మంత్రికి వినతి పత్రం ఇచ్చినవిద్యార్థి యువజన సంఘాలు…

మంత్రికి వినతి పత్రం ఇచ్చినవిద్యార్థి యువజన సంఘాలు

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎస్సీ గర్ల్స్ కళాశాల హాస్టల్ కు మంత్రి అడ్లూరీ లక్ష్మణ్, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ పర్యటించారు. రెండు రోజుల క్రితం జరిగిన సంఘటన పై వారు విద్యార్థులతో మాట్లాడిన అనంతరం భూపాలపల్లి జిల్లా విద్యార్థి యువజన సంఘాల నాయకులు ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, డిఐవైఎఫ్ ప్రజా సంఘాలు మంత్రికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా నేరెళ్ల జోసెఫ్,వేముల శ్రీకాంత్, భూక్యా నవీన్ నాయకులు మాట్లాడుతూ వరుసగా జిల్లా కేంద్రంలో ప్రభుత్వ హాస్టల్ లో చదువుతున్న విద్యార్థులకు తరచూ ఫుడ్ పాయిజనింగ్, విద్యార్థినిలపై దాడులు, కరెంటు షాక్ ఇతర సంఘటనల వల్ల అధికారుల లోపం స్పష్టంగా కనబడుతుందని తెలిపారు. కేవలం జిల్లా అధికారుల నిర్లక్ష్యం వల్లనే తరచూ ఇలాంటి ఘటన జరుగుతూ విద్యార్థులు ఆవేదన గురవుతున్నారని అన్నారు. ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్లను కేటాయించినప్పటికీ ఎవ్వరు కూడా నెలలో కనీసం ఒక్కరోజు కూడా హాస్టలకు రాకపోవడం, వారి సమస్యలు తెలుసుకోకపోవడం చాలా బాధాకరమని అన్నారు. ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని అధికారులు,విద్యార్థి యువజన సంఘాలతో కమిటీ వేసి ప్రభుత్వ హాస్టల్ విద్యార్థుల సంక్షేమం కోసం పాటుపడాలని కోరారు. జిల్లాలో వారానికి ఒకసారైనా కలెక్టర్ ప్రతి ప్రభుత్వ హాస్టల ను పర్యటించాలని డిమాండ్ చేశారు.

ఎస్వీయూ పీఎస్‌ వద్ద హైటెన్షన్.. భారీగా చేరుకుంటున్న విద్యార్థులు…

ఎస్వీయూ పీఎస్‌ వద్ద హైటెన్షన్.. భారీగా చేరుకుంటున్న విద్యార్థులు

 

ర్యాగింగ్‌పై ఫిర్యాదు చేయడానికి వెళ్ళిన విద్యార్థులు, విద్యార్థి సంఘ నేతలపై యూనివర్సిటీ అధికారులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే ర్యాగింగ్‌పై యూనివర్సిటీ అధికారులు ఓ కమిటీని వేసి చేతులు దులుపుకున్నారు.

తిరుపతి, నవంబర్ 6: తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ వద్దకు విద్యార్థులు భారీగా చేరుకుంటున్నారు. దీంతో పీఎస్‌ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. యూనివర్సిటీ అధికారులపై విద్యార్థులు, విద్యార్థి సంఘం నేతలు ఫిర్యాదు చేయనున్నారు. కాగా.. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో (SV University) ర్యాగింగ్ కలకలం రేపుతోంది. యూనివర్సిటీలో విద్యార్థులను ప్రొఫెసర్‌ విశ్వనాథ్ రెడ్డి ర్యాగింగ్‌కు ప్రోత్సహించారంటూ బాధిత విద్యార్థులు ఆరోపించారు. ఈ క్రమంలో ప్రొఫెసర్‌పై ఫిర్యాదు ఇవ్వడానికి యూనివర్సిటీ అధికారులను మూడు రోజులు ముందు విద్యార్థి సంఘాలు కలిశాయి. అయితే ఫిర్యాదు చేయడానికి వెళ్ళిన విద్యార్థులు, విద్యార్థి సంఘం నేతలపై యూనివర్సిటీ అధికారులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే ర్యాగింగ్‌పై యూనివర్సిటీ అధికారులు ఓ కమిటీని వేసి చేతులు దులుపుకున్నారు.
అయితే.. ఇప్పటి వరకు ర్యాగింగ్‌పై ఎలాంటి చర్యలు లేకపోగా.. తిరిగి తమపైనే కేసులు నమోదు చేయటాన్ని నిరసిస్తూ ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ వద్దకు విద్యార్థులు, బాధిత విద్యార్థినిలు చేరుకున్నారు. యూనివర్సిటీ అధికారులపై విద్యార్థినిలు, విద్యార్థి సంఘ నేతలు ఫిర్యాదు చేయనున్నారు. దీంతో ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ వద్ద ఉత్కంఠ భరిత వాతావరణం నెలకొంది.

అయ్యా సీఎం రేవంత్ రెడ్డి మాకు ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు చెల్లించండి.

అయ్యా సీఎం రేవంత్ రెడ్డి మాకు ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు చెల్లించండి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పోస్టు ద్వారా లేఖను రాసిన ఏఐఎస్ఎఫ్ నాయకులు

కరీంనగర్, నేటిధాత్రి:

రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నత విద్యార్థుల చదువులను రోడ్డున పడేసిందని, ప్రజాపాలన అంటే విద్యార్థులు ఇంటి వద్ద, కళాశాలలకు తాళాలు ఉండడమా అని? కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు బకాయిల విడుదలపై నిర్లక్ష్యం చేస్తూ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి ఫీజు బకాయిలపై ఇచ్చిన మాట తప్పారని, రాష్ట్రంలో అందాల పోటీలకు ఉన్న నిధులు ఫీజు బకాయిలకు ఎందుకు లేవని? సీఎం రేవంత్ రెడ్డి వద్ద విద్యాశాఖ ఉన్న ఫీజు బకాయిల కోసం కళాశాలలు బంద్ చేసే పరిస్థితి వచ్చిందని రెండు రోజుల్లో ఫీజు బకాయిలు విడుదల చేయకపోతే ఏఐఎస్ఎఫ్ మంత్రులు, ఎమ్మెల్యేల ఇండ్లు ముట్టడిస్తామని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామారావు వెంకటేష్ హెచ్చరించారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కరీంనగర్ లోని పోస్టు ఆఫీస్ లో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి పోస్టు ద్వారా లేఖను పంపడం జరిగింది. ఈసందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ నేడు రాష్ట్రంలో విద్యార్థులు ఉండాల్సిన కళాశాలలు మూసిఉన్నాయి, తరగతుల్లో ఉండాల్సిన విద్యార్థులు ఇంటి వద్ద ఉండే పరిస్థితికి కారణం సీఎం రేవంత్ రెడ్డి అని, రేవంత్
రెడ్డి ఎన్నికల ముందు తాము అధికారంలోకి వచ్చాక వెంటనే పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలను విడుదల చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఇరవై మూడు నెలలు గడుస్త ఉన్న ఫీజు బకాయిలు ఎందుకు విడుదల చేయడం లేదో సమాధానం చెప్పాలని, గతంలో కళాశాలల వారు బంద్ చేస్తే దసరా దీపావళి లోపు పన్నెండు వందల కోట్లు విడుదల చేస్తామని చెప్పి మాట తప్పి కేవలం మూడు వందల కోట్లు విడుదల చేశారని, నేటి నుండి కళాశాలలు బంద్ చేస్తామని యాజమాన్యాలు ప్రకటించి పది రోజులు గడుస్తున్న ప్రభుత్వం వారితో చర్చించకుండా వారికి బకాయిలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసి విద్యార్థుల చదువులతో చెలగాటమాడుతుందని, ప్రైవేట్ యాజమాన్యాలకు  ఇవ్వాల్సిన బాకాయలు ఇవ్వమంటే ఇవ్వకుండా పెండింగ్ బకాయిలు ఇవ్వమన్నందుకు విజిలెన్స్ తనిఖీల పేరిట ప్రభుత్వం బెదిరింపులు చేయడం సిగ్గుచేటని, ఫీజు బకాయిలని విడుదల చేసిన తర్వాతనే విజిలెన్స్ తనిఖీలు నిర్వహించాలని, రాష్ట్రం అప్పుల్లో ఉన్నా సంక్షేమ పథకాలు, ఎన్నికల హామీలు అమలు చేస్తున్నామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం విద్యార్థులకు ఇవ్వాల్సిన ఎనిమిది వేల కోట్ల ఫీజు బకాయిలు ఎందుకు ఇవ్వడం లేదని, ఫీజు బకాయిల విడుదల లేక విద్యార్థులు సర్టిఫికెట్ల కోసం కళాశాలలకు అప్పులు చేసి మరి ఫీజులు కట్టే పరిస్థితి వచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వం అందాల పోటీలకు, మంత్రులు హెలికాప్టర్లో తిరగడానికి, పక్క రాష్ట్రాల్లో పత్రిక ప్రకటనలు ఇవ్వడానికి ఉన్న నిధులు విద్యార్థుల ఉన్నత చదువులకు ఆసరాగా ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి నిధులు ఇవ్వకుండా నేడు కళాశాలలు బంద్ చేసే పరిస్థితి ప్రభుత్వమే తీసుకొచ్చిందని, కళాశాలలు బంద్ చేయడం వల్ల విద్యార్థుల చదువులకు పూర్తిగా ఆటంకం కలుగుతుందని, కనీసం ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుపై దృష్టి పెట్టకుండా ఫీజు బకాయిల విడుదలలో నిర్లక్ష్యం చేయడం వల్ల లక్షలాది మంది విద్యార్థులు నేడు రాష్ట్రంలో ఫీజు బకాయిల విడుదల లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అటు ప్రైవేట్ కళాశాలలు సైతం ఫీజు బకాయిల విడుదల లేక కళాశాలల నిర్వహణ చేయలేక, సిబ్బందికి జీతాలు ఇవ్వలేని స్థితిలో యాజమాన్యాలు ఉన్నాయని, సీఎం రేవంత్ రెడ్డి తన వద్ద విద్యాశాఖ ఉన్న ఫీజు బకాయిలను విడుదల చేయించడంలో వైఫల్యం చెందడానీ, విద్యార్థుల చదువులకు ఆటంకాలు లేకుండా ప్రభుత్వం వెంటనే  కళాశాలల యాజమాన్యాలతో చర్చలు జరిపి బంద్ విరమింపజేసి పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని, కళాశాలల బంద్ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలసి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని, ప్రభుత్వం వెంటనే మొత్తం ఫీజు బకాయిలు విడుదల చేయాలని లేనిపక్షంలో రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల ఇండ్లు ముట్టడిస్తామని మణికంఠ రెడ్డి హెచ్చరించారు. ఈకార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా నగర అధ్యక్షులు కేషబోయిన రాము యాదవ్, నగర నాయకులు కసిరెడ్డి సందీప్ రెడ్డి, శివ, రాజు, మల్లికార్జున్, మని, వరుణ్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

పి డి ఎస్ యు రాష్ట్ర 23వ మహాసభలను జయప్రదం చేయండి…

పి డి ఎస్ యు రాష్ట్ర 23వ మహాసభలను జయప్రదం చేయండి.

మహాసభల లోగో ఆవిష్కరించిన ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే

హన్మకొండ:నేటిధాత్రి

 

డిసెంబర్ 10,11,12 తేదీల్లో జరిగే పి డి ఎస్ యు రాష్ట్ర 23వ మహాసభలను జయప్రదం చేయాలని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో మహాసభ లోగోను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పి డి ఎస్ యు రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షులు, ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే మాట్లాడుతూ చారిత్రాత్మక పోరాట వారసత్వం ఉన్న పి డి ఎస్ యు రాష్ట్ర మహాసభలు ఉద్యమాల కేంద్రం వరంగల్ జిల్లాలో నిర్వహించడం అభినందనీయమన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల విద్య పేదలకు మరింత దూరం అవుతుందన్నారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా నేటికీ విద్యా వైద్యం ఉపాధి అవకాశాలు పేద బడుగు బలహీన వర్గాలకు అందకుండా ప్రభుత్వాలు తమ విధానాలను రూపొందించుకుంటున్నాయన్నారు. పాలకులు కార్పొరేట్, పెట్టుబడేదారులకు ఊడిగం చేసేందుకే ప్రభుత్వాలను నడుపుతున్నాయన్నారు. ప్రభుత్వ విద్యారంగం ధ్వంసం అవుతుందని అనేక పాఠశాలలు కళాశాలలు యూనివర్సిటీలు మూసివేత గురి అవ్వడమే దీనికి తార్కాణం అన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలోనే ఉన్న చట్టాలను కార్పొరేట్ పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చారన్నారు. ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ ప్రైవేటుపరం అయ్యాయని, విద్యా రంగాన్ని కూడా పూర్తిగా ప్రవేట్ పరం చేసేందుకు నూతన జాతీయ విద్యా విధానం 2020 తీసుకొచ్చిందన్నారు. దీంతో దేశంలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీలలో కోర్స్ ఫీజులు ఎగ్జామినేషన్ ఫీజులు పెరిగి ఆర్థిక భారంతో విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం అవుతున్నారన్నారు. విద్యార్థుల మెదలను కలుషితం చేయడం కోసం పాఠ్యాంశాల్లో మూఢనమ్మకాలను, మతోన్మాదం ను చెప్పిస్తుందన్నారు. ఎన్సీఈఆర్టీ పాఠ్యాంశాల్లో గాంధీని చంపిన గాడ్సే పాఠాలను తీసివేయడం చరిత్ర వక్రీకరణలో భాగమే అన్నారు. ప్రపంచంలో వివిధ దేశాల్లో విద్యార్థులు యువకులు విద్యార్థి వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు నడుస్తున్నాయన్నారు. విద్యార్థుల పోరాటాలతో ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ శ్రీలంక నేపాల్ లాంటి దేశాల్లో ప్రభుత్వాలే కూలిపోయాయని అన్నారు. అంతర్జాతీయ విద్యార్థి ఉద్యమాల స్ఫూర్తితో దేశం విద్యార్థులోకం పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. జార్జిరెడ్డి, జంపాల చంద్రశేఖర ప్రసాద్ శ్రీపాద శ్రీహరి రంగవల్లి కోలాశంకర్ చేరాలు లాంటి ఎందరో విద్యార్థి అమరవీరుల త్యాగంతో పురుడోసుకున్న పి డి ఎస్ యు సంస్థ విద్యార్థుల ఉద్యమాన్నీ తీవ్రతరం చేయాలని ఆకాంక్షించారు.
మహాసభల ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి మైసా శ్రీనివాస్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందన్నారు. కనీసం పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ కూడా విద్యార్థులకు ఇవ్వకుండా మొండిగా వ్యవహరిస్తుందన్నారు. దీంతో విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందన్నారు. పాలకులు మారిన వారి విధానాలు మారకపోవడం వల్ల విద్యారంగ సమస్యలు పరిష్కారం కావడంలేదని అన్నారు. విద్యార్థులు సమస్యల పరిష్కారం కోసం సమరశీల ఐక్య ఉద్యమాలు చేయాలన్నారు. డిసెంబర్ 10,11 ,12 తేదీల్లో వరంగల్ లో జరిగే రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు..
ఈ కార్యక్రమం లో పి డి ఎస్ యు జాతీయ నాయకులు P. మహేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. నాగరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు బోనగిరి మధు, డాక్టర్ రాజేష్, పి డి ఎస్ యు వరంగల్ జిల్లా అధ్యక్షులు గుర్రం అజయ్, ప్రధాన కార్యదర్శి మర్రి మహేష్ ,పి డి ఎస్ యు రాజేందర్, బాలరాజు, బండి కోటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

ఎస్ఎఫ్ఐ బంద్ విజయవంతం…

ఎస్ఎఫ్ఐ బంద్ విజయవంతం

ప్రభుత్వం స్పందించి స్కాలర్షిప్ లు విడుదల చేయాలి

ఎస్ఎఫ్ఐ నాయకులు

పరకాల,నేటిధాత్రి

 

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చేపట్టిన విద్యాసంస్థల బందు పట్టణంలో విజయవంతం అయ్యింది.ఎస్ఎఫ్ఐ ఈ సందర్బంగా హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్,జిల్లా కమిటీ సభ్యుడు మడికొండ ప్రశాంత్
మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని పట్టణంలో ఉన్న డిగ్రీ పీజీ ఇంటర్మీడియట్ కాలేజీలను బందు చేయడం జరిగిందన్నారు.

ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం పెండింగ్ స్కాలర్షిప్లను ఫీజు రియంబర్స్మెంట్ లను వెంటనే విడుదల చేయాలని కళాశాలలో కోర్సు అయిపోయిన విద్యార్థులకు సర్టిఫికెట్స్ ఇవ్వకుండ యజమాన్యం విద్యార్థులను తీవ్రమైన ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పరకాల పట్టణ అధ్యక్షుడు బొచ్చు ఈశ్వర్, జిల్లా కమిటీ సభ్యుడు బొజ్జ హేమంత్,పట్టణ ఉపాధ్యక్షుడు యశ్వంత్,పట్టణ సహాయ కార్యదర్శి అరుణ్,చంటి పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version