క్షేత్రస్థాయి సిబ్బంది తలసీమియా వ్యాధి.

క్షేత్రస్థాయి సిబ్బంది తలసీమియా వ్యాధి గురించి ప్రజల్లో అవగాహన కలిగించాలి

హనుమకొండ డిఎంహెచ్ఓ డాక్టర్ అల్లం అప్పయ్య

హన్మకొండ, నేటిధాత్రి:

 

 

ప్రపంచ తలసీమియా దినం సందర్భంగా ఈరోజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి హనుమకొండ నుండి నిర్వహించిన అవగాహన ర్యాలీని జిఎంహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి మరియు ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి మదన్మోహన్ రావుతో కలిసి జండా ఊపి ప్రారంభించారు. పట్టణ కుటుంబ సంక్షేమ కేంద్రం ,అలాగే పోచమ్మ కుంట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ,బ్లడ్ బ్యాంక్ మరియు టీ హబ్ సిబ్బందితో కలిసి నిర్వహించిన ఈ ర్యాలీ కొత్తూర్ మరియు మెయిన్ రోడ్డు గుండా అవగాహన నినాదాలతో నిర్వహించడం జరిగింది. అనంతరం బ్లడ్ బ్యాంకులో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న డాక్టర్ అప్పయ్య మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో దాదాపుగా 300 మంది చిన్నారులు తలసీమియా వ్యాధితో బాధపడుతున్నారని , ఇది ఒక జన్యు సంబంధమైనటువంటి వ్యాధి అని,వ్యాధితో బాధపడుతున్నారు మరియు వారి కుటుంబ సభ్యులు జన్యు పరీక్షలు చేయించుకోవాలని అలాగే మేనరిక వివాహాలు కూడా సరికాదన్నారు. వీరికి తరచుగా రక్త మార్పిడి అవసరము ఉంటుందన్నారు అలాగే రెడ్ క్రాస్ ఆవరణలో వీరి కోసం ప్రత్యేకమైనటువంటి వార్డు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని ఆరోగ్యశ్రీ సదుపాయం కూడా ఉందన్నారు. నెలల వయస్సులోనే ఈ వ్యాధి లక్షణాలను మనం గుర్తించవచ్చునని వీరిలో ఎదుగుదల సరిగా ఉండదని మొహం పీకపోయి ఉన్నట్టుగా ఉండి నీరసంగా ఉంటారని తొందరగా అనారోగ్యం బారిన పడతారన్నారు. తలసీమియా మరియు సికిల్ సెల్ అనే మియా రెండు కూడా జన్యుపరమైనవని అలాగే రక్తమునకు సంబంధించిన సమస్యలతో కూడుకున్న వన్నారు. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాలో సికిల్ సెల్ అనేమియా గురించి ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ప్రత్యేక కార్యక్రమంలు నిర్వహించడం జరుగుతున్నది అన్నారు.
జిఎంహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ వీరికి ప్రతి రెండు మూడు వారాలకు ఒకసారి రక్త మార్పిడి అవసరం ఉంటుందని అలాగే తలసీమియా వ్యాధితో బాధపడుతున్న కుటుంబ సభ్యులు, వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు అలాగే గర్భవతి కావాలనుకున్నప్పుడు తప్పనిసరిగా తలసీమియా స్క్రీనింగ్ చేసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ టి మదన్మోహన్రావు , ఇన్చార్జ్ బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నిఖిల, పట్టణ కుటుంబ సంక్షేమ కేంద్రం డాక్టర్ గీత , జిల్లా మాస్ మీడియా అధికారి వి అశోక్ రెడ్డిపోచమ్మ కుంట వైద్యాధికారి డాక్టర్ దీప్తి పిహెచ్ఎన్ రామేశ్వరి టీ హబ్ మేనేజర్ శ్రీ కౌముది, హెచ్ ఈ ఓ ఖాదర్ అబ్బాస్ ,సూపర్వైజర్లు రమేష్ , బజిలీస్ అమ్మ, విప్లవ్ కుమార్్,రాజేష్ , కమలాకర్,ల్యాబ్ టెక్నీషియన్లుఏఎన్ఎంలు ,ఆశాలు
పాల్గొన్నారు.

తలసేమియా దినోత్సవం .

తలసేమియా దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ

మరిపెడ నేటిధాత్రి.

 

 

 

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో ని ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్బంగా మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ గుగులోతు రవి ఆధ్వర్యంలో మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో ఆరోగ్య సిబ్బంది తో కలిసి అవగాహన ర్యాలీ మరియు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈసందర్భంగా డాక్టర్ రవి మాట్లాడుతూ ఎర్ర రక్త కణాలలో ఉండే హిమోగ్లోబిన్ ను శరీరం తగినంతగా ఉత్పత్తి చేయనప్పుడు ఏర్పడే రక్త వ్యాధినే తలసేమియా అంటారు.హిమోగ్లోబిన్ రక్తంలోని ఆక్సిజన్‌ను శరీరంలోని వివిధ భాగాలకు తీసుకు వెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ఆల్ఫా (α) మరియు బీటా (β) అనే రెండు ప్రోటీన్లతో ఏర్పడుతుంది. త‌ల‌సేమియా వ్యాధిగ్రస్తుల్లో ఎముక మజ్జ (బోన్ మ్యారో) శ‌రీరానికి కావాల్సిన హిమోగ్లోబిన్ లేదా ఎర్ర ర‌క్త క‌ణాల‌ను త‌యారుచేయ‌కపోవడంతో శరీరంలోని అన్ని కణాలకు తగినంత ఆక్సిజన్ సరఫరా అందదు.తలసేమియా ఎక్కువగా రెండు సంవత్సరాల్లోపు గల వారిలో గమనించవచ్చు.మ‌న శ‌రీరంలో ఎర్ర ర‌క్త క‌ణాలు లేదా హిమోగ్లోబిన్ ఉండాల్సిన మోతాదులో లేన‌ప్పుడు తలసేమియాతో పాటు ర‌క్త‌హీన‌త సమస్య కూడా కలిగే అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమం లో డాక్టర్ స్వామి, సాయిశ్రీ,సిరి,పబ్లిక్ హెల్త్ నర్సింగ్ ఆఫీసర్ మంగమ్మ, సూపెర్వైసోర్స్ కృష్ణ,ఆచార్యలు,సరళ, నర్సబాయి, ఝాన్సీ,శ్రీదేవి, నాగమణి, ఆశ ఆరోగ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version