వరంగల్‌లో వ్యవసాయ అధికారి చేతుల మీదుగా కొత్త క్యాలెండర్ ఆవిష్కరణ

క్యాలెండర్ ఆవిష్కరించిన వ్యవసాయ అధికారి

 

నడికూడ,నేటిధాత్రి:

 

తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా నూతన క్యాలెండర్‌ను ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు వరికెల కిషన్ రావు ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా వ్యవసాయ అధికారి చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు వరికెల కిషన్ రావు, హనుమకొండ జిల్లా అధ్యక్షులు హింగే భాస్కర్, జిల్లా నాయకులు సుగుణ సుధాకర్,చౌల రామారావు, హింగే రవీందర్,అంబరి శ్రీనివాస్,సురావు బాబురావు, అలాగే నడికూడ,పరకాల, ఎల్కతుర్తి మండల అధ్యక్షులు వంకే రాజు, బిక్షపతి,మధుకర్,మండల ప్రధాన కార్యదర్శి తిప్పారపు సుధాకర్ మాధవరావు,రైతు నాయకులు లోనే సతీష్ తదితర రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ,రైతుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ రైతు రక్షణ సమితి నిరంతరం పోరాటం చేస్తుందని, రైతుల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా ముందుకు సాగుతుందని తెలిపారు. నూతన క్యాలెండర్ రైతులకు ఉపయోగపడే విధంగా రూపొందించబడిందని పేర్కొన్నారు.

ఒకే ఈతలో రెండు లేగ దూడలకు జన్మనిచ్చిన ఆవు…

ఒకే ఈతలో రెండు లేగ దూడలకు జన్మనిచ్చిన ఆవు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఒకే కాన్పులో రెండు లేగ దూడలకు జన్మనిచ్చిన అరుదైన సంఘటన ఝరాసంగం మండల బోరేగావ్ గ్రామ పరిధిలోని బుధవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన చాకలి శంకర్ అనే పాడి రైతు ఆవు ఉదయం రెండు లేగ దూడలను జన్మనిచ్చింది. లేగ దూడలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాయని ఇలాంటి అరుదైన సంఘటనలు చోటు చేసుకోవడం విశేషమని రైతు తెలిపారు. ఒకే కాన్పులో ఆవు రెండు లేగ దూడలను ప్రసవించిన విషయం తెలుసుకున్న గ్రామస్తులు లేగ దూడలను చూసేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు.ఈ విషయం బోరేగావ్ గ్రామ నూతన సర్పంచ్ నాగేందర్ పటేల్ పై మండల పశువైద్యాధికారి హర్షవర్ధన్ రెడ్డిని సంప్రదించగా, ఒకే కాన్పులో జన్మించాయని, అవి సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే సిబ్బందిని పంపించి వైద్యం అందిస్తామన్నారు.

మొగిలిపేటలో గొర్రెల, మేకల ఉచిత నట్టల మందుల పంపిణీ

మొగిలిపేట గ్రామంలో గొర్రెలకు మేకలకు నట్టల మందు పంపిణీ
మల్లాపూర్ డిసెంబర్ 30 నేటి ధాత్రి

పశు వైద్య పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈనెల 22 నుండి 31 వరకు జరుగుతున్నటువంటి ఉచిత గొర్రెల మేకల నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మల్లాపూర్ మండలంలోని మొగిలిపేట గ్రామంలో 3100 గొర్రెలకు 450 మేకలకు నట్టల మందుల పంపిణీ చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి సర్పంచ్ గోల్కొండ కళా. ఉప సర్పంచ్ దండవేణి రాజేందర్ వార్డ్ సభ్యులు ప్రణయ్ కాంగ్రెస్ నాయకులు ఎలేటి జలపతి రెడ్డి గోల్కొండ రమేష్ లైవ్ స్టాక్ ఆఫీసర్ సుజాత వెటర్నరీ అసిస్టెంట్ రవీందర్ ఆఫీస్ సబార్డినేట్ రాజేందర్ గొల్ల కుర్మా యాదవ రైతులు ముక్కెర రాజేందర్. ముక్కెర లక్ష్మీనరసయ్య . మల్లయ్య. బాస రమేష్ తదితరులు పాల్గొన్నారు

చిట్టాపూర్ గ్రామంలో గొర్రెలు, మేకల ఉచిత నట్టల నివారణ కార్యక్రమం

చిట్టాపూర్ గ్రామంలో పశు వైద్య పశు సంవర్ధక శాఖ వారి ఆధ్వర్యంలో నట్టల మందు నివారణ మల్లాపూర్ డిసెంబర్ 30 నేటిధాత్రి

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటివంటి పశువైద్య పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో గొర్రెలు మేకలలో ఉచిత నట్టల నివారణ మందుల కార్యక్రమంలో మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామంలో సర్పంచ్ సంపాతి శంకరమ్మ ప్రారంభించారు .ఇట్టి కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి డాక్టర్ అశోక్,సహాయక సిబ్బంది రవీందర్, ఇక్బాల్, మహేష్ పంచాయతీ కార్యదర్శి అశోక్,ఉపసర్పంచ్ బాల్సని ప్రణయ్,సంపాతి ఆశలు,బార్ల మల్లేష్, బొల్లపెల్లి శ్రీనివాస్, పెసరి రాకేష్, హన్మండ్లు,మల్లేష్,సింగరపు అశోక్ తదితరులు పాల్గొన్నారు.

పార్ధీవ దేహానికి నివాళులర్పించిన మాలహల్ రావు

 

పార్ధీవ దేహానికి నివాళులర్పించిన మాలహల్ రావు

నడికూడ,నేటిధాత్రి:

మండలంలోని ముస్త్యాలపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బందెల దామోదర్ అనారోగ్య కారణాల వల్ల మృతి చెందిన విషయం తెలిసి వారి పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాల వేసి,వారి మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేసి,ఘన నివాళ్లులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుటుంబానికి అండగా ఉంటానని తెలియజేసిన నడికూడ మండల కాంగ్రెస్ పార్టీ ప్రధానకార్యదర్శి కుడ్ల మలహాల్ రావు వెంట నడికూడ మండల కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు,ఎఎమ్సి డైరెక్టర్ భోగం కమల,పరకాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఈర్ల చిన్ని,మండల సమన్వయ కమిటీ సభ్యులు పాడి ప్రతాప్ రెడ్డి,చౌటుపర్తి గ్రామ కమిటీ అధ్యక్షులు ఓదేలా రవి,ముస్తలపల్లి గ్రామా కమిటీ ఎస్సి సెల్ అధ్యక్షులు బోట్ల అనిల్,నార్లపూర్ గ్రామ బూత్ కమిటీ సభ్యులు శనిగరపు రవీందర్, ముస్తాలపల్లి మాజీ సర్పంచ్ బోట్ల రవి, రాజేందర్(రమాకాంత్),రాష్ట్ర మాల మహానాడు అధికార ప్రతినిధి నీరటి రాములు, సీనియర్ నాయకులు బందెల స్వామి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version