నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ డ్రైవర్
అభినంధించిన డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ
నర్సంపేట,నేటిధాత్రి:
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నర్సంపేట డిపో బస్టాండ్ లో
శుక్రవారం ఉదయం 6గంటలకు నర్సంపేట నుండి వేములవాడ బస్సు ముందుగా ఎక్కిన నర్సంపేట టౌన్ ఎన్జీవో కాలనీకి చెందిన కీసర రజిత అనే ప్రయాణికురాలు దిగి వెంటనే హన్మకొండ బస్సు ఎక్కి
మనీ పర్సు పోగొట్టుకుంది.బస్సు డ్రైవర్ మహేష్ సహకారంతో బస్టాండు కంట్రోలర్ మల్లికార్జున్ ఆ మనిపర్సు అందజేశారు.కాగా అందులో ఆధార్ కార్డు, రూ.7200 నగదు, రెండు బంగారు ఉంగరాలు ఆ ప్రయాణికురాలకు రజిత అందజేశారు.నిజాయితీ చాటుకున్న సిబ్బంది డ్రైవర్ మహేష్ ను డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ అభినందించారు.