వరంగల్‌లో వ్యవసాయ అధికారి చేతుల మీదుగా కొత్త క్యాలెండర్ ఆవిష్కరణ

క్యాలెండర్ ఆవిష్కరించిన వ్యవసాయ అధికారి

 

నడికూడ,నేటిధాత్రి:

 

తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా నూతన క్యాలెండర్‌ను ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు వరికెల కిషన్ రావు ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా వ్యవసాయ అధికారి చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు వరికెల కిషన్ రావు, హనుమకొండ జిల్లా అధ్యక్షులు హింగే భాస్కర్, జిల్లా నాయకులు సుగుణ సుధాకర్,చౌల రామారావు, హింగే రవీందర్,అంబరి శ్రీనివాస్,సురావు బాబురావు, అలాగే నడికూడ,పరకాల, ఎల్కతుర్తి మండల అధ్యక్షులు వంకే రాజు, బిక్షపతి,మధుకర్,మండల ప్రధాన కార్యదర్శి తిప్పారపు సుధాకర్ మాధవరావు,రైతు నాయకులు లోనే సతీష్ తదితర రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ,రైతుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ రైతు రక్షణ సమితి నిరంతరం పోరాటం చేస్తుందని, రైతుల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా ముందుకు సాగుతుందని తెలిపారు. నూతన క్యాలెండర్ రైతులకు ఉపయోగపడే విధంగా రూపొందించబడిందని పేర్కొన్నారు.

ఏసీబీ కి దొరికిన అవినీతి ఏఈఓ.

ఏసీబీ కి దొరికిన అవినీతి ఏఈఓ.

రైతు భీమా కోసం 20 వేలు డిమాండ్.

మరిపెడ నేటిధాత్రి.

 

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని ఏసీబీ అధికారులకు దొరికిన అవినీతి ఏఈఓ, ఆనేపురం గ్రామపంచాయతీలోని చనిపోయిన రైతుకు ప్రభుత్వం నుంచి అందించే రైతు బీమా మంజూరు కోసం రూ.10వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి ఏఈఓ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుపడ్డాడు.వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మరిపెడ మండలంలోని అనే పురం గ్రామానికి చెందిన రైతు బిక్కు అక్టోబర్ 14 వ తేదీన మరణించాడు. దీంతో నామినీగా ఉన్న రైతు కుమారుడు రైతు బీమా కోసం గత నెల 30వ తేదీన అన్ని ధ్రువీకరణ పత్రాలతో మరిపెడ అగ్రికల్చర్ కార్యాలయంలో రైతు బీమాకు దరఖాస్తు చేసుకున్నాడు. ఈ క్రమంలోనే అనేపురం క్లస్టర్ ఏఈఓ గా విధులు నిర్వహిస్తున్న గాడిపెళ్లి సందీప్ సదరు రైతు కుమారుడి వద్ద రూ. 20 వేలు ఇస్తేనే ధ్రువీకరణ పత్రాలు ఆన్లైన్ చేస్తానని డిమాండ్ చేసినట్లు తెలిపారు.అధికారికి డబ్బులు ఇచ్చే స్తోమత లేక సదర్ దరఖాస్తుదారుడు నేరుగా వరంగల్‌లోని ఏసీబీ అధికారులను సంప్రదించి అధికారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టించడం జరిగింది. గురువారం మరిపెడ మండల కేంద్రంలోని జేజే బార్ అండ్ రెస్టారెంట్ ఎదురుగా దరఖాస్తుదారుల నుంచి రూ.10వేలు తీసుకుంటుండగా పట్టుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. నేరస్తుడిని శుక్రవారం ఉదయం వరంగల్ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ చేయడం జరుగుతుందని డీఎస్పీ సాంబయ్య తెలిపారు. ఈ దాడుల్లో ఆయనతో పాటుగా ఇన్స్పెక్టర్లు ఎల్ రాజు, శేఖర్, ఏసీబీసీ సిబ్బంది పాల్గొన్నారు. కాగా మరిపెడలోని నేరస్తుడి బంధువుల ఇళ్లలో సైతం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version