గడీలవ్యవస్థపై గలమెత్తి పోరాడిన వీర వనిత చాకలి ఐలమ్మ
ఐలమ్మ వర్ధంతి సంద ర్భంగా ఘన నివాళులు
కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి
శాయంపేట నేటిధాత్రి:
గడీల వ్యవస్థపై గలమెత్తి పోరాడిన ఐలమ్మ బహుజన ఆత్మ గౌరవానికి, మహిళా చైతన్యానికి ప్రతీక అని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాలబుచ్చిరెడ్డి అన్నారు. బుధవారం ఐలమ్మ వర్థంతి సందర్భంగా రజక కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రం లోని ఐలమ్మ విగ్రహానికి స్థానిక నాయకులతో కలిసి పూల మాలవేసి ఘనంగా నివాళుల ర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ తొలి భూ పోరాటానికి నాంది పలి కిన వీర వనిత ఐలమ్మ అని అన్నారు.తెలం గాణ రైతాంగ పోరాటంలో ఐలమ్మ చూపిన తెగువ అంద రికీ ఆదర్శమని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మారపెళ్లి రవీందర్ వైనాల కుమారస్వామి చిందం రవి నిమ్మల రమేష్ రాజ్ కుమార్ రాజు మార్కండేయ తదిత రులు పాల్గొన్నారు.