లోక్ అదాలత్ ద్వారా సామరస్యంతో సమస్యల ముగింపు…

లోక్ అదాలత్ ద్వారా సామరస్యంతో సమస్యల ముగింపు

రాజీ మార్గంలో వివాదాల పరిష్కారం

రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

మంచిర్యాల,నేటి ధాత్రి:

లోక్ అదాలత్ ద్వారా సామరస్యంతో సమస్యలు ముగించుకోవాలని మార్చి 28న శనివారం నిర్వహించబడనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పిలుపునిచ్చారు.ఆయన మాట్లాడుతూ లోక్ అదాలత్ ద్వారా వివాదాలు శాంతియుతంగా,రాజీ మార్గంలో పరిష్కారమవుతాయని తెలిపారు.రాజీకి అనువైన క్రిమినల్ కంపౌండబుల్ కేసులు,సివిల్ తగాదా కేసులు,ఆస్తి విభజన, కుటుంబపరమైన,వైవాహిక కేసులు,బ్యాంకు బకాయిల వసూలు,విద్యుత్ చౌర్యం,చెక్ బౌన్స్ వంటి కేసుల్లో ఇరువర్గాలు లోక్ అదాలత్ ద్వారా చర్చించుకుని రాజీకి రావాలని అన్నారు.

రాజీయే రాజమార్గం

చిన్న చిన్న తగాదాల కారణంగా కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయం,డబ్బు వృథా చేసుకోవద్దని తెలిపారు.జుడీషియల్ శాఖ అందించిన ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఇరుపక్షాలు శాంతియుత పరిష్కారం పొందాలని సూచించారు.పెద్దపల్లి, మంచిర్యాల జోన్లలోని అన్ని పోలీస్ అధికారులు,కోర్టు విధులు నిర్వహించే కానిస్టేబుళ్లు,పోలీస్ సిబ్బందికి సరైన మార్గదర్శకాలు ఇచ్చి,రాజీ పడదగిన కేసులను గుర్తించాలని అన్నారు.ఇరువర్గాల వారిని పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించి రాజీ సాధించే ప్రయత్నాలు చేయాలని కమిషనర్ సూచించారు.తమ కేసుల్లో రాజీ కావాలని కోరుకునే వ్యక్తులు సంబంధిత పోలీస్ అధికారులను సంప్రదించాలని ఆయన కోరారు.లోక్ అదాలత్ ద్వారా వివాదాలు త్వరితగతిన పరిష్కారమై బాధితులకు సత్వర న్యాయం లభిస్తుందని పేర్కొన్నారు.

లోక్ అదాలత్ గురించి ప్రజలకు సూచనలు:

ఇరుపక్షాల సమ్మతితో మాత్రమే రాజీ సాధ్యం.లోక్ అదాలత్‌లో జరిగిన రాజీ చట్టపరంగా తుది తీర్పుగా పరిగణించబడుతుంది.ప్రతి కేసులో న్యాయమూర్తులు, న్యాయవాదులు,సామాజిక కార్యకర్తల సమన్వయంతో పరిష్కారం జరుగుతుంది.ప్రజలు, పోలీసులు,న్యాయస్థానాలు కలిసికట్టుగా పనిచేస్తే చిన్న వివాదాలు కూడా పెద్ద సమస్యలుగా మారకుండా ముందే పరిష్కరించుకోవచ్చని సీపీ అంబర్ కిషోర్ ఝా అన్నారు.

మహిళా చైతన్యానికి,ఆత్మగౌరవానికి చాకలి ఐలమ్మ ఒక ప్రతీక…

మహిళా చైతన్యానికి,ఆత్మగౌరవానికి చాకలి ఐలమ్మ ఒక ప్రతీక

పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్

మంచిర్యాల,నేటి ధాత్రి:

తెలంగాణ వీర వనిత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝ, అధికారులు, సిబ్బంది పోలీస్ కమిషనరేట్ కార్యాలయం భవనం వద్ద ఏర్పాటు చేసిన చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ…పెత్తందార్ల దురాగతాలను,ఆనాటి నిరంకుశ రజాకార్లకు,దేశ్ ముఖ్ లకు వ్యతిరేఖంగా మొక్కవోని ధైర్యంతో ఐలమ్మ ఎదిరించిన తీరు అందరికీ ఆదర్శమని ఐలమ్మ పోరాటాలను కొనియాడారు. ఆమె చేసిన పోరాట ఉద్యమమే తెలంగాణ సాయుధ పోరాటానికి స్ఫూర్తి అని అన్నారు.మహిళా చైతన్యానికి,ఆత్మగౌరవానికి ప్రతిక అని మహిళలందరూ ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈకార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్,ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్,ఏ ఓ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ లు భీమేష్,ఆర్ఐ లు దామోదర్,శ్రీనివాస్, వామన మూర్తి,సీపీఓ సిబ్బంది,వివిధ వింగ్స్ సిబ్బంది,ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు.

సీసీసీ నస్పూర్ పోలీస్‌ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించిన సీపీ

సీసీసీ నస్పూర్ పోలీస్‌ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించిన సీపీ

నస్పూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్ కిషోర్ ఝా మంగళవారం సీసీసీ నస్పూర్ పోలీస్‌ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించారు.ఈ సందర్బంగా కమిషనర్‌ స్టేషన్‌ పరిసరాలను పరిశీలించడంతో పాటు, భౌగోళిక పరిస్థితులు,సిబ్బంది పనితీరు,అలాగే స్టేషన్‌ పరిధిలో ఎక్కువగా నమోదయ్యే కేసులపై పూర్తి వివరాలను తెలుసుకున్నారు.
రిసెప్షన్‌ సిబ్బందితో మాట్లాడి రికార్డులను కమిషనర్‌ పరిశీలించారు.పెండింగ్‌ కేసులపై ఆరా తీసి,నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను అధికారుల నుండి వివరంగా అడిగి తెలుసుకున్నారు.రాబోయే గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా జరిగేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సందర్శనలో సీపీ అంబర్ కిషోర్ ఝా,మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్‌ (ఐపీఎస్), మంచిర్యాల ఏసీపీ ఆర్. ప్రకాష్,మంచిర్యాల రూరల్ సీఐ అశోక్‌కుమార్‌,సీసీసీ నస్పూర్ ఎస్ఐ ఉపేందర్‌ పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version