పాఠశాలలను సందర్శించిన జిల్లా కలెక్టర్.
నడికూడ,నేటిధాత్రి:
మండలంలోని రాయపర్తి గ్రామంలో ఉన్నత,ప్రాథమిక పాఠశాలలను హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించారు,విద్యార్థుల విద్యా ప్రగతి,బోధన కార్యక్రమాలను సమీక్షించారు. విద్యార్థుల హాజరు బోధన విధానం,పాఠశాలల పరిశుభ్రతపై ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు,విద్యా ప్రమాణాలు మెరుగు పరిచేదిశగా పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి,తహసీల్దార్ రాణి, మండల విద్యాశాఖ అధికారి కే.హనుమంత రావు, పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు పాల్గొన్నారు.