విజయదశమి అందరికి విజయాలు చేకూర్చాలి
జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపీఎస్
జిల్లా ప్రజలకు,పోలీస్ అధికారులకు,సిబ్బందికి విజయదశమి శుభాకాంక్షలు
జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయుధ,వాహన పూజలు
సిరిసిల్ల టౌన్ : ( నేటిధాత్రి )
సిరిసిల్ల జిల్లాలో ఈరోజు విజయదశమి పండుగ ప్రజలకు అన్ని రంగాలలో విజయం చేకూర్చాలని ఎస్పీ ఆకాంక్షించారు.ఈరోజు జిల్లా పోలీసు కార్యాలయంలోని ఆర్ముడు రిజర్వ్ విభాగంలో ఆయుధ పూజ, వాహన పూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పీ దుర్గా దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.విజయదశమి పర్వదినోత్సవం అందరికి సుఖ సంతోషాలు కలిగించాలని ఆకాంక్షించారు. ఈసందర్భంగా జిల్లా ప్రజలకు మరియు పోలీస్ అధికారులకు సిబ్బందికి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈపూజా కార్యక్రమాలలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, ఆర్.ఐ లుమధుకర్, యాదగిరి, సి.ఐ లు కృష్ణ,నాగేశ్వరావు,మధుకర్, శ్రీనివాస్, ఆర్.ఎస్.ఐ లు, ఎస్.ఐ లు సిబ్బంది పాల్గొన్నారు.