నిరుపేద బాధిత కుటుంబాలకు అండగా నిలవాలి…

నిరుపేద బాధిత కుటుంబాలకు అండగా నిలవాలి
-కాంగ్రెస్ పార్టీ నాయకులు జక్కా మహబూబ్ రెడ్డి

తొర్రూర్ డివిజన్ నేటి ధాత్రి

https://youtu.be/ooGYBXQUVCQ?si=-goZNUdgZUHhhhjG

బడుగు బలహీన వర్గాలకు చెందిన నిరుపేద బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మడిపల్లి గ్రామ మాజీ ఎంపీటీసీ జక్కా మహబూబ్ రెడ్డి అన్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టిపిసిసి ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డిల ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు జక్కా మహబూబ్ రెడ్డి,జక్కా ఇంద్రసేనారెడ్డిలు బుధవారం మండలంలోని హరిపిరాల గ్రామానికి చెందిన పులుగుజ్జా అనూష(25),ఎర్రబోయిన లింగయ్య(90),బొంత రాజు(30)లు వివిధ కారణాలతో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను సందర్శించి పరామర్శించారు. అనంతరం మూడు బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 కేజీల చొప్పున 75 కేజీల బియ్యం, ఒక్కొక్కరికి రూ.3 వేల చొప్పున రూ.9 వేల రూపాయలు నగదు అందజేశారు.
అనంతరం మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా మహబూబ్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి,టిపీసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డిల సహకారంతో బడుగు బలహీన వర్గాలకు చెందిన నిరుపేద కుటుంబాలకు అన్ని విధాలుగా ఆదుకుంటామని అన్నారు.పేద బాధిత కుటుంబాలకు ప్రతి ఒక్కరు అండగా నిలిచి ఆదుకోవాలన్నారు. మండలంలోని వివిధ గ్రామాలలో పేద కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా నిలుస్తానన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అందే సంక్షేమ పథకాలు సకాలంలో అందేలా కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు చెవిటి సదాకర్,మడిపల్లి గ్రామ పార్టీ అధ్యక్షుడు వెన్నెం సోమిరెడ్డి,హరిపరాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,1వ వార్డు మెంబెర్ తోట అశోక్,4,6వ వార్డు సభ్యులు రామగిరి రమ సురేష్, వల్లపు సైదులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు రావుల వెంకటరెడ్డి,చిరబోయిన కృష్ణ యాదవ్,వల్లపు రాఘవులు,లింగన్న,పనికర కొమురయ్య,దాసరి సాగర్, మహంకాల సంపత్, శనిగరం శివశంకర్,వెంకన్న, మురళి,మండల సోషల్ మీడియా కో ఆర్డినేటర్ గద్దల పరశురాములు,గ్రామ యూత్ అధ్యక్షులు గద్దల మధుకర్, వెంకన్న,లింగన్న,నాగన్న,ప్రశాంత్, ముకేశ్,మురేష్,సాగర్, రామకృష్ణ,యర్రం రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

కరీంనగర్ డేయిరీ పాల కేంద్రంఆధ్వర్యంలో పుస్తె మట్టలపంపిణీ….

కరీంనగర్ డేయిరీ పాల కేంద్రంఆధ్వర్యంలో పుస్తె మట్టలపంపిణీ….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

తంగళ్ళపల్లి మండలం అంకిరెడ్డిపల్లి గ్రామంలో నూతన వధువుకు. కరీంనగర్ డేయిరీ పాల యజమాన్యం ఆధ్వర్యంలో పుస్తె మట్టలు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా నేరెళ్ల రూట్ సూపర్వైజర్ ఉమ్మారెడ్డి భానుచందర్.రెడ్డి మాట్లాడుతూ కరీంనగర్. డే యి రీ. ఆధ్వర్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాల కొనసాగు.తున్నయని అందులో భాగంగా కళ్యాణ.మస్తు. పథకం ద్వారా పేద కుటుంబాలకు ఆడబిడ్డల వివాహాలకు సహాయం అందిస్తున్నామని తెలుపుతూ ఇట్టి కార్యక్రమంలో భాగంగా. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం.అంకి రెడ్డిపల్లి. గ్రామంలోని పల్లె లక్ష్మారెడ్డి.కలల.కూతురు రజిత వివాహానికి. కరీంనగర్ పాలకేంద్రం యజమాన్యం తరపున.పుస్తె మట్టెలు అందజేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో. అంకిరెడ్డి పల్లె పాల ఉత్పత్తిదారుల సంస్థ అధ్యక్షులు సింగిరెడ్డి మాధవరెడ్డి. డైరెక్టర్లు రాగుల రాజిరెడ్డి. ఏలేటి విజయ్ రెడ్డి. తొoటిరాజయ్య. పల్లె లక్ష్మారెడ్డి. గొట్టిపర్తిరాజు. సుంకపాక.దేవయ్య. పోచంపల్లి రంగయ్య. భీమరి రాములు. సెక్రెటరీ ఐ రెడ్డి సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు

పేద ఆడబిడ్డలకు అండగా ప్రభుత్వం:ఎమ్మెల్యే నాయిని..

పేద ఆడబిడ్డలకు అండగా ప్రభుత్వం:ఎమ్మెల్యే నాయిని..

#రూ. 1.59 కోట్ల విలువైన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ..
#హనుమకొండ, కాజీపేట మండలాల లబ్ధిదారులకు చేయూత..

హన్మకొండ, నేటిధాత్రి:

 

పేద కుటుంబాల్లో ఆడబిడ్డల పెళ్లిళ్లు భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా కొండంత అండగా నిలుస్తోందని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. హనుమకొండ గోకుల్ నగర్ లోని అంబేద్కర్ భవన్‌లో బుధవారం హనుమకొండ మరియు కాజీపేట మండలాలకు సంబంధించిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మొత్తం 159 మంది లబ్ధిదారులకు సుమారు రూ. 1,59,18,444 విలువ గల చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఆడబిడ్డల వివాహాల కోసం తల్లిదండ్రులు అప్పుల పాలు కాకూడదన్నదే ప్రభుత్వ ప్రధాన ఆశయమని పేర్కొన్నారు. గతంలో పెళ్లిళ్లు చేయాలంటే పేదలు పడే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ఈ పథకం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా ఆర్థిక సాయం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి అర్హుడికి రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.
అనంతరం లబ్ధిదారులతో ముచ్చటించిన ఎమ్మెల్యే, ప్రభుత్వం అందిస్తున్న ఈ సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులు, మండల స్థాయి అధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన మాజీ జెడ్పిటిసి కోడి అంతయ్య….

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన మాజీ జెడ్పిటిసి కోడి అంతయ్య….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

తంగళ్ళపల్లి మండలంలో పలు గ్రామాలు మృతి చెందిన కుటుంబాలను పరామర్శించిన మాజీ జెడ్పిటిసి కోడి అంతయ్య. గత రెండు రోజుల క్రితం వైద్యం వికటించి మృతి చెందిన మహమ్మద్ అమిద్ కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ఇచ్చి మృతుడి కుటుంబానికి మూడు వేల రూపాయల ఆర్థిక సాయం అందజేయడంతో పాటు. తంగళ్ళపల్లి మండల కేంద్రానికి చెందిన బుస రాజేశం. ఒగ్గు కుంటయ్య మరియు రాళ్లపేట గ్రామానికి చెందిన గౌరీ శంకర్ మృతిచెందగా వారి కుటుంబాలను పరామర్శించి మనం ధైర్యం కల్పించి. వారికి భరోసాను.ఇచ్చారు అలాగే నిరుపేద కుటుంబానికి చెందిన అమీద్.కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా.ఆదుకోవాలని. ప్రభుత్వానికి తెలియజేస్తూ నిరుపేద కుటుంబాలను ఆదుకోవాలని తదుపరి ఇట్టి విషయాలపై సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ మంత్రి బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు దృష్టికి తీసుకువెళ్లి వాళ్ళ కుటుంబాలకు అన్ని రకాల సహాయ సహకారాలు చేకూర్చే దిశగా ప్రభుత్వపరంగా సహాయ సహకారాలు అందించాలని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే విధంగా కేటీ రామారావు కి తెలియజేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. పరామర్శించిన వారిలో. మాజీ జెడ్పిటిసి కోడి అంతయ్య. తంగళ్ళపల్లి ఉపసర్పంచ్ ఆసాని శ్రీకాంత్ రెడ్డి. వార్డు మెంబర్ తాటికొండ చందు. సాయి. మైనార్టీ నాయకులు. చనిపోయిన బాధిత కుటుంబాల వారు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version