సవ కమిటి వారు ఎమ్మెల్యే గారిని చైర్మన్ ను నాయకులను సన్మానించారు
ఈ సందర్భంగ ఎమ్మెల్యే డిసిఎంఎస్ చైర్మన్ మాట్లాడుతూ వినాయకుని ఆశీస్సులతో ప్రజలందరికీ ఆరోగ్యం ఆనందం శాంతి శ్రేయస్సు కలగాలని కోరుకున్నారు గణేశ నవరాత్రి వేడుకలు సాంప్రదాయాలకు ప్రతీకగా సమాజంలో ఐక్యత స్నేహభావాలను పెంపొందించే వేదికలని పేర్కొన్నారు.
అనంతరం నాయకులతో కలిసి వివిధ సంస్కృతిక కార్యక్రమలలో పాల్గొన్న వారికి చిన్నారులకు జ్ఞాపకాలను అందజేశారు భక్తులకు ప్రసాదాన్ని పంచుతూ వివిధ కుల సంఘాలు ప్రసాదా పంపిణీ కార్యక్రమాలలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ గుండప్ప, జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం మాజి పట్టణ అధ్యక్షులు మొహియుద్దీన్ మాజి ఆలయ చైర్మన్ నరసింహ గౌడ్,పట్టణ యూత్ అధ్యక్షులు కళ్లెం రవి, ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు శివప్ప మాజి సర్పంచ్ ప్రభు పటేల్ నాయకులు వెంకట్ రెడ్డి బరూర్ దత్తాత్రి,ఇబ్రహీం సంజీవ్ పవార్ అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

శివాజీ యువసేన ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-05T113838.352.wav?_=7

శివాజీ యువసేన ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ

అన్న ప్రసాద కార్యక్రమం అభినందనీయం సీఐ క్రాంతికుమార్,ఎస్ఐ విట్టల్

పరకాల నేటిధాత్రి

 

 

గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శివాజీ యువసేన అధ్యక్షులు ఆర్పి జయంత్ లాల్ ఆధ్వర్యంలో మహా అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పరకాల సీఐ క్రాంతి కుమార్ మరియు ఎస్ ఐ విట్టల్ పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం అన్నవితరణ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శివాజీ యువసేన ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కుల మతాలకతీతంగా నిర్వహించే పండుగ శాంతియుతంగా నిర్వహించుకోవాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో శివాజీ యువసేన గౌరవ అధ్యక్షులు ఆర్పీ జయంతి లాల్,కిరాణా వర్తక సంఘ అధ్యక్షులు కిరణ్ కుమార్,శివాజీ యువసేన నాయకులు దినేష్,రాజేష్,నాగరాజ్ అర్జున్,వంశీ,లడ్డు,ఖాసీం,రాజకుమార్ ,శ్రీనివాస్,రాకేష్,పవన్,రవి,మహేందర్,సూర్య,ప్రవీణ్,రజినీకాంత్,అనిల్,నర్సింగరావు,మార్కండేయ,అశోక్,రవి,రాజు తదితరులు మరియు భక్తులు పాల్గొన్నారు.

ఘనంగా ఉపాధ్యాయుల దినోత్సవం…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-05T113022.925.wav?_=8

 

ఘనంగా ఉపాధ్యాయుల దినోత్సవం

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి వేడుకలు

సమాజంలో గురువుల పాత్ర అమూల్యమైనది… ఎంఈఓ కాలేరు యాదగిరి

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

మన దేశ రెండవ రాష్ట్రపతి మరియు గొప్ప విద్యావేత్త అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని, విద్యారంగంలో ఉపాధ్యాయులు చేసే నిస్వార్థ సేవలను, అంకితభావాన్ని గౌరవించుకోవడానికి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా గురువారం కేసముద్రం మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో గౌడ సంఘం ఫంక్షన్ హాల్ లో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేసముద్రం మండల విద్యాశాఖాధికారి కాలేరు యాదగిరి మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు అంకితభావం, కృషికి కృతజ్ఞతలు తెలియజేయడం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశ్యం అని కొనియాడారు.ఉపాధ్యాయుల సేవలను గౌరవిస్తూ, విద్యార్థులకు జ్ఞానాన్ని పంచే గురువుల త్యాగాలను స్మరించుకుంటూ, వారి అద్భుతమైన కృషికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.

విద్యార్థులను జ్ఞానవంతులుగా తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర అమూల్యమైనది. వారు అందించే మార్గదర్శకత్వం, బోధన, ప్రోత్సాహం విద్యార్థుల భవిష్యత్తును రూపుదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
ఉపాధ్యాయులు తమ జీవితాలను విద్యార్థుల అభివృద్ధికి అంకితం చేస్తారని అన్నారు. వారి అద్భుతమైన కృషిని స్మరించుకుంటూ, వారి పట్ల హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మండలంలోని 21 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.

ఉత్తమ ఉపాధ్యాయులు:-
1 బందెల రాజు, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, కేసముద్రం స్టేషన్
2) బద్దెపురి అంజయ్య, స్కూల్ అసిస్టెంట్ పెనుగొండ హైస్కూల్
3) చీకటి వెంకట్రాం నర్సయ్య, స్కూల్ అసిస్టెంట్ కేసముద్రం విలేజ్ హైస్కూల్
4) గుంటి కుమార స్వామి, స్కూల్ అసిస్టెంట్ కేసముద్రం స్టేషన్
5) గుడిబోయిన గోపికృష్ణ, స్కూల్ అసిస్టెంట్ తాళ్ల పూసపల్లి హైస్కూల్
6) మాంకాలి యాకాంబరం, స్కూల్ అసిస్టెంట్ కల్వల హైస్కూల్
7) షేక్ మునీర్ అహ్మద్, ఎల్.ఎఫ్.ఎల్.హెచ్.ఎం. భవాని గడ్డ తండా
8) పోతుగంటి సరిత, ఎస్జీటీ ఎంపీయూపీఎస్ రంగాపురం
9) జె సువర్ణ, ఎస్జీటీ ఎంపీపీఎస్ మానసింగ్ తండా
10) జయ్యారపు స్వప్న, ఎస్జిటి ఎంపీపీఎస్ ఎస్టీ కాలనీ
11) తాళ్లపెల్లి రమేష్, ఎస్జీటీ ఎంపీపీఎస్ చైతన్య నగర్
12) కడుదుల శ్రీధర్, ఎస్జిటి ఎంపీపీఎస్ చంద్రు తండా, వెంకటగిరి
13) సింగారపు ఉపేందర్, ఎస్జీటీ ఎంపీపీఎస్ మాతృతండా
14) శివంగారి సురేందర్, ఎస్జీటీ ఎంపీపీఎస్ ముత్యాలమ్మ తండా, మహమూద్ పట్నం
15) నలబోల రేవతి, ఎస్జిటి ఎంపీపీఎస్ దన్నసరి
16) బానోత్ హరికిషన్, ఎంపీపీఎస్ కాట్రపల్లి
17) అయిత ప్రణీత, ఎంపీపీఎస్ కేసముద్రం స్టేషన్
18) సి.హెచ్ స్వరూప, ఎస్జీటీ ఎంపీపీఎస్ కల్వల
19) తమ్మె శ్రీనివాస్, ఎస్జిటి ఎంపీపీఎస్ క్యాంపు తండా
20) వెన్ను బిక్షపతి కంప్యూటర్ ఆపరేటర్, ఎం.ఆర్.సి కేసముద్రం
21) చీర మురళి, సిఆర్పి, ఉప్పరపల్లి కాంప్లెక్స్
ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు బందెల రాజు, కోట కనకయ్య, బండారు నరేందర్, కె చంద్రశేఖర్, వి రాజశేఖర్, మరియు ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు గోపాల శ్రీధర్, బీరం జనార్ధన్ రెడ్డి, కీర్తి నాగయ్య, భద్రు నాయక్, గుండు సురేందర్, నరసింహ రాజు. భూక్య శ్రీను, వోమ సంతోష్, మండల రాజు, కె.శ్రీశైలం ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాల్గొన్నారు

గణనాథునికి ముస్లిం సోదరులచే ప్రత్యేక పూజలు.

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-04T160733.104-1.wav?_=9

గణనాథునికి ముస్లిం సోదరులచే ప్రత్యేక పూజలు.

కల్వకుర్తి/ నేటి ధాత్రి :

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలోనీ తోటపల్లి గ్రామంలో గణనాధుల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.రుద్ర సేన యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణనాథుని బుధవారం రాత్రి ముస్లిం సోదరులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మతసామ్రాస్యానికి ప్రతీకగా నిలువడం పట్ల పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు ఎండీ అష్, నాజిరదిన్, ఖాజా, అజ్జిబాబా, దుర్ధ్ణ బేగం, అష్పిన్, నవాజ్, యూత్ సభ్యులు పాల్గొన్నారు.

నూతన విద్యా విధానంపై దృష్టిసారించాలి…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-04T154134.305.wav?_=10

 

నూతన విద్యా విధానంపై దృష్టిసారించాలి

ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి

నస్పూర్ లో ఉత్తమ ఉపాధ్యాయులకు ట్రస్మా ఘన సన్మానం

శ్రీరాంపూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

 

 

మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఉపాధ్యాయులు నూతన విద్యా విధానంపై దృష్టిసారించాలని ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్రెడ్డి సూచించారు.ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ట్రస్మా ఆధ్వర్యంలో బుధవారం నస్పూర్ పట్టణంలోని ఎంఎం గార్డెన్లో మంచిర్యాల జిల్లాకు చెందిన ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఫోర్స్ అధినేత నరేందర్రెడ్డి,ఎంఈవో పద్మజ,ట్రస్మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మలేత్తుల రాజేంద్రపాణి,జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్,తదితరులు పాల్గొని డాక్టర్ సర్వేపల్లి రాధకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ..ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైనా వారికి అభినందనలు తెలియజేశారు.ఆర్టిఫిషిల్ ఇంటిలిజెన్స్ కాలంలో సెలబస్ మొత్తం కొత్త పుంతలు తొక్కుతుందని,దీనికి అనుగుణంగా విద్యా బోధనలో మార్పులు తీసుకురావాల్సిన అవశ్యకత ఎంతో ఉందన్నారు. 2027–28లో రాష్ట్రంలో కొత్త విద్యా పాలసీ రాబోతుందని, దీంతో విద్యా విధానంలో అనేక మార్పులు చోటు చేసుకోబోతున్నట్లు తెలిపారు.వెనుగబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. పిల్లలకు అర్థమైయ్యే విధంగా పాఠాలు బోధించాలని, ముఖ్యంగా పిల్లలతో ఎక్కువగా ప్రాక్టీస్ చేపిస్తే ఉపయోగకరంగా ఉంటుందన్నారు.ప్రతి ఉపాధ్యాయుడు తమ సబ్జెక్టులపై పట్టుసాధిస్తే విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దవచ్చని సూచించారు.
ఉపాధ్యాయులకు సబ్జెక్టుల వారిగా మోటివేషన్, ఓరియంటేషన్ క్లాసులను త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు.అనంతరం ట్రస్మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెత్తుల రాజేంద్రపాణి, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ లు మాట్లాడుతూ..ట్రస్మా ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో విద్యా బోధన చేస్తున్న ఉపాధ్యాయులకు త్వరలోనే హెల్త్ స్కీంను ప్రారంభిస్తామన్నారు.తాము ఇతర సంఘాల్లా కాకుండా ఒక క్రమశిక్షణతో విద్యా సంస్థలను నడిపిస్తూ విద్యాబోధన, ఉపాధ్యాయుల సంక్షేమం, పలు సేవా కార్యక్రమాలను స్వంత ఖర్చులతో చేస్తున్నట్లు చెప్పారు.ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లాలోని పలు ప్రైవేట్ పాఠశాలలకు చెందిన 78మంది ఉత్తమ ఉపాధ్యాయులను శాలువాలు,పూల మాలలతో ఘనంగా సన్మానించి,ప్రశంసా పత్రాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో ట్రస్మా నాయకులు శ్యాంసుందర్రెడ్డి, రజనీ,రేగళ్ల ఉపేందర్,మైదం రామకృష్ణ,ఊట్ల సత్యనారాయణ,అంబాల రాజ్ కుమార్,పెట్టం మల్లయ్య, బత్తిని దేవన్న,కృష్ణారెడ్డి, అంబాల రాజ్ కుమార్ అమన్ ప్రసాద్,సమ్మిరెడ్డి,మమత, జూల్పెకర్, సత్యనారాయణరెడ్డి, జిల్లాలోని పలు పాఠశాలలకు చెందిన కరస్పాండెంట్లు, ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు, ట్రస్మా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఘనంగా ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలు

https://netidhatri.com/wp-content/uploads/2025/09/teacher.wav?_=11

ఘనంగా ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలు

మహాదేవపూర్ (నేటి ధాత్రి)

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపురం మండల కేంద్రం లోని బాలుర జిల్లా పరిషత్ పాఠశాలలో గురువారం రోజున సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి లో బాగంగా ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల లో భాగంగా పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులను పూల మాలలు మరియు శాలువాలతో సత్కరించి ఉపాధ్యాయుల గొప్పతనాన్ని కొనియాడారు. భారత దేశపు రెండవ రాష్ట్రపతి అయిన సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం మొత్తంలో ఉపాధ్యాయుడిగా చేసిన సేవలే అత్యంత తృప్తినిచ్చాయని తన జీవిత చరిత్రలో రాసుకున్న సందర్భాన్ని ఉపాధ్యాయులు గుర్తు చేసుకున్నారు. ప్రతీ సంవత్సరం సెప్టెంబర్ 5వ తేది ఉపాధ్యాయులకు ప్రత్యేకమైన రోజని ప్రధానోపాధ్యాయులు అనిల్ కుమార్ అన్నారు. విద్యార్థులు ఉపాధ్యాయుల గురించి కవితలు, పాటలు వినిపించి కార్యక్రమాన్ని రక్తి కట్టించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, తిరుపతి రెడ్డి, రాజయ్య, దేవేందర్ రెడ్డి, రమేష్, లచ్చయ్య, అనిల్ కుమార్, సమ్మయ్య,షాజహా, అనిత, కవిత, కిరణ్ కుమార్, కోటేశ్వర్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు విద్యార్థులు పాల్గొన్నారు.

“నూతన అగ్నిమాపక కేంద్రం ప్రారంభం…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-04T153143.129-1.wav?_=12

 

“నూతన అగ్నిమాపక కేంద్రం ప్రారంభం”

“ప్రజల ప్రాణాలు, ఆస్తులకు రక్షణ”

మంత్రి వాకటి శ్రీహరి.

జడ్చర్ల /నేటి ధాత్రి

 

 

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల కేంద్రంలో నూతనంగా నిర్మించిన అగ్నిమాపక కేంద్రం భవనాన్ని గురువారం పశుసంవర్థక క్రీడలు & యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి గారు ముఖ్య అతిథిగా హాజరై, ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి, మహబూబ్ నగర్, యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారితో కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…
“ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించే అగ్నిమాపక విభాగానికి తగిన సదుపాయాలు కల్పించడం ప్రభుత్వ ప్రాధాన్యత. అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించేలా ఆధునిక పరికరాలు, సిబ్బందిని ఈ కేంద్రంలో ఏర్పాటు చేశాం. జడ్చర్ల పరిసర ప్రాంతాలకు ఈ కొత్త కేంద్రం భద్రతా పరంగా పెద్ద తోడ్పాటు అందిస్తుంది” అని తెలిపారు. ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి గారు మాట్లాడుతూ…

 

“జడ్చర్ల పట్టణం అభివృద్ధిలో మరో ముందడుగుగా ఈ అగ్నిమాపక కేంద్రం నిలుస్తుంది. పట్టణంలో వేగంగా పెరుగుతున్న జనాభా, వాణిజ్య కార్యకలాపాల దృష్ట్యా ఈ కేంద్రం అవసరం ఉంది. ప్రజలకు అత్యవసర సర్వీసులు అందించడంలో ఇది కీలకంగా ఉపయోగపడుతుంది. మా నియోజకవర్గానికి మరిన్ని అభివృద్ధి ప్రాజెక్టులను తీసుకురావడంలో ఎల్లప్పుడూ కృషి చేస్తాను” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో డిఐజి నాగిరెడ్డి, జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, మున్సిపల్ చైర్మన్ కోనేటి పుష్పలత, జిల్లా అధికారులు, అగ్నిమాపక శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు భారీగా పాల్గొన్నారు.

ఎన్నికలకు ఎదురు చూపులు.. ఎన్నికల వరుసలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download.wav?_=13

ఎన్నికలకు ఎదురు చూపులు.. ఎన్నికల వరుసలు…

◆:- ఆశ్చర్యపోతున్న ఓటర్లు..

జహీరాబాద్ నేటి ధాత్రి:

పల్లెల్లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి కనిపిస్తోంది కాక బాగున్నారా.. మావ ఎక్కడ పోతున్నవు, ఓ అక్క ని బిడ్డ మంచిగా ఉన్నాదా… మంచిగా చదువుతుందా…. బాపు యూరియ దొరికిందా చల్లినవా పొలంలో… తాత పాణం బాగుందా.. ఇలా రక రకాల పలకరింపులు తో పల్లెల్లో పులకరిస్తున్నాయి. ఈ యెడు అంత మాట్లాడని వారు, వరుస లు కలుపుతూ పలకరిస్తుండడంతో ప్రజలు ఉబ్బి తబ్బి పోతున్నారు.. కొందరు ఇదేంరా బాబు ఎన్నడూ లేని వీడు వరుసలు కలవుతున్నాడని లోలోపల గోనుగుతున్నారు.. ఓటర్లకు దగ్గర అయ్యేందుకు వివిధ పార్టీల నాయకులు వరుసలు కలుపుకొని జనాలను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు కాగా కొందరు మీరు జిమ్ముక్కులు మాకు తెలుసులే అని అంటున్నారు కొందరు పార్టీతో పనిలేకుండా ఓటర్లను వలకరిస్తూ.. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటిస్తున్నారు.

Local Election Buzz

కూడగట్టుకుంటున్న మద్దతు

సర్పంచు. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలపై కన్నేసిన ఆశావహులు ఇప్పటి సుంచే గ్రామాల్లో
కలియదిరుగుతున్నారు. ఆర్థికంగా బలంగా ఉన్న వారంతా యువత, ఆయా కుల సంఘాల పెద్దలను మచ్చిక చేసుకుంటున్నారు. మరి కొంత మంది విందులు ఏర్పాటు చేస్తూ పలుకుబడి ఉన్న వ్యక్తులను తమవైపు తిప్పుకుంటున్నారు. కులాల వారీగా సమీకరణాలను అంచనా వేసుకుంటున్నారు

నేతల చుట్టూ చెక్కర్లు.

సర్పంచ్ బరిలో నిలిచేవారి పేర్లు ప్రచారంలోకి వస్తుండడంతో గ్రామాల్లో రోజుకొకరు పోటీ పడుతున్నట్లుగా చెప్పుకుంటున్నారు. తద్వారా ఒకరిని చూసి మరొకరు తయారవుతున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు పార్టీల వారీగా టికెట్ల కేటాయింపు ఉండడంతో నేతల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జి, పార్టీ అధ్యక్షులతో నిరంతరం టచ్లో ఉంటూ వారి ఆశీస్సులు పొందడానికి పాకులాడుతున్నారు.

Local Election Buzz

ఓటరు జాబితా ప్రచురణ

ఆగస్టు 28వ తేదీ లోపు గ్రామ పంచాయతీల ముసాయిదా ఓటర్ల జాబితా తయారీచేసి గ్రామ పంచాయతీ, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను ప్రదర్శించారు ఇక ఆ మరునాడే.. అంటే ఆగస్టు 29వ తేదీన ఎంపీడీవోల ద్వారా మండల స్థాయిలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎంపీడీవోల ద్వారా మండల స్థాయిలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు ఏర్పటు చేశారు.. ఆగస్టు 30వ తేదీన ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరించి ఆగస్టు 31వ తేదీన జిల్లా పంచాయతీ అధికారి గ్రామ పంచాయతీల వార్డుల వారీగా ఫొటో ఓటర్ల తుది జాబితాలను ప్రచురణ చేశారు. దీనికి తోడు సెప్టెంబర్ 30వ తేదీ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో పల్లెలో పంచాయతీ సందడి కనిపిస్తుంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version