రాష్ట్రస్థాయి కరాటే పోటీలకు రితిక ఎంపిక…

 

రాష్ట్రస్థాయి కరాటే పోటీలకు రితిక ఎంపిక

పరకాల,నేటిధాత్రి

 

రాష్ట్ర స్థాయి ఎస్జిఎఫ్ కరాటే పోటీలకు పరకాల పట్టణానికి చెందిన పోచంపల్లి రితిక ఎంపిక అయినట్లు క్రియేటివ్ కరాటే డూ వ్యవస్థాపకులు మాడ సంపత్ పేర్కొన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో జరిగిన జిల్లా స్థాయి ఎంపికల్లో రితిక ప్రతిభ చూపినట్లు తెలిపారు.అండర్ 19.56కిలోల విభాగంలో రితిక ప్రథమ స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయి కరాటే పోటీలకు ఎంపిక అయిందన్నారు.డిసెంబర్ నెలలో జరగనున్న రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నట్లు పేర్కొన్నారు.కాగా రాష్ట్రస్థాయి కరాటే పోటీలకు ఎంపికైన రితికను మాస్టర్ పాపయ్యతో పాటు పలువురు అభినందించారు.

భవాని మాతను దర్శించుకున్న నాయకులు…

భవాని మాతను దర్శించుకున్న నాయకులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం మండల శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీదేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ దుర్గాభవాని మాత అమ్మవారిని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హనుమంతరావు పటేల్ దర్శించుకున్నారు. ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆయనతోపాటు శ్రీ కేతకి సంగమేశ్వర దేవస్థాన చైర్మన్ శేఖర్ పటేల్ ఎంపీడీవో మంజుల ఏపీవో రాజ్ కుమార్ గ్రామ కార్యదర్శి వీరన్న పటేల్ ఫీల్డ్ అసిస్టెంట్ నర్సింలు మోహన్ సంగమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

వనపర్తిలో ఇండోరా స్టేడియంలో పనులను తనిఖీ చేసిన కలెక్టర్…

వనపర్తిలో ఇండోరా స్టేడియంలో పనులను తనిఖీ చేసిన కలెక్టర్
వనపర్తి నేటిదాత్రి .

 

 

వనపర్తి జిల్లా కేంద్రంలో ప్రజల ఆరోగ్యం కోసం అందుబాటులోకి రానున్న ఇండోర్ స్టేడియాన్ని ప్రజలు సద్వినియోగించుకునేలా అన్ని రకాల సదుపాయాలను కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు సమర్థవంతంగా స్టేడియాన్ని ఉపయోగించుకునేలా అన్ని సదుపాయాలను కల్పించాలని కోరారు క్రీడాకారుల సౌకర్యార్థం సరైన మెయింటెనెన్స్, సీటింగ్, లైటింగ్‌తో పాటు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించేందుకు ఇంజినీరింగ్, క్రీడా శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. వీలైనంత త్వరగా అన్ని అవసరమైన సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చి ప్రారంభానికి సిద్ధం చేస్తామని అధికారులు బదులిచ్చారు.
పంచాయతీరాజ్ కార్యనిర్వాహక ఇంజనీర్ మల్లయ్య, అధికారులు కలెక్టర్ వెంట ఉన్నారు.

చంద్రగిరిలో శరవేగంగా క్రీడా వికాస్ కేంద్రం (ఇండోర్ స్టేడియం) పనులు

*చంద్రగిరిలో శరవేగంగా క్రీడా వికాస్ కేంద్రం (ఇండోర్ స్టేడియం) పనులు…

*హర్షం వ్యక్తం చేస్తున్న చంద్రగిరి పట్టణ ప్రజలు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు..

*అంకితభావంతో కృషి చేస్తున్న చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కి కృతజ్ఞతలు తెలుపుకున్న ప్రజలు…

చంద్రగిరి(నేటి ధాత్రి) జూలై 10:

పట్టణ అభివృద్ధిలో భాగంగా రూ.
1.53 కోట్లతో మంజూరైన క్రీడా వికాస్ కేంద్రం (ఇండోర్ స్టేడియం) పునఃనిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ పనుల పురోగతి పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ఈ క్రీడా వికాస్ కేంద్రం నిర్మాణం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి ఊపందుకుందిభూమిపూజతో పనులు ప్రారంభం కాగా ప్రస్తుతం నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. అధునాతన ఇండోర్ స్టేడియం అందుబాటులోకి వస్తే యువ క్రీడాకారులకు ఎంతో మేలు జరుగుతుందని, చంద్రగిరి క్రీడా రంగంలో మరింత ముందుకు దూసుకెళ్తుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధికి అంకితభావంతో కృషి చేస్తున్న చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కి ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version