చేతిలో లేని అధికారంతో బీసీ రిజర్వేషన్ పెంపు.
42 శాతం బిసి రిజర్వేషన్లను అమలు చేయాలి
రాష్ట్రవ్యాప్త బిసి బంద్ లో పాల్గొన్న తెలంగాణ ముదిరాజ్ మహాసభ నాయకులు
దుగ్గొండి,నేటిధాత్రి:*
ఎన్నికల హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలోలేని అధికారంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు 42 శాతం చట్టసభల్లో రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టగా ఆ రిజర్వేషన్ పట్ల సుప్రీంకోర్టు స్టే విధించిందని తెలంగాణ ముదిరాజ్ మహాసభ వరంగల్ జిల్లా అధ్యక్షుడు,నర్సంపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పొన్నం మొగిలి ముదిరాజ్ ఆరోపించారు. బీసీ బందు కార్యక్రమంలో భాగంగా దుగ్గొండి మండలంలోని గిర్నిబావి గ్రామం ప్రధాన రహదారిపై ముదిరాజ్ మహాసభ దుగ్గొండి మండల శాఖ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నం మొగిలి మాట్లాడుతూ విద్య ఉద్యోగాలు చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ పట్ల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రిజర్వేషన్ బిల్లు మంచిదే కానీ.. అది అమలు కాకపోవడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తం ఉన్నదని ఆరోపించారు. రిజర్వేషన్ల అమలు కోసం వివిధ బిసి కుల సంఘాలు రోడ్డెక్కాల్సిన పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తంచేశారు. 42 శాతం బిసి రిజర్వేషన్ అమలు పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకొని అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినా నేటికీ బీసీ వర్గాలకు ఇలాంటి రిజర్వేషన్ల ప్రకారం ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ నుండి కేంద్రంలో ఉన్న మంత్రులు, పార్లమెంటు సభ్యులు బిసి రిజర్వేషన్ల పట్ల ఆలోచించాలని ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు పొన్నం మొగిలి కోరారు.ఈ కార్యక్రమంలో
తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఎన్నారై సెల్ కన్వీనర్ శానబోయిన రాజ్ కుమార్ ముదిరాజ్,దుగ్గొండి మండలం అధ్యక్షులు పల్లె రమేష్ ముదిరాజ్, సార రాములు ముదిరాజ్, బీసీ జాక్ కన్వీనర్ బండారి ప్రకాష్ ముదిరాజ్, మాజీ ఉప సర్పంచ్ నేదురి రాజేందర్ ముదిరాజ్, వరంగంటి తిరుపతి, నీరటి మురళి, ఒరంగంటి కుమారస్వామి, గొర్రె శీను, దండు రాజు, మేక అనిల్, జెట్టబోయిన రాజు, తెప్ప శంకర్, పొన్నం వంశీ తదితరులు పాల్గొన్నారు.
