విద్యార్థులు తమ భవిష్యత్తుపై దృష్టి పెట్టాలి
హనుమకొండ ఇన్స్పెక్టర్ మచ్చ శివకుమార్
హన్మకొండ, నేటిధాత్రి:
ఈ రోజు కాకతీయ డిగ్రీ కాలేజ్ లో అవగాహన కార్యక్రమం నిర్వహించి, విద్యార్థినులకు ఈవ్ టీజింగ్, షీ టీమ్స్ సేవలు, డయల్ 100 యొక్క ప్రాముఖ్యత, మహిళల స్వీయ రక్షణ & చట్టపరమైన హక్కులు గురించి వివరించి అవగాహన కల్పించడం జరిగింది. అలాగే, సైబర్ నేరాలు, వాటి నివారణ మరియు టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ 1930 గురించి కూడా విద్యార్థినులకు వివరించడం జరిగింది. విద్యార్థులు సెల్ ఫోను మరియు ఇతర విషయాల మీద కాకుండా చదువుపై దృష్టి పెట్టి తమ భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకొని తోటి వారికి ఆదర్శంగా నిలవాలని సూచించారు
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ఉమెన్ ఏ ఎస్సై కమల మంజుల, బ్లూకోల్ట్స్ టీమ్ నాయక్, కుమార్ లు మరియు సైబర్ వారియర్ కిరణ్ పాల్గొన్నారు.
