మున్సిపల్ సిబ్బందికి సీజనల్ మరియు హెల్త్ కిట్స్ పంపిణీ.

మున్సిపల్ సిబ్బందికి సీజనల్ మరియు హెల్త్ కిట్స్ పంపిణీ

.వర్షాకాలంలో 16వ డివిజన్ ను పరిశుభ్రంగా ఉంచాలి.

సుంకరి మనిషా శివకుమార్.
16వ డివిజన్ కార్పొరేటర్

కాశిబుగ్గ నేటిధాత్రి.

వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధి 16వ డివిజన్ లోని పారిశుద్య పనులు నిర్వహిస్తున్న మున్సిపల్ సిబ్బందికి స్థానిక 16వ డివిజన్ కార్పొరేటర్ సుంకరి మనీషా శివకుమార్ సీజనల్ మరియు హెల్త్ కిట్స్ అందచేయడం జరిగింది.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ నిరంతం డివిజన్ ను పరిశుభ్రంగా ఉంచేందుకు ఎంతగానో శ్రమిస్తున్న సిబ్బంది అనారోగ్య ఇబ్బందులకు గురి కాకుండా ఉండేందుకు కార్పొరేషన్ హెల్త్ కిట్స్ అందించడం ద్వారా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని అన్నారు.అదే విధంగా వర్షా కాలాన్ని దృష్టిలో పెట్టుకొని సీజనల్ కిట్స్ అందించడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపాలిటీ సిబ్బంది కార్పొరేటర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ జవాన్ లు సిబ్బంది పాల్గొన్నారు.

ఘనంగా జనసేన పార్టీ కిట్ల పంపిణి.

ఘనంగా జనసేన పార్టీ కిట్ల పంపిణి
మెట్ పల్లి జూలై 01 నేటి దాత్రి:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కిట్ల పంపిణీ కార్యక్రమం జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి నేమూరి శంకర్ గౌడ్ ఆదేశాల మేరకు మరియు రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంఛార్జి ఆర్ కే సాగర్ సూచనల మేరకు సీనియర్ నాయకులు కోరుట్ల నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి గంగం అజయ్ కుమార్ ఆధ్వర్యంలో క్రియాశీల కిట్ల పంపిణీ కార్యక్రమం నేడు మంగళవారం రోజున మెట్ పల్లి మండలం మారుతి నగర్ లో ఘనంగా జరిగింది . రాబోయే రోజుల్లో జనసేన పార్టీ రాజకీయాల్లో క్రియా శీలకంగా పాల్గొంటుందని వారు అన్నారు .ఇట్టి కార్యక్రమంలో బోగ చక్రదర్, రాజోగి కార్తీక్, ప్రణయ్ కుమార్ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు .

కాటమయ్య రక్షణ కిట్ల పంపిణీ.

*కాటమయ్య రక్షణ కిట్ల పంపిణీ
కార్యక్రమంలో మోకుదెబ్బ నాయకులు..*

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల
ప్రవేశ పెట్టిన కాటమయ్య రక్షణ కిట్లను ఎమ్మెల్యే క్యాంపు
కార్యాలయంలో ఎమ్మెల్యే దొంతి మాదవరెడ్డి శనివారం ప్రారంభించడం
జరిగింది..జిల్లా బీసీ సంక్షేమ శాఖ, ఆబ్కారీ శాఖల ఆధ్వర్యంలో డివిజన్ లోని ఆరు మండలాలకు చెందిన 214 మంది గీత కార్మికులకు కిట్లు అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ పుస్పలత,కందాల శంకరయ్య గౌడ్,ఆబకారి సీఐ నరేష్ రెడ్డి,ఎస్ఐ శార్వాణి,గౌడ జనహక్కుల పోరాటం సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్, జిల్లా అధ్యక్షులు గోపగాని వెంకట్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి శీలం వీరన్న గౌడ్,డివిజన్ అధ్యక్షులు కందుల శ్రీనివాస్ గౌడ్,సలహాదారులు రామగోని సుధాకర్ గౌడ్,పొగాకు వెంకటేశ్వర్లు, రమేష్ గౌడ్,పోగాకు సాయితేజ గౌడ్,భూపతి మల్లంపల్లి గౌడ సంఘం సభ్యులు అరేల్లి ప్రకాష్ గౌడ్, కక్కేర్ల రాజు,రమేష్,రాజు,రామకృష్ణ,
తదితరులు పాల్గొన్నారు.

గర్భిణీ స్త్రీలకు మెడికల్ కిట్ల పంపిణి.

ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు మెడికల్ కిట్ల పంపిణి.

నాగర్ కర్నూల్ నేటి దాత్రి:

 

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం లోని వెల్దండ మండలంలోని అజిలాపురం, కుందారం తండా, లాలు తాండ, గ్రామాలలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్,బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఉప్పల వెంకటేష్ సహకారంతో గ్రామంలోని గర్భిణీ స్త్రీలకు మెడికల్ కిట్లని పంపిణీ చేయడం జరిగింది.ఈ పంపిణీ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు సిద్ధగొని రమేష్ గౌడ్ , ఆశ వర్కర్ కలమ్మ, సిద్ధగోని పరమేష్, బుడ్డ రాములు, ఆర్కే గౌడ్, కుమార్, ఎండి ఖాజాబీ, కాలే నరసింహ, ఎండి జాఫర్, నిరంజన్, లింగం, కేశముని పరమేష్, కొప్పుల యాదయ్య , మహేష్, రామచంద్రి, దాములా నాయక్, రమేష్ నాయక్ , వెంకటేష్ నాయక్ గ్రామ పెద్దలు మహిళలు టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

రంజాన్ తోఫా కిట్స్ పేద ముస్లిం లకు నిత్యవసర.

రంజాన్ తోఫా కిట్స్ పేద ముస్లిం లకు నిత్యవసర సరుకులు పంపిణీ

వనపర్తి నేటిదాత్రి :

తెలంగాణ జన సమితి
పార్టీ జిల్లా అధ్యక్షులు
య౦ఏ ఖాదర్ పాష.
ఆధ్వర్యంలో
రంజాన్ పండుగ సందర్భంగా ఖాదర్ నివాసంలో పేదా ముస్లిం మహిళలకు
రంజాన్ నెల సందర్భంగా నిరుపేద ముస్లింలకు రంజాన్ పండుగ తోఫా నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు 250.మంది.ముస్లిం ల కు తోఫా కిట్స్ ఇచ్చారు .
గత 8 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఖాదర్ తెలిపారు. ఈ రంజాన్ పండుగ తోఫా
కిట్స్ పంపిణీ కార్యక్రమా౦ విజయవంతం చేశామని
ఆయన వెల్లడించారు . ఈ కార్యక్రమానికి తెలంగాణ జన సమితి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అని ఖాదర్ పాష అన్నారు
ఈ కార్యక్రమంలో
టి జేఏసీ ప్రజా వాగ్గేయకారుడు రాజారాం ప్రకాష్.
సామాజిక నేత పోచ రవీందర్ రెడ్డి
మండల అధ్యక్షులు ఎండి సమీ. . జే. వినోద్ కుమార్ గారు తదితరులు పాల్గొన్నారు

పదవ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ కిట్ అందజేసిన వర్ధిని ఫౌండేషన్.

పదవ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ కిట్ అందజేసిన వర్ధిని ఫౌండేషన్

చిల్పూర్(జనగామ)నేటి ధాత్రి:

ఈనెల జరగబోయే పదవ తరగతి పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలని వర్ధిని ఫౌండేషన్ నిర్వాహకులు పేర్కొన్నారు. ఇందులో భాగంగా వర్థిని ఫౌండేషన్ వారి సహకారంతో చిల్పూర్ మండలంలోని చిన్నపెండ్యాల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో
పదవ తరగతి విద్యార్థులకు జరగబోయే పరీక్షలను దృష్టిలో పెట్టుకొని ఎగ్జామ్ ప్యాడ్ కిట్టును స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇల్లందుల విజయ్ ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమం చేపట్టారు.
ఈ కార్యక్రమంలో చిల్పూర్ సబ్ ఇన్స్పెక్టర్ సిరిపురం నవీన్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ఎగ్జామ్ ప్యాడ్ కిట్టులను పదవ తరగతి విద్యార్థులకు అందజేశారు.
ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ నవీన్ మాట్లాడుతూ చాలా గొప్ప కార్యక్రమం చేపడుతున్నారని కార్యక్రమం నిర్వహిస్తున్న ఫౌండేషన్ ప్రశంసించారు,
పరీక్ష రాయనున్న విద్యార్దులు అందరూ పరీక్షలు బాగా రాసి మెరుగైన ఫలితాలు సాధించి జీవితంలో ఉన్నతమైన స్థానంలో వుండాలని పదవ తరగతి విద్యార్థులకు ఈ పరీక్షలు జీవితంలో ఉన్నత స్థానం ఎంచుకోవడానికి సరైన మార్గం అని అన్నారు.విద్యార్థులందరికీ ఈ సందర్భంగా ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు..
ఈ కార్యక్రమంలో వర్ధిని
ఫౌండేషన్ సభ్యులు తన్నీరు రమేష్ , ఎండి.హఫీజ్, సౌదర పల్లి సంపత్ రాజ్ ,కొర్ర వెంకటేష్ నాయక్,ఇల్లందుల రాజు మరియు కాంగ్రెస్ యూత్ నాయకులు ఐలపాక శ్రీనివాస్,పొన్న రాజేష్ తోపాటు పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version